IPL 2023: David Warner Miss Communication With Priyam Garg Run-Out Vs GT Match - Sakshi

#WarnerRunOut: గార్గ్‌ తప్పిదం.. దిక్కుతోచని స్థితిలో వార్నర్‌ ఔట్‌!

Published Tue, May 2 2023 9:14 PM | Last Updated on Tue, May 2 2023 9:22 PM

David Warner Miss Communication With Priyam Garg Run-Out Vs GT Match - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ వైఫల్యం సక్సెస్‌గా కొనసాగుతోంది. అయితే కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ సీజన్‌లో మెల్లిగా ఆడుతున్నాడన్న విమర్శలు ఉన్నా బ్యాటర్‌గా జట్టు తరపున టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఎవరు ఆడకపోయినా తాను ఒంటరిపోరాటం చేశాడు. అయితే తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మాత్రం వార్నర్‌ను దురదృష్టం వెంటాడింది.

మరో ఓపెనర్‌ ప్రియమ్‌ గార్గ్‌ తప్పిదం వల్ల వార్నర్‌ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. పైగా అది నోబాల్‌ కావడం విశేషం. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో రెండో బంతిని ప్రియమ్‌ గార్గ్‌ మిడ్‌ వికెట్‌ దిశగా ఆడాడు. అయితే క్రీజులో ఉన్న గార్గ్‌ బయటకు రావడంతో వార్నర్‌ సింగిల్‌కు కాల్‌ ఇచ్చాడేమో అని పరిగెత్తుకొచ్చాడు.

కానీ రషీద్‌ బంతి అందుకోవడం గార్గ్‌ వెనక్కి వెళ్లిపోయాడు. అప్పటికే వార్నర్‌ పిచ్‌ మధ్యలోకి వచ్చేశాడు. వార్నర్‌ తిరిగి వచ్చేలోపే రషీద్‌ వేగంగా వచ్చి వికెట్లను గిరాటేశాడు. దీంతో వార్నర్‌ నిరాశగా పెవిలియ్‌ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక పాంటింగ్‌, గంగూలీ లాంటి ఇద్దరు దిగ్గజ కెప్టెన్ల ఆధ్వర్యంలో ఈ సీజన్‌లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘోరంగా విఫలమవుతుంది. అంచనాలు అందుకోలేక చతికిలపడుతున్న ఢిల్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎవరిని పంపాలి.. బౌలింగ్‌ కూర్పుపై ఒక స్పష్టతకు రాలేకపోతుంది. అంతంత బ్యాటింగ్‌ మాత్రమే కలిగిన ఢిల్లీ అహ్మదాబాద్‌ పిచ్‌పై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడమేంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: బెస్ట్‌ బౌలింగ్‌ ఫిగర్స్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌కు చుక్కలే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement