
కలకత్తా: ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆమె ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలపైనే విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీతో కలిసి కాంగ్రెస్, వామపక్షాలు తృణమూల్ కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
అసలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిందే తానని, కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే పెట్టానన్నారు. ఇంత చేస్తే పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ బీజేపీ కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్,వామపక్షాలకు ఎవరూ ఓటు వేయకండి’అని మమత పిలుపునిచ్చారు.
కాగా,లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పశ్చిమబెంగాల్‌లో పొత్తు కుదరలేదు. సీట్ల పంపకం ఒప్పందం కుదరకపోవడం వల్లే ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని తృణమూల్ ప్రకటించింది.
ఇదీ చదవండి.. కోయంబత్తూరులో రూ.1000 కోట్లు.. బీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు