Tennis Tournament
-
‘ప్లే ఆఫ్’ బెర్త్ లక్ష్యంగా...
పుణే: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ (Billie Jean King Cup) ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టెన్నిస్ టోర్నమెంట్ కోసం భారత జట్టు సిద్ధమైంది. నేటి నుంచి ఐదు రోజులపాటు పుణే వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా భారత టెన్నిస్ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. తెలుగమ్మాయిలు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పాటు అంకితా రైనా, వైదేహి, ప్రార్థన తొంబారేలతో కూడిన మన జట్టు ముమ్మర సాధన చేస్తోంది. ఇటీవల ముంబై డబ్ల్యూటీఏ టోర్నమెంట్ సెమీఫైనల్‌కు చేరిన యువ సంచలనం మాయా రాజేశ్వరన్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైంది. రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నమెంట్లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, హాంకాంగ్ జట్లు పాల్గొంటున్నాయి. గతేడాది మూడో స్థానంలో నిలవడం ద్వారా వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందలేకపోయిన భారత జట్టు ఈసారి ఆ అవాంతరాలను అధిగమించాలని పట్టుదలతో ఉంది.‘ప్రస్తుతానికి మా లక్ష్యం ప్లేయర్లను శారీరకంగా, మానసికంగా తాజాగా ఉంచడమే. ఈ వారం చాలా ముఖ్యమైంది. ఫిట్‌గా ఉంటేనే కోర్ట్‌లో చురుగ్గా కదలగలరు’ అని భారత కెప్టెన్ విశాల్ ఉప్పల్ పేర్కొన్నాడు. టోర్నమెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డైరెక్టర్ సుందర్ అయ్యర్ పేర్కొన్నారు. ప్రేక్షకులను ఉచితంగా అనుమతించనున్నట్లు వెల్లడించిన సుందర్ అయ్యర్... టోర్నీకి ‘సుహానా’ గ్రూప్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ఐటా, ఐటీఎఫ్ మహారాష్ట్ర టెన్నిస్ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీని డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. -
విజేత పెగూలా.. ఎనిమిదో టైటిల్
చార్ల్స్టన్ : అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా తన కెరీర్లో ఎనిమిదో సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. చార్ల్స్టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో పెగూలా చాంపియన్‌గా అవతరించింది. అమెరికాకే చెందిన సోఫియా కెనిన్‌తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో పెగూలా 6–3, 7–5తో గెలుపొందింది. ఈ సీజన్‌లోని పెగూలాకిది రెండో టైటిల్. ఈ విజయంతో పెగూలా తన కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌ను అందుకుంది. విజేతగా నిలిచిన పెగూలాకు 1,64,000 డాలర్ల (రూ. 1 కోటీ 40 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మెయిన్ ‘డ్రా’కు నగాల్ అర్హత మోంజా (ఇటలీ): భారత పురుషుల టెన్నిస్ సింగిల్స్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ మోంజా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఫెడరికో ఇనాకోన్ (ఇటలీ)తో సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో సుమిత్ నగాల్ 6–4, 6–2తో గెలుపొంది మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో నగాల్ 5–7, 7–6 (7/2), 6–2తో ఎర్గీ కిర్కిన్ (టర్కీ)పై గెలుపొందాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఆస్ట్రియా ప్లేయర్ ఫిలిప్ మిసోలిచ్తో సుమిత్ ఆడతాడు. 28వ ర్యాంక్‌లో యూకీ బాంబ్రీ సోమవారం విడుదల చేసిన ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో యూకీ బాంబ్రీ భారత నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. యూకీ రెండు స్థానాలు పడిపోయి 28వ ర్యాంక్‌లో నిలిచాడు. ఆరేళ్లుగా డబుల్స్‌లో భారత నంబర్‌వన్‌గా ఉన్న రోహన్ బోపన్న గతవారం టాప్ ర్యాంక్‌ను యూకీకి కోల్పోయాడు. ప్రస్తుతం బోపన్న 43వ స్థానంలో ఉన్నాడు. -
సాకేత్ జోడీ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: మెనోర్కా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్లో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సాకేత్ తమిళనాడుకు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో బరిలోకి దిగాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 6–2తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా)–ఇజాన్ కొరెత్యా (స్పెయిన్) జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 48 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్‌కుమార్ నాలుగు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశారు. తమ సర్వీస్‌లను నిలబెట్టుకొని, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. అనిరుద్‌కు నిరాశమరోవైపు ఇదే టోర్నీలో బరిలోకి దిగిన హైదరాబాద్‌కే చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ మాత్రం తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. గతవారం డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్)తో కలిసి జిరోనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గిన అనిరుధ్ అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. తొలి రౌండ్లో అనిరుధ్ (భారత్)–హెర్నాండెజ్ ద్వయం 6–7 (4/7), 7–5, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ డానియల్ కుకెర్మన్ (ఇజ్రాయెల్)–జోషువా పారిస్ (బ్రిటన్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్ జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం అనిరుధ్ ద్వయం తడబడింది. భారత్‌కే చెందిన టాప్ సీడ్ జోడీ విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెళియన్ జోడీ 2–6, 0–6తో మాటియో–ఆండ్రియా (ఇటలీ) జంట చేతిలో ఓటమి పాలైంది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో నిక్కీ పునాచా (భారత్)– గోర్నెస్ (స్పెయిన్) ద్వయం 6–3, 6–3తో వరోనా–టబెర్నర్ (స్పెయిన్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. -
రెండో సీడ్ జోడీకి యూకీ బాంబ్రీ ద్వయం షాక్
కాలిఫోర్నియా: తన కెరీర్లో ఆడుతున్న తొలి మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ జోరు కొనసాగుతోంది. ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ–గొరాన్సన్ జంట 6–2, 5–7, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్, ప్రపంచ మూడో, నాలుగో ర్యాంకుల్లో ఉన్న హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్)లను బోల్తా కొట్టించింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–గొరాన్సన్ ఒక ఏస్ సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. వాస్తవానికి ఈ టోర్నీలో తమ ర్యాంకింగ్ ప్రకారం యూకీ–గొరాన్సన్‌లకు క్వాలిఫయింగ్‌తోపాటు మెయిన్ ‘డ్రా’లోనూ చోటు దక్కలేదు. అయితే మెయిన్ ‘డ్రా’లో ఉన్న మార్కోస్ గిరోన్–లెర్నర్ టియెన్ (అమెరికా) చివరి నిమిషంలో వైదొలగడంతో ‘రిజర్వ్’ పూల్‌లో ఉన్న యూకీ–గొరాన్సన్‌లకు ఈ టోర్నీలో ఆడే అవకాశం లభించింది. క్వార్టర్ ఫైనల్ చేరడంతో యూకీ బాంబ్రీ –గొరాన్సన్‌లకు 65 వేల డాలర్ల (రూ. 56 లక్షల 67 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు ఖరారయ్యాయి. -
అనిరుధ్ జోడీకి టైటిల్
బెంగళూరు: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్... బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అనిరుధ్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) జంట 6–2, 6–4తో బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడుసార్లు భారతీయ ప్లేయర్లు డబుల్స్ చాంపియన్స్‌గా నిలిచారు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో అనిరుద్–రే హో జంట నెట్ గేమ్‌తో చెలరేగింది. తొలి సెట్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్న అనిరుధ్ జంట... రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా వెనక్కి తగ్గకుండా విజయం ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో రూ.8.65 లక్షల నగదు బహుమతితో పాటు... 125 ర్యాంకింగ్ పాయింట్లు అనిరుధ్ జోడీ ఖాతాలో చేరాయి. -
పోరాడి ఓడిన మానస్, కరణ్..
బెంగళూరు: ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన మానస్ ధామ్నె, రామ్‌కుమార్ రామనాథన్... ‘క్వాలిఫ యర్’ హోదాలో అడుగు పెట్టిన కరణ్ సింగ్... బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మానస్ ధామ్నె 3–6, 6–3, 6–7 (3/7)తో పీటర్ బార్ బిర్యుకోవ్ (రష్యా) చేతిలో... కరణ్ సింగ్ 4–6, 6–4, 6–7 (3/7)తో జురిజ్ రొడియోనోవ్ (ఆ్రస్టియా) చేతిలో... రామ్‌కుమార్ రామనాథన్ 6–7 (3/7), 5–7తో షింటారో మొచిజుకి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు.బిర్యుకోవ్‌తో 1 గంట 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల మానస్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. అయితే టైబ్రేక్‌లో మానస్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. రొడియోనోవ్తో 1 గంట 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కరణ్ 11 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నిర్ణాయక టైబ్రేక్‌లో కరణ్ ఒత్తిడికి లోనై ఓటమి పాలయ్యాడు. షింటారోతో 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్ 14 ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. -
రామ్‌కుమార్ సంచలనం
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్(Ramkumar Ramanathan) మెయిన్ ‘డ్రా’కు మరో విజయం దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రామ్‌కుమార్ సంచలనం సృష్టించాడు. టాప్ సీడ్, ప్రపంచ 267వ ర్యాంకర్ ఇలియాస్ ఇమర్ (స్వీడన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 403వ ర్యాంకర్ రామ్‌కుమార్ 5–7, 6–1, 6–4తో గెలుపొందాడు.ఒక గంట 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో కిమర్ కాప్‌జాన్స్ (బెల్జియం)తో రామ్‌కుమార్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గిన ప్లేయర్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. చైనా జట్టుకు ఇండోనేసియా షాక్కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇండోనేసియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో జరిగిన ఫైనల్లో ఇండోనేసియా 3–1తో నెగ్గింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో రివాల్డీ–ఫాదియా జంట 21–11, 21–13తో జువాన్–మెంగ్ యింగ్ జోడీని ఓడించడంతో ఇండోనేసియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఫర్హాన్ 21–15, 21–13తో హు జె ఆన్‌ను ఓడించడంతో ఇండోనేసియా ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో జు వెన్ జింగ్ 21–12, 21–13తో కుసుమ వర్ధినిపై గెలవడంతో చైనాకు తొలి విజయం దక్కింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో షోహిబుల్ ఫిక్రి–డానియల్ మారి్టన్ జోడీ 21–15, 21–9తో చెన్ జుజున్–హువాంగ్ ది (చైనా) ద్వయంపై గెలిచి ఇండోనేసియాకు టైటిల్‌ను ఖరారు చేసింది. -
రష్మిక సంచలనం
ముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్లో భారత మూడో ర్యాంకర్, హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనంతో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 325వ ర్యాంకర్ రష్మిక 6–1, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్ ఎలీనా ప్రిడాన్కినా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. రెండు ఏస్‌లు సంధించిన రష్మిక మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఒక్కసారి చేజార్చుకున్న రష్మిక ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. ఓవరాల్‌గా మ్యాచ్ మొత్తంలో ప్రిడాన్కినా తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా నిలబెట్టుకోకపోవడం గమనార్హం. భారత్‌కే చెందిన అంకిత రైనా, మాయ రేవతి రాజేశ్వరన్ కూడా తొలి రౌండ్లో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 15 ఏళ్ల క్వాలిఫయర్ మాయ 6–4, 6–1తో ఇరీనా షైమనోవిచ్ (బెలారస్)పై, అంకిత రైనా 6–2, 6–2తో భారత్‌కే చెందిన వైష్ణవి అడ్కర్‌పై విజయం సాధించారు. -
వరస్ట్ డాన్సర్‌ని అంటూనే అదరగొట్టిన సబలెంక.. వీడియో వైరల్
బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంకా(Aryna Sabalenka) ఆటతోనే కాదు.. డాన్స్‌తోనూ ఆకట్టుకోగలనని నిరూపించింది. ఆస్ట్రేలియా ఓపెన్(Australian Open)లో శుభారంభం చేసిన అనంతరం తనలోని మరో కోణాన్ని అభిమానులకు చూపించింది. వరస్ట్ డాన్సర్‌ని అంటూనే‘నా డాన్స్ అస్సలు బాగోదు. ఇకనై నన్నో వరస్ట్ డాన్సర్‌గా అందరూ గుర్తు పెట్టుకుంటారేమో’ అంటూనే కాలు కదిపిన సబలెంకా.. క్యూట్ మూవ్స్‌తో ప్రేక్షకులను అలరించింది. దీంతో ఫిదా అయిన ఆడియన్స్ కరతాళ ధ్వనులతో సబలెంకాను ఉత్సాహపరుస్తూ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘హ్యాట్రిక్’ టైటిల్ గెలవడమే లక్ష్యంగాకాగా ‘హ్యాట్రిక్’ టైటిల్ గెలవడమే లక్ష్యంగా సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సబలెంకా 6–3, 6–2తో 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై అలవోకగా గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది.ఇక 2023, 2024లలో చాంపియన్‌గా నిలిచిన సబలెంకా ఈసారీ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధిస్తే... మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్; 1997, 1998, 1999) తర్వాత ఈ టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతుంది.శుభారంభం చేసిఇక మ్యాచ్ విషయానికొస్తే.. స్లోన్ స్టీఫెన్స్‌తో 71 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 20 విన్నర్స్ కొట్టిన ఈ బెలారస్ స్టార్ 21 అనవసర తప్పిదాలు చేసింది. నెట్ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు నెగ్గిన సబలెంకా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. గత ఏడాది రన్నరప్, పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కిన్వెన్ జెంగ్ (చైనా), 11వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు.తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ కిన్వెన్ 7–6 (7/3), 6–1తో అంకా టొడోని (రొమేనియా)పై, బదోసా 6–3, 7–6 (7/5)తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 14వ సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా) 6–3, 6–3తో మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై, 18వ సీడ్ డొనా వెకిచ్ (క్రొయేషియా) 6–4, 6–4తో డియాన్ పారీ (ఫ్రాన్స్)పై, లేలా ఫెర్నాండెజ్ (కెనడా) 7–5, 6–4తో యులియా (ఉక్రెయిన్)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు.జ్వెరెవ్ బోణీ మరోవైపు.. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (alexander zverev- జర్మనీ) సులువుగా రెండో రౌండ్‌కు చేరగా... ఆరో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) ఐదు సెట్ల పోరులో గట్టెక్కాడు. జ్వెరెవ్ 6,4 6–4, 6–4తో లుకాస్ పౌలీ (ఫ్రాన్స్)పై నెగ్గగా... రూడ్ 6–3, 1–6, 7–5, 2–6, 6–1తో 3 గంటల 21 నిమిషాల్లో మునార్ (స్పెయిన్)ను ఓడించాడు. వర్షం కారణంగా తొలి రోజు చాలా మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. Aryna Sabalenka dancing for Australian Open crowd after winning her 1st round against Sloane Stephens“Now they have proof that I’m the worst dancer” 😂Give this woman a spotlight and she will shinepic.twitter.com/L5JyfrwcXs— The Tennis Letter (@TheTennisLetter) January 12, 2025 -
‘అప్పుడు నాపై విష ప్రయోగం జరిగింది’
సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ సంచలన విషయం బయటపెట్టాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడేందుకు వచ్చినపుడు తనపై విష ప్రయోగం జరిగిన మాట నిజమేనని వెల్లడించాడు. 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు రాగా తనకు వడ్డించిన ఆహారంలో తీవ్రస్థాయిలో మెర్క్యూరీ, లోహం అవశేషాలున్నట్లు పరీక్షల్లో తెలిందని చెప్పాడు.ఆ మేగజైన్ తిరగేస్తే మీకే తెలుస్తుంది ‘ఈ విషయం జీకే మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు మళ్లీ స్పందించకుండా ఉండాలనుకుంటున్నా. అందుకు నన్ను నేను అభినందించుకోవాలి. ఎందుకంటే ఇక్కడికొచ్చిన పని వేరు.ఈ స్పందన వేరు. ఇక్కడ నేను టోర్నీ ఆడాలి. ఆ పనేదో చూసుకుంటే మంచిది’ అని జొకోవిచ్ అన్నాడు. ఆసక్తి గలవారికి మరిన్ని వివరాలు కావాలనుకుంటే తాను ఇంటర్వ్యూ ఇచ్చిన మేగజైన్‌ను తిరగేస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.కాగా... మూడేళ్ల క్రితం కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకోని కారణంగా జొకోను టోర్నీ ఆడేందుకు నిరాకరించారు. విమానాశ్రయంలోని హోటల్ గదిలోనే నిర్బంధించారు. ‘ఆ సమయంలో నాకు ఇచ్చిన ఆహరం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యాను. కానీ ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరికీ, ఎక్కడ చెప్పనేలేదు. సెర్బియా వెళ్లాక ల్యాబ్ పరీక్షల్లో అత్యధిక స్థాయిలో ప్రమాదకర మెర్క్యురి, లెడ్ అవశేషాలు ఉన్నట్లు తేలింది’ అని 37 ఏళ్ల నొవాక్ గత చేదు అనుభవాన్ని తాజాగా వివరించాడు. ప్రస్తుతం 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో ఉన్న ఈ సెర్బియన్ సూపర్‌స్టార్ 25వ రికార్డు టైటిల్‌పై దృష్టి పెట్టాడు. మరిన్ని క్రీడా వార్తలుపోరాడి ఓడిన యూకీ–ఒలివెట్టి జోడీ ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్–ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం 3–6, 6–1, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ నికోల్ మెక్టిక్ (క్రొయేషియా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ, ఒలివెట్టి ఒక్క ఏస్ కూడా సంధించకుండానే ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం.తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన యూకీ–ఒలివెట్టి ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. చెరో సెట్ గెలిచాక నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో మెక్టిక్–వీనస్ ద్వయం పైచేయి సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో ఓడిన యూకీ–ఒలివెట్టి జంటకు 11,310 డాలర్ల (రూ. 9 లక్షల 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తమిళనాడు డ్రాగన్స్ జోరురూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో తమిళనాడు డ్రాగన్స్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న డ్రాగన్స్ నాలుగో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో తమిళనాడు డ్రాగన్స్ 2–1 గోల్స్ తేడాతో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్‌పై విజయం సాధించింది. తమిళనాడు డ్రాగన్స్ తరఫున సెల్వం కార్తీ (16వ నిమిషంలో), ఉత్తమ్ సింగ్ (37వ నిమిషంలో) చెరో ఫీల్డ్ గోల్ సాధించారు.బెంగాల్ టైగర్స్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (35వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా... రెండో క్వార్టర్ ఆరంభంలోనే కార్తి గోల్‌తో తమిళనాడు బోణీ కొట్టింది. మూడో క్వార్టర్లో టైగర్స్ ప్లేయర్ రూపిందర్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో స్కోరు సమం కాగా... మరో రెండు నిమిషాల వ్యవధిలో ఉత్తమ్ సింగ్ గోల్ చేయడంతో డ్రాగన్స్ తిరిగి ఆధిక్యంలోకి వెళ్లింది.చివరి వరకు అదే జోరు కొనసాగించిన తమిళనాడు జట్టు విజయం సాధించింది. తాజా సీజన్లో 5 మ్యాచ్‌లాడి నాలుగు విజయాలు సాధించిన డ్రాగన్స్ 12 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానంలో నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 9 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బెంగాల్ టైగర్స్ పట్టికలో రెండో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌ల్లో హైదరాబాద్ తూఫాన్స్తో సూర్మా హాకీ క్లబ్, ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌తో యూపీ రుద్రాస్ తలపడతాయి. -
ఎదురులేని నిశేష్
ఆక్లాండ్: మరో మ్యాచ్... మరో సంచలనం... ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల నిశేష్ 2–6, 6–2, 6–4తో ఎనిమిదో సీడ్, ప్రపంచ 41వ ర్యాంకర్ అలెక్స్ మికిల్సిన్ (అమెరికా)ను ఓడించాడు. 1 గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 133వ ర్యాంకర్ నిశేష్ నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు.క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన నిశేష్ తొలి రౌండ్లో ప్రపంచ 85వ ర్యాంకర్ కమ్సానా (అర్జెంటీనా)పై, రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 23వ ర్యాంకర్ అలెజాంద్రో టబిలో (చిలీ)పై సంచలన విజయాలు సాధించాడు. -
రిత్విక్ జోడీకి రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టైటిల్
రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ టైటిల్ చేజిక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట చాంపియన్‌గా నిలిచింది. ఇటలీ వేదికగా జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో శనివారం రిత్విక్–బాలాజీ జోడీ 6–3, 2–6, 12–10తో థియో అరిబెగ్ (ఫ్రాన్స్)–ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన రితి్వక్–బాలాజీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షలు) ప్రైజ్ మనీ, 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రిత్విక్ కెరీర్లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. -
18 ఏళ్ల తర్వాత తొలిసారి..
