
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్, న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ తన మంచి మనుసును చాటుకున్నాడు. ఐపీఎల్-2024లో ధర్మశాల వేదికగా మే5న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు మిచెల్ బౌండరీ లైన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. మిచిల్ ఫుల్ షాట్ ఆడగా.. బంతి ప్రమాదశాత్తూ స్టాండ్స్‌లో ఉన్న అభిమానికి తాకింది. వెంటనే పక్క సీట్‌లో పడిపోయాడు. ఈ క్రమంలో అతడి చేతిలో ఉన్న ఐ ఫోన్ గ్లాస్ సైతం బ్రేక్ అయింది.
అదృష్టవశాత్తూ ఆ అభిమానికి ఎటువంటి గాయం కాలేదు. కానీ అతడి ఫోన్ మాత్రం పాడైపోయింది. ఇది చూసిన మిచెల్ అతడికి క్షమపణలు తెలిపాడు. అంతేకాకుండా తర్వాత అతడికి వద్ద తన బ్యాటింగ్‌కు గ్లౌవ్స్‌ను మిచెల్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శెభాష్ మిచెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా మే 10న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
A guy got hurt and broke his iPhone during practice!!!
Daz gave him his Gloves as a reward!!!💛👊🏻⭐️😎 pic.twitter.com/NkfAGp8Zph— AnishCSK💛 (@TheAnishh) May 7, 2024