
అయోధ్య: రాష్ట్ర రాజధాని లక్నోలో కాకుండా అయోధ్యలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేశారు. అయోధ్యలో కేబినెట్ భేటీ
జరగడం ఇదే తొలిసారి. అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఇలా రాష్ట్ర రాజధానికి బదులు వేరే చోట కేబినెట్ సమావేశమవుతుంది.
అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవానికి అంగరంగ వైభవంగా సంసిద్ధమవుతున్న వేళ అదే పట్టణంలో సీఎం మంత్రివర్గాన్ని సమావేశపరచడం ప్రాధాన్యతను సంతరించుకుంది.