Novak Djokovic: వారెవ్వా జొకోవిచ్‌... అరుదైన రికార్డు | Novak Djokovic Wins 37 Masters Title Beat Daniil Medvedev New Record | Sakshi
Sakshi News home page

Novak Djokovic: వారెవ్వా జొకోవిచ్‌... అరుదైన రికార్డు.. ఏకంగా..

Published Mon, Nov 8 2021 7:59 AM | Last Updated on Mon, Nov 8 2021 8:05 AM

Novak Djokovic Wins 37 Masters Title Beat Daniil Medvedev New Record - Sakshi

అత్యధిక మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డు

Novak Djokovic Wins 37 Masters Title: సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ జొకోవిచ్‌ తన కెరీర్‌లో 37వ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ను గెలిచాడు. ఆదివారం ముగిసిన పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ ఫైనల్లో వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ 4–6, 6–3, 6–3తో మెద్వెదేవ్‌ (రష్యా)పై గెలిచాడు.

ఈ విజయంతో స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ (36 మాస్టర్స్‌ టైటిల్స్‌)ను వెనక్కి నెట్టి అత్యధిక మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా అత్యధికంగా ఏడుసార్లు సీజన్‌ను నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డు సృష్టించాడు. పీట్‌ సంప్రాస్‌ (అమెరికా–6 సార్లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ సవరించాడు. 

చదవండి: Abu Dhabi Chief Curator: అబుదాబిలో భారత క్యూరేటర్‌ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement