‘పాలమూరు’ పూర్తికాకుండానే ప్రారంభోత్సవమా?  | YS Sharmila Tweet On CM KCR | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ పూర్తికాకుండానే ప్రారంభోత్సవమా? 

Published Fri, Sep 8 2023 3:19 AM | Last Updated on Fri, Sep 8 2023 3:19 AM

YS Sharmila Tweet On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘సగం పనులు కూడా కాని ప్రాజెక్టుకు ప్రారంబోత్సవాలట. పూర్తే కాని రిజర్వాయర్లకు పూజలట’ అని ఎద్దేవా చేస్తూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ట్వీట్‌ చేశారు. స్వరాష్ట్రంలో ప్రారంభించిన తొలి ప్రాజెక్టు పాలమూరు– రంగారెడ్డిని కేసీఆర్‌ సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం నామమాత్రం పనులు చేసి, ప్రాజెక్టు మొత్తం పూర్తయిందనే భ్రమను సృష్టిస్తున్నారన్నారు.

వాస్తవానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 50% కూడా కాలేదని, అందులోని 4 రిజర్వాయర్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదని పేర్కొన్నారు. కానీ ప్రాజెక్ట్‌ మొత్తం కట్టినట్లు కలరింగ్‌ ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ కాలువలకు భూసేకరణ కూడా పూర్తి కాలేదంటే, పాల మూరు ప్రాజెక్టుపై కేసీఆర్‌ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement