
అ‘పూర్వ’ం.. అద్వితీయం
కడెం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004–05లో పదో తరగతి చదివిన వారంతా ఆదివారం మండలంలోని కొండుకూ ర్ గ్రామంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆత్మీయ స మ్మేళనం పేరిట కలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు 20 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలుసుకుని సందడి చేశారు. ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకున్నారు. పాఠశాలలో చదివిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి గురువులను ఆహ్వానించి శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
నిర్మల్‌చైన్‌గేట్: పట్టణంలోని బ్రహ్మపురి కాలనీలోగల శ్రీసరస్వతి శిశుమందిర్ ప్రాథమిక పా ఠశాలలో 1993–94లో ఎస్సెస్సీ పూర్తి చేసినవా రంతా స్థానిక ఉత్సవ్ ఫంక్షన్‌హాల్‌లో కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు.

అ‘పూర్వ’ం.. అద్వితీయం