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో ఈసారి నూతన చాంపియన్ అవతరించనున్నాడు. ఇటలీలోని ట్యూరిన్ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అమెరికా ప్లేయర్, ఈ ఏడాది యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్(Taylor Fritz) 6–3, 3–6, 7–6 (7/3)తో రెండుసార్లు చాంపియన్ (2018, 2021), ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలుపొందాడు.18 ఏళ్ల తర్వాతఫలితంగా 18 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో ఓ అమెరికా ఆటగాడు టైటిల్ కోసం తలపడనున్నాడు. చివరిసారి 2006లో అమెరికా ప్లేయర్ జేమ్స్ బ్లేక్ ఫైనల్లోకి ప్రవేశించి తుది సమరంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. 1999లో పీట్ సంప్రాస్ తర్వాత మరో అమెరికా ప్లేయర్ ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్ సాధించలేకపోయాడు.ఇక జ్వెరెవ్‌తో 2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో ఫ్రిట్జ్ 15 ఏస్‌లు సంధించాడు. ఒకసారి తన సర్వీస్‌ను కోల్పోయి, ఒకసారి జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. 31 విన్నర్స్ కొట్టిన ఫ్రిట్జ్ 34 అనవసర తప్పిదాలు చేశాడు. ఫ్రిట్జ్‌తో సినెర్ అమీతుమీఇదిలా ఉంటే.. ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), ప్రపంచ ఆరో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో.. సినెర్ అద్భుత విజయం సాధించాడు. రూడ్‌ను 6-1, 6-2తో చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ క్రమంలో టేలర్ ఫ్రిట్జ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.రొనాల్డో మ్యాజిక్ పోర్టో: యూరోప్ నేషన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పోర్చుగల్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. పోలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. పోర్చుగల్ తరఫున రొనాల్డో రెండు గోల్స్ (72వ, 87వ నిమిషాల్లో) సాధించాడు. 87వ నిమిషంలో రొనాల్డో గాల్లో ఎగురుతూ ఓవర్‌హెడ్ కిక్‌తో చేసిన గోల్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రాఫెల్ లియో (59వ నిమిషంలో), ఫెర్నాండెస్ (80వ నిమిషంలో), పెడ్రో నెటో (83వ నిమిషంలో) పోర్చుగల్‌కు ఒక్కో గోల్ సాధించి పెట్టారు. పోలాండ్ జట్టుకు మార్జుక్ (88వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. -
ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా! రూ. 40 కోట్ల 55 లక్షల ప్రైజ్‌మనీ
రియాద్: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా పోరాడిన అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో 20 ఏళ్ల కోకో గాఫ్ విజేతగా నిలిచింది. మూడోసారి ఈ టోర్నీలో ఆడుతున్న కోకో గాఫ్ తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఏకంగా.. 3 గంటల 4 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 3–6, 6–4, 7–6 (7/2)తో ప్రపంచ ఏడో ర్యాంకర్, చైనా రైజింగ్ స్టార్ కిన్వెన్ జెంగ్పై చిరస్మరణీయ విజయం అందుకుంది.విజేతగా నిలిచిన కోకో గాఫ్నకు 48,05,000 డాలర్ల (రూ. 40 కోట్ల 55 లక్షలు) ప్రైజ్‌మనీ, 1300 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కిన్వెన్ జెంగ్‌కు 23,05,000 డాలర్ల (రూ. 19 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీ, 800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై గెలిచిన కోకో గాఫ్నకు తుది పోరులో గట్టిపోటీనే ఎదురైంది.టైబ్రేక్‌లో కోకో పైచేయితొలి సెట్‌ను చేజార్చుకున్న కోకో రెండో సెట్లో ఒకదశలో 1–3తో వెనుకబడింది. కానీ వరుసగా మూడుసార్లు కిన్వెన్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కోకో అదే జోరులో సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో కోకో 3–5తో వెనుకంజలో పడింది. తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్న కోకో పదో గేమ్‌లో కిన్వెన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసింది.ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో కోకో పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకొని 2014లో సెరెనా విలియమ్స్ తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలిచిన అమెరికా ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది కోకో మొత్తం 54 మ్యాచ్‌ల్లో గెలిచి, 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓవరాల్‌గా మూడు టైటిల్స్ (బీజింగ్ ఓపెన్, ఆక్లాండ్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్) సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Tennis (@tennischannel) -
సాకేత్ జంట సంచలనం
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ సంచలన విజయంతో బోణీ చేసింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.తొలి రౌండ్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ క్రిస్టియన్ రోడ్రిగెజ్ (కొలంబియా)– రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీని కంగుతినిపించింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జంట ఐదు ఏస్‌లు సంధించింది. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.అనిరుధ్ జోడీ ముందంజ ఇదే టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ భారత్‌కే చెందిన తన భాగస్వామి నిక్కీ కలియంద పూనాచాతో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో మూడో సీడ్ అనిరుధ్–నిక్కీ ద్వయం 6–3, 7–5తో ఎస్కోఫియర్–బెనోట్ పెయిర్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో దివిజ్ శరణ్ (భారత్)–ఇసారో (థాయ్‌లాండ్) జంట 3–6, 5–7తో మొరెనో (అమెరికా)–రూబిన్ స్థాతమ్ (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది.రిత్విక్ ద్వయం ముందంజసాక్షి, హైదరాబాద్: స్లొవాక్ ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ ముందంజ వేసింది. స్లొవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్లో రిత్విక్–అర్జున్ ద్వయం 6–4, 6–4తో భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఇటీవల కజకిస్తాన్‌లో జరిగిన అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో టైటిల్ నెగ్గిన రిత్విక్–అర్జున్ ఈ మ్యాచ్‌లో కీలకదశలో పాయింట్లు గెలిచింది. తొలి సెట్లో ఒకసారి, రెండో సెట్లో ఒకసారి ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తమ సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీ కూడా డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–గిడో ఆండ్రెజి (అర్జెంటీనా) ద్వయం 6–3, 6–7 (2/7), 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–మాట్వీ మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది.క్వార్టర్ ఫైనల్లో రష్మిక జోడీసాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టెన్నిస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రష్మిక... డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన తన భాగస్వామి వైదేహి చౌదరీతో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.ప్రపంచ 422వ ర్యాంకర్ గాబ్రియేలా డ సిల్వా ఫిక్ (ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 300వ ర్యాంకర్ రష్మిక 5–7, 3–6తో ఓడిపోయింది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి జోడీ 7–6 (7/3), 6–4తో మూడో సీడ్ లీ యు యున్ (చైనీస్ తైపీ)–నీనా వర్గోవా (స్లొవేకియా) జంటపై సంచలన విజయం సాధించింది. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ 71వ ర్యాంకర్ క్రిస్టోఫర్ ఒకానెల్ (ఆ్రస్టేలియా)తో జరిగిన క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్ లో 81వ ర్యాంకర్ సుమిత్ 4–6, 6–7 (3/7)తో పోరాడి ఓడిపోయాడు. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. సుమిత్‌కు 6,380 యూరోల (రూ. 5 లక్షల 79 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సహజ పరాజయం
సాక్షి, హైదరాబాద్: అబీర్టో టాంపికో ఓపెన్ డబ్ల్యూటీఏ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్, తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో సహజ పరాజయం పాలైంది. టాప్ సీడ్, ప్రపంచ 97వ ర్యాంకర్ నూరియా పారిజా దియాజ్ (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 284వ ర్యాంకర్ సహజ 5–7, 4–6తో ఓటమి చవిచూసింది. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. -
యూరోప్ జట్టుదే లేవర్ కప్
బెర్లిన్: రెండేళ్ల తర్వాత లేవర్ కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో యూరోప్ జట్టు విజేతగా నిలిచింది. వరల్డ్ టీమ్‌తో మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో యూరోప్ జట్టు 13–11 పాయింట్ల తేడాతో వరల్డ్ టీమ్ జట్టును ఓడించి ఐదోసారి విన్నర్స్ ట్రోఫీని దక్కించుకుంది. యూరోప్ జట్టు తరఫున అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), డానిల్ మెద్వెదెవ్ (రష్యా), కాస్పర్ రూడ్ (నార్వే), దిమిత్రోవ్ (బల్గేరియా), సిట్సిపాస్ (గ్రీస్), ఫ్లావియో కొబోలి (ఇటలీ), జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) బరిలోకి దిగారు. జాన్ బోర్గ్ (స్వీడన్) కెప్టెన్‌గా, థామస్ ఎన్క్విస్ట్ (స్వీడన్) వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. వరల్డ్ టీమ్ తరఫున టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో, బెన్ షెల్టన్ (అమెరికా), అలెజాంద్రో తబిలో (చిలీ), ఫ్రాన్సిస్సో సెరున్‌డొలో (అర్జెంటీనా), థనాసి కొకినాకిస్ (ఆస్ట్రేలియా) పోటీపడ్డారు. జాన్ మెకన్రో (అమెరికా) కెపె్టన్‌గా, ప్యాట్రిక్ మెకన్రో (అమెరికా) వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. రోజుకు మూడు చొప్పున మొత్తం తొమ్మిది సింగిల్స్ మ్యాచ్‌లు... రోజుకు ఒక డబుల్స్ మ్యాచ్ చొప్పున మొత్తం మూడు డబుల్స్ మ్యాచ్‌లు నిర్వహించారు. తొలి రోజు మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్‌కు 1 పాయింట్... రెండో రోజు మ్యాచ్‌లో నెగ్గిన ప్లేయర్‌కు 2 పాయింట్లు... మూడో రోజు మ్యాచ్‌లో విజయం సాధించిన ప్లేయర్‌కు 3 పాయింట్లు కేటాయించారు. తొలుత 13 పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. రెండు రోజుల మ్యాచ్‌ల తర్వాత వరల్డ్ టీమ్ 8–4 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. అయితే చివరిరోజు యూరోప్ జట్టు మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి 9 పాయింట్లు సాధించగా... వరల్డ్ జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచి 3 పాయింట్లు సంపాదించింది. ఓవరాల్‌గా యూరోప్ జట్టు 13–11తో విజయాన్ని దక్కించుకుంది. ఆఖరి రోజు డబుల్స్ మ్యాచ్‌లో కార్లోస్ అల్కరాజ్–కాస్పర్ రూడ్ (యూరోప్) జోడీ 6–2, 7–6 (8/6)తో బెన్ షెల్టన్–ఫ్రానెŠస్స్ టియాఫో (వరల్డ్) జంటను ఓడించింది. తొలి సింగిల్స్‌లో బెన్ షెల్టన్ (వరల్డ్) 6–7 (6/8), 7–5, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో డానిల్ మెద్వెదెవ్ (యూరోప్)పై గెలిచాడు. రెండో సింగిల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (యూరోప్) 6–7 (5/7), 7–5, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో టియాఫో (వరల్డ్)ను ఓడించాడు. మూడో సింగిల్స్‌లో అల్కరాజ్ (యూరోప్) 6–2, 7–5తో టేలర్ ఫ్రిట్జ్ (వరల్డ్)పై నెగ్గడంతో యూరోప్ జట్టుకు టైటిల్ ఖరారైంది. విజేత జట్టులోని ప్రతి సభ్యుడికి 2,50,000 డాలర్ల (రూ. 2 కోట్ల 8 లక్షలు) చొప్పున, రన్నరప్ జట్టులోని ప్రతి సభ్యుడికి 1,25,000 డాలర్ల (రూ. 1 కోటీ 4 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. ఆ్రస్టేలియా దిగ్గజ క్రీడాకారుడు రాడ్ లేవర్ పేరిట 2017 నుంచి ప్రతి ఏడాది ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. యూరోప్ దేశాలకు చెందిన మేటి టెన్నిస్ ప్లేయర్లతో ఒక జట్టు... యూరోపేతర దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లతో మరో జట్టు ఈ టోర్నీలో పోటీపడతాయి. 2017, 2018, 2019లలో వరుసగా మూడేళ్లు యూరోప్ జట్టు టైటిల్ నెగ్గి హ్యాట్రిక్ సాధించింది. కరోనా కారణంగా 2020లో ఈ టోర్నీని నిర్వహించలేదు. 2021లోనూ యూరోప్ జట్టుకే టైటిల్ లభించింది. 2022, 2023లలో వరల్డ్ టీమ్ జట్టు విజేతగా నిలిచింది. టైటిల్ పోరుకు విజయ్–జీవన్ జోడీహాంగ్జూ (చైనా): భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ విజయ్ సుందర్ ప్రశాంత్ తన కెరీర్లో తొలిసారి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాడు. భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్‌తో కలిసి హాంగ్జూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ డబుల్స్ విభాగంలో విజయ్ సుందర్ ప్రశాంత్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.సోమవారం జరిగిన సెమీఫైనల్లో 37 ఏళ్ల విజయ్, 35 ఏళ్ల జీవన్ 0–6, 6–2, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో ఏరియల్ బెహర్ (ఉరుగ్వే)–రాబర్ట్ గాలోవే (అమెరికా) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో కాన్స్టాన్టిన్ ఫ్రాంట్జెన్–హెండ్రిక్ జెబెన్స్ (జర్మనీ) ద్వయంతో విజయ్–జీవన్ జంట తలపడుతుంది. 71 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో తొలి సెట్లో ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయిన విజయ్–జీవన్ ద్వయం రెండో సెట్లో తేరుకుంది. రెండు సార్లు ప్రత్యర్థి జోడీ సర్విస్‌ను బ్రేక్ చేసి తమ సర్విస్లను కాపాడుకొని సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో భారత జోడీ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది.విజయ్ కెరీర్లో ఇదే తొలి ఏటీపీ–250 టోర్నీ ఫైనల్‌కాగా... జీవన్కిది నాలుగో ఫైనల్. 2017లో రోహన్ బోపన్నతో కలిసి జీవన్ చెన్నై ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ గెలిచాడు. 2018లో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)తో కలిసి చెంగ్డూ ఓపెన్‌లో, 2023లో శ్రీరామ్ బాలాజీతో కలిసి పుణే ఓపెన్‌లో జీవన్ రన్నరప్ ట్రోఫీని సాధించాడు. -
భారత్ 0 స్వీడన్ 2
స్టాక్‌హోమ్: డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నీ వరల్డ్ గ్రూప్–1లో భాగంగా స్వీడన్ జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత క్రీడాకారులకు ఓటమి ఎదురైంది. 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన స్వీడన్ నేడు జరిగే ఒక డబుల్స్ మ్యాచ్, రెండు రివర్స్ సింగిల్స్‌లలో ఒక విజయం సాధిస్తే గెలుపును ఖరారు చేసుకుంటుంది. వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు కూడా అర్హత సాధిస్తుంది. తొలి సింగిల్స్‌లో ‘డబుల్స్ స్పెషలిస్ట్’ శ్రీరామ్ బాలాజీ 4–6, 2–6తో ప్రపంచ 238వ ర్యాంకర్ ఇలియాస్ యెమెర్ చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 3–6, 3–6తో లియో బోర్గ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ వెన్నునొప్పితో స్వీడన్‌తో పోరు నుంచి వైదొలిగాడు. దాంతో సుమిత్ స్థానంలో శ్రీరామ్‌ను ఆడించాల్సి వచ్చింది. నేడు జరిగే మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలిస్తేనే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత పొందుతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందడం రెండుసార్లు (2010లో బ్రెజిల్‌పై, 2018లో చైనాపై) మాత్రమే జరిగింది. -
‘బాగానే ఉన్నా.. కానీ ఇప్పట్లో ఆడలేను’
స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ చేసిన వ్యాఖ్యలు అతడి అభిమానులను కలవరపెడుతున్నాయి. ఫెడరర్ మాదిరే రాఫెల్నూ ఇక టెన్నిస్ కోర్టులో చూడలేమా అని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా నాదల్ లేవర్ కప్ టెన్నిస్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. వచ్చే వారం నుంచి బెర్లిన్ వేదికగా ఈ టెన్నిస్ టీమ్ టోర్నీ జరగనుంది. అయితే, గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న నాదల్ ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మూడింట పాల్గొనలేదు. చివరగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన 38 ఏళ్ల నాదల్... నిరాశపరిచాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సెర్బియా స్టార్ జొకోవిచ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. ఈ నేపథ్యంలో లేవర్ కప్ టోర్నీతో తిరిగి వస్తాడని భావించిన అభిమానులకు షాకిచ్చాడు. ‘వచ్చే వారం జరగనున్న లేవర్ కప్‌లో ఆడలేకపోతున్నా. ఇది టీమ్ ఈవెంట్. జట్టుకు ఏది మంచో అదే చేయాలి. టీమ్‌ను విజయ తీరాలకు చేర్చగల ఆటగాళ్లు ఉండటం ముఖ్యం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. మానసికంగా నేనేమీ ఇబ్బందిపడటం లేదు. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాను. వీలైనంత వరకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అయితే, ఇప్పటికిప్పుడు కోర్టులో దిగే పరిస్థితి మాత్రం లేదు. అందుకే తప్పుకొంటున్నా. ఒలింపిక్స్ వరకు ఆడతానని చెప్పాను. ఇక ఇప్పుడు ఏం జరుగబోతుందో చూడాలి’ అని నాదల్ పేర్కొన్నాడు. లేవర్ కప్‌నకు దూరం కావడానికి ప్రధాన కారణం చెప్పకపోయినా... గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అదే సమయంలో త్వరలోనే రిటైర్మెంట్ కాబోతున్నాననే సంకేతాలు ఇస్తున్నాడనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కాగా స్విట్జర్లాండ్ దిగ్గజ ఆటగాడు ఫెడరర్ 2022 లేవర్ కప్ అనంతరమే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక.. పురుషుల సింగిల్స్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన నాదల్... ఇటీవల యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో కూడా గాయం కారణంగానే బరిలోకి దిగలేదన్న విషయం తెలిసిందే. చదవండి: దిగ్గజాలకు గడ్డుకాలం: భవిష్యత్తు అతడిదేనా? -
టెన్నిస్ టోర్నమెంట్.. హెలికాప్టర్లలో స్టేడియానికి
గ్వాడలహారా (మెక్సికో): ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు టోర్నీ నిర్వాహకులు ఏకంగా హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో ప్రస్తుతం డబ్ల్యూటీఏ–500 టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతోంది.ఇక్కడ తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. హోటల్స్ నుంచి ప్లేయర్లను నిరీ్ణత సమయంలోగా స్టేడియానికి తీసుకొచ్చేందుకు రోడ్డు మార్గంలో కుదరదని భావించిన గ్వాడలహారా టోర్నీ ఆర్గనైజర్లు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.దీనిపై టోర్నీ డైరెక్టర్ గుస్టావో శాంటోస్కాయ్ మాట్లాడుతూ ప్లేయర్లకు మరింత సౌకర్యం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. క్రీడాకారిణులు కూడా ఈ తరహా రవాణా అనుభవాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కొన్ని టోర్నీల్లో అప్పుడప్పుడు ప్లేయర్లను ఇలా హెలికాప్టర్లలో వేదిక వద్దకు తీసుకొస్తారు. కానీ రెగ్యులర్‌గా మాత్రం ఈ సదుపాయం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిసారి ప్లేయర్లను చాపర్లలోనే హోటల్ గదుల నుంచి టెన్నిస్ కోర్టులకు తీసుకొస్తున్నారు’ అని డబ్ల్యూటీఏ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అలెక్స్ ప్రియర్ తెలిపారు. ఆకాశ మార్గాన త్వరితగతిన వేదికకు చేరుకోవడం ద్వారా ప్లేయర్లంతా ఎలాంటి ప్రయాణ బడలిక లేకుండా మ్యాచ్‌ల బరిలోకి దిగుతున్నారు. గ్వాడలహారా సబర్బన్ సిటీలో రోడ్డు మార్గాలన్నీ రద్దీగా ఉంటాయి. ప్లేయర్లు బస చేసే హోటల్స్ నుంచి టోర్నీ వేదికకు మధ్య దూరం 11 కిలో మీటర్లు ఉంటుంది. అయితే ఈ మాత్రం దూరానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టడంతో నిర్వాహకులు చాపర్లను అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల నాలుగైదు నిమిషాల్లోనే క్రీడాకారిణులు స్టేడియానికి చేరుకుంటున్నారు.చదవండి: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ కన్నుమూత.. -
ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అ‘మెరిక’న్
న్యూయార్క్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. ఎట్టకేలకు 2009 తర్వాత గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా ప్లేయర్‌ను ఫైనల్లో చూడబోతున్నాం. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో అమెరికా ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తొలి సెమీఫైనల్లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడనున్నారు. దాంతో ఓ అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఖాయమైంది. 2009 వింబుల్డన్ టోరీ్నలో ఆండీ రాడిక్ తర్వాత మరో అమెరికా ప్లేయర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ 7–6 (7/2), 3–6, 6–4, 7–6 (7/3)తో నాలుగో సీడ్, 2020 రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను బోల్తా కొట్టించాడు. తొమ్మిదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)తో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో 20వ సీడ్ టియాఫో 6–3, 6–7 (5/7), 6–3, 4–1తో గెలుపొందాడు. నాలుగో సెట్లో టియాఫో 4–1తో ఆధిక్యంలో ఉన్న దశలో దిమిత్రోవ్ గాయంతో వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ముకోవా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
U S Open 2024: కోకో గాఫ్ అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ (అమెరికా) ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారోతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 3–6, 6–4, 3–6తో ఓడిపోయింది. 2 గంటల 12 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కోకో గాఫ్ ఏకంగా 19 డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. కేవలం 14 విన్నర్స్ కొట్టిన కోకో 60 అనవసర తప్పిదాలు చేసింది. తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కిన్వెన్ జెంగ్ 7–6 (7/2), 4–6, 6–2తో డోనా వెకిచ్ (క్రొయేషియా)పై, సబలెంకా 6–2, 6–4తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలి యా) ద్వయం 1–6, 5–7తొ మాక్సిమో–మొల్తాని (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
జెనరాలి ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీనలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. ఆ్రస్టియాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 80వ ర్యాంకర్ సుమిత్ 5–7, 5–7తో ప్రపంచ 45వ ర్యాంకర్ పెడ్రో మారి్టనెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్వస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. సుమిత్‌కు 10,165 యూరోల (రూ. 9 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 25 పాయింట్లు లభించాయి. -
టాప్ సీడ్ జోడీని ఓడించిన అనిరుధ్–అర్జున్ ద్వయం
హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లో అనిరుద్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 3–6, 10–7తో టాప్ సీడ్, 28వ ర్యాంక్ జోడీ లామోన్స్ –విత్రో (అమెరికా)ను బోల్తా కొట్టించింది. ప్రస్తుతం అనిరుధ్ 128వ ర్యాంక్‌లో, అర్జున్ 111వ ర్యాంక్‌లో ఉన్నారు. -
సుమిత్ శుభారంభం
బస్టాడ్ (స్వీడన్): నోర్డియా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 68వ ర్యాంకర్ సుమిత్ 6–4, 6–3తో ఇలియాస్ యామెర్ (స్వీడన్)పై గెలుపొందాడు. 98 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ రెండు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. రెండో రౌండ్లో ప్రపంచ 36వ ర్యాంకర్ మరియానో నవోన్ (అర్జెంటీనా)తో సుమిత్ తలపడతాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సుమిత్ నగాల్
భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ పురుషుల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో సుమిత్ ఐదు స్థానాలు ఎగబాకి 68వ ర్యాంక్‌లో నిలిచాడు.1973లో కంప్యూటర్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్న మూడో భారతీయ ప్లేయర్‌గా సుమిత్ గుర్తింపు పొందాడు. తొలి రెండు స్థానాల్లో విజయ్ అమృత్‌రాజ్ (1980లో 18వ ర్యాంక్), సోమ్‌దేవ్ వర్మ (2011లో 62వ ర్యాంక్) ఉన్నారు. -
Wimbledon 2024: సరికొత్త చాంపియన్ క్రిచికోవా
వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన టెన్నిస్ ప్లేయర్ బార్బరా క్రిచికోవా వింబుల్డన్-2024 టైటిల్ సాధించింది.లండన్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో క్రిచికోవా.. ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలిపై గెలుపొందింది. 6-2, 2-6, 6-4 తేడాతో జాస్మిన్ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన ప్రపంచ 31వ ర్యాంకర్ క్రిచికోవా.. వరల్డ్ సెవన్త్ ర్యాంకర్ జాస్మిన్‌కు చెమటలు పట్టించింది. అయితే, రెండో సెట్లో మాత్రం క్రిచికోవాను సమర్థవంతంగా ఎదుర్కొంది జాస్మిన్.ఈ క్రమంలో కీలకమైన మూడో సెట్లోనూ దూకుడుగా ఆడిన జాస్మిన్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలిగింది. కానీ.. తిరిగి కోలుకున్న క్రిచికోవా .. జాస్మిన్‌కు మరో అవకాశం ఇవ్వలేదు.కాగా 28 ఏళ్ల క్రిచికోవా 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ట్రోఫీ గెలిచింది. మరోవైపు.. 28 ఏళ్ల జాస్మిన్ గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఇగా స్వియా టెక్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజాగా వింబుల్డన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్లోనూ ఆమెకు ఇలా చేదు అనుభవమే ఎదురైంది.The moment a dream became reality ✨#Wimbledon | @BKrejcikova pic.twitter.com/38xPz9pCin— Wimbledon (@Wimbledon) July 13, 2024Showing off the Venus Rosewater Dish to the adoring #Wimbledon fans 🤩 pic.twitter.com/GmMlsOPMWW— Wimbledon (@Wimbledon) July 13, 2024 -
ఫైనల్లో సుమీత్ నగాల్
పెరూగియా ఓపెన్ ఏటీపీ –125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌లో శనివారం ఆరో సీడ్ నగాల్ 7–6 (7/2), 1–6, 6–2 స్కోరుతో బెర్నెబ్ జపటా మిరాల్స్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. 2 గంటల 38 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఐదు సార్లు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేసిన నగాల్...తన సర్విస్‌ను 6 సార్లు నిలబెట్టుకున్నాడు. -
ఏడో సీడ్‌పై నిశేష్ సంచలన విజయం
లిటిల్ రాక్ ఓపెన్ ఏటీపీ–75 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతికి చెందిన అమెరికా యువతార నిశేష్ బసవ రెడ్డి సంచలన విజయం సాధించాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 19 ఏళ్ల నిశేష్ 7–5, 6–4తో ఏడో సీడ్, ప్రపంచ 252వ ర్యాంకర్ ఈథన్ క్విన్ (అమెరికా)పై నెగ్గాడు. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిశేష్ ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన నిశేష్ తల్లిదండ్రులు 1999లో అమెరికాకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. -
జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి
యెచోన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. భారత స్టార్స్, ప్రపంచ రెండో ర్యాంకర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ 12వ ర్యాంకర్ పర్ణీత్ కౌర్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగ్గా... ప్రపంచ చాంపియన్ అదితి రెండో రౌండ్ లో, అవనీత్ కౌర్ రెండో రౌండ్లో నిష్క్రమించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో జ్యోతి సురేఖ 142–145తో ప్రపంచ మూడో ర్యాంకర్ సారా లోపెజ్ (కొలంబియా) చేతిలో... పర్ణీత్ 138–145తో హాన్ సెంగ్యోన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. అదితి 142–145తో అలెక్సిస్ రూయిజ్ (అమెరికా) చేతిలో, అవనీత్ 143–145తో ఒ యుహూన్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... ప్రియాంశ్ మూడో రౌండ్లో, అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్ రెండో రౌండ్లో ఓడిపోయారు. సెమీస్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ పారిస్: ఓపెన్ పార్క్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో సాండర్ అరెండ్స్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ, ఒలివెట్టి జోడీ పది ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే సెమీఫైనల్లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–వాసెలిన్ (ఫ్రాన్స్)లతో యూకీ, ఒలివెట్టి తలపడతారు. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్..
జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ 6–7 (7/9), 3–6తో ప్రపంచ 19వ ర్యాంకర్ సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.ఒక గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్వీను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశాడు. సుమిత్‌కు 6,215 యూరోల (రూ. 5 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.ఇవి చదవండి: వర్షంతో కోల్‌కతా, రాజస్తాన్ మ్యాచ్ రద్దు -
రష్మిక ఓటమి.. సుమిత్ నగాల్ ర్యాంక్ 93...
