
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది.
ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(42 బంతుల్లో3 ఫోర్లు, 3 సిక్స్‌లతో57 నాటౌట్), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అక్షర్ పటేల్(20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఐడైన్ మార్క్‌రమ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. మిగితా లక్నో బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
మార్‌క్రమ్ హాఫ్ సెంచరీ..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. లక్నో ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం అందించినప్పటికి, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమకావడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.
లక్నో బ్యాటర్లలో ఐడైన్ మార్‌క్రమ్(52) టాప్ స్కోరర్‌గా నిలవగా..మిచెల్ మార్ష్(45), ఆయూష్ బదోని(36) రాణించారు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, చమీరా తలా వికెట్ సాధించారు.