
బుమ్రా బౌలింగ్‌లో.. స్టోక్స్ బౌల్డ్.. రియాక్షన్ వైరల్(PC: JIO Cinema/BCCI)
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా పేస్‌దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లిష్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ చుక్కలు చూపించాడు.
వైజాగ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో భాగంగా.. తొలుత జో రూట్(5)ను పెవిలియన్‌కు పంపిన ఈ పేస్ గుర్రం.. ఆ తర్వాత ఒలీ పోప్(23)నకు వీడ్కోలు పలికాడు. అద్భుతమైన ఇన్‌స్వింగింగ్ యార్కర్‌తో పోప్‌ను బౌల్డ్ చేశాడు.
అనంతరం.. బెయిర్ స్టో(25) రూపంలో తన ఖాతాలో మూడో వికెట్ జమచేసుకున్న బుమ్రా.. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్(47)ను సంచలన రీతిలో బౌల్డ్ చేసి.. మరోసారి తన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. శనివారం నాటి ఆటలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 49.2వ ఓవర్లో నమ్మశక్యం కాని రీతిలో కట్టర్ సంధించి స్టోక్స్‌ను బోల్తా కొట్టించాడు.
ఊహించని పరిణామానికి కంగుతిన్న స్టోక్స్ తన బ్యాట్ కిందపడేసి.. ‘‘ఇలాంటి బాల్ వేస్తే నేను ఎలా ఆడేది?’’ అన్నట్లుగా సైగ చేయడం విశేషం. దీంతో బుమ్రా ముఖంలో నవ్వులు పూయగా.. సహచరులంతా పరిగెత్తుకు వచ్చి బుమ్రాతో కలిసి బిగ్ వికెట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇక అంతర్జాతీయ టెస్టుల్లో బుమ్రాకు స్టోక్స్ రూపంలో 150వ వికెట్ దక్కింది. స్టోక్స్ తర్వాత ఈ మ్యాచ్‌లో టామ్ హార్లీని అవుట్ చేసిన బుమ్రా తన కెరీర్‌లో టెస్టు కెరీర్‌లో పదోసారి ఫైవ్- వికెట్ హాల్ నమోదు చేశాడు. ఇక రెండో రోజు ఆటలో బుమ్రా ఆఖరిగా జేమ్స్ ఆండర్సన్ వికెట్ దక్కించుకున్నాడు.
కాగా వైజాగ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా మొత్తంగా ఆరు వికెట్లతో మెరవగా.. కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు.
𝘚𝘵𝘰𝘬𝘦𝘴' 𝘳𝘦𝘢𝘤𝘵𝘪𝘰𝘯 𝘴𝘢𝘺𝘴 𝘪𝘵 𝘢𝘭𝘭 😱
— JioCinema (@JioCinema) February 3, 2024
1⃣5⃣0⃣ Test wickets for the Wrecker-in-chief! 🤌#Bumrah #INDvENG #BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports pic.twitter.com/cWG7HfKqir