ఫ్లోరిడా: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ–75 మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయింది. క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో రష్మిక 3–6, 0–6తో అకాషా ఉర్హోబో (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. సుమిత్ నగాల్ ర్యాంక్ 93... అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ (ఏటీపీ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ర్యాంక్ దిగజారింది. తాజా ర్యాంకింగ్స్‌లో సుమిత్ 11 స్థానాలు పడిపోయి 93వ ర్యాంక్‌లో నిలిచాడు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న రెండు స్థానాలు పడిపోయి నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ 55వ ర్యాంక్‌లో, శ్రీరామ్ బాలాజీ 83వ ర్యాంక్‌లో, విజయ్ సుందర్ ప్రశాంత్ 98వ ర్యాంక్‌లో ఉన్నారు. -
సెమీస్‌లో యూకీ జోడీ
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–3తో రాబర్ట్ గాలోవే–ఇవాన్ కింగ్ (అమెరికా) జంటపై విజయం సాధించింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
యూకీ జోడీ సంచలనం
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సంచలనం సృష్టించింది. తొలి రౌండ్లో ఇండో–ఫ్రెంచ్ ద్వయం మూడో సీడ్ సాండర్ జిలె–జొరాన్ వ్లీజెన్ (బెల్జియం) జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 95 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ 4–6, 7–6 (7/5), 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో విజయాన్ని అందుకుంది. 11 ఏస్‌లతో అదరగొట్టిన యూకీ–ఒలివెట్టి నిర్ణాయక టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో రాబర్ట్ గాలోవే–ఇవాన్ కింగ్ (అమెరికా)లతో యూకీ, ఒలివెట్టి తలపడతారు. -
రిత్విక్ జోడీ శుభారంభం
జీఎన్‌పీ సెగురోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ శుభారంభం చేశాడు. మెక్సికోలోని అకాపుల్కో నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్లో రిత్విక్–నిక్కీ పునాచా (భారత్) ద్వయం 7–5, 6–2తో యువాన్ పాబ్లో ఫిచోవిచ్ (అర్జెంటీనా)–లుకాస్ రెస్ డా సిల్వా (బ్రెజిల్) జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. -
భారత్‌ను గెలిపించిన అంకిత–ప్రార్థన జోడీ
చాంగ్షా (చైనా): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు మూడో విజయం లభించింది. దక్షిణ కొరియాతో శుక్రవారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోస్లే 6–2, 6–2తో సోహున్ పార్క్‌పై నెగ్గి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 2–6, 3–6తో సుజియోంగ్ జాంగ్ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో అంకిత –ప్రార్థన తొంబారే ద్వయం 6–4, 6–4తో దబిన్ కిమ్–సోహున్ పార్క్ జంటను ఓడించి భారత్‌కు విజయాన్ని ఖరారు చేసింది. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోరీ్నలో ప్రస్తుతం చైనా టాప్ ర్యాంక్‌లో, భారత్ రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌తో భారత్, కొరియాతో చైనా పోటీపడతాయి. టాప్–2లో నిలిచిన జట్లు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధిస్తాయి. -
భారత్‌కు తొలి ఓటమి
చాంగ్షా (చైనా): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. పటిష్టమైన చైనా జట్టుతో బుధవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 0–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సహజ యామలపల్లి 2–6, 3–6తో ప్రపంచ 43వ ర్యాంకర్ జిన్యు వాంగ్ చేతిలో... రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 0–6, 0–6తో ప్రపంచ 7వ ర్యాంకర్ క్విన్వెన్ జెంగ్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్‌లో రుతుజా భోస్లే–ప్రార్థన ద్వయం 1–6, 1–6తో హాన్యు గువో–జియు వాంగ్ జోడీ చేతిలో పరాజయం పొందడంతో భారత ఓటమి ఖరారైంది. నేడు జరిగే మూడో మ్యాచ్‌లో చైనీస్ తైపీతో భారత్ ఆడుతుంది. -
సాకేత్ జోడీకి చుక్కెదురు
బుసాన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్ సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. దక్షిణ కొరియాలో బుధవారం జరిగిన తొలి రౌండ్లో టాప్ సీడ్ సాకేత్–ప్యాట్రిక్ నిక్లాస్ సాల్మనెన్ (ఫిన్లాండ్) ద్వయం 5–7, 2–6తో అలెక్స్ బోల్ట్–లి టు (ఆ్రస్టేలియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయింది. -
పోరాడి ఓడిన సుమిత్
మరాకెష్ (మొరాకో): గ్రాండ్‌ప్రి హసన్–2 ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 95వ ర్యాంకర్ సుమిత్ 6–1, 3–6, 4–6తో ప్రపంచ 61వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. సుమిత్ కు 10,165 యూరోల (రూ. 9 లక్షల 16 వేలు) ప్రైజ్‌మనీ, 25 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యూకీ జోడీ శుభారంభం ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో యూకీ–ఒలివెట్టి జంట 6–3, 6–4తో స్టీవెన్స్ (నెదర్లాండ్స్)–పెట్రోస్ సిట్సిపాస్ (గ్రీస్) ద్వయంపై గెలిచింది. -
Davis Cup 2024: భారత్ ప్రత్యర్థి స్వీడన్
న్యూఢిల్లీ: డేవిస్‌కప్ పురుషుల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ వరల్డ్ గ్రూప్–1 పోటీల ‘డ్రా’ను గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 15 మధ్య వివిధ దేశాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. భారత జట్టుకు స్వీడన్ జట్టు రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. స్వీడన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటి వరకు స్వీడన్‌తో ఐదుసార్లు తలపడిన భారత్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. పోరాడి ఓడిన సహజ సాక్షి, హైదరాబాద్: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ– 125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి, భారత రెండో ర్యాంకర్ సహజ యామలపల్లి పోరాటం ముగిసింది. ముంబైలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 336వ ర్యాంకర్ సహజ 6–1, 3–6, 5–7తో ప్రపంచ 162వ ర్యాంకర్ పొలీనా కుదెర్మెతోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. గంటా 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన రుతుజా 6–7 (6/8), 6–2, 1–6తో కేటీ వోలినెట్స్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. -
WTA Mumbai Open: పోరాడి ఓడిన రష్మిక..
సాక్షి, హైదరాబాద్: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం ముగిసింది. ముంబైలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 520వ ర్యాంకర్ రషి్మక 7–5, 4–6, 4–6తో రష్యా టీనేజర్, ప్రపంచ 134వ ర్యాంకర్ అలీనా కోర్నివా చేతిలో పోరాడి ఓడిపోయింది. 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రషి్మక ఐదు ఏస్‌లు సంధించి, ఏకంగా 14 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు డబుల్స్ తొలి రౌండ్లో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జోడీ 3–6, 6–7 (1/7)తో రెండో సీడ్ సబ్రీనా (అమెరికా)–దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. -
మెయిన్ ‘డ్రా’కు రష్మిక అర్హత
Mumbai Open WTA-125 Rashmika Srivalli Advances To Main Draw:: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. ముంబైలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో ప్రపంచ 521వ ర్యాంకర్ రష్మిక 6–3, 3–6, 6–3తో ప్రపంచ 482వ ర్యాంకర్ విక్టోరియా మొర్వాయోవా (స్లొవేకియా)పై విజయం సాధించింది. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఆరు ఏస్‌లు సంధించింది. వరల్డ్ గ్రూప్-1లో భారత్ డేవిస్‌కప్ టోర్నీలో భారత పురుషుల టెన్నిస్ జట్టు మళ్లీ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించింది. ఆదివారం పాకిస్తాన్‌తో ముగిసిన వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ పోటీలో 4–0తో గెలుపొందింది. చదవండి: భారత్‌కు మరో ఓటమి భువనేశ్వర్: మహిళల ప్రొ లీగ్ హాకీ టోర్నీలో భారత జట్టు మరో ఓటమి చవిచూసింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 1–3తో ఓడింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ ఏకైక గోల్ చేసింది. నెదర్లాండ్స్ తరఫున యిబ్బీ జాన్సెన్ రెండు గోల్స్, ఫేవాన్‌డెర్ ఒక గోల్ సాధించారు. -
Shooting World Cup: ఆరు పతకాలతో అగ్రస్థానంలో భారత్
కైరో: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ అఖిల్ షెరాన్ కాంస్య పతకంతో మెరిశాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అఖిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్లో అఖిల్ 451.8 పాయింట్లు స్కోరు చేశాడు. అఖిల్ ప్రదర్శనతో భారత్ ఈ టోర్నీని రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో అగ్రస్థానంతో ముగించింది. ఇవీ చదవండి... భారత్‌కు ఐదో స్థానం మస్కట్: ‘ఫైవ్–ఎ–సైడ్’ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు ఐదో స్థానం లభించింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6–4 గోల్స్ తేడాతో ఈజిప్ట్ జట్టును ఓడించింది. భారత్ తరఫున మణీందర్ (10వ, 23వ ని.లో) రెండు గోల్స్ చేయగా... రాహీల్ (8వ ని.లో), పవన్ (9వ ని.లో), ఉత్తమ్ (13వ ని.లో), మందీప్ (11వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫైనల్లో నెదర్లాండ్స్ 5–2తో మలేసియాపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో రష్మిక జోడీ ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రషి్మక... డబుల్స్‌లో వైదేహి చౌధరీ (భారత్)తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ‘వైల్డ్ కార్డు’తో సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పోటీపడిన రష్మిక తొలి రౌండ్లో 6–7 (8/10), 6–7 (2/7)తో రీనా సాల్గో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి జంట 6–3, 6–3తో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జోడీపై విజయం సాధించింది. -
క్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి పరాజయం
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి 14–21, 6–21తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మస్కట్‌లో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని కెపె్టన్సీలోని భారత జట్టు 6–3తో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. ఫైనల్లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్లో భారత్ తరఫున అక్షత, మరియానా, ముంతాజ్, రుతుజా, జ్యోతి అజ్మీనా ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోంది. Australian Open 2024- మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇటలీకి చెందిన 22 ఏళ్ల యానిక్ సినెర్.. ఫైనల్లోమెద్వెదెవ్తో తలపడనున్నాడు. జొకోవిచ్‌ను ఓడించిన సినెర్.. జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచి మెద్వెదేవ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. -
Australian Open: సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన సుమిత్
Australian Open 2024- Sumit Nagal First Indian In 35 Years: ఆస్ట్రేలియా ఓపెన్-2024లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ సంచలన విజయం సాధించాడు. మెన్స్ సింగిల్స్‌లో 137వ ర్యాంకర్ అయిన ఈ హర్యానా కుర్రాడు.. వరల్డ్ నెంబర్ 27 అలెగ్జాండర్ బబ్లిక్‌పై గెలుపొంది చరిత్ర సృష్టించాడు. భారత టెన్నిస్ చరిత్రలో 35 ఏళ్ల తర్వాత.. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన రెండో ఆటగాడిగా సుమిత్ రికార్డులకెక్కాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ తాజా ఎడిషన్‌లో భాగంగా తొలి రౌండ్లో.. సుమిత్ నాగల్.. కజకిస్తాన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ బబ్లిక్‌తో పోటీపడ్డాడు. ర్యాంకింగ్ పరంగా తనకంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న అలెగ్జాండర్‌కు ఆది నుంచే గట్టి పోటీనిస్తూ చుక్కలు చూపించాడు సుమిత్. రెండో రౌండ్లో అడుగుపెట్టిన సుమిత్ మొత్తంగా రెండు గంటల 38 నిమిషాల పాటు పోరాడి ఆఖరికి 6-4, 6-2, 7-6తో విజయం సాధించాడు. అయితే, తొలి రెండు సెట్లలో తేలిగ్గానే తలవంచిన అలెగ్జాండర్ మూడో సెట్లో మాత్రం సుమిత్‌ను చెమటోడ్చేలా చేశాడు. ఈ క్రమంలో టై బ్రేకర్‌లో ఎట్టకేలకు పైచేయి సాధించిన సుమిత్.. ప్రత్యర్థిని ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. హర్యానాకు చెందిన 26 ఏళ్ల సుమిత్ నాగల్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. 2021లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన అతడు ఈసారి మాత్రం చారిత్రక విజయంతో మొదటి ఆటంకాన్ని అధిగమించాడు. రమేశ్ క్రిష్ణన్ తర్వాత అదే విధంగా.. రమేశ్ క్రిష్ణన్ తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్‌లో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన భారత రెండో ఆటగాడిగా సుమిత్ నాగల్ అరుదైన ఘనత సాధించాడు. కాగా 1989 నాటి ఆస్ట్రేలియా ఓపెన్‌లో రమేశ్ క్రిష్ణన్ ఆనాటి నంబర్ వన్ ప్లేయర్ మ్యాట్స్ విలాండర్ను ఓడించి సంచలనం సృష్టించాడు. 35 ఏళ్ల తర్వాత మళ్లీ సుమిత్ ఆ ఫీట్‌ను నమోదు చేశాడు. పదేళ్ల వయసులోనే.. హర్యానాలో 1997, ఆగష్టు 16న జన్మించిన సుమిత్ నాగల్ 10వ ఏటనే టెన్నిస్ రాకెట్ పట్టుకున్నాడు. మహేశ్ భూపతి మిషన్ 2018 ప్రోగ్రాంలో భాగమైన అతడు.. 2015లో తొలిసారి ప్రతిష్టాత్మక విజయం సాధించాడు. వింబుల్డన్ బాయ్స్ డబుల్స్ టైటిల్ పోరులో తన వియత్నాం పార్ట్నర్ లీ హొంగ్ నామ్‌తో కలిసి విజేతగా నిలిచాడు. అయితే, 2019లో మొదటిసారి సుమిత్ నాగల్ క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. Well played Sumit Nagal💐💐💐.Although Sumit Nagal lost, But surely it was an exciting match . Winning a set against @rogerfederer is nothing less than an achievement. #FederervsNagal #USOpen pic.twitter.com/XN3WVuHDiq — Mahesh Kanakaraj🇮🇳 (@maheshmech06) August 27, 2019 ఏకంగా ఫెడరర్తోనే నాటి యూఎస్ ఓపెన్ టోర్నీలో టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్‌తో తొలి రౌండ్లో పోటీ పడ్డ సుమిత్.. తొలి సెట్‌ను 6-4తో గెలిచాడు. ఆ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ ఫెడరర్‌కు పోటీనిచ్చిన యంగ్‌స్టర్‌గా తనదైన ముద్ర వేయగలిగాడు. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. The first Indian man in 3️⃣5️⃣ years to beat a seed at a Grand Slam 🇮🇳@nagalsumit • #AusOpen • #AO2024 • @Kia_Worldwide • #Kia • #MakeYourMove pic.twitter.com/SY55Ip4JaG — #AusOpen (@AustralianOpen) January 16, 2024 -
యూకీ బాంబ్రీ జోడీకి చేదు అనుభవం.. సెమీస్‌లోనే నిష్క్రమణ
Brisbane International Semifinals: బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ ప్రయాణం ముగిసింది. శనివారం నాటి పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో లాయిడ్ గ్లాస్‌పూల్(ఇంగ్లండ్)- జీన్ జులెన్ రోజర్(నెదర్లాండ్స్) ద్వయంలో చేతిలో ఈ జంట ఓటమి పాలైంది. ఎనిమిదో సీడ్ యూకీ- రాబిన్ జోడీ... సెకండ్ సీడ్ అయిన ప్రత్యర్థి చేతిలో 3-6, 7-6, 9-11 పరాజయం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. గంటా నలభై నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఏ దశలోనూ లాయిడ్- జీన్ జంటపై యూకీ- రాబిన్ పైచేయి సాధించలేకపోయారు. దీంతో.. సెమీస్‌లోనే వీరు ఇంటిబాట పట్టారు. క్వార్టర్ ఫైనల్లో అలా గెలుపొంది ఇదిలా ఉంటే.. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ –రాబిన్ ద్వయం 7–6 (7/5), 7–6 (7/5)తో నథానియల్ లామోన్స్–జేక్సన్ విత్రో (అమెరికా) జంటపై విజయం సాధించింది. 96 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకున్నాయి. ఈ క్రమంలో టైబ్రేక్‌లలో యూకీ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. తద్వారా సెమీస్‌లో ప్రవేశించింది. కాగా ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల యూకీ బాంబ్రీ.. గతేడాది మలోర్కా చాంపియన్‌షిప్స్ డబుల్స్ కాంపిటీషన్లో పాల్గొని తొలి ఏటీపీ టైటిల్ గెలిచాడు. సౌతాఫ్రికాకు చెందిన లాయిడ్ హ్యారిస్‌తో కలిసి విజేతగా నిలిచాడు. చదవండి: Ind vs Afg: టీమిండియాతో సిరీస్‌కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్‌గా రషీద్.. కెప్టెన్? -
కోచ్‌తో ప్రేమపెళ్లి.. శుభవార్త చెప్పిన టెన్నిస్ స్టార్
చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్, వింబుల్డన్ మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్-2024కు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించింది. ప్రస్తుతం తాను గర్భవతినని.. అందుకే ఆటకు విరామం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కొత్త సంవత్సరం సందర్భంగా తాను తల్లి కాబోతున్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సోనోగ్రామ్ ఫొటోను చూపిస్తూ భర్త జిరి వనెక్తో కలిసి ఉన్న దృశ్యాలను ఈ సందర్భంగా క్విటోవా షేర్ చేసింది. ఈ ఏడాది వేసవిలో తమ ఇంట్లోకి బుజ్జాయి రానుందంటూ హర్షం వ్యక్తం చేసింది. జీవితంలోని కొత్త దశను పూర్తిగా ఆస్వాదించడానికే కొంతకాలం ఆటకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా 33 ఏళ్ల పెట్రా క్విటోవా రెండుసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచింది. 2011లో మారియా షరపోవాను ఓడించి.. 2014లో ఉజెనీ బౌచర్డ్ను మట్టికరిపించి టైటిల్స్ సాధించింది. అదే విధంగా.. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. ఇక 2019లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్ చేరిన క్విటోవా నయోమి ఒసాకా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక పెట్రా క్విటోవా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తనకు కోచ్‌గా వ్యవహరించిన జిరి వనెక్తో 2019 నుంచి డేటింగ్ చేసిన ఆమె గతేడాది అతడిని పెళ్లాడింది. ఈ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. కాగా జనవరి 14- 28 వరకు ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. On the first day of 2024 I wanted to wish you a happy new year and share the exciting news that Jiri and I will be welcoming a baby into our family this summer! 👼 pic.twitter.com/JwUi2Lcose — Petra Kvitova (@Petra_Kvitova) December 31, 2023 -
పాక్ వెళ్లేందుకు సుముఖంగా లేని సుమిత్, శశి.. కారణం?
న్యూఢిల్లీ: భారత సింగిల్స్ టెన్నిస్ స్టార్లు సుమిత్ నగాల్, శశికుమార్ ముకుంద్ పాకిస్తాన్లో డేవిస్ కప్ ఆడేందుకు నిరాకరించారు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లేఆఫ్ ‘టై’లో భాగంగా భారత్ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో తలపడాల్సివుంది. అయితే భారత్ తరఫున ఉత్తమ సింగిల్స్ ప్లేయర్లు అయిన సుమిత్ నగాల్ (141 ర్యాంకు), శశికుమార్ (477 ర్యాంకు) చిరకాల ప్రత్యర్థితో ఆడేందుకు విముఖత వ్యక్తం చేశారు. అయితే వారిద్దరు వైదొలగేందుకు కారణాలు వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నగాల్ తనకు అంతగా అలవాటు లేని గ్రాస్ కోర్టులో ఆడేందుకు సిద్ధంగా లేనని అన్నాడు. అదే కారణమా? ఇక హార్డ్ కోర్టుల్లో రాణించే సుమిత్ ఈ కారణంతో పాక్ వెళ్లేందుకు ఆసక్తి చూపించకపోగా, శశికుమార్ ముకుంద్ మాత్రం ప్రత్యేకించి ఏ కారణం చెప్పకుండానే తప్పుకొన్నట్లు తెలిసింది. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) దేశం తరఫున ఆడేందుకు నిరాకరించిన ఆటగాళ్లపై అసంతృప్తి వెలిబుచ్చింది. ఇలా చేయడం తప్పు ‘ఇది చాలా తప్పు. దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సినపుడు ఇలాంటి కారణాలు చూపడం ఏమాత్రం సమంజసం కాదు. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం’ అని ఐటా ఉన్నతాధికారి తెలిపారు. సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ప్రపంచ టెన్నిస్ టూర్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 21 ఏళ్ల శ్రీవల్లి 6–1, 6–4తో భారత్‌కే చెందిన వైష్ణవి అడ్కర్‌పై సునాయాస విజయం సాధించింది. సెమీస్‌లో రష్మిక థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్ లాన్లానా తారరుదితో తలపడుతుంది. క్వార్టర్స్‌లో ఆమె 6–1, 6–2తో ఏడో సీడ్ డిలెటా చెరుబిని (ఇటలీ)ని ఓడించింది. ఈ టోరీ్నలో హైదరాబాదీ యువతారతో పాటు మరో ఇద్దరు భారత క్రీడాకారిణులు జీల్ దేశాయ్, రుతూజ భోసలే సెమీస్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో జీల్ దేశాయ్ 3–6, 6–7 (8/2), 6–4తో అంటోనియా షమిడ్త్ (జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గింది. రుతూజ 7–6 (8/4), 1–6, 6–1తో కజకిస్తాన్‌కు చెందిన ఐదో సీడ్ జిబెక్ కులంబయెవాను కంగుతినిపించింది. -
సెమీఫైనల్లో సుమిత్
Sumit Nagal: హెల్సింకి ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 69వ ర్యాంకర్ ఎమిల్ రుసువోరి (ఫిన్లాండ్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 169వ ర్యాంకర్ సుమిత్ నెగ్గాడు. తొలి సెట్‌ను 6–3తో నెగ్గి, రెండో సెట్లో 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో ఎమిల్ గాయంతో వైదొలిగాడు. దాంతో సుమిత్‌ను విజేతగా ప్రకటించారు. రన్నరప్ నైశిక్ రెడ్డి జోడీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య జూనియర్ సర్క్యూట్ టోరీ్నలో తెలంగాణకు చెందిన గనగామ నైశిక్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. ఢాకాలో జరిగిన ఈ టోరీ్నలో నైశిక్ రెడ్డి–ప్రబీర్ ముకేశ్ చావ్డా (భారత్) ద్వయం బాలుర డబుల్స్ విభాగం ఫైనల్లో ఓటమి చవిచూసింది. తుది పోరులో నైశిక్–ప్రబీర్ జోడీ 2–6, 3–6తో భారత్‌కే చెందిన తవీశ్ పావా–అర్ణవ్ యాదవ్ జంట చేతిలో ఓటమి పాలైంది. -
రన్నరప్‌గా బోపన్న జోడీ.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
షాంఘై: ఈ ఏడాది మూడో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోరీ్నలో బోపన్న–ఎబ్డెన్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 7–5, 2–6, 7–10తో గ్రానోలెర్స్ (స్పెయిన్)–జెబలాస్ (అర్జెంటీనా) ద్వయం చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–ఎబ్డెన్‌లకు 2,31,660 డాలర్ల (రూ. కోటీ 93 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు... టైటిల్ నెగ్గిన గ్రానోలెర్స్–జెబలాస్లకు 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా ఫలితంతో బోపన్న –ఎబ్డెన్ జోడీ టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. షాంఘై మాస్టర్స్ టోర్నీ విజేత హుర్కాజ్ పోలాండ్ టెన్నిస్ స్టార్ హుబెర్ట్ హుర్కాజ్ తన కెరీర్లో రెండో మాస్టర్స్ సిరీస్ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో హుర్కాజ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 17వ ర్యాంకర్ హుర్కాజ్ 6–3, 3–6, 7–6 (10/8)తో ఏడో ర్యాంకర్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై గెలిచాడు. విజేత హుర్కాజ్‌కు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 52 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. -
యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఎంట్రీ.. రోహన్ బొపన్న సరికొత్త రికార్డు
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొపన్న ఓపెన్ శకంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఓపెన్-2023 పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ బొపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందిన విషయం తెలిసిందే. తద్వారా ఈ జోడీ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–6 (7/3), 6–2తో పియరీ హ్యూజ్ హెర్బర్ట్–నికోలస్ మహుట్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బొపన్న జోడీ తన ప్రత్యర్థి జంట సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. రాజీవ్ రామ్ (అమెరికా)–సాలిస్బరీ (బ్రిటన్); ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో బొపన్న జంట తలపడుతుంది. తాజా ఫలితంతో 43 ఏళ్ల బొపన్న ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్లో పురుషుల డబుల్స్ విభాగంలో బొపన్న గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి మాత్రమే. 2010లో ఐజామ్ ఖురేషి (పాకిస్తాన్)తో జతకట్టి యూఎస్ ఓపెన్లోనే ఫైనల్ చేరిన బోపన్న తుది పోరులో బాబ్ బ్రయాన్–మైక్ బ్రయాన్ (అమెరికా) ద్వయం చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. NO OTHER male player (Singles or Doubles) at his age (43 yrs 6 months) has reached Grand Slam FINAL in the Open era before! You are special Rohan Bopanna | @rohanbopanna ❤️ https://t.co/JCcq55SDwd pic.twitter.com/AmZwxVfhhi — India_AllSports (@India_AllSports) September 7, 2023 Bopanna/Ebden make an amazing comeback from 2-4 down to take the 1st set 7-6 (3). #USOpen https://t.co/E6Y5XA12ae — India_AllSports (@India_AllSports) September 7, 2023 -
US Open 2023: తొలిసారి సెమీస్‌లో కోకో గాఫ్.. ముకోవాతో అమీతుమీ
