
మార్చి 31న ఐపీఎల్ 2023 సీజన్‌కు తెరలేవనుంది. మరో 27 రోజులు మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో ఐపీఎల్‌లో పాల్గొనే ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. సీఎస్‌కేను నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఎంఎస్ ధోని కూడా తన ప్రాక్టీస్‌లో వేగం పెంచాడు. ఇప్పటికే ఐపీఎల్ ఆడేందుకు చెన్నై చేరుకున్న ధోని ప్రాక్టీస్‌లో భాగంగా సిక్సర్ల వర్షం కురిపించాడు.
'తలా'(ధోని) వచ్చాడని తెలియగానే చేపాక్ స్టేడియం పరిసరిరాలు అభిమానులతో నిండిపోయాయి. తమ ఫెవరెట్ ఆటగాడి ప్రాక్టీస్‌ను కళ్లారా చూడాలని వచ్చిన ఫ్యాన్స్‌ను ధోని ఖుషీ చేశాడు. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చిన ధోని సిక్సర్ల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ధోని అభిమాని ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది.
ఇక 2023 ఐపీఎల్ ధోని కెరీర్‌లో చివరిది కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈసారి ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడా లేక జట్టులోకి కొత్తగా వచ్చిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారా అనేది వేచి చూడాలి. గతేడాది సీజన్‌లో సీఎస్‌కే అంతగా ఆకట్టుకోలేదు. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే నమోదు చేసిన సీఎస్‌కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
Dhoni smashing the ball 🏏💥@MSDhoni #MSDhoni @ChennaiIPL pic.twitter.com/C4qSIq2UJ3
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) March 4, 2023