
గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
నిర్మల్‌ఖిల్లా: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మత్యువాత పడిన కార్మికుల కుటుంబాలను ఆ దుకోవాలని, వారికి ఆర్థిక సామాజిక బాధ్యత క ల్పించాలని లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఎన్నారై రాష్ట్ర సలహా మండలి సభ్యులు, ప్రవాసీమిత్ర కా ర్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. సోమవారం అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవన్‌లో బాధిత కుటుంబ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గల్ఫ్ జేఏసీ, ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ ఫోరం, టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లిన వలస కార్మికుల హక్కులను పరిరక్షించేలా చట్టాలు అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణిి, ప్రముఖ నవలా రచయిత టి.సంపత్ కుమార్, ఆకుల సుదర్శన్, సీపీఐ కార్యదర్శి ఎస్‌ఎన్ రెడ్డి, సంఘం జిల్లా ప్రతినిధులు కొమ్ము గీత, శశిమాల, రేఖ, వాసవి పాల్గొన్నారు.