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా టీనేజ్ స్టార్, ఆరో సీడ్ కోకో గాఫ్ తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 67 నిమిషాల్లో 6–0, 6–2తో 20వ సీడ్ ఒస్టాపెంకో(లాతి్వయా)పై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, స్వియాటెక్‌ను బోల్తా కొట్టించినా.. ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించిన 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకో క్వార్టర్ ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. గాఫ్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఒస్టాపెంకో 36 అనవసర తప్పిదాలు చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో కరోలినా ముకోవా.. సిరెస్టియాను మట్టికరిపించి తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్), 12వ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. Karolina Muchova, are you kidding!? What a get! pic.twitter.com/MOUmzt3YMn — US Open Tennis (@usopen) September 6, 2023 Novak Djokovic refuses to be defeated in #USOpen quarterfinals. pic.twitter.com/MKdhLmUCMU — US Open Tennis (@usopen) September 5, 2023 What a match point from @CocoGauff❗️ How it sounded on #USOpen radio 🎙️⤵️ pic.twitter.com/m4DGbBkk1A — US Open Tennis (@usopen) September 5, 2023 -
US Open: వరల్డ్ నంబర్ 1కు ఊహించని షాక్.. టోర్నీ నుంచి అవుట్
న్యూయార్క్: పోలండ్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ 1 ఇగా స్వియాటెక్‌కు ఊహించని షాక్ తగిలింది. ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్-2023 టోర్నీ నుంచి ఆమె నిష్క్రమించింది. టాప్-20 సీడ్ జెలెనా ఒస్తాపెంకో చేతిలో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ రౌండ్ 16లో డిఫెండింగ్ చాంపియన్ స్వియాటెక్‌ను 6-3, 3-6, 1-6తో ఓడించిన జెలెనా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ముందడుగు వేసింది. పూర్తిగా తనదే ఆధిపత్యం కాగా నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో స్వియాటెక్ 6-3తో తొలి సెట్ గెలిచినప్పటికీ.. ఆ తర్వాత జెలెనా పూర్తిగా ఆధిపత్యం కొనసాగించింది. తగ్గేదేలే అన్నట్లు టాప్ సీడ్‌కు షాకుల మీద షాకులిచ్చి 3-6, 1-6తో ఏ దశలోనూ కోలుకోకుండా చేసింది. తద్వారా స్వియాటెక్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో ఆమెతో పోటీ ఇక జెలెనా చేతిలో పరాజయం పాలైన స్వియాటెక్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. పోలండ్ స్టార్ తాజా ఓటమి నేపథ్యంలో రెండో సీడ్‌గా ఉన్న బెలారస్ టెన్నిస్ తార అరియానా సబలెంక నంబర్ 1గా అవతరించింది. ఇదిలా ఉంటే.. యూఎస్‌కు చెందిన కోకో గాఫ్.. మాజీ వరల్డ్ నంబర్ 1 కరోలిన్ వోజ్నియాకిపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో జెలెనా క్వార్టర్స్‌లో కోకో గాఫ్‌ను ఎదుర్కోనుంది. క్వార్టర్స్‌లో ముకోవా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ ముకోవా 2 గంటల 34 నిమిషాల్లో 6–3, 5–7, 6–1తో జిన్యు వాంగ్ (చైనా)పై గెలిచింది. ఈ క్రమంలో తదుపరి గేమ్‌లో ముకోవా సొరానాతో తలపడనుంది. చదవండి: నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..? Make your prediction. What's the semifinal here? pic.twitter.com/xxrXmYXkIv — US Open Tennis (@usopen) September 4, 2023 Jelena Ostapenko reaches the #USOpen quartefinals for the first time in her career! pic.twitter.com/QzSWObVJYE — US Open Tennis (@usopen) September 4, 2023 Well, well, well 💅 There will be a deciding set between Jelena Ostapenko and Iga Swiatek. pic.twitter.com/3iIYIG0MLs — US Open Tennis (@usopen) September 4, 2023 -
జొకోవిచ్‌ను ‘పచ్చిక’ కరిపించిన అల్కరాజ్.. నాదల్ భావోద్వేగ ట్వీట్ వైరల్
Wimbledon 2023 Mens Singles Winner Alcaraz: ఆల్ ఇంగ్లండ్ క్లబ్ వేదికపై కొత్త చరిత్ర నమోదైంది. క్లే కోర్టు స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకొని, హార్డ్‌కోర్ట్‌పై తొలి గ్రాండ్‌స్లామ్ సాధించిన తర్వాత ఇప్పుడు గ్రాస్ కోర్టుపై స్పెయిన్ ‘బేబీ బుల్’ మెరిశాడు. 23 గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్ జొకోవిచ్ వరుస విజయాలకు విరామమిస్తూ యువ సంచలనం కొత్త శకానికి నాంది పలికాడు. జొకోవిచ్‌ను ‘పచ్చిక’ కరిపించి రెండు పదుల వయసుకే కీర్తి శిఖరంపై నిలిచిన కార్లోస్ అల్కరాజ్ అద్భుత ఆటతో ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో ‘ఆల్‌టైమ్ దిగ్గజం’ జొకోవిచ్‌ను ‘పచ్చిక’ కరిపించి చాంపియన్‌గా అవతరించాడు. వరల్డ్ నంబర్‌వన్‌గా తన అద్వితీయ ఆటను అతను సాధించిన గెలుపు టెన్నిస్‌లో రాబోయే నూతన శకానికి నాంది పలికింది. 24వ టైటిల్‌తో పాటు క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన జొకోవిచ్ ఆఖరి వరకు తన స్థాయికి తగ్గ ఆటతో ప్రయత్నించినా... ఇద్దరి మధ్య ఉన్న ‘16’ ఏళ్ల అంతరం ఆట చివర్లో అతని జోరుకు అడ్డుకట్ట వేసింది. నాదల్ భావోద్వేగ ట్వీట్ వైరల్ నాదల్ వారసుడిగా గుర్తింపు తెచ్చుకొని పిన్న వయసులోనే పలు రికార్డులకు చిరునామాగా మారిన అల్కరాజ్ సగర్వంగా తన రెండో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో ఈ స్పెయిన్ టెన్నిస్ స్టార్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సెర్బియా స్టార్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్‌ను ఓడించిన అతడి ఆటకు అభిమానులు మాత్రమే కాదు దిగ్గజ ఆటగాళ్లు సైతం ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో మరో స్పెయిన్ స్టార్, లెజెండ్ రాఫెల్ నాదల్ చేసిన ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. ‘‘కంగ్రాట్యులేషన్స్ అల్కరాజ్. ఈరోజు మాకు నువ్వు ఎనలేని సంతోషాన్ని పంచావు. స్పానిష్ టెన్నిస్‌లో మన మార్గదర్శి, దిక్సూచి, వింబుల్డన్‌లో అద్భుతాలు చేసిన మనోలో సాంటానా కూడా నీ ఆట చూసి ఉప్పొంగిపోయి ఉంటారు. నిన్ను గట్టిగా హత్తుకుని ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని ఉంది చాంపియన్!!! మన టీమ్‌కు ఇదొక గొప్ప క్షణం’’ అని నాదల్.. అల్కరాజ్ను ఉద్దేశించి భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. కాగా తొంటినొప్పి కారణంగా నాదల్ ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్‌షిప్‌నకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. అల్కరాజ్ అద్భుత ఆట కారణంగా 24వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న జొకోవిచ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇక ఈ విజయంతో.. గతేడాది యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన అల్కరాజ్ ఖాతాలో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరింది. చదవండి: టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా.. ‘సెహ్వాగ్.. నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’ జైశ్వాల్ ఒక్కడే కాదు.. అతడు కూడా టాలెంటెడ్.. ఛాన్స్ ఇస్తేనే: పాంటింగ్ Enhorabuena @carlosalcaraz . Nos has dado una alegría inmensa hoy y seguro que nuestro pionero en el tenis español, Manolo Santana, también ha estado animando allá dónde esté como de Wimbledon al que hoy te has unido. Un abrazo muy fuerte y a disfrutar del momento ¡¡¡Campeón!!!… pic.twitter.com/y0j2GowX3O — Rafa Nadal (@RafaelNadal) July 16, 2023 -
Wimbledon: మహిళల సింగిల్స్‌లో సంచలనం.. వొండ్రుసోవా సరికొత్త చరిత్ర
Wimbledon 2023, Women's Singles Winner Marketa Vondrousova: వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మర్కెటా వొండ్రుసోవా సంచలన విజయం సాధించింది. ట్యునీషియా టెన్నిస్ స్టార్ ఆన్స్ జబర్‌ను ఓడించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకుంది. 6-4, 6-4 తేడాతో ప్రత్యర్థిపై గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది. వింబుల్డన్ చరిత్రలో 60 ఏళ్ల తర్వాత చాంపియన్‌గా అవతరించిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా వొండ్రుసోవా చేతిలో ఓడిన 28 ఏళ్ల జబర్ గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓపెన్ శకంలో (1968 తర్వాత) వింబుల్డన్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 24 ఏళ్ల వొండ్రుసోవా ఏకంగా విజేతగా నిలిచింది. కెరీర్లో ఆడిన రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనే టైటిల్ గెలిచింది. ప్రైజ్‌మనీ ఎంతంటే అంతకు ముందు 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో వొండ్రుసోవా ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది జబర్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన వొండ్రుసోవా తాజాగా ఆమెను ఫైనల్లో ఓడించి ట్రోఫీ గెలుచుకుంది. తద్వారా 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 25 కోట్ల 29 లక్షలు) ప్రైజ్‌మనీ గెలిచింది. ఇక రన్నరప్ ప్లేయర్ జబర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 12 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కనుంది. POV: you just become a Wimbledon champion 🏆#Wimbledon pic.twitter.com/kf484DhHUt — Wimbledon (@Wimbledon) July 15, 2023 Marketa's magical moment 🏆 Marketa Vondrousova becomes the third Czech woman to win the ladies' singles title, defeating Ons Jabeur 6-4, 6-4#Wimbledon pic.twitter.com/AAHThI1ZYn — Wimbledon (@Wimbledon) July 15, 2023 Unseeded. Unstoppable.#Wimbledon pic.twitter.com/sgSwIWirDM — Wimbledon (@Wimbledon) July 15, 2023 -
Wimbledon 2023: రెండో రౌండ్లో మానస్
వింబుల్డన్ జూనియర్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ బాలుర సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ మానస్ ధామ్నే శుభారంభం చేశాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన మానస్ ఆదివారం లండన్‌లో జరిగిన తొలి రౌండ్లో 6–2, 6–4తో ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో 47వ స్థానంలో ఉన్న హేడెన్ జోన్స్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మానస్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు 14 విన్నర్స్ కొట్టి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. రన్నరప్ సహజ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ25 మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి రన్నరప్‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌లో జరిగిన సింగిల్స్ ఫైనల్లో సహజ 4–6, 0–6తో మన చాయ సావంగ్కెయి (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 65 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ఒక ఏస్ సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. చదవండి: నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా -
ITF womens tennis tournament: రన్నరప్‌గా శ్రీవల్లి – వైదేహి జోడి
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) – ప్రొ సర్క్యూట్ 25 వేల డాలర్ల మహిళల టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక జోడి రన్నరప్‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌లోని నకోన్ సి తమారట్లో శనివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ రష్మిక – వైదేహి చౌదరి (భారత్) జంట 6–7 (6/3), 1–6 స్కోరుతో భారత్‌కే చెందిన రెండో సీడ్ రుతుజ భోసలే (భారత్) – ఎరికా సేమ (జపాన్)చేతిలో ఓటమిపాలైంది. మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో సహజ 6–2, 6–1తో పియాంగ్‌టర్న్ ప్లిప్యూ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో థాయ్‌లాండ్‌కే చెందిన మనచాయ సవాంగ్కేతో సహజ తలపడుతుంది. -
ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్.. చాంపియన్ సమీర్ వర్మ
Slovenia Open- 2023: ఐదేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సమీర్ వర్మ తన కెరీర్లో మరో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సమీర్ వర్మ 21–18, 21–14తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. విజేతగా నిలిచిన సమీర్‌కు 1200 డాలర్ల (రూ. 99 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. చివరిసారి సమీర్ వర్మ 2018లో సయ్యద్ మోదీ సూపర్–300 టోర్నీలో టైటిల్ సాధించాడు. ఇక టోర్నీలో సిక్కి రెడ్డి- రోహన్ కపూర్ జోడీ మిక్స్డ్ డబుల్స్‌లో రజతం సాధించారు. అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. షాంట్ సర్గ్‌సియాన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను అర్జున్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిన అర్జున్ 3.5 పాయింట్లతో 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, ఆర్యన్ చోప్రా నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా రెండో ర్యాంక్‌లో ఉన్నారు. మాజీ టాప్ ర్యాంక్ జోడీకి సాకేత్–యూకీ షాక్ పారిస్: లియోన్ –250 ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 7–6 (7/4), 3–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ జోడీ సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాకేత్, యూకీ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ ర్యాంకింగ్ ఆధారంగా వచ్చే వారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’కు సాకేత్, యూకీ అర్హత పొందారు. -
జొకోవిచ్‌కు చేదు అనుభవం.. తొలిసారి స్టార్లు లేకుండానే ఫైనల్
Rome Masters: రోమ్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) కథ ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 2–6, 6–4, 2–6తో ఏడో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. 2004 తర్వాత రోమ్ మాస్టర్స్ టోర్నీలో జొకోవిచ్, నాదల్‌లలో ఒక్కరు కూడా లేకుండా తొలిసారి ఫైనల్ జరగనుంది. ఇది కూడా చదవండి: ‘ఎమిలియా’ ఎఫ్1 రేసు రద్దు ఇమోలా (ఇటలీ): ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో భాగంగా ఈనెల 21న ఇటలీలో జరగాల్సిన ఎమిలియా రొమాన్య గ్రాండ్‌ప్రి రేసు రద్దయింది. ఈ రేసుకు వేదికగా నిలవాల్సిన ఇమోలా ప్రాంతాన్ని భారీవర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో రేసును నిర్వహించి అందరినీ ఇబ్బంది పెట్టే యోచన లేదని ఎఫ్1 నిర్వాహకులు తెలిపారు. సీజన్‌లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 28న జరుగుతుంది. -
Madrid Open 2023: అద్భుత ప్రదర్శన.. ఫైనల్లో బోపన్న జోడీ
మాడ్రిడ్: ఈ సీజన్లో తమ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 5–7, 7–6 (7/3), 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీని ఓడించింది. మాడ్రిడ్ మాస్టర్స్ టోర్నీలో బోపన్న ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2015లో ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన బోపన్న, 2016లో రన్నరప్‌గా నిలిచాడు. ఏడేళ్ల తర్వాత మరోసారి ఈ టోర్నీ లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ సీజన్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో, దోహా ఓపెన్‌లో టైటిల్ సాధించి, రోటర్‌డామ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. బోరిస్ గెల్ఫాండ్‌పై అర్జున్ గెలుపు టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ శుభారంభం చేశాడు. స్వీడన్లో గురువారం మొదలైన ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లు జరుగుతాయి. తొలి రౌండ్లో 19 ఏళ్ల అర్జున్ 41 ఎత్తుల్లో ఇజ్రాయెల్ గ్రాండ్‌మాస్టర్ బోరిస్ గెల్ఫాండ్‌పై గెలుపొందాడు. 54 ఏళ్ల గెల్ఫాండ్ 2012 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో విశ్వనాథన్ ఆనంద్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. -
రన్నరప్ అనిరుధ్ జోడీ; మూడో సీడ్‌పై సాకేత్ జోడీ విజయం
సాక్షి, హైదరాబాద్: స్ల్పిట్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. క్రొయేషియాలో జరిగిన ఈ టోర్నీలో అనిరుధ్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీ ఫైనల్లో ఓడిపోయింది. 70 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో అనిరుధ్–విజయ్ సుందర్ ప్రశాంత్ 4–6, 4–6తో సాదియో డుంబియా–ఫాబ్లెన్ రెబూల్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. తొలి రౌండ్లో భారత జోడీ 6–2, 6–1తో అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్)–కైచి ఉచిడా (జపాన్) జంటను ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో అనిరుధ్–విజయ్‌లకు తమ ప్రత్యర్థుల నుంచి వాకోవర్ లభించడంతో నేరుగా ఫైనల్ ఆడారు. అనిరుధ్–విజయ్‌లకు 2,450 యూరోల (రూ. 2 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మూడో సీడ్‌పై సాకేత్ జోడీ విజయం బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. జర్మనీలోని మ్యూనిక్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 6–3, 7–6 (7/4)తో మూడో సీడ్ నథానియల్ లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) జోడిని ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ జోడి ఆరు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
రుబ్లెవ్ ఖాతాలో తొలి ‘మాస్టర్స్’ టైటిల్.. రూ. 8 కోట్ల ప్రైజ్‌మనీతోపాటు..
Andrey Rublev : మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రష్యా ప్లేయర్ ఆండ్రీ రుబ్లెవ్ విజేతగా నిలిచాడు. మొనాకోలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ రుబ్లెవ్ 5–7, 6–2, 7–5తో తొమ్మిదో ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై నెగ్గాడు. రుబ్లెవ్ కెరీర్లో ఇదే తొలి ‘మాస్టర్స్’ సిరీస్ టైటిల్ కావడం విశేషం. మూడో సెట్లో రుబ్లెవ్ 1–4తో వెనుకబడి పుంజుకున్నాడు. విజేత రుబ్లెవ్కు 8,92,590 యూరోల (రూ. 8 కోట్లు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఓటమితో ముగించిన భారత్
తాష్కెంట్: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల గ్రూప్–1 టెన్నిస్ టోర్నీని భారత్ ఓటమితో ముగించింది. శనివారం జరిగిన ఆఖరి పోరులో భారత్‌పై 2–1 తేడాతో కొరియా విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో భారత్‌కు చెందిన వైదేహి చౌదరి 6–2, 4–6, 4–6 తేడాతో కిమ్ డాబిన్ చేతిలో పరాజయంపాలైంది. అయితే రెండో సింగిల్స్‌లో రుతుజ భోస్లే 7–5, 2–6, 6–2 తేడాతో క్యూ య్యూన్‌వును ఓడించింది. అనంతరం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో కొరియా జోడి కిమ్ డాబిన్ – జీ హీ చొయ్ 6–4, 2–6, 6–3తో భారత ద్వయం అంకితా రైనా – రుతుజ భోస్లేపై విజయం సాధించింది. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లలో థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్‌లపై గెలుపొందిన భారత అమ్మాయిలు ఆ తర్వాత వరుసగా మూడు సమరాల్లో చైనా, జపాన్, కొరియా చేతుల్లో ఓడిపోయారు. ఈ క్రమంలో ఈ టెన్నిస్ టోర్నీలో భారత్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. చదవండి: కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన జితేశ్ శర్మ -
ఒలింపిక్ పతకం లేకపోయినా బాధలేదు: సానియా భావోద్వేగం
Sania Mirza Retirement: ‘‘నా జీవితంలో టెన్నిస్ ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటుంది. అయితే టెన్నిస్ మాత్రమే జీవితం కాదు. ప్రొఫెషనల్ అథ్లెట్‌గా ఎదుగుతున్న సమయంలోనే అలా భావించాను. కాబట్టి ఏనాడూ ఓటమి భయం లేదు. ఓడితే మళ్లీ వచ్చి గెలవగలమనే ధైర్యంతోనే ఆడాను. పరాజయాలు నాపై ప్రభావం చూపలేదు. ఓడినప్పుడు కొద్దిసేపు బాధపడినా దాంతో ప్రపంచం ఆగిపోదని నాకు తెలుసు. డబుల్స్ కారణంగానే నాకు గుర్తింపు దక్కింది. దానికి నేను గర్విస్తున్నా. సింగిల్స్‌లోనూ మన దేశం నుంచి ఎవరికీ సాధ్యం కాని రీతిలో టాప్–30లోకి వచ్చాను కాబట్టి అదీ గొప్ప ఘనతే. మణికట్టుకు శస్త్రచికిత్సల తర్వాత సింగిల్స్‌లో ఆడటం ఇబ్బందిగా మారడంతో డబుల్స్‌కు మారాను తప్ప ఆడలేక కాదు. ఎక్కడైనా నంబర్‌వన్ అంటే చిన్న విషయం కాదు. ఒలింపిక్ పతకం లేకపోయినా నేను సాధించినదాంతో సంతృప్తిగా ఉన్నా. నేనో ట్రెండ్ సెట్టర్‌గా భావించడం లేదు. నాకు వచ్చిన, నచ్చిన రీతిలో ఆడుతూ పోయాను. ఆ క్రమంలోనే ఈ విజయాలన్నీ వచ్చాయి’’ అని భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు. నంబర్ 1గా ఎదిగి.. ఓటమితో ముగింపు ఇరవై ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని.. నంబర్ 1 స్థాయికి ఎదిగిన ఈ హైదరాబాదీ ఆటకు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి లోనయ్యారు. దుబాయ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓటమి ద్వారా ప్లేయర్‌గా సానియా టెన్నిస్ కెరీర్ ముగిసిపోయింది. ఐదేళ్ల వయసులోనే రాకెట్ పట్టిన సానియా మీర్జా.. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నారు. మూడు డబుల్స్ గ్రాండ్‌స్లామ్, మూడు మిక్స్డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచి మరే ఇతర భారత మహిళా టెన్నిస్ ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో రికార్డులు నెలకొల్పారు. 43 డబుల్స్ ట్రోఫీలు సాధించారు. 91 వారాలు వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగారు. చదవండి: Sania Mirza: 'వండర్ ఉమన్'.. సానియాకు సలాం! ముక్కుసూటి జవాబులతో.. Smriti Mandhana: వారెవ్వా.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దాదానే తలపించింది View this post on Instagram A post shared by Women’s Tennis Association (@wta) -
ఫైనల్లో బోపన్న జోడీ
ఏబీఎన్ ఆమ్రో ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 6–4తో కెవిన్ క్రాయిట్జ్–టిమ్ పుయిట్జ్ (జర్మనీ) ద్వయంపై గెలుపొందింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. -
చరిత్ర సృష్టించిన వు యిబింగ్.. టైటిల్ గెలిచిన తొలి చైనీయుడిగా..
ATP Tour- Dallas Open: ఏటీపీ టైటిల్ గెలిచిన తొలి చైనీయుడిగా వు యిబింగ్ చరిత్ర సృష్టించాడు. డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ ఫైనల్లో జాన్ ఇస్నర్‌ను ఓడించి విజేతగా అవతరించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో యిబింగ్ 6-7(4) 7-6(3) 7-6(12) తేడాతో అమెరికాకు చెందిన జాన్‌ను ఓడించాడు. తద్వారా డాలస్ ఓపెన్ ట్రోఫీ నెగ్గి రికార్డులకెక్కాడు. మీ వల్లే ఇదంతా అంటూ భావోద్వేగం ఈ సందర్భంగా యిబింగ్ మాట్లాడుతూ.. ‘‘నా దేశం గర్వించదగ్గ రీతిలో ఈరోజు నేనిక్కడ చరిత్ర సృష్టించాను. నాకు చాలా చాలా సంతోషంగా, గర్వంగానూ ఉంది. నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిన నా అభిమానులు, సహాయక సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. మీరు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక రన్నరప్‌గా నిలిచిన జాన్..‘ ఎంతగా పోరాడినా ఒక్కోసారి చేదు అనుభవాలు తప్పవు. యిబింగ్ మాత్రం చాలా బాగా ఆడాడు. అతడి ప్రతిభ అమోఘం’’ అని ప్రశంసించాడు. ఒకే ఒక్కడు కాగా మహిళల టెన్నిస్‌లో చైనా నుంచి గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్ ఉన్నా... పురుషుల టెన్నిస్‌లో మాత్రం ఇప్పటివరకు ఒక్కరు కూడా కనీసం ఏటీపీ టోర్నీలోనూ ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయారు. అయితే డాలస్ ఓపెన్‌లో 23 ఏళ్ల యిబింగ్ వు ఈ లోటును తీర్చాడు. ఈ టోర్నీ సెమీఫైనల్లో 97వ ర్యాంకర్ యిబింగ్ వు 6–7 (3/7), 7–5, 6–4తో 8వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)ను ఓడించి ఏటీపీ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి చైనా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఇదే జోష్‌లో.. ఫైనల్లోనూ సత్తాచాటి సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. చదవండి: Womens T20 World Cup 2023: మన అమ్మాయిలు... అదరగొట్టారు That winning slide though 😅 What a moment for Wu Yibing after an electric game against Isner 🍿@DALOpenTennis | #DalOpen pic.twitter.com/x2r8D1FAdm — ATP Tour (@atptour) February 12, 2023 -
Myneni Saketh: సెమీస్‌లో పోరాడి ఓడిన సాకేత్ జోడీ
ATP 250 Dallas Open: డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–7 (11/13), 5–7తో లామోన్స్–విత్రో (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–యూకీ మూడుసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను వృథా చేసుకున్నారు. సాకేత్–యూకీలకు 12,230 డాలర్ల (రూ. 10 లక్షలు) ప్రైజ్‌మనీ, 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
Saketh Myneni- Yuki Bhambri: డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 5–7, 7–6 (7/3), 10–3తో క్రిస్టోఫర్ యుబ్యాంక్స్–మార్కస్ జిరోన్ (అమెరికా) జోడీపై గెలిచింది. గంటా 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–యూకీ మూడు ఏస్‌లు సంధించారు. క్వార్టర్ ఫైనల్లో జూలియన్ క్యాష్–హెన్రీ ప్యాటర్న్ (బ్రిటన్)లతో సాకేత్–యూకీ ఆడతారు. చదవండి: Zim Vs WI 1st Test: జింబాబ్వే- వెస్టిండీస్‌టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత T20 WC 2023: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం -
భావోద్వేగానికి లోనైన సానియా.. ఇక్కడే మొదలు, ఇక్కడే ముగింపు అంటూ..
