
India vs Australia, 4th Test- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 17000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ నమోదు చేసిన ఆరో భారత బ్యాటర్‌గా (ఓవరాల్‌గా 28వ క్రికెటర్‌గా) నిలిచాడు. ఇంకో 78 పరుగులు సాధిస్తే ఎంఎస్ ధోనిని అధిగమించి ఈ జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంటాడు.
అజారుద్దీన్ తర్వాత
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు మూడోరోజు ఆట సందర్భంగా హిట్‌మ్యాన్ ఈ రికార్డు అందుకున్నాడు. అదే విధంగా సొంతగడ్డపై టెస్టుల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా ఈ ఓపెనర్ ఘనత వహించాడు.
తద్వారా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తర్వాత అత్యంత వేగంగా ఈ మేర స్కోరు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇక ఇప్పటి వరకు రోహిత్ 49 టెస్టులు, 241 వన్డేలు, 148 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా 438 మ్యాచ్‌లలో కలిపి ఇప్పటి వరకు 17,014 పరుగులు సాధించాడు.
కాగా ఆసీస్‌తో అహ్మదాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 35 పరుగులు చేసి మాథ్యూ కుహ్నెమన్ బౌలింగ్‌లో లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇదిలా ఉంటే.. నిర్ణయాత్మక ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులు చేసి రోహిత్ సేనకు గట్టి సవాల్ విసిరింది. ప్రస్తుతం భారమంతా బ్యాటర్లపైనే ఉంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో 17000+ పరుగులు సాధించిన భారత బ్యాటర్లు
1.సచిన్ టెండుల్కర్- 34,357
2.విరాట్ కోహ్లి- 25,047
3.రాహుల్ ద్రవిడ్- 24,064
4.సౌరవ్ గంగూలీ- 18,433
5.మహేంద్ర సింగ్ ధోని- 17,092
6. రోహిత్ శర్మ- 17,014