
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నట్టుగా పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల పిటిషన్‌పై విచారణ జరుగనుంది.
కాగా, బిల్లులను గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక, సొలిసిటర్ జనరల్.. గవర్నర్ తమిళిసై వద్ద బిల్లుల పొజిషన్‌ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
అయితే, ఇప్పటికే పలు బిల్లులకు ఆమోదం తెలిపిన గవర్నర్.. తాజాగా తన వద్ద ఉన్న మరికొన్ని బిల్లుల్లో ఒకదాన్ని తిరస్కరించగా.. మిగతావాటిపై ప్రభుత్వ వివరణ కోరారు. ప్రభుత్వం ఆమోదించి తన వద్దకు పంపిన డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లును ఆమె తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన వాటిలో పురపాలక నిబంధనల చట్ట సవరణ, ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లులు ఉన్నాయి. మొత్తం 10 బిల్లులలో మూడింటిని మాత్రమే ఆమె ఆమోదించారు.