Sania Mirza Gets Emotional Video: ‘‘నా ప్రొఫెషనల్ కెరీర్ ఇక్కడే.. 2005లో 18 ఏళ్ల వయసులో మెల్బోర్న్లో మొదలైంది.. ఇక్కడే నా గ్రాండ్‌స్లామ్ కెరీర్ ముగిసిపోతోంది కూడా. రాడ్ లావెర్ ఎరీనా నాకు ఎంతో ప్రత్యేకం. నా చిన్నారి కుమారుడి సమక్షంలో ఇలా ఇక్కడ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడతానని అస్సలు ఊహించలేదు. ఇంతకంటే మరో గొప్ప చోటు ఎక్కడా ఉండదు’’ అంటూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భావోద్వేగానికి లోనయ్యారు. ఆస్ట్రేలియా ఓపెన్-2023 మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓటమి తర్వాత తన కెరీర్‌లోని మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఓటమితో ముగింపు కాగా ఇప్పటికే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన హైదరాబాదీ సానియా మీర్జా కెరీర్లో ఇదే ఆఖరి గ్రాండ్‌స్లామ్. మరో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నతో కలిసి ఫైనల్ చేరుకున్న సానియా మెల్బోర్న్లో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఓటమిని మూటగట్టుకున్నారు. బ్రెజిల్ జంట లూసియా స్టెఫానీ- రఫేల్ మాటోస్ చేతిలో ఓడిపోయిన భారత జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక బ్రెజిల్ ద్వయానికి కూడా ఇదే తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కావడం విశేషం. కన్నీళ్లు పెట్టుకున్న సానియా.. 36 ఏళ్ల సానియా మీర్జా కెరీర్లో ఇది 11వ గ్రాండ్ స్లామ్ ఫైనల్. కాగా సానియా ఇప్పటి వరకు 43 డబుల్స్ టైటిళ్లు గెలిచారు. ఇందులో ఆరు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు ఉన్నాయి. నంబర్ 1గా.. కానీ అదొక్కటే లోటు మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్డ్ డబుల్స్‌లో మూడుసార్లు విజేతగా నిలిచారు. అంతేగాక మహిళల డబుల్స్ కేటగిరీలో సానియా 91 వారాల పాటు నంబర్ 1 ర్యాంకులో కొనసాగారు. అయితే కెరీర్లో ఒక్కసారి కూడా ఆమె మేజర్ సింగిల్స్ టైటిల్ గెలవలేకపోయారు. ఇదే సానియా కెరీర్లో పెద్దలోటు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తన కుమారుడు ఇజహాన్ ఎదుట ఆడిన ఫైనల్లో ఓడిపోయిన సానియా కన్నీళ్లు పెట్టుకుంటూ వీడ్కోలు పలికారు. వి లవ్ యూ! ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు.. ‘‘మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము సానియా’’ అని ట్వీట్ చేశారు. కాగా వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరుగనున్న డబ్లూటీఏ 1000 ఈవెంట్ తర్వాత సానియా తన టెన్నిస్ కోర్టుకు పూర్తిగా దూరం కానున్నారు. సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు- భాగస్వాములు ►2006- ఆస్ట్రేలియా ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- మహేశ్ భూపతి ►2012- ఫ్రెంచ్ ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- మహేశ్ భూపతి ►2014- యూఎస్ ఓపెన్- మిక్స్డ్ డబుల్స్- బ్రూనో సోర్స్ ►2015- వింబుల్డన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ ►2015- యూఎస్ ఓపెన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ ►2016- ఆస్ట్రేలియా ఓపెన్- మహిళల డబుల్స్- మార్టినా హింగిస్ చదవండి: Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... “My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my [Grand Slam] career at.” We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/E0dNogh1d0 — #AusOpen (@AustralianOpen) January 27, 2023 -
మాజీ నంబర్ వన్‌కు షాకిచ్చి రిబాకినా.. సునాయాసంగా సబలెంకా! ఫైనల్లో..
Elena Rybakina Vs Aryna Sabalenka In Final- మెల్బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. గత ఏడాది వింబుల్డన్ టైటిల్ నెగ్గి వెలుగులోకి వచ్చిన కజకిస్తాన్ అమ్మాయి ఎలీనా రిబాకినా... కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన సబలెంకా (బెలారస్) మధ్య శనివారం ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరు జరగనుంది. మాజీ నంబర్ వన్‌కు షాకిచ్చి గురువారం జరిగిన రెండు సెమీఫైనల్స్‌లో 22వ సీడ్ రిబాకినా 7–6 (7/4), 6–3తో 2012, 2013 చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించగా... ఐదో సీడ్ సబలెంకా 7–6 (7/1), 6–2తో అన్‌సీడెడ్ మగ్దా లీనెట్ (పోలాండ్)పై విజయం సాధించింది. కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న సబలెంకాకిది తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కానుండగా... రిబాకినా కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తుది పోరుకు చేరింది. ఇక అజరెంకాతో గంటా 41 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రిబాకినా తొమ్మిది ఏస్‌లు, 30 విన్నర్స్ కొట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరోవైపు అజరెంకా మూడు ఏస్‌లు కొట్టి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 27 అనవసర తప్పిదాలు చేసింది. అజరెంకా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన రిబాకినా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. సబలెంకా ముందు నిలవలేకపోయిన లీనెట్ తన కెరీర్లో 30వ ప్రయత్నంలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన లీనెట్ కీలకపోరులో సబలెంకాకు సరైన సమాధానమివ్వలేకపోయింది. గంటా 33 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో లీనెట్ తొలి సెట్లో గట్టిపోటీనిచ్చినా రెండో సెట్లో డీలా పడింది. మ్యాచ్‌లో సబలెంకా ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ఏకంగా 33 విన్నర్స్ కొట్టింది. సబలెంకాదే పైచేయి మూడుసార్లు లీనెట్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకా తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే చేజార్చుకుంది. గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ చేరి ఓడిపోయిన సబలెంకా నాలుగో ప్రయత్నంలో సఫలమై ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. రిబాకినాతో గతంలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సబలెంకా ఈసారీ గెలిస్తే తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఖచనోవ్ (రష్యా)తో సిట్సిపాస్ (గ్రీస్)... టామీ పాల్ (అమెరికా)తో జొకోవిచ్ (సెర్బియా) ఆడతారు. చదవండి: Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... -
Australia Open: ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో సానియా- బోపన్న జోడీ
Australian Open Mixed Doubles: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) జోడి అదరగొట్టింది. బుధవారం నాటి సెమీస్ మ్యాచ్‌లో థర్డ్ సీడ్ ద్వయం నీల్ స్కుప్స్కి(గ్రేట్ బ్రిటన్), డిసిరే(యూఎస్ఏ)ను ఓడించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రత్యర్థిపై 7-6, 6-7, (10-6) తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. అలా సెమీస్‌కు చేరి.. ఇదిలా ఉంటే.. సానియా మీర్జా–రోహన్ బోపన్న ద్వయం కోర్టులోకి అడుగు పెట్టకుండానే మిక్స్డ్ డబుల్స్‌లో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జోడీతో తలపడాల్సిన ఒస్టాపెంకో (లాత్వియా)–వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో భారత జంటను విజేతగా ప్రకటించారు. ఇలా సెమీస్‌కు చేరుకున్న సానియా- బోపన్న జోడీ మెరుగైన ప్రదర్శనతో ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా.. బోపన్న సాయంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోనూ విజయం సాధించి టైటిల్‌తో ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: ICC ODI Rankings: నంబర్ వన్ బౌలర్‌గా సిరాజ్ ICC ODI Rankings: కోహ్లిని వెనక్కునెట్టిన గిల్.. హిట్‌మ్యాన్ ఏ స్థానంలో ఉన్నాడంటే..? In a fitting farewell, @MirzaSania's last dance will take place on the grandest stage! She and @rohanbopanna 🇮🇳 have qualified for the Mixed Doubles Final!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/qHGNOvWMoC — #AusOpen (@AustralianOpen) January 25, 2023 -
Sania Mirza: ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. విజయంతో మొదలు
మెల్బోర్న్: హైదరాబాద్ వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో ముందంజ వేసింది. కెరీర్లో ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న ఆమె అనా డానిలినా (కజకిస్తాన్) కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సానియా–డానిలినా జోడీ 6–2, 7–5తో డాల్మా గాల్ఫీ (హంగేరి)–బెర్నార్డా పెర (అమెరికా) జంటపై విజయం సాధించింది. తొలి సెట్‌ను 25 నిమిషాల్లోనే వశం చేసుకున్న భారత్–కజకిస్తాన్ ద్వయానికి రెండో సెట్లో అనూహ్య పోటీ ఎదురైంది. 4–1తో గెలిచే దశలో కనిపించిన సానియా జోడీకి గాల్ఫీ–బెర్నార్డా వరుసగా 4 గేమ్‌లు గెలిచి సవాలు విసిరారు 5–5తో సమం చేశారు. అయితే తర్వాత వారి సర్వీస్‌ను బ్రేక్ చేయడం ద్వారా సానియా–డానిలినా జంట గెలుపొందింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 2009 (మిక్స్డ్), 2016 (డబుల్స్)లలో సానియా విజేతగా నిలిచింది. చదవండి: Kaviya Maran: నన్ను పెళ్లి చేసుకుంటావా?.. సౌతాఫ్రికాలో కావ్య మారన్‌కు ప్రపోజల్.. వీడియో వైరల్ Hockey WC 2023: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర! బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. పాక్ బ్యాటర్ ఊచకోత -
తొలి రౌండ్లోనే సానియా జోడీ ఓటమి.. ప్రైజ్‌మనీ?
Adelaide Open 2023: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొత్త సంవత్సరాన్ని ఓటమితో ప్రారంభించింది. సోమవారం మొదలైన అడిలైడ్ ఓపెన్ ఇంటర్నేషనల్–2 టోర్నీలో సానియా మీర్జా–అనా డానిలినా (కజకిస్తాన్) జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సానియా–డానిలినా ద్వయం 6–3, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ స్టార్మ్ హంటర్ (ఆస్ట్రేలియా)–క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓడిపోయింది. ఇక తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టిన సానియా– డానిలినా జోడీకి 4,350 డాలర్ల (రూ. 3 లక్షల 58 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్ -
సుమీత్ నగాల్ అవుట్...
పుణే: దేశంలోని ఏకైక ఏటీపీ టోర్నీ టాటా ఓపెన్ మహారాష్ట్రలో భారత ఆటగాడు సుమీత్ నగాల్ పోరు ముగిసింది. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫిలిప్ క్రజినోవిచ్ (సెర్బియా) 6–4, 4–6, 6–4 స్కోరుతో నగాల్‌పై విజయం సాధించాడు. 2 గంటల 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ‘వైల్డ్ కార్డ్’ సుమీత్ తీవ్రంగా పోరాడినా లాభం లేకపోయింది. క్రజినోవిచ్ 8 ఏస్‌లు కొట్టగా, నగాల్ 3 ఏస్‌లు నమోదు చేశాడు. మరో మ్యాచ్‌లో అమెరికాకు చెందిన మైకేల్ మో 6–2, 6–4 స్కోరుతో 15 ఏళ్ల భారత సంచలనం మానస్ ధమ్నేపై విజయం సాధించాడు. ఇది కూడా చదవండి: ఫైనల్లో శివ థాపా జాతీయ పురుషుల సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ బాక్సర్ శివ థాపా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆరు సార్లు ఆసియా పతకాలు సాధించిన అస్సాం బాక్సర్ థాపా... 63.5 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో జస్వీందర్ సింగ్ (ఢిల్లీ)ని తన నాకౌట్ పంచ్‌తో చిత్తు చేశాడు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించిన రోహిత్ టోకస్ (రైల్వేస్) కూడా 5–0తో జై సింగ్ (ఛత్తీస్‌గఢ్)పై ఘన విజయం సాధించాడు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక; అడిలైడ్ టోర్నీతో సానియా సీజన్ షురూ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నవీ ముంబైలో బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో రష్మిక 6–0తో రియా భాటియా (భారత్)పై గెలిచింది. రష్మిక తొలి సెట్ గెలిచాక రియా గాయం కారణంగా వైదొలగడంతో రెండో సెట్‌ను నిర్వహించలేదు. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి (భారత్) జోడీ 4–6, 6–4, 10–8తో శ్రావ్య శివాని–జెన్నిఫర్ (భారత్) ద్వయంపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కే చెందిన సౌజన్య బవిశెట్టి డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. తొలి రౌండ్లో సౌజన్య–షర్మదా (భారత్) జోడీ 6–4, 7–6 (11/9)తో సహజ–సోహా (భారత్) జంటను ఓడించింది. అడిలైడ్ టోర్నీతో సానియా సీజన్ షురూ భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2023 సీజన్‌ను అడిలైడ్ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నీ ద్వారా ప్రారంభించనుంది. జనవరి 1 నుంచి 7 వరకు ఆస్ట్రేలియాలో జరిగే ఈ టోర్నీలో సానియా కజకిస్తాన్ ప్లేయర్ అన్నా డానిలినాతో కలిసి డబుల్స్ విభాగంలో బరిలోకి దిగనుంది. ఈ మేరకు నిర్వాహకులు ఈ టోర్నీలో ఆడుతున్న క్రీడాకారిణుల జాబితాను విడుదల చేశారు. ఈ ఏడాది సానియా 16 టోర్నీలలో పోటీపడగా... రెండు టోర్నీలలో (చార్ల్స్టన్ ఓపెన్, స్ట్రాస్‌బర్గ్ ఓపెన్) రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి పడింది. ఆమె 26 మ్యాచ్‌ల్లో గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. చదవండి: ICC Test Rankings: అదరగొట్టిన అక్షర్ పటేల్... కుల్దీప్, పుజారా, గిల్ సైతం.. BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కిట్ స్పాన్సర్ కూడా! కారణం? -
122 ఏళ్ల డేవిస్‌కప్ చరిత్రలో కెనడాకు తొలిసారి...
Davis Cup- ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్‌కప్‌లో కెనడా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. స్పెయిన్‌లో జరిగిన ఫైనల్లో కెనడా 2–0తో ఆస్ట్రేలియాపై గెలిచింది. తొలి సింగిల్స్‌లో షపోవలోవ్ 6–2, 6–4తో కొకినాకిస్‌పై నెగ్గాడు. ఇక రెండో సింగిల్స్‌లో ఫెలిక్స్ అలియాసిమ్ 6–3, 6–4తో అలెక్స్ డిమినార్‌ను ఓడించి 122 ఏళ్ల డేవిస్‌కప్ చరిత్రలో కెనడాకు తొలిసారి టైటిల్ అందించాడు. 2019లో కెనడా ఫైనల్‌కు చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. Take a bow, @denis_shapo 🤯🤩 Was this the shot of the #Final8? 💫#DavisCup #byRakuten | @TennisCanada pic.twitter.com/96vU0TU7AW — Davis Cup (@DavisCup) November 28, 2022 చదవండి: కామెరూన్‌ను కాపాడిన అబుబాకర్ దోహా: కామెరూన్ స్ట్రయికర్ విన్సెంట్ అబుబాకర్ సెర్బియా గెలుపురాతను మార్చేశాడు. 3–1తో సెర్బియా గెలుపుబాట పట్టిన దశలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ అబుబాకర్ ఒక గోల్ చేయడంతో పాటు మరో గోల్‌కు తోడయ్యాడు. దీంతో గ్రూప్ ‘జి’లో సోమవారం సెర్బియా, కామెరూన్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరకు 3–3 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. సెర్బియా తరఫున పావ్లోవిచ్ (45+1వ ని.లో), మిలింకోవిచ్ (45+3వ ని.లో), మిత్రోవిచ్ (53వ ని.లో) గోల్ చేశారు. కామెరూన్ తరఫున క్యాస్టె లెటో (29వ ని.లో), అబుబాకర్ (63వ ని.లో), మోటింగ్ (66వ ని.లో) గోల్ సాధించారు. ర్యాంకింగ్, ఆటతీరు పరంగా కామెరూన్ కంటే సెర్బియా గట్టి ప్రత్యర్థి. ఇందుకు తగ్గట్లే తొలి అర్ధభాగాన్ని 2–1తో ముగించింది. రెండో అర్ధభాగం మొదలైన కాసేపటికే మిత్రోవిచ్ గోల్ చేయడంతో 3–1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో మైదానంలోకి వచ్చిన విన్సెంట్ సెర్బియాకు కొరకరాని కొయ్యగా మారాడు. 63వ నిమిషంలో గోల్ చేసిన అతను మూడు నిమిషాల వ్యవధిలో మోటింగ్ గోల్ చేసేందుకు సాయపడ్డాడు. చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8! FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ -
జొకోవిచ్ ఖాతాలో 89వ సింగిల్స్ టైటిల్
సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్ తన కెరీర్లో 89వ సింగిల్స్ టైటిల్ సాధించాడు. టెల్ అవీవ్ ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–4తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేíÙయా)పై గెలుపొందాడు. చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్‌కు 1,44,415 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 17 లక్షలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Vietnam Open 2022: సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ జోడీ జోరు
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ జోరు కొనసాగుతోంది. గతవారం ఛత్తీస్‌గఢ్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో టైటిల్ నెగ్గిన సిక్కి–రోహన్ ద్వయం వియత్నాం ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి, ఢిల్లీ ప్లేయర్ రోహన్ కపూర్ 21–19, 21–17తో మూడో సీడ్ చాన్ పెంగ్ సూన్–చెయ యీ సీ (మలేసియా) జోడీపై సంచలన విజయం సాధించారు. 34 ఏళ్ల చాన్ పెంగ్ సూన్ 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకం సాధించడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ రెహన్ నౌఫల్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) జోడీతో సిక్కి రెడ్డి–రోహన్ తలపడతారు. Tel Aviv Tennis Tournament: టైటిల్‌కు గెలుపు దూరంలో... టెల్ అవీవ్: భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది మూడో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. టెల్ అవీవ్ ఏటీపీ–250 టోర్నీలో బోపన్న (భారత్)– మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 4–6, 7–6 (7/3), 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో డూంబియా–రెబూల్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. 42 ఏళ్ల బోపన్న ఈ ఏడాది పుణే ఓపెన్, అడిలైడ్ ఓపెన్లలో డబుల్స్ టైటిల్స్ సాధించాడు. -
క్వార్టర్స్‌లో బోపన్న జోడీ
న్యూఢిల్లీ: టెల్ అవీవ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం ఇజ్రాయెల్‌లో జరిగిన తొలి రౌండ్లో టాప్ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 4–6, 7–6 (7/4), 10–6తో వైషయ్ ఒలియెల్ (ఇజ్రాయెల్)–మెద్జెదోవిచ్ (సెర్బియా) జోడీ పై గెలిచింది. గంటా 28 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. చదవండి: Vietnam Open Badminton: ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ జోడీ -
ఫెదరర్ మ్యాచ్‌కు ముందు నాటకీయ పరిణామం.. పిచ్చి పరాకాష్టకు
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన 24 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. లావెర్ కప్ 2022లో శుక్రవారం అర్థరాత్రి ఫెదరర్-నాదల్‌తో కలిసి తన చివరి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ డబుల్స్ మ్యాచ్‌లో ఫెదరర్-నాదల్ జోడి ఓటమిపాలైంది. అయితే ఫెదరర్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఒక అపశృతి చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. సిట్సిపాస్, డీగో వార్ట్జ్మన్ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో 6-1, 6-2తో సిట్సిపాస్ విజయం సాధించాడు. అయితే మ్యాచ్‌లో తొలి సెట్ సిట్సిపాప్ కైవసం చేసుకున్న తర్వాత ఆటకు విరామం వచ్చింది. ఈలోగా మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక ఆగంతకుడు టెన్నిస్ కోర్టులోకి దూసుకెళ్లి అందరూ చూస్తుండగానే తన మోచేతికి నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత పిచ్చి పట్టినట్లు అరుస్తూ మంటలు ఆర్పుకున్నాడు.ఈ సమయంలో సిట్సిపాస్ అతని వెనకాలే ఉన్నాడు. ఈ ఉదంతంతో భయపడిన సిట్సిపాస్ బారీకేడ్ దాటి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సెక్యూరిటీ వచ్చి అతన్ని వెళ్లిపోవాలని చెప్పినా వినిపించుకోకుండా అక్కడే కూర్చున్నాడు. దీంతో సెక్యూరిటీ అతన్ని కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు. పోలీసులు సదరు వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి ఎవరికి హాని తలపెట్టకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టోర్నీ నిర్వాహకులు అక్కడికి చేరుకొని అక్కడి సిబ్బందిచే టెన్నిస్ కోర్టును క్లీన్ చేయించారు. A man has set his arm on fire after invading the court at the Laver Cup on Roger Federer's last day as a professional tennis player. pic.twitter.com/g0LcBU8PeJ — Sam Street (@samstreetwrites) September 23, 2022 చదవండి: 'కోచ్ ఇబ్బంది పెడుతున్నారు.. తట్టుకోలేకపోతున్నాం' ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటీ పర్యంతం -
రోజర్ ఫెదరర్ కీలక వ్యాఖ్యలు..
