
మద్యం తాగి విద్యుత్ శాఖ అధికారి హల్‌చల్
అమర్తలూరు(వేమూరు): విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీరు మద్యం తాగి హల్‌చల్ చేసిన తీరు సామాజిక మాథ్యమాలలో వైరల్ మారింది. అమర్తలూరు మండలం విద్యుత్ కార్యాలయం అసిస్టెంట్ ఇంజినీరుగా నాంచారయ్య పని చేస్తున్నారు. మూల్పూరు గ్రామంలో ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో మద్యం తాగి వ్యక్తులపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ప్రవర్తించిన దృశ్య రూపం ద్వారా బయటకు వచ్చింది. విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహించాల్సి ఉంది. విధుల్లో ఉన్న విద్యుత్ శాఖాధికారి ప్రవర్తన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ వీడియో జిల్లా ఉన్నతాధికారులు దృష్టికి చేరినట్లు సమాచారం.