
రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
దాచేపల్లి: రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు మంగళవారం రసవత్తరంగా జరిగాయి. ఆరుపళ్ల విభాగంలో జరిగిన పోటీలో ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం కాజీపురానికి చెందిన వేగనాటి ఓసూరరెడ్డి ఎడ్లజత 5వేల అడుగుల దూరం బండలాగి మొదటిస్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా పంగలూరు మండలం పంగలూరుకి చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జత 4,952 అడుగుల దూరం బండలాగి రెండో స్థానం, ప్రకాశం జిల్లా అర్ధవీడుకి చెందిన సూర చైత్రరెడ్డి పూజితరెడ్డి ఎడ్ల జత 4,856 అడుగుల దూరం బండ లాగి మూడో స్థానం, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన కావ్యనంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 4,750 అడుగుల దూరం బండలాగి నాల్గవ స్థానం, పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లకి చెందిన మేక అంజిరెడ్డి ఎడ్ల జత 4,358 అడుగుడుల దూరంబండలాగి ఐదవస్థానం, పల్నాడు జిల్లా గురజాల మండలం అంబాపురంకి చెందిన చుండు అప్పయ్యచౌదరి ఎడ్ల జత 4వేల అడుగుల దూరం బండలాగి ఆరో స్థానం, బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరానికి చెందిన పీవీఆర్ బుల్స్, పెడవల్లి బ్రదర్స్ 3,108 అడుగుల దూరం బండలాగి ఏడో స్థానంలో నిలిచాయి. విజేతలైన ఎడ్ల జతల రైతులకు దాతలు బహుమతులు, నగదు ప్రదానం చేశారు. పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించారు. కమిటీ సభ్యులు కొప్పుల గిరి, యలమల నరేష్, అనిశెట్టి శ్రీనివాసరావు, మునగా నిమ్మయ్య, కానుకొల్లు ప్రశాంత్ తదితరులు పర్యవేక్షించారు.