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు లావెర్ కప్ చివరి టోర్నీ కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో నాలుగో రౌండ్లో వెనుదిరిగిన అనంతరం ఫెదరర్ తన 24 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక లావెర్ కప్ ఫెదరర్‌కు చివరి టోర్నీ కానుంది. ఈ టోర్నీ అనంతరం టెన్నిస్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలకనున్నాడు. ఫెదరర్‌కు చివరి టోర్నీ కావడంతో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని లావెర్ కప్ టోర్నీ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ శుక్రవారం ఫెదరర్ లావెర్కప్లో డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. 24 కెరీర్లో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఫెదరర్ లావెర్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడాడు. ''ప్రొఫెషనల్ టెన్నిస్‌లో నాకిది చివరి మ్యాచ్.. అంతే. దీంతో నా జీవితం ముగిసిపోలేదు. అనవసరంగా నన్ను హీరోని చేస్తున్నారు. చివరి మ్యాచ్ చూసేందుకు సంతోషంగా రండి.. దయచేసి అంతిమయాత్రలా చేయకండి ప్లీజ్'' అంటూ పేర్కొన్నాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత కూడా ఆట కొనసాగిస్తానని ఫెదరర్ పేర్కొన్నాడు. కుటుంబంతో గడపడానికి, కొత్త ప్రదేశాల సందర్శనకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానన్నాడు. లండన్‌లో చివరి మ్యాచ్ ఆడడానికి ఒక కారణం ఉందని ఫెదరర్ పేర్కొన్నాడు. ఇక్కడి అభిమానులు నాకెంతో ఇచ్చారు.. అందుకే వారి సమక్షంలో నా ఆటను ముగించాలనుకుంటున్నానంటూ వెల్లడించాడు. కాగా ఫెదరర్ ఆడనున్న చివరి మ్యాచ్‌కు పలువురు టెన్నిస్ ప్రముఖులు రానున్నారు. ఫెదరర్ చిరకాల మిత్రుడు రఫేల్ నాదల్ కూడా హాజరు కానున్నాడు. ఈ విషయాన్ని నాదల్ స్వయంగా ట్విటర్ వేదికగా తెలిపాడు. ఫెడ్డీ మ్యాచ్‌కు రానున్న జొకోవిచ్ ఉద్దేశించి '' జొకో.. నేను రేపు లండన్‌కు వస్తున్నా.. ఫెడ్డీ మ్యాచ్ చూడడానికి.. వెయిట్ ఫర్ మీ'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. Hey… I am coming tomorrow… Landing in London in the morning… wait for me 😉💪🏻 https://t.co/IguhwCxN3E — Rafa Nadal (@RafaelNadal) September 21, 2022 చదవండి: కోహ్లి, ధావన్‌ల తర్వాత స్మృతి మందానకే సాధ్యమైంది.. -
భారత టెన్నిస్ క్రీడాకారిణులకు నిరాశ
చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్‌లో బరిలోకి దిగిన ఐదుగురు ప్లేయర్లు సౌజన్య బవిశెట్టి, లక్ష్మీ ప్రభ, రియా భాటియా, రుతుజా భోస్లే, సాయి సంహిత తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. శనివారం చెన్నైలో జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య 4–6, 0–6తో క్యోకా ఒకమురా (జపాన్) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో లక్ష్మీ ప్రభ 4–6, 1–6తో యుకీ నైటో (జపాన్) చేతిలో... సంహిత 1–6, 0–6తో నావో హిబినో (జపాన్) చేతిలో... రియా 4–6, 0–6తో మికుల్స్కైటీ (లిథువేనియా) చేతిలో... రుతుజా 3–6, 2–6తో ఎన్షువో లియాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. భారత్‌కే చెందిన అంకిత రైనా, కర్మన్కౌర్లకు మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు వైల్డ్ కార్డు కేటాయించారు. చదవండి: US Open 2022: ‘నంబర్‌వన్’ సమరం -
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. నాదల్ కథ ముగిసింది
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్.. స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ కథ ముగిసింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన 22వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫో చేతిలో నాదల్.. 6-4, 4-6, 6-4, 6-3తో దారుణ పరాజయం చవిచూశాడు. ఇక కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న నాదల్కు ఈ ఏడాది మేజర్ టోర్నీల్లో నాదల్కు ఎదురైన తొలి ఓటమి ఇదే. కిక్కిరిసిన ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో నాదల్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్ స్లామ్స్ గెలిచి జోరు మీదున్న ప్రపంచ రెండో ర్యాంకర్ రఫెల్ నాదల్ కు షాక్ తగిలింది. టైటిల్ ఫేవరెట్ గా భావించిన నాదల్ పోరాటం ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో అమెరికా ఆటగాడు, 22వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫో 6-4,4-6,6-4,6-3 స్కోరుతో నాదల్ ను ఓడించి సంచలనం సృష్టించాడు.పేలవ సర్వీసులు, రిటర్న్ లతో నిరాశ పరిచాడు. తొలి సెట్ నే కోల్పోయిన రఫెల్ రెండో సెట్ గెలిచి స్కోరు సమం చేశాడు. కానీ, తర్వాతి రెండు సెట్లలో తేలిపోయాడు. దాంతో, ఐదోసారి నాదల్ సర్వీస్ బ్రేక్ చేస్తూ విజయం సాధించిన టియఫో తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకొని క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే ప్రపంచ నంబర్ వన్ డానిల్ మెద్వెదెవ్ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. దీంతో క్వార్టర్స్ కు ముందే ఇద్దరు టాప్ సీడ్ ఆటగాళ్లు ఇంటిదారి పట్టినట్టయింది. ఫ్రాన్సిస్ రికార్డ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్‌ను ఓడించిన అమెరికా క్రీడాకారుల్లో ఫ్రాన్సిస్ టోయాఫే మూడో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. గతంలో ఆండీ రాడిక్, జేమ్స్ బ్లేక్‌లు మాత్రమే నాదల్‌ను ఓడించారు. ఇక ఈ విజయంతో రొడ్డిక్ తర్వాత యూఎస్ ఓపెన్ సెమీస్‌లోకి అడుగుపెట్టిన అతి చిన్న వయస్కుడిగా ఫ్రాన్సీస్ (24) గుర్తింపు సాధించాడు. నాదల్ ను ఓడించడం సంతోషంగా ఉందని ఫ్రాన్సిస్ టోయాఫే తెలిపాడు. నాదల్ ను ఓడించానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పాడు. నాదల్ టెన్నిస్ లెజెండ్ అని..అతన్ని ఓడించానంటే నమ్మశక్యంగా లేదన్నాడు. Have a moment Frances Tiafoe!#USOpen pic.twitter.com/egoIVDoRWh — US Open Tennis (@usopen) September 5, 2022 చదవండి: FIH Nations Cup: నేషన్స్ కప్ బరిలో భారత హాకీ జట్టు US Open 2022: మెద్వెదెవ్కు చుక్కెదురు -
వరల్డ్ నెంబర్-2కు షాక్.. మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన నల్లకలువ
అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో తన జోరు ప్రదర్శిస్తోంది. యూఎస్ ఓపెన్ అనంతరం లాంగ్‌బ్రేక్ తీసుకోనున్న నేపథ్యంలో సెరెనా 24వ టైటిల్ సాధించేందుకు మరో అడుగు ముందుకేసింది. యూఎస్ ఓపెన్‌లో భాగంగా బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సెరెనా.. వరల్డ్ నెంబర్-2 అనేట్ కొంటావెయిట్ను 7-6(7-4), 2-6, 6-2తో చిత్తుగా ఓడించి ప్రిక్వార్టర్స్(మూడో రౌండ్)కు చేరుకుంది. ఐదేళ్ల నుంచి ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా నెగ్గని సెరెనా... వయసు మీద పడి, గాయాల కారణంగా మునుపటి లయ కోల్పోయింది. పలు టోర్నీల్లో ఒకటి, రెండు రౌండ్లలోనే వెనుదిరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ రెండో ర్యాంకర్ తో మ్యాచ్ కావడంతో యూఎస్ ఓపెన్ లోనూ సెరెనాకు రెండో రౌండ్ ఆఖరుదని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ 41 ఏళ్ల వయసులో సెరెనా అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. మ్యాచ్‌లో తొలి సెట్‌ను టై బ్రేక్ లో గెలిచిన సెరెనా రెండో సెట్లో మాత్రం వెనుకంజ వేసింది. ఇక ఓటమి ఖాయమనుకున్న తరుణంలో నిర్ణాయాత్మక మూడో సెట్లో సెరెనా విజృంభించింది. పాత సెరెనాను గుర్తుచేస్తూ బ్యాక్, ఫోర్ హ్యాండ్, ఫార్వర్డ్ షాట్లతో దూకుడు ప్రదర్శించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం సెరెనా మాట్లాడుతూ.. ''నేను సెరెనా విలియమ్స్. బాగా ఆడితే ఇలాంటి ఫలితమే వస్తుంది. కెరీర్లో ఎంతో సాధించా. నిజాయతీగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చేదంతా బోనస్‌గా భావిస్తున్నా. కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు.. అలాగని కోల్పోయేది కూడా ఏమీ లేదు. నా ఆట ఇంకా కొంచెం మిగిలి ఉందని అనుకుంటున్నా'' అంటూ పేర్కొంది. Serena, surprised at her level? 😏 pic.twitter.com/QP41An73FE — US Open Tennis (@usopen) September 1, 2022 చదవండి: Japan Open 2022: తొలి రౌండ్లో భారత్‌కు నిరాశజనక ఫలితాలు -
రఫ్పాడించిన స్పెయిన్ బుల్; ఒసాకాకు బిగ్‌షాక్
స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను దిగ్విజయంగా అధిగమించాడు. మంగళవారం అర్థరాత్రి జరిగిన తొలి రౌండ్లో నాదల్.. ఆస్ట్రేలియన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రింకీ హిజికాటాను 4-6, 6-2, 6-3, 6-3తో ఓడించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. దాదాపు మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో నాదల్ తొలి సెట్‌ను 4-6తో హిజికాటాకు కోల్పోయాడు. అయితే ఇక్కడి నుంచి నాదల్ తన గేర్ మార్చాడు. రెండో గేమ్ నుంచి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన వరుసగా మూడు సెట్లను గెలవడంతో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. Photo Credit: US Open Twitter ఇక 22 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచిన నాదల్.. ఇటీవలే వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు ముందు గాయంతో దూరమయ్యాడు. అయితే ఈసారి మాత్రం నాదల్‌లో ఫిట్నెస్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోవడం.. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా జొకోవిచ్ దూరం కాగా.. నాదల్ మరోసారి ఫెవరెట్‌గా కనిపిస్తున్నాడు. ఇక రెండో రౌండ్లో నాదల్.. ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినితో తలపడనున్నాడు. 2019లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన నాదల్ ఆ తర్వాత యూఎస్ ఓపెన్ ఆడడం ఇదే. ఇప్పటికవరకు నాదల్ ఖాతాలో నాలుగు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. #USOpen night sessions carry. Just ask @RafaelNadal pic.twitter.com/llcuqtIA7F — US Open Tennis (@usopen) August 31, 2022 HOLY MATCH POINT RAFA pic.twitter.com/sHsyYmPBAK — US Open Tennis (@usopen) August 31, 2022 తొలి రౌండ్లోనే వెనుదిరిగిన నవోమి ఒసాకా Photo Credit: US Open Twitter యూఎస్ ఓపెన్‌లో భాగంగా మహిళల సింగిల్స్‌లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఎమ్మా రాడుకాను తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టగా.. తాజాగా జపాన్ టెన్నిస్ స్టార్.. మాజీ చాంపియన్ 44వ సీడ్ నవోమి ఒసాకా అమెరికాకు చెందిన 19వ సీడ్ డేనియల్ కాలిన్స్ చేతిలో 7-6(7-5), 6-3 తేడాతో ఓడి తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. గత కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న ఒసాకా 2018, 2020లో యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. Danielle Collins is into Round 2 of the #USOpen pic.twitter.com/rUZa0hWKHx — US Open Tennis (@usopen) August 31, 2022 చదవండి: Emma Raducanu: యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్ Colin De Grandhome: అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్ ఆల్‌రౌండర్ గుడ్‌బై -
యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్
యూఎస్ ఓపెన్‌లో బుధవారం తెల్లవారుజామున పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో బ్రిటన్ స్టార్.. డిఫెండింగ్ ఛాంపియన్ ఎమ్మా రాడుకానుకు బిగ్‌షాక్ తగిలింది. తొలి రౌండ్లో ఫ్రాన్స్ టెన్నిస్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ చేతిలో 6-3, 6-3తో చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన మరుసటి ఏడాదే తొలి రౌండ్లో వెనుదిరిగిన మూడో క్రీడాకారిణిగా ఎమ్మా రాడుకాను నిలిచింది. ఇంతకముందు 2004లో యూఎస్ ఓపెన్ నెగ్గిన స్వెత్లానా కుజ్నెత్సోవా.. మరుసటి ఏడాది తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఇక 2016లో విజేతగా నిలిచిన ఏంజెలిక్ కెర్బర్.. మరుసటి ఏడాది నవోమి ఒసాకా చేతిలో తొలి రౌండ్లోనే చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. ఇక 40వ ర్యాంకర్ అయిన అలిజా కార్నెట్ రికార్డు స్థాయిలో 63వ గ్రాండ్‌స్లామ్ ఆడుతుండడం విశేషం. అయితే ఇప్పటివరకు క్వార్టర్స్ వరకు మాత్రమే వెల్లగలిగింది. అయితే ఈ సీజన్లో టాప్ 20లో ఉన్న ఆరుగురు క్రీడాకారిణులను ఓడించడం విశేషం. .@alizecornet is victorious in Armstrong! She defeats Raducanu, 6-3, 6-3 to advance to Round 2. pic.twitter.com/RHAd0zCBxv — US Open Tennis (@usopen) August 31, 2022 చదవండి: US Open 2022: యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు -
US Open Qualifiers: యూకీ శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 552వ ర్యాంకర్ యూకీ 7–6 (7/4), 6–4తో తొమ్మిదో సీడ్, ప్రపంచ 107వ ర్యాంకర్ రాడూ అల్బోట్ (మాల్డొవా)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. గంటా 34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. అయితే భారత నంబర్‌వన్, ప్రపంచ 241వ ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ప్రపంచ 762వ ర్యాంకర్ బ్రూనో కుజుహారా (అమెరికా) 6–3, 7–5తో రామ్‌కుమార్‌ను ఓడించాడు. చదవండి: BWF World Championships 2022: ప్రణయ్ సంచలనం -
Chicago Open ATP Challenger Tennis: పోరాడి ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ
షికాగో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట పోరాటం ముగిసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 5–7, 6–4, 3–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్)–బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. ఈ సీజన్లో సాకేత్–యూకీ జంట అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వీరిద్దరు కలిసి నాలుగు ఏటీపీ చాలెంజర్ టైటిల్స్‌ను, రెండు ఐటీఎఫ్ టోర్నీ టైటిల్స్‌ను సాధించారు. -
క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా జోడీ
టొరంటో: యూఎస్ ఓపెన్‌కు ముందు సన్నాహకంగా ఆడుతున్న కెనడియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. అమెరికన్ ప్లేయర్ మాడిసన్ కీస్‌తో జతకట్టిన హైదరాబాదీ స్టార్ మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–కీస్ జంట 3–6, 6–4, 10–8తో టాప్ సీడ్ ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం)– వెరొనిక కుడెర్మెటొవా (రష్యా) జోడీని కంగుతినిపించింది. తొలి సెట్‌ను కోల్పోయిన భారత్–అమెరికా ద్వయం తర్వాత రెండు సెట్లలోనూ పట్టుదలతో ఆడింది. హోరాహోరీగా జరిగిన ఆఖరి మూడో సెట్లో సానియా జోడీ పైచేయి సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఆరో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)–కిచెనొక్ (ఉక్రెయిన్), పుతిత్సెవా (కజకిస్తాన్)–కెనిన్ (అమెరికా) జోడీల మధ్య జరిగే ప్రిక్వార్టర్స్ విజేతతో సానియా జంట క్వార్టర్స్‌లో తలపడుతుంది. చదవండి: Diamond League 2022: డైమండ్ లీగ్ అథ్లెటిక్స్.. శ్రీశంకర్‌కు ఆరో స్థానం -
Wimbledon 2022 Final: జబర్, రిబాకినా.. ఎవరు గెలిచినా చరిత్రే!
Wimbledon 2022 Women's Singles Final- లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్ రావడం ఖాయమైంది. శనివారం జరిగే ఫైనల్లో అన్స్ జబర్ (ట్యునీషియా), ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) తలపడనున్నారు. వీరిలో ఎవరు గెలిచినా కొత్త చరిత్ర సృష్టిస్తారు. జబర్ గెలిస్తే ఆఫ్రికా ఖండంనుంచి గ్రాండ్‌స్లామ్ సాధించిన తొలి మహిళ అయ్యే అవకాశం ఉండగా...రిబాకినా విజేతగా నిలిస్తే కజకిస్తాన్ తరఫున గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి మహిళగా నిలుస్తుంది. గురువారం జరిగిన తొలి సెమీస్‌లో మూడో సీడ్ జబర్ 6–2, 3–6, 6–1తో తత్యానా మారియా (జర్మనీ)పై విజయం సాధించింది. దూకుడుగా ఆడిన జబర్ తొలి సెట్‌ను అలవోకగా గెలుచుకుంది. అయితే రెండో సెట్లో 17 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసిన ఆమె సెట్‌ను కోల్పోయింది. నిర్ణాయక సెట్లో మాత్రం మారియాపై జబర్ పూర్తిగా పైచేయి సాధించింది. మాజీ చాంపియన్‌కు ఓటమి... మరో సెమీస్‌లో 23 ఏళ్ల కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా సత్తా చాటింది. 23 ఏళ్ల రిబాకినా తన రెండో వింబుల్డన్‌లోనే ఫైనల్ చేరింది. 76 నిమిషాల సాగిన సెమీస్‌లో రిబాకినా 6–3, 6–3తో 2019 వింబుల్డన్ విజేత సిమోనా హలెప్ (రొమేనియా)ను ఓడించింది. మాస్కోలో పుట్టి 2018 వరకు రష్యాకు ప్రాతినిధ్యం వహించిన రిబాకినా రష్యా ఆటగాళ్లపై వింబుల్డన్‌లో నిషేధం ఉన్న సమయంలో ఫైనల్‌కు చేరడం విశేషం. Rybakina roars onto the biggest stage The 23-year-old defeats Simona Halep 6-3, 6-3 to reach her first Grand Slam final#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/u0jfhZlDEA — Wimbledon (@Wimbledon) July 7, 2022 "It's time to enjoy and really have fun on court" Elena Rybakina is excited to face @Ons_Jabeur in a Wimbledon final#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/J0o9RlShFJ — Wimbledon (@Wimbledon) July 7, 2022 "I have no idea, I'm The Minister of Happiness" 😀 A very diplomatic answer from our first-time Wimbledon finalist, @Ons_Jabeur pic.twitter.com/ZPGFTE8WIY — Wimbledon (@Wimbledon) July 7, 2022 -
Wimbledon 2022: గెలిచినా నిష్క్రమించిన నాదల్.. ఎందుకంటే!
Rafael Nadal: పొత్తి కడుపు గాయంతో బాధపడుతున్న స్పానిష్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ వింబుల్డన్ సెమీఫైనల్ నుంచి తప్పుకున్నాడు. క్వార్టర్స్‌లో కూడా గాయంతోనే బాధపడుతూ ఆడిన అతనికి కండరాల్లో 7 మిల్లీమీటర్ల చీలిక వచ్చినట్లు తేలింది. దీంతో సెమీస్ ఆడరాదని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో దాంతో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) ఫైనల్‌కు చేరుకు న్నాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి జరిగే మరో సెమీస్‌లో జొకోవిచ్ (సెర్బియా)తో నోరీ (బ్రిటన్)తో తలపడతాడు. ఇందులో గెలిచిన ఆటగాడు కిరియోస్తో తుదిపోరులో అమీతుమీ తేల్చుకుంటాడు. కాగా గతంలో నాదల్ రెండుసార్లు టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: IND vs ENG 1st T20: హార్దిక్ ఆల్‌రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం 25 shots of pure tennis theatre 🎭@RafaelNadal 🤝 @Taylor_Fritz97#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/KwZg3hpOye — Wimbledon (@Wimbledon) July 6, 2022 -
'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం
ఇటాలియన్ టెన్నిస్ స్టార్ మాటియో బెరెట్టిని సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఏటీపీ 500 క్వీన్స్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్లో భాగంగా శనివారం డచ్‌కు చెందిన బోటిక్ వాన్ డి జాండ్స్చుల్ప్పై 6-4, 6-3 తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాడు. బెరెట్టిని గ్రాస్ కోర్టులో తాను చివరగా ఆడిన 20 మ్యాచ్‌ల్లో ఇది 19వ విజయం కావడం విశేషం. ఆ ఓడిపోయిన ఒక్క మ్యాచ్ కూడా వింబుల్డన్ ఫైనల్. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో బెరెట్టిని పరాజయం పాలయ్యాడు. కాగా మ్యాచ్ గెలిచిన అనంతరం ఇంటర్య్వూలో భాగంగా బెరెట్టినికి వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఒక యువతి.. ''మాటియో.. నన్ను పెళ్లి చేసుకుంటావా'' అని గట్టిగా అరిచింది. దీంతో షాక్ తిన్న బెరెట్టిని.. ఆ తర్వాత చిరునవ్వుతో ''ఈ విషయం గురించి ఆలోచించి చెబుతా'' అని సూపర్ సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఇక ఫైనల్లో బెరెట్టిని సెర్బియాకు చెందిన ఫిలిప్ క్రాజినోవిక్తో తలపడనున్నాడు. A post-match marriage proposal for @MattBerrettini 👀 💍#cinchChampionships pic.twitter.com/IzQiIG1EYG — Tennis TV (@TennisTV) June 18, 2022 చదవండి: Stuart MacGill: 'పాయింట్ బ్లాక్‌లో గన్.. నగ్నంగా నిలబెట్టి దారుణంగా కొట్టారు' Nick Kyrgios: 'తెలుసుకొని మాట్లాడితే మంచిది'.. రిఫరీతో దురుసు ప్రవర్తన -
'తెలుసుకొని మాట్లాడితే మంచిది'.. రిఫరీతో దురుసు ప్రవర్తన
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్‌కు కోపం ఎక్కువ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ టెన్నిస్ స్టార్ కోర్టులో సీరియస్‌గా మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఎవరైనా గెలికారో ఇక అంతే సంగతులు. తాజాగా నిక్ కిర్గియోస్ తన కోపాన్ని మరోసారి చూపించాడు. ఏటీపీ 500 హాలే ఓపెన్‌లో బుధవారం రాత్రి నిక్ కిర్గియోస్, సిట్సిపాస్ మధ్య నాలుగో రౌండ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కిర్గియోస్ 5-7, 6-2, 6-4తో సిట్సిపాస్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరాడు. అయితే మ్యాచ్‌లో రెండో రౌండ్ సందర్భంగా సిట్సిపాస్ 2-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో కిర్గియోస్ సర్వీస్ చేయడంలో సమయం ఎక్కువ తీసుకున్నాడు. తనకు సర్వీస్ వచ్చిన ప్రతీసారి అదే చేయడంతో లైన్ అంపైర్(రిఫరీ)..''తొందరగా సర్వీస్ చెయ్.. నీ వల్ల సమయం వృథా అవుతుంది.. ప్రత్యర్థి ఆటగాడి ఫోకస్ దెబ్బ తింటుంది'' అంటూ కిర్గియోస్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇది విన్న కిర్గియోస్‌కు కోపం నషాళానికి అంటింది. అంపైర్‌వైపు కోపంగా చూస్తూ.. ''నేను టైం వేస్ట్ చేయడం లేదు.. కాస్త అలసటగా ఉండడంతో మెళ్లిగా సర్వీస్ చేస్తున్నా.. అనే ముందు తెలుసుకొని మాట్లాడితే మంచిది'' అంటూ దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్వార్టర్స్‌లో కిర్గియోస్.. కారెన్నోతో తలపడనున్నాడు. *time violation warning mr Kyrgios* the supervisor arrives, Tsitsipas keeps serving, everything is so perfect pic.twitter.com/yJT79W3U9M — Garbee|| Serena is coming ❤️ (@muguruthlessN1) June 15, 2022 చదవండి: Base Ball Game: అది బేస్‌బాల్ గేమ్.. ఏమరపాటుగా ఉంటే అంతే సంగతి! -
Rafael Nadal: మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు!
French Open 2022- Winner Rafael Nadal: మట్టికోర్టులో తనకు తిరుగులేదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. ఏకంగా 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచి సత్తా చాటాడు. తద్వారా కెరీర్లో 22వ ‘గ్రాండ్’ టైటిల్ కైవసం చేసుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇక ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో నార్వేకు చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కాస్పర్ రూడ్‌పై ఐదో సీడ్ నాదల్ 6–3, 6–3, 6–0తో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నాదల్ పేరిట పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం! ►1: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా నాదల్ (36 ఏళ్ల 2 రోజులు) రికార్డు సృష్టించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆండ్రెస్ గిమెనో (స్పెయిన్; 1972లో 34 ఏళ్ల 10 నెలలు) పేరిట ఉండేది. 🚫 Trying a drop shot against @RafaelNadal is never a good idea -- find out why with our Shot of the Day by @oppo 🎥#RolandGarros | #InspirationAhead pic.twitter.com/tfnK8YrvMO — Roland-Garros (@rolandgarros) June 5, 2022 ►8: నాదల్ 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రమంలో ఎనిమిదిసార్లు వేర్వేరు ప్రత్యర్థులపై గెలిచాడు. ఫైనల్స్‌లో ఫెడరర్‌పై నాలుగుసార్లు, జొకోవిచ్పై మూడుసార్లు, డొమినిక్ థీమ్‌పై రెండుసార్లు, సోడెర్లింగ్, పుయెర్టా, ఫెరర్, వావ్రింకా, కాస్పర్ రూడ్లపై ఒక్కోసారి విజయం సాధించాడు. ►23: నాదల్ 14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన క్రమంలో తన ప్రత్యర్థులకు కోల్పోయిన మొత్తం సెట్ల సంఖ్య. ♦2008, 2010, 2017, 2020లలో అతను ఒక్క సెట్ కూడా ఓడిపోలేదు. ♦2007, 2012, 2018లలో ఒక్కో సెట్... 2014, 2019లలో రెండు సెట్లు... 2005, 2006, 2011, 2022లలో మూడు సెట్లు... 2013లో అత్యధికంగా నాలుగు సెట్లు చేజార్చుకున్నాడు. ✅ Rafa 🆚 Ruud ✅ Double delight for France 🇫🇷 ✅ 1️⃣4️⃣ for @RafaelNadal Look back at Day 15 with the Best Moments of the Day by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoments pic.twitter.com/IPfdgyMB2w — Roland-Garros (@rolandgarros) June 5, 2022 ►112: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ చరిత్రలో నాదల్ గెలిచిన మొత్తం మ్యాచ్‌లు. ►22: నాదల్ నెగ్గిన ఓవరాల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్‌కాగా... 4 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్, 2 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. 2️⃣2️⃣ in '22 -- a look back at how @RafaelNadal reached a new record for career Grand Slams: 1️⃣4️⃣ #RolandGarros 2️⃣ @Wimbledon 4️⃣ @usopen 2️⃣ @AustralianOpen pic.twitter.com/hq1HPD9uRL — Roland-Garros (@rolandgarros) June 5, 2022 చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్..! -
సాకేత్ జంటకు టైటిల్.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో 11వ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. చెక్ రిపబ్లిక్‌లోని ప్రోస్తెజోవ్ పట్టణంలో శుక్రవారం జరిగిన చెక్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ 6–3, 7–5తో రెండో సీడ్ రోమన్ జెబవీ (చెక్ రిపబ్లిక్)–ఆంద్రెజ్ మార్టిన్ (స్లొవేకియా) జంటపై నెగ్గింది. సెమీఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–4, 6–4తో టాప్ సీడ్ ఎర్లెర్–మెడ్లెర్ (ఆస్ట్రియా) జంటను... క్వార్టర్ ఫైనల్లో 7–6 (7/4), 3–6, 13–11తో మూడో సీడ్ మొల్చ నోవ్ (ఉక్రెయిన్)–ఫ్రాంకో స్కుగోర్ (క్రొయే షియా) జోడీని ఓడించడం విశేషం. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 5,250 యూరో ల (రూ. 4 లక్షల 37 వేలు) ప్రైజ్‌మనీ తోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: French Open: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం -
సెమీస్‌లోనే ముగిసిన బోపన్న పోరాటం
పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న అద్భుత పోరాటం సెమీస్‌లో ముగిసింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో 16వ సీడ్ బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–4, 3–6, 6–7 (8/10) స్కోరుతో 12వ సీడ్ మార్సెలో అరివలో (సాల్వేడార్)–జీన్ జులియెన్ రోజర్ (నెదర్లాండ్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ఈ టోర్నీలో గత మ్యాచ్‌ల్లో సూపర్ టైబ్రేకర్‌లో ప్రత్యర్థి ద్వయంపై ఆధిపత్యం కనబరిచి నెగ్గుకొచ్చిన భారత్–డచ్ జంటకు ఇక్కడ మాత్రం కలిసిరాలేదు. 2 గంటల 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న జోడీ తొలి సెట్ చేజిక్కించుకుంది కానీ రెండో సెట్‌ను కోల్పోయింది. ఆఖరి సెట్ మాత్రం హోరాహోరీగా జరగడంతో టైబ్రేక్‌దాకా వచ్చింది.అయితే ఇందులో బోపన్న–మిడిల్‌కూప్ ఆటలు సాగలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ పోరుకు చేరాలనుకున్న బోపన్న ఆశలు సెమీస్‌లోనే గల్లంతయ్యాయి. చివరిసారిగా బోపన్న... ఐజముల్ హక్ ఖురేషీ (పాకిస్తాన్)తో కలిసి 2010 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. -
French Open 2022: వారెవ్వా.. రోహన్ బోపన్న తొలిసారి..
