
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేల మధ్య ‘వర్గపోరు’కు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. ఇటీవల ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. తనను తేలిగ్గా తీసుకోవద్దని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చిన విషయాన్ని మర్చిపోవద్దనే విషయాన్ని మరిచిపోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం ఎవరికి అర్థం కావాలో వారికి అర్ధమైతే బాగుంటుందనే కూడా ఏక్ నాథ్ షిండ్ చెప్పుకొచ్చారు. తాను సీఎం ఉండగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఫడ్నవీస్ ఆపేసారనే ఆరోపణల నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే కాస్త ఘాటుగా స్పందించారు.
అయితే దీనికి ఫడ్నవీస్ ఇంచుమించు తెరదించినట్లే కనబుడుతున్నారు. తనకెందుకు వచ్చిన గొడవో ఏమిటో అనుకున్నారో కానీ శంకుస్థాపనుల, ఆరంభించిన ఏ ప్రాజెక్టును ఆపడం లేదన్నారు ఫడ్నవీస్. గవర్నర్ కు ధన్యవాదాలు తీర్మానంలో భాగంగా మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘ నేనేమీ మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కాను. తలపెట్టిన ప్రాజెక్టులను ఆపిన ఘనత ఉద్ధవ్ ది. నేను అటువంటి సీఎం ను కాను అన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. షిండే హయాంలో ఉండగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టాం. అది మేమంతా(షిండే, అజిత్ పవార్) కలిసి తీసుకున్న నిర్ణయం. ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరిపైనా ఉంది’ అంటూ పేర్కొన్నారు.
మాపై ప్రజలు పెద్ద బాధ్యత ఉంచారు
గతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ మహాయుతి కూటమికి భారీ సీట్లు ఇచ్చి అధికారాన్ని ఇచ్చారన్నారు. అందుచేతు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళతామని, భవిష్యత్ తరాలకు మంచి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు ఫడ్నవీస్.
నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఏక్‌నాథ్ షిండే స్ట్రాంగ్ వార్నింగ్