
కోల్‌కతా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి ఘటన కేసు విచారణలో కోల్‌కతా పోలీసులు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు.
ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనలో విచారణ కొనసాగుతుంది.
అయితే విచారణ నిమిత్తం జైల్లో ఉన్న నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు సోమవారం సీల్దా కోర్టుకు తరలించారు. ఆ సమయంలో సంజయ్ రాయ్ మీడియాకు, ప్రజలకు వినిపించకుండా పోలీసులు హారన్ కొడుతూ తీసుకెళ్లడం చర్చనీయాశంగా మారింది.
దీనిపై పోలీసులు స్పందిస్తూ.. నవంబర్ 11న సీల్దా కోర్టుకు సంజయ్‌రాయ్‌ను తీసుకెళ్లే సమయంలో కోల్‌కతా మాజీ పోలీసు కమీషనర్ వినీత్ గోయల్‌పై రాయ్ తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని, తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యానించాడు. ఈ తరహ ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండేలా సైరన్ మోగిస్తూ కోర్టుకు తీసుకెళ్లినట్లు తెలిపారు.