భారత టెన్నిస్ సీనియర్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న(భారత్)- మిడిల్‌కూప్(నెదర్లాండ్స్) ద్వయం 4-6, 6-4, 7-6(10/3)తో సూపర్ ట్రై బ్రేక్‌లో లాయిడ్ గ్లాస్‌పూల్(బ్రిటన్)- హెలియోవారా(ఫిన్లాండ్) జోడీపై గెలిచింది. ఈ విజయంతో 42 ఏళ్ల బోపన్న ఏడేళ్ల విరామం తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు అర్హత సాధించాడు. చివరసారి బోపన్న 2015లో వింబుల్డన్ టోర్నీలో సెమీ ఫైనల్ చేరాడు. The first men’s doubles semi-final is set! 🇸🇻🇳🇱Arevalo/Rojer 🆚 Bopanna/Middelkoop 🇮🇳🇳🇱#RolandGarros pic.twitter.com/66zNDLzmgZ — Roland-Garros (@rolandgarros) May 30, 2022 -
French Open: కోకో కేక.. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌లో..
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ అమెరికన్ టీనేజ్ స్టార్ కోకో గౌఫ్ కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీ ఫైనల్ దశకు అర్హత సాధించింది. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో అమెరికాకు చెందిన 18 ఏళ్ల కోకో గౌఫ్ తన జోరు కొనసాగిస్తూ వరుసగా ఐదో మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఒక్క సెట్ కోల్పోకుండా విజయం సాధించింది. 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, 64వ ర్యాంకర్ స్లోన్ స్టీఫెన్స్(అమెరికా)తో మంగళవారం జరిగిన సింగిల్వ్ క్వార్టర్ ఫైనల్లో 18వ సీడ్, ప్రపంచ 23వ ర్యాంకర్ కోకో 7-5, 6-2తో గెలుపొందింది. నాలుగేళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారి ఇప్పటివరకు 11 గ్రాండ్‌స్లామ్‌లు ఆడిన కోకో గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇదే టోర్నీలో ఈసారి క్వార్టర్స్ అడ్డంకిని అధిగమించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు అర్హత సాధించింది. 🇺🇸🆚🇺🇸 Teenager @CocoGauff came out on top against fellow American Sloane Stephens in a hard-fought quarter-final:#RolandGarros pic.twitter.com/kQphuXxVva — Roland-Garros (@rolandgarros) May 31, 2022 -
నేను మగాడినైనా బాగుండేది.. ఈ కడుపునొప్పి వల్ల: టెన్నిస్ ప్లేయర్ భావోద్వేగం
Zheng Qinwen French Open 2022: ‘‘ఇది అమ్మాయిలకు సంబంధించిన విషయం. మొదటి రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. భరించలేని కడుపు నొప్పి. అయినా నేను గేమ్ ఆడాలనే ప్రయత్నిస్తాను. కానీ ఈరోజు అలా జరుగలేదు’’ అంటూ చైనా యువ టెన్నిస్ క్రీడాకారిణి జెంగ్ కిన్వెన్ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తాను పురుషుడినైనా బాగుండేదని ఉద్వేగానికి గురైంది. ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ అరంగేట్రంలోనే నాలుగో రౌండ్‌కు చేరుకున్న నాలుగో చైనీస్ మహిళగా కిన్వెన్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ప్రపంచ నంబర్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌తో తలపడే అవకాశం దక్కించుకుంది ఈ 19 ఏళ్ల చైనీస్ టీనేజర్. అయితే, సోమవారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా కిన్వెన్ రుతుస్రావ సమయంలో కలిగే నొప్పి కారణంగా విలవిల్లాడింది. స్వియాటెక్‌తో మ్యాచ్‌లో తొలి సెట్ వరకు బాగానే ఉన్న కిన్వెన్.. ఆ తర్వాత నొప్పి తీవ్రతరం కావడంతో అక్కడే బ్యాక్ మసాజ్ చేయించుకుంది. ఆ తర్వాత కుడి తొడకు కట్టు కట్టుకుని బరిలోకి దిగింది. ఈ క్రమంలో 6-7(5), 6-0, 6-2 తేడాతో స్వియాటెక్ చేతిలో ఆమెకు ఓటమి తప్పలేదు. దీంతో కిన్వెన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు లోనైన ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ఎంతకష్టమైనా మ్యాచ్ పూర్తి చేయడానికే నేను ఇష్టపడతా. నా స్వభావానికి విరుద్ధంగా వెళ్లను. అయితే, ఈరోజు కోర్టులో ఉన్న సమయంలో నేను పురుషుడినైతే బాగుండేదనిపించింది. ఆ క్షణంలో నిజంగా నేను మగాడిని అయి ఉంటే.. ఈ బాధ తప్పేది. పరిస్థితి ఇంకాస్త మెరుగ్గా ఉండేదేమో. ’’ అని వ్యాఖ్యానించింది. కడుపునొప్పి, కాలు నొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే, వరల్డ్ నెంబర్ 1తో పోటీపడిన సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించానని ఈ 74వ ర్యాంకర్ పేర్కొంది. అయితే, కడుపునొప్పి లేకుండా మరింత ఎక్కువగా ఎంజాయ్ చేసేదానినని, ఇంకాస్త బాగా ఆడేదానిని తెలిపింది. తనతో మరో మ్యాచ్ అవకాశం వచ్చినపుడు మాత్రం అస్సలు ఇలాంటి పరిస్థితి(రుతుస్రావం) ఎదురుకాకూడదని ఉద్వేగపూరితంగా మాట్లాడింది. ఇదిలా ఉంటే.. కిన్వెన్పై విజయంతో ఈ ఏడాది వరుసగా 32వ గెలుపు నమోదు చేసింది పోలాండ్‌కు చెందిన స్వియాటెక్. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన ఆమె.. టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. క్వార్టర్లో అమెరికాకు చెందిన జెసికా పెగులాతో ఆమె అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్లో మోస్ట్ లక్కీ ప్లేయర్..! 📽️ It was a real battle for No.1 @iga_swiatek against Zheng Qinwen in their Round of 16 match:#RolandGarros pic.twitter.com/1FWNGZS5Im — Roland-Garros (@rolandgarros) May 30, 2022 -
ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల కుర్రాడు..
స్పెయిన్ టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ 2022లో చరిత్ర సృష్టించాడు. సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ తర్వాత అత్యంత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్.. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో సెబాస్టియర్ కోర్డాను 6-2, 6-4, 6-2తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. కాగా మాంటే కార్లో ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెబాస్టియన్ చేతిలో ఓటమికి కార్లోస్ బదులు తీర్చుకున్నాడు. సెబాస్టియన్ క్లే కోర్టులో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడగా.. అతనికి ఇదే తొలి ఓటమి కావడం విశేషం. ఇంతకముందు 2006లో నొవాక్ జొకోవిచ్ అత్యంత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక కార్లోస్ అల్కరాజ్.. ప్రిక్వార్టర్స్‌లో 21వ సీడ్ కరెన్ ఖచనోవ్‌తో తలపడనున్నాడు. చదవండి: French Open 2022: నాదల్, జొకోవిచ్ జోరు [6] @alcarazcarlos03 defeats [27] Korda 6-4 6-4 6-2 and is youngest man to reach 4R @RolandGarros since #Djokovic in 2006. #Alcaraz saved all 5 break pts faced (broke 4 times) en route to his 13th win in a row. Next: 1st meeting vs [21] @karenkhachanov (d [10] Norrie in 4 sets). — ATP Media Info (@ATPMediaInfo) May 27, 2022 -
French Open 2022: మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన వరల్డ్ నెంబర్-2
టెన్నిస్ పురుషుల ప్రపంచ నెంబర్-2 డానిల్ మెద్వెదెవ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో మెద్వదెవ్.. సెర్బియాకు చెందిన లాస్లో జెరీని 6-3, 6-4, 6-3తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. కాగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం మెద్వెదెవ్ సెర్బియాకు చెందిన 28వ సీడ్ మియోమిర్ కెక్మనోవిక్తో తలపడనున్నాడు. 2 గంటల 35 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో జెరిని 39 విన్నర్స్ సందించినప్పటికి.. 68 తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ''లాస్లో పోరాటం మెచ్చుకోదగినది. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో జెరీని విన్నర్స్ సంధించినప్పటికి.. అన్నే తప్పులు చేశాడు. అతని కాలికి కచ్చితంగా దెబ్బలు తగిలి ఉంటాయి. అతని టఫ్ ఫైట్ కారణఃగా నేను ప్రతీ పాయింట్‌పై ఫోకస్ చేయాల్సి వచ్చింది.'' అని మెద్వెదెవ్ మ్యాచ్ విజయం అనంతరం పేర్కొన్నాడు. -
18-0.. ఎదురులేని సెర్బియా స్టార్
టెన్నిస్ పురుషుల ప్రపంచ నెంబర్ వన్.. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. సోమవారం అర్థరాత్రి జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 99వ ర్యాంకర్ జపాన్‌కు చెందిన యోషియితో నిషియోకాను 6-3,6-1, 6-0తో వరుస సెట్లతో ఖంగుతినిపించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఆదివారం పుట్టినరోజు జరుపుకున్న సెర్బియా స్టార్.. క్లే కోర్టుపై తొలి రౌండ్లో ఉన్న రికార్డును కాపాడుకున్నాడు. ఇప్పటివరకు ఫ్రెంచ్ ఓపెన్‌లో జొకోవిచ్ ఒక్కసారి కూడా తొలి రౌండ్ ఓడిపోలేదు. 18-0తో జొకోవిచ్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. కాగా జొకోవిచ్‌కు పారిస్ ఈవెంట్లో ఇది 82వ విజయం కావడం విశేషం. కాగా జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో జొకోవిచ్ ఆడని సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడకుండా నిషేధించింది. మూడేళ్ల పాటు జొకోవిచ్‌కు ఆసీస్ గడ్డపై అడుగుపెట్టకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం.. తొలి రౌండ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్‌కు పరాభవం 🥇 No.1 @DjokerNole cruised in his first round matchup against Yoshihito Nishioka in today's late match -- catch the highlights:#RolandGarros pic.twitter.com/agxo5JfBuy — Roland-Garros (@rolandgarros) May 23, 2022 -
టైటిల్ పోరుకు సానియా–హర్డెస్కా జంట
స్ట్రాస్‌బర్గ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రాన్స్‌లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–3, 6–3తో కైట్లిన్ క్రిస్టియన్ (అమెరికా)–లిద్జియా మరోజవా (రష్యా) జంటపై గెలిచింది. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–హర్డెస్కా జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే ఫైనల్లో నికోల్ (అమెరికా)–దరియా సావిల్లె (ఆస్ట్రేలియా) జంటతో సానియా–హర్డెస్కా తలపడతారు. -
సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా జంట
ఇటాలియన్ ఓపెన్ డబ్ల్యూటీఏ మహిళల టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రోమ్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–4, 4–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో అలెక్సా గ్వరాచి (చిలీ)– ఆంద్రియా క్లెపాక్ (స్లొవేనియా) జోడీపై విజయం సాధించింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–హర్డెస్కా జంట నాలుగు ఏస్‌లు సంధించింది. -
2022 BMW Open: క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట ఓటమి
బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ నుంచి రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. మ్యూనిక్‌లో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 3–6, 4–6తో మటోస్ (బ్రెజిల్)–డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 4,950 యూరోల (రూ. 3 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
టైటిల్ నిలబెట్టుకున్న సిట్సిపాస్
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో గ్రీస్ ప్లేయర్, ప్రపంచ ఐదో ర్యాంకర్ సిట్సిపాస్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సిట్సిపాస్ 6–3, 7–6 (7/3)తో అలెజాంద్రో ఫొకీనా (స్పెయిన్)పై గెలిచాడు. సిట్సిపాస్ కెరీర్లో ఇది ఎనిమిదో టైటిల్. విజేతగా నిలిచిన సిట్సిపాస్‌కు 8,36,335 యూరోల (రూ. 6 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
భారత్‌కు మూడో స్థానం
అంటాల్యా (టర్కీ): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ మూడు జట్లపై (ఇండోనేసియా, న్యూజిలాండ్, కొరియా) గెలిచి, రెండు జట్ల (చైనా, జపాన్) చేతిలో ఓడిపోయింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన చైనా, జపాన్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత పొం దాయి. కొరియాతో జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్ తొలి రెండు సింగిల్స్‌లో నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. తొలి సింగిల్స్‌లో రియా భాటియా 6–3, 2–6, 6–3తో నా రి కిమ్‌పై నెగ్గగా... రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 6–2, 6–3తో దాబిన్ కిమ్ ను ఓడించి టీమిండియాకు విజయాన్ని అందించింది. -
భారత్‌కు రెండో గెలుపు
అంటాల్యా (టర్కీ): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు ఖాతాలో రెండో గెలుపు చేరింది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. తొలి సింగిల్స్‌లో రుతుజా బోస్లే 6–1, 7–6 (7/3)తో వలెంటీనా ఇవనోవ్‌పై గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 7–5, 6–3తో పైజ్ హురీగాన్‌ను ఓడించి భారత్‌కు విజయాన్ని అందించింది. డబుల్స్‌లో సౌజన్య బవిశెట్టి–రియా భాటియా జంట ఓడిపోయింది. గురువారం ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత జట్టులో చూడాలనుకుంటున్నాం' -
భారత్‌కు రెండో ఓటమి
Billie Jean King Cup- అంటాల్యా (టర్కీ): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. తొలి రోజు జపాన్ చేతిలో 0–3తో ఓడిపోయిన టీమిండియా... రెండో రోజు చైనాతో జరిగిన మ్యాచ్‌లోనూ 0–3తో పరాజయం పాలైంది. తొలి సింగిల్స్‌లో రియా భాటియా 1–6, 3–6తో లిన్ జూ (చైనా) చేతిలో... రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 319వ ర్యాంకర్ అంకిత రైనా 4–6, 2–6తో ప్రపంచ 97వ ర్యాంకర్ కియాంగ్ వాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. నామమాత్రమైన డబుల్స్ మ్యాచ్‌లో సౌజన్య బవిశెట్టి–రుతుజా బోస్లే జోడీ 5–7, 1–6తో జు యిఫాన్– జావోజువాన్ యాంగ్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. చదవండి: IPL 2022: ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్! -
బార్సిలోనా ఓపెన్‌కు నాదల్ దూరం
Rafael Nadal: పక్కటెముకల గాయం నుంచి స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఇంకా కోలుకోలేదు. దీంతో స్వదేశంలో ఈనెల 18 నుంచి జరిగే బార్సిలోనా ఓపెన్ టోర్నీకి అతడు దూరమయ్యాడు. కాగా బార్సిలోనా ఓపెన్‌లో రికార్డుస్థాయిలో 12 సార్లు విజేతగా నిలిచాడు నాదల్. ఇక వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకల్లా నాదల్ కోలుకునే అవకాశముంది. 35 ఏళ్ల నాదల్ ఓవరాల్‌గా 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవగా అందులో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్సే 13 ఉన్నాయి. చదవండి: IPL 2022: మొదట్లో కష్టాలు... తర్వాత చుక్కలు... సిక్సర్ల సునామీతో చెన్నై బోణీ -
సానియా జంటకు ఫైనల్లో నిరాశ.. సాకేత్‌కు పదో టైటిల్!
చార్ల్స్టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. అమెరికాలో ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా–హర్డెస్కా జంట 2–6, 6–4, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ మాగ్దా లినెట్ (పోలాండ్)–ఆంద్రియా క్లెపాచ్ (స్లొవేనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. ఫైనల్లో ఓడిన సానియా–హర్డెస్కా జోడీకి 25,900 డాలర్ల (రూ. 19 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 305 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాకేత్‌కు పదో టైటిల్ సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో పదో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈక్వెడార్‌లో ఆదివారం ముగిసిన సాలినాస్ ఓపెన్ టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జంట పురుషుల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–3, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’ లో రెండో సీడ్ అరగాన్ (అమెరికా) –రొబెర్టో క్విరోజ్ (ఈక్వెడార్) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 3,100 డాలర్ల (రూ. 2 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: IPL 2022: స్టొయినిస్ ఆటలు సాగనివ్వని కుల్దీప్... లక్నో జోరుకు బ్రేక్! -
Charleston Open: సెమీస్‌లో సానియా జోడి...
Charleston Open- చార్ల్స్టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. అమెరికాలోని సౌత్ కరోలినాలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా జంట 3–6, 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ అలెక్సా గురాచి (చిలీ)–జెస్సికా పెగూలా (అమెరికా) ద్వయంపై గెలిచింది. తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా 7–5, 7–6 (7/5)తో ఫ్రాన్సెస్కా లొరెంజో–కేటీ వొలినెట్స్ (అమెరికా)లపై గెలిచారు. డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్ జంట Salinas Open- సాలినాస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈక్వెడార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–3, 6–4తో బెంజమిన్ లాక్–జాన్ లాక్ (జింబాబ్వే) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో సాకేత్–యూకీ జంట 6–3, 7–6 (8/6)తో టాప్ సీడ్ జీవన్ నెడుంజెళియన్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీని ఓడించింది. చదవండి: GT Vs PBKS: ఎదురులేని టైటాన్స్.. గుజరాత్ ‘హ్యాట్రిక్’ -
సూపర్ టైమింగ్.. ఎవరికి సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు
మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భాగంగా గురువారం నార్వేకు చెందిన కాస్పర్ రాడ్, జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాస్పర్ రాడ్.. జ్వెరెవ్‌ను (6-3,1-6,6-3)తో ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. మూడు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించిన కాస్పర్ రాడ్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే తన ట్రిక్‌తో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్ మధ్యలో రాడ్ సర్వీస్ చేయాల్సి ఉంది. జ్వెరెవ్ కోర్టు బయటకు వెళ్లి బంతిని రాడ్వైపు విసిరాడు. సాధారణంగా చేతితో అందుకుంటే సరిపోయేది..కానీ కాస్పర్ రాడ్ బంతి కచ్చితంగా తన జేబులో పడేలా ట్రిక్ చేయడం ఆసక్తి కలిగించింది. అతని టైమింగ్ ఎంతలా అంటే.. అతను తన జేబును ఓపెన్ చేయడం..బంతి వెళ్లి అతని పాకెట్లో పడడం జరిగిపోయింది. ఇది చూసిన అభిమానులు అతని ట్రిక్స్‌కు మంత్రముగ్దులై లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను టెన్నిస్ టీవీ తన ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: పుట్‌బాల్ ప్రపంచకప్‌కు పోర్చుగల్ Ruud-iculous skills 😍@CasperRuud98 #MiamiOpen pic.twitter.com/3NZCRN3p2b — Tennis TV (@TennisTV) March 31, 2022 -
Miami Open: మరో మ్యాచ్ గెలిస్తే మళ్లీ నంబర్‌వన్
Tennis Star Daniil Medvedev - Miami Open 2022: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో మూడు వారాలపాటు నిలిచి ఆ తర్వాత జొకోవిచ్ (సెర్బియా)కు టాప్ ర్యాంక్‌ను కోల్పోయిన రష్యా టెన్నిస్ స్టార్ మెద్వెదెవ్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరువయ్యాడు. మయామి ఓపెన్ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్లో మెద్వెదెవ్ 7–5, 6–1తో బ్రూక్స్‌బై (అమెరికా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరాడు. క్వార్టర్ ఫైనల్లో హుర్కాజ్ (పోలాండ్)ను ఓడించి మెద్వెదెవ్ సెమీస్ చేరితే ఏప్రిల్ 4న మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకుంటాడు. Yesterday, we completed our Men’s Singles Round of 1️⃣6️⃣! @AndrewKrasny highlights @janniksin, @DaniilMedwed, and @alcarazcarlos03's R4 victories ⤵️ pic.twitter.com/NSgnTBiTr2 — Miami Open (@MiamiOpen) March 30, 2022 -
Indian Wells Final: నాదల్కు భారీ షాక్.. అమెరికా యువ ఆటగాడి సంచలన విజయం
Taylor Fritz Upsets Rafael Nadal Clinch Title: ఏటీపీ మాస్టర్స్ 100 టోర్నీ ఇండియన్‌వెల్స్ టోర్నీలో అమెరికా యువ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ విజేతగా నిలిచాడు. ఆదివారం 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో అతను 6–3, 7–6 (7/5)తో స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్‌పై సంచలన విజయం సాధించాడు. 2001 (ఆండ్రీ అగస్సీ) తర్వాత సొంతగడ్డపై ఈ టైటిల్ గెలిచిన తొలి అమెరికా ఆటగాడిగా ఫ్రిట్జ్ నిలవగా... 2022లో 20 వరుస విజయాల నాదల్ జోరుకు బ్రేక్ పడింది. ఇక విజేత 24 ఏళ్ల టేలర్ ఫ్రిట్జ్ మాట్లాడుతూ.. ఇప్పటికీ తాను గెలిచానంటే నమ్మకం కలగడం లేదని, ఇంకా షాక్‌లోనే ఉన్నానంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. Just. incredible. 🤯@Taylor_Fritz97 | @BNPPARIBASOPEN | #IndianWells pic.twitter.com/UaACu8HvJ8 — ATP Tour (@atptour) March 20, 2022 -
Novak Djokovic: మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్.. వారం ఉన్నా గొప్పే కదా!
