
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు పతకాలతో సత్తాచాటిన భారత స్టార్ షూటర్ మను భాకర్ అరుదైన గౌరవం దక్కింది. ఈ విశ్వక్రీడల ముగింపు వేడకల్లో భారత మహిళా పతాకధారిగా మను భాకర్ వ్యవహరించనున్నారు. ఈ మెరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
అయితే ఈ క్లోజింగ్ సెర్మనీలో భారత్ నుంచి మెన్స్ ఫ్లాగ్ బేరర్ ఎవరన్నది ఇంకా ఖారారు చేయలేదు. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుక ఆగష్టు 11న జరగనుంది. కాగా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా మను భాకర్ చరిత్ర సృష్టించింది.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన మను.. సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మూడో పతకాన్ని తృటిలో మను కోల్పోయింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంతో ఈ హర్యానా అమ్మాయి సరిపెట్టుకుంది.