
జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. నేటి (సోమవారం)నుంచి అయోధ్యలో రామోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే 35 వేలకుపైగా కళాకారులు పాల్గొననున్నారు. రామకథా పార్కులో నేటి నుంచి రామకథ ప్రారంభం కానుంది.
నేటి నుంచి అయోధ్యలోని సరయూ నది ఒడ్డున హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయంలో కళాకారులు తమ కళాప్రతిభను ప్రదర్శించనున్నారు. రామోత్సవ్‌లో 35 వేల మంది కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
అయోధ్యలో త్వరలో బాలరాముని విగ్రహప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రజలు రామభక్తిలో మునిగిపోయారు. త్వరలో అహ్మదాబాద్‌లో జరిగే కైట్ ఫెస్టివల్‌లో కూడా రామనామం వినిపించనుంది. రాముని చిత్రాలతో కూడిన గాలిపటాలు తయారు చేసి, ఆకాశంలో ఎగురవేస్తున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర రజనీకాంత్ పటేల్ స్వయంగా రాముని చిత్రపఠంతో కూడిన గాలిపటాన్ని ఎగురవేయనున్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి