
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం ప్రకటించిన సులభతర వాణిజ్య రాష్ట్రాల జాబితాలో మొదటి, మూడవ స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందదాయకమని శనివారం ట్వీట్ చేశారు.
(చదవండి : ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్ వన్)
కాగా, ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ (సులభతర వ్యాపార నిర్వహణ) -2020 ర్యాంకులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో ఏపీ బర్‌వన్ స్థానంలో నిలిచింది. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ఓవరాల్ ర్యాంకింగ్‌లోనూ జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్, మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి.