
అధికారులు సమయపాలన పాటించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా
అధికారులు సమయపాలన పాటించాలని కలెక్టర్ అ భిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి ఉదయం 11 గంటలు దాటినా సగానికి పైగా అధికారులు గ్రీవెన్స్‌కు హాజ రు కాలేదు. దీంతో అటెండెన్స్ రిజిస్టర్‌లో గ్రీన్ పె న్నుతో మార్క్ చేశారు. అనంతరం జిల్లాలోని వివి ధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దా దాపు 60 దరఖాస్తులకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లాలో మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం ఏర్పా టు చేసిన టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫోన్ కాల్స్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు వివరాలను వాట్సప్ ద్వారా స్వీకరించి, రసీదులను దరఖాస్తుదారులకు పంపించా రు. ప్రజలు ఇంటినుంచే 91005 77132 నంబర్‌కు ఫోన్‌చేసి సమస్యలు తెలియజేసి, వాట్సప్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.