
అకాల వర్షం.. అపార నష్టం
సారంగపూర్/ఖానాపూర్: జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి అపారనష్టం సంభవించింది. ఖానాపూర్ మండలంలోని బావాపూర్(ఆర్)తండాకు చెందిన లావుడ్య చిన్నిబాయి ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో పాటు పశువుల కొట్టం కూలిపోయింది. విద్యుత్ స్తంభం విరిగిపడి తీగలు తెగిపోయాయి. సారంగపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన జొన్న, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డులో తూకం వేసి తరలించడానికి సిద్ధంగా ఉన్న జొన్న, మొక్కజొన్న సంచులు తడిసిపోయాయి.

అకాల వర్షం.. అపార నష్టం