Novak Djokovic: ఏటీపీ వరల్డ్ నంబర్‌వన్‌గా రష్యా ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్ ఆనందం మూడు వారాలకే పరిమితం కానుంది. ఇండియన్ వెల్స్ టోర్నీలో కనీసం క్వార్టర్ ఫైనల్ చేరితే గానీ అగ్ర స్థానంలో నిలవలేని మెద్వెదెవ్ మూడో రౌండ్లో 6–4, 3–6, 1–6 తేడాతో గేల్ మాన్ఫిల్స్ చేతిలో పరాజయంపాలయ్యాడు. సోమవారం ప్రకటించే ర్యాంకుల్లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు మళ్లీ అగ్ర స్థానం దక్కుతుంది. ఈ నేపథ్యంలో మెద్వెదేవ్ మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎప్పటికీ నంబర్‌వన్ కాకపోవడంకంటే ఒక వారం ఉన్నా గొప్పే కదా’ అని వ్యాఖ్యానించాడు. కాగా జొకోవిచ్ కోవిడ్ వ్యాక్సినేషన్‌కు నిరాకరించిన కారణంగా ఇప్పటికే పలు టోర్నీలకు దూరమైన సంగతి తెలిసిందే. చదవండి: Sandeep Nangal Death: కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. మ్యాచ్ జరుగుతుండగానే కాల్పులు -
పోరాడి ఓడిన రామ్‌కుమార్
ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 170వ ర్యాంకర్ రామ్2–6, 6–3, 4–6తో 124వ ర్యాంకర్ లియామ్ బ్రాడీ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. గంటా 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్ ఐదు ఏస్‌లు సంధించి, తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. -
Saketh Myneni: పోరాడి ఓడిన సాకేత్–రామ్‌కుమార్ జంట
Dubai Tennis Championships: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ (భారత్) జంట తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన సాకేత్–రామ్ ద్వయం 82 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్లో 5–7, 5–7తో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–పొలాసెక్ (స్లొవేకియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న (భారత్)–కరాత్సెవ్ (రష్యా) జంట 2–6, 6–3, 5–10తో టాప్ సీడ్ మెక్టిక్–పావిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో నీతూ, అనామిక న్యూఢిల్లీ: స్ట్రాండ్జా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో భారత మహిళా బాక్సర్లు నీతూ (48 కేజీలు), అనామిక (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బల్గేరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో నీతూ 5–0తో ల్యూలియా (రష్యా)పై, అనామిక 4–1తో చుకనొవా(బల్గేరియా) పై గెలిచారు. 54 కేజీల బౌట్లో శిక్ష 0–5తో దినా జొలమన్ (కజకిస్తాన్) చేతిలో ... పురుషుల 67 కేజీల పోటీలో ఆకాశ్ 0–5తో క్రొటెర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. చదవండి: IND Vs SL T20 Series: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో సూర్యకుమార్ ఔట్ -
యూకీ బాంబ్రీకి నిరాశ
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్ యూకీ బాంబ్రీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ సింగిల్స్ చివరి రౌండ్ మ్యాచ్‌లో యూకీ 3–6, 4–6తో ఒనీల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. 72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యూకీ ఐదు ఏస్‌లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా వృథా చేసుకున్నాడు. -
Bengaluru Open: సెమీస్‌లో సాకేత్ జంట
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు ఓపెన్–2 ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–4, 7–6 (7/3)తో వ్లాదిస్లావ్ ఒర్లోవ్ (ఉక్రెయిన్)–కాయ్ వెనల్ట్ (జర్మనీ) జోడీపై గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) ద్వయం 6–3, 4–6, 11–9తో కలోవెలోనిస్ (గ్రీస్)–మత్సుయ్ (జపాన్) జంటను ఓడించి సెమీఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో రష్మిక సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణులు రష్మిక, సామ సాత్విక, శ్రావ్య శివాని క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. గురుగ్రామ్‌లో గురువారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక 6–2, 6–2తో హుమేరాపై, సాతి్వక 7–6 (7/1), 7–5తో స్మృతి భాసిన్‌పై గెలిచారు. పూజా ఇంగ్లేతో జరిగిన మ్యాచ్‌లో శ్రావ్య శివాని తొలి సెట్‌ను 6–0తో నెగ్గి, రెండో సెట్లో 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి గాయంతో వైదొలిగింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రషి్మక–హుమేరా జంట 7–5, 2–6, 10–7తో షర్మదా బాలు–శ్రావ్య శివాని జోడీని ఓడించి సెమీఫైనల్ చేరింది. -
Sania Mirza: క్వార్టర్స్‌కు దూసుకువెళ్లిన సానియా జోడీ
Dubai Tennis Championships: దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో సానియా మీర్జా జోడీ అదరగొట్టింది. సానియా- లూసీ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఉత్కంఠ రేపిన బుధవారం నాటి మహిళల డబుల్స్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ 12 డెమీ జోడీని ఓడించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 7(7)-6(3), 5-7, 11-9తో ప్రత్యర్థిపై విజయం సాధించింది ఈ జంట. ఇక క్వార్టర్ ఫైనల్లో వీరు జపాన్‌కు చెందిన షుకో- సెర్బియాకు చెందిన అలెగ్జాండ్రాతో తలపడనున్నారు. చదవండి: IPL 2022 Auction: అందమైన నవ్వు.. వేలంలో ప్రత్యేక ఆకర్షణ.. అందరి దృష్టి తన మీదే.. అసలు ఎవరామె? గుర్తుపట్టారా? -
Prajnesh Gunneswaran: ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం
Bengaluru Open: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత రెండో ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేశాడు. సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ 7–6 (7/4), 6–2తో మథియాస్ బుర్గె (ఫ్రాన్స్)పై గెలిచాడు. మరోవైపు భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ 6–3, 0–6, 5–7తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. ఇతర మ్యాచ్‌ల్లో అర్జున్ ఖడే 1–6, 2–6తో సెలిక్బిలెక్ (టర్కీ) చేతిలో, రిషి రెడ్డి 1–6, 3–6తో కుకాడ్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. చదవండి: Mohammed Siraj: 'క్రికెట్ వదిలేయ్.. మీ నాన్నతో వెళ్లి ఆటో తోలుకో' -
బోపన్న–రామ్‌కుమార్ సంచలన విజయం.. డబుల్స్ టైటిల్
Rohan Bopanna Ramkumar- పుణే: దక్షిణాసియాలో జరిగే ఏకైక ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్ టాటా ఓపెన్‌లో భారత సీనియర్ స్టార్ రోహన్ బోపన్న, యువతార రామ్‌కుమార్ రామనాథన్ మెరిశారు. వీరిద్దరు జతగా బరిలోకి దిగి టాటా ఓపెన్ డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 6–7 (10/12), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ లూక్ సావిల్లె–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై సంచలన విజయం సాధించింది. బోపన్న–రామ్ జంటకు 16,370 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 12 లక్షల 22 వేలు)లభించింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట ఏడు ఏస్‌లు సంధించి ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఈ ఏడాది బోపన్న–రామ్ జోడీకిది రెండో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గత నెలలో అడిలైడ్ ఓపెన్‌లోనూ బోపన్న–రామ్ జంట విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా బోపన్న కెరీర్లో ఇది 21వ డబుల్స్ టైటిల్‌కాగా రామ్ ఖాతాలో ఇది రెండో డబుల్స్ టైటిల్. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
విష్ణు–బాలాజీ జంట ఓటమి
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ– 250 టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో విష్ణు వర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం 2–6, 4–6తో టాప్ సీడ్ ల్యూక్ స్మిత్–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తమ సర్వీస్‌ను మూడు సార్లు కోల్పోయింది. నేడు సాదియో –ఫాబియన్ (ఫ్రాన్స్); రోహన్ బోపన్న–రామ్ కుమార్ (భారత్) జోడీల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో రేపు జరిగే ఫైనల్లో ల్యూక్–జాన్ ప్యాట్రిక్ జంట ఆడుతుంది. సుహానా సైనీకి కాంస్యం ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) యూత్ కంటెండర్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణి సుహానా సైనీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ట్యూనిషియా రాజధాని ట్యూనిస్లో శుక్రవారం జరిగిన అండర్–19 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో సుహానా 11–9, 9–11, 10–12, 11–13తో ప్రపంచ నంబర్‌వన్ ఎలీనా జహారియా (రొమేనియా) చేతిలో ఓడింది. -
యూకీ బాంబ్రీ శుభారంభం
టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. పుణేలో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూకీ 6–7 (10/12), 6–2, 7–5తో కొవాలిక్ (స్లొవేకియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో యూకీ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరో మ్యాచ్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) 6–7 (5/7), 2–6తో అల్ట్‌మైర్ (జర్మనీ) చేతిలో ఓడాడు. -
మళ్లీ కోర్టులో అడుగు పెడతానో లేదో అనుకున్నా కానీ.. ఇప్పుడు: నాదల్ భావోద్వేగం
Australia Open 2022- Rafael Nadal Emotional Words: అద్భుతం... అసమానం... అసాధారణం... చిరస్మరణీయం... ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం రాఫెల్ నాదల్, డానిల్ మెద్వెదెవ్ పోరాడిన తీరును ఎన్ని విశేషణాలతో ప్రశంసించినా తక్కువే అవుతుంది. ఒకటా.. రెండా... మూడా... ఏకంగా 5 గంటల 24 నిమిషాలపాటు ఇద్దరూ కొదమ సింహాల్లా పోరాడారు. చివరకు 63 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన అపార అనుభవంతో రాఫెల్ నాదల్ పైచేయి సాధించాడు. రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలవడంతోపాటు పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా కొత్త చరిత్రను లిఖించాడు. ఈ టోర్నీకి ముందు ‘దిగ్గజ త్రయం’ నాదల్, ఫెడరర్, జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సమఉజ్జీగా ఉన్నారు. తాజా విజయంతో ఫెడరర్, జొకోవిచ్‌లను వెనక్కి నెట్టి 35 ఏళ్ల నాదల్ ముందుకొచ్చాడు. సమీప భవిష్యత్‌లో నాదల్‌ను అధిగమించే అవకాశం కేవలం 34 ఏళ్ల జొకోవిచ్‌కు మాత్రమే ఉంది. గాయాలతో సతమతమవుతున్న 40 ఏళ్ల ఫెడరర్ కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. మెల్బోర్న్: వరుసగా రెండు సెట్లు చేజార్చుకొని ఇక ఓటమి తప్పదేమో అనుకుంటున్న తరుణంలో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ నేలకు కొట్టిన టెన్నిస్ బంతిలా ఒక్కసారిగా పైకి లేచాడు. అంతర్జాతీయ టెన్నిస్‌లో తనకున్న 21 ఏళ్ల అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఒక్కో పాయింట్ గెలుస్తూ ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్నాడు. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. వెరసి రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచాడు. తన కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. తద్వారా పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిడిగా ఆవిర్భవించాడు. ఆదివారం రాడ్ లేవర్ ఎరీనాలో 5 గంటల 24 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ రాఫెల్ నాదల్ 2–6, 6–7 (5/7), 6–4, 6–4, 7–5తో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై అద్భుత విజయం సాధించాడు. నాదల్కు 28 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 15 కోట్ల 9 లక్షలు)... రన్నరప్ మెద్వెదెవ్కు 15 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 8 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలి రెండు సెట్లు కోల్పోయినా... గత ఏడాది ఈ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిన మెద్వెదెవ్ ఈసారి మాత్రం నాదల్‌పై శుభారంభం చేశాడు. తొలి సెట్‌ను, రెండో సెట్‌ను సొంతం చేసుకొని విజయానికి ఒక సెట్ దూరంలో నిలిచాడు. రెండు సెట్లు వెనుకబడ్డా నాదల్ మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. తన అపార అనుభవాన్ని రంగరించి పాయింట్ పాయింట్ కోసం పోరాడాడు. ముఖ్యంగా నాదల్ కొట్టిన కొన్ని బ్యాక్‌హ్యాండ్ షాట్లకు మెద్వెదెవ్ వద్ద సమాధానం లేకపోయింది. పాయింట్ల కోసం ఎన్నోసార్లు సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. కొన్నిసార్లు నాదల్, మరికొన్నిసార్లు మెద్వెదెవ్ పైచేయి సాధించారు. మూడో సెట్లోని తొమ్మిదో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను గెలిచాడు. నాలుగో సెట్లో మూడో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసినా వెంటనే నాలుగో గేమ్‌లో నాదల్ తన సర్వీస్‌ను కోల్పోయాడు. తర్వాత ఐదో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన నాదల్ అదే జోరులో నాలుగో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్లోని ఐదో గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అదే దూకుడు కొనసాగించి 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో పదో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన మెద్వెదెవ్ స్కోరును 5–5తో సమం చేశాడు. అయితే 11వ గేమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన నాదల్ 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు. ‘గ్రాండ్’ ఆధిక్యం చేతులు మారిన వేళ... ►2022 ఆస్ట్రేలియన్ ఓపెన్: 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో జొకోవిచ్, ఫెడరర్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన నాదల్ 21వ ‘గ్రాండ్’ టైటిల్‌తో ఒంటరిగా ఆధిక్యంలోకి వచ్చాడు. ►2009 వింబుల్డన్: 14 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పీట్ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ ఫెడరర్ 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఆధిక్యంలోకి వచ్చాడు. ►2000 వింబుల్డన్: 12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రాయ్ ఎమర్సన్ పేరిట ఉన్న రికార్డును సవరిస్తూ సంప్రాస్ 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఆధిక్యంలోకి వచ్చాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ వీరులు (కనీసం 10) ►రాఫెల్ నాదల్- (స్పెయిన్) 21 ►జొకోవిచ్- (సెర్బియా) 20 ►ఫెడరర్- (స్విట్జర్లాండ్) 20 ►పీట్ సంప్రాస్- (అమెరికా) 14 ►రాయ్ ఎమర్సన్- (ఆస్ట్రేలియా) 12 ►జాన్ బోర్గ్ - (స్వీడన్) 11 ►రాడ్ లేవర్- (ఆస్ట్రేలియా) 11 ►బిల్ టిల్డెన్ - (అమెరికా) 10 ఫైనల్ గణాంకాలు... నాదల్- మెద్వెదెవ్ 3 ఏస్‌లు 23 5 డబుల్ ఫాల్ట్‌లు 5 7/23 బ్రేక్ పాయింట్లు 6/22 30/50 నెట్ పాయింట్లు 28/50 69 విన్నర్స్ 76 68 అనవసర తప్పిదాలు 52 182 మొత్తం పాయింట్లు 189 నాదల్ భావోద్వేగం.. నిస్సందేహంగా నా టెన్నిస్ కెరీర్లో అత్యంత భావోద్వేగ మ్యాచ్ ఇది. నిజాయతీగా చెప్పాలంటే నెలన్నర రోజుల క్రితం అసలు టెన్నిస్ రాకెట్ పట్టుకొని మళ్లీ కోర్టులో అడుగు పెడతానో లేదోననే సందిగ్ధావస్థలో ఉన్నాను. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్స్ ట్రోఫీతో మీ ముందు ఉన్నాను. నాలో ఇంకా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచే శక్తి ఉందని తెలిసింది. తప్పకుండా వచ్చే ఏడాది కూడా ఈ టోర్నీలో ఆడతాను. మెద్వెదెవ్ అసాధారణంగా పోరాడాడు. భవిష్యత్‌లో కచ్చితంగా అతడిని కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా చూస్తాం. ఆస్ట్రేలియాలో గత మూడు వారాలుగా నాకు లభించిన ఆదరణ, ఆప్యాయత జీవితాంతం నా హృదయంలో ఉండిపోతుంది. –రాఫెల్ నాదల్ అద్భుత రికార్డులు: టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తొలి రెండు సెట్లు కోల్పోయాక కూడా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్ నాదల్. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సుదీర్ఘంగా సాగిన రెండో ఫైనల్‌గా నాదల్, మెద్వెదెవ్ మ్యాచ్ నిలిచింది. జొకోవిచ్, నాదల్ మధ్య 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జరిగిన మ్యాచ్ (5 గంటల 53 నిమిషాలు) సుదీర్ఘంగా జరిగిన గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌గా గుర్తింపు పొందింది. టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచిన నాలుగో ప్లేయర్ నాదల్. ఈ జాబితాలో జొకోవిచ్ (సెర్బియా), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) కూడా ఉన్నారు. తన కెరీర్ మొత్తంలో మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు చేజార్చుకొని ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి విజేతగా నిలువడం నాదల్‌కిది నాలుగోసారి మాత్రమే. గతంలో నాదల్ 2007 వింబుల్డన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మిఖాయిల్ యూజ్నీ (రష్యా)పై... 2006 వింబుల్డన్ రెండో రౌండ్లో రాబర్ట్ కెండ్రిక్ (అమెరికా)పై... 2005 మాడ్రిడ్ ఓపెన్‌లో లుబిసిచ్ (క్రొయేషియా)పై ఇలా గెలిచాడు. నాదల్ 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ►ఆస్ట్రేలియన్ ఓపెన్- 2009, 2022 ►ఫ్రెంచ్ ఓపెన్- 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020 ►వింబుల్డన్- 2008, 2010 ►యూఎస్ ఓపెన్- 2010, 2013, 2017, 2019 ప్రశంసల జల్లు: ‘ఆహా ఏమి మ్యాచ్ ఆడావు. 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన నా మిత్రుడు, గొప్ప ప్రత్యర్థి నాదల్కు హృదయపూర్వక అభినందనలు. చాంపియన్స్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు.’ –ఫెడరర్ ‘అద్భుతమైన ఘనత. నాదల్ మరోసారి నీ అసమాన పోరాటంతో ఆకట్టుకున్నావు.’–జొకోవిచ్ -
Australian Open: మిక్స్డ్ డబుల్స్ విజేత.. డోడిగ్- క్రిస్టినా.. ప్రైజ్‌మనీ ఎంతంటే..
Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట విజేతగా నిలిచింది. శుక్రవారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డోడిగ్–మ్లాడెనోవిచ్ ద్వయం 6–3, 6–4తో జేసన్ కుబ్లెర్–జైమీ ఫోర్లిస్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. డోడిగ్–మ్లాడెనోవిచ్ జంటకు 1,90,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 99 లక్షల 65 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో మ్లాడెనోవిచ్కిది నాలుగో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. 2014లో డానియల్ నెస్టర్ (కెనడా)తో కలిసి మిక్స్డ్ టైటిల్ నెగ్గిన ఆమె తిమియా బాబోస్ (హంగేరి)తో కలిసి 2018, 2020లలో మహిళల డబుల్స్ టైటిల్స్‌ను సాధించింది. చదవండి: 29 ఫోర్లు, 7 సిక్సులు.. తొలి వికెట్‌కు 155 పరుగులు.. అయినా! Title town for 🇫🇷 @kikimladenovic & @dodigtennis 🇭🇷 They defeat Fourlis/Kubler 6-3 6-4 to win the mixed doubles crown 🏆 #AusOpen • #AO2022 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/SyeWnzdKjO — #AusOpen (@AustralianOpen) January 28, 2022 -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో బార్టీ సంచలనం... ఫైనల్లో తలపడబోయేది ఆమెతోనే..
స్వదేశీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి యాష్లే బార్టీ తెరదించింది. 42 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన ఆసీస్ ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. 1980లో చివరిసారిగా వెండీ టర్న్‌బుల్ రూపంలో ఆసీస్ మహిళా క్రీడాకారిణి ఈ మెగా టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆస్ట్రేలియన్ క్రీడాకారిణిగా ఘనత సాధించేందుకు బార్టీ మరో విజయం దూరంలో నిలిచింది. అమెరికా క్రీడాకారిణి డానియెల్ కొలిన్స్‌తో శనివారం జరిగే ఫైనల్లో బార్టీ గెలిస్తే 1978లో క్రిస్టీన్ ఒనీల్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల చాంపియన్‌గా నిలిచిన ఆసీస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియ ఓపెన్‌లో ఈ ఏడాది మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా) తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో యాష్లే బార్టీ 62 నిమిషాల్లో 6–1, 6–3తో అన్‌సీడెడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై... కొలిన్స్ 78 నిమిషాల్లో 6–4, 6–1తో ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై విజయం సాధించారు. శనివారం జరిగే ఫైనల్లో బార్టీతో కొలిన్స్ తలపడనుంది. ముఖాముఖి రికార్డులో బార్టీ 3–1తో కొలిన్స్‌పై ఆధిక్యంలో ఉంది. బారీ్టకిది మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా... 28 ఏళ్ల కొలిన్స్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో టైటిల్ పోరుకు చేరింది. 25 ఏళ్ల బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2021లో వింబుల్డన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. అదే జోరు... టైటిల్ ఫేవరెట్ హోదాకు తగ్గట్టు ఈ టోర్నీలో బార్టీ ఆడుతోంది. ఫైనల్ చేరే క్రమంలో ఆరు మ్యాచ్‌లు ఆడిన బార్టీ 6 గంటల 6 నిమిషాలు మాత్రమే టెన్నిస్ కోర్టులో గడిపింది. ఒక్క సెట్ కూడా తన ప్రత్యర్థులకు కోల్పోని బార్టీ కేవలం 21 గేమ్‌లు మాత్రమే సమర్పించుకుంది. 2017 యూఎస్ ఓపెన్ రన్నరప్ మాడిసన్ కీస్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్లో బార్టీకి ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. ఐదు ఏస్‌లు సంధించి ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయని బార్టీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. 20 విన్నర్స్ కొట్టిన బార్టీ 13 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు 2015 తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ సెమీఫైనల్ ఆడిన కీస్ ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ సంపాదించలేదు. ‘బ్రేక్’తో మొదలు... 2020 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వియాటెక్‌తో జరిగిన సెమీఫైనల్లో కొలిన్స్ ఆరంభం నుంచే ఆధిపత్యం చలాయించింది. తొలి సెట్లో, రెండో సెట్లో ఆరంభంలోనే రెండుసార్లు చొప్పున స్వియాటెక్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన కొలిన్స్ 4–0తో, 4–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి సెట్లో 0–4తో వెనుకబడ్డాక స్వియాటెక్ కోలుకొని రెండుసార్లు కొలిన్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అయితే 5–4తో స్కోరు వద్ద కొలిన్స్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లోనూ 0–4తో వెనుకబడ్డ స్వియాటెక్ ఈసారి మాత్రం ఒక్క గేమ్ మాత్రమే గెలవగలిగింది. ఏడో గేమ్‌లో స్వియాటెక్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన కొలిన్స్ సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఏడు ఏస్‌లు సంధించిన కొలిన్స్ 27 విన్నర్స్ కొట్టింది. స్వియాటెక్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 13 అనవసర తప్పిదాలు చేసింది. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Made Down Under ™️ 🇦🇺 @ashbarty defeats Madison Keys 6-1 6-3 to become the first home representative to reach the #AusOpen women's singles final since 1980. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/C7NtLJySmp — #AusOpen (@AustralianOpen) January 27, 2022 The finishing touch to the opening set 🎨 🇦🇺 @ashbarty draws first blood against Madison Keys, taking the first set 6-1. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AusOpen • #AO2022 pic.twitter.com/i37x16v6oP — #AusOpen (@AustralianOpen) January 27, 2022 Cool ✅ Calm ✅ Calculated ✅ Swiatek looking as sharp as ever with a beautiful finish 🙌#bondisands • @bondisands pic.twitter.com/2fnl0nLTMh — #AusOpen (@AustralianOpen) January 28, 2022 -
Australian Open: ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆష్లే బార్టీ.. సరికొత్త చరిత్ర
Ashleigh Barty dismantles Madison Keys: ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ ఆష్లే బార్టీ అద్భుత విజయం సాధించింది. అమెరికన్ ప్లేయర్ మేడిసన్ కీస్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. 1980 తర్వాత మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా నిలిచింది. ఇక వరల్డ్ నెంబర్ 1 ఆష్లే.. మేడిసన్ను 6-1, 6-3 తేడాతో మట్టికరిపించి టైటిల్ రేసులోకి దూసుకువెళ్లింది. ఫైనల్లో ఆమె.. ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) లేదంటే... 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా)తో తలపడే అవకాశం ఉంది. ఫైనల్లో గెలిస్తే ఆష్లే కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరుతుంది. కాగా 1980లో వెండీ టర్న్‌బల్ తొలిసారిగా మహిళల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆష్లే ఆ రికార్డును సవరించింది. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Made Down Under ™️ 🇦🇺 @ashbarty defeats Madison Keys 6-1 6-3 to become the first home representative to reach the #AusOpen women's singles final since 1980. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/C7NtLJySmp — #AusOpen (@AustralianOpen) January 27, 2022 The finishing touch to the opening set 🎨 🇦🇺 @ashbarty draws first blood against Madison Keys, taking the first set 6-1. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AusOpen • #AO2022 pic.twitter.com/i37x16v6oP — #AusOpen (@AustralianOpen) January 27, 2022 -
Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్.. సానియా జంట ముందడుగు
Australia Open- Sania Mirza: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో సానియా–రాజీవ్ ద్వయం 7–6 (8/6), 6–4తో ఎలెన్ పెరెజ్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–రాజీవ్ రామ్ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సాకారి, బదోసా అవుట్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. ఐదో సీడ్ మరియా సాకరి (గ్రీస్), ఎనిమిదో సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–1తో బదోసా ను ఓడించగా... 21వ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 7–6 (7/0), 6–3తో సాకరిపై గెలిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–4, 6–3తో అమండా అనిసిమోవా (అమెరికా)పై, నాలుగో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చదవండి: Australia Open: నాదల్ దూకుడు.. మూడో సీడ్ జ్వెరెవ్‌కు షాక్ -
Novak Djokovic: జొకోవిచ్‌కు భారీ షాకిచ్చిన కోర్టు.. మూడేళ్ల పాటు నో ఎంట్రీ!
సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీసా అంశంలో ఆస్ట్రేలియా కోర్టులో అతడికి చుక్కెదురైంది. దీంతో టైటిల్ నిలబెట్టుకోవాలన్న జొకోవిచ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేయించుకోకపోయినా... ప్రత్యేక మినహాయింపుతో అతడు ఆస్ట్రేలియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకో వీసాను రద్దు చేసింది. అయితే, అతడు కోర్టుకెక్కి విజయం సాధించాడు. కానీ ప్రభుత్వం మాత్రం తమకున్న అధికారాలతో మరోసారి వీసాను రద్దు చేసింది. దీంతో జొకో రెండోసారి కోర్టును ఆశ్రయించాడు. కానీ.. ఈసారి మాత్రం అతడికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వీసాను రద్దు చేశామన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. వ్యాక్సినేషన్ పత్రాలు సమర్పించడంలో విఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో డిఫెండింగ్ చాంపియన్ జొకో.. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఆడకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన జొకోవిచ్.. ‘‘తీవ్ర నిరాశకు గురయ్యాను. అయితే, కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాను. నేను దేశాన్ని వీడటానికి అధికారులు చేస్తున్న ఏర్పాట్లకు సహకరిస్తాను’’ అని పేర్కొన్నాడు. కాగా... రెండోసారి వీసా రద్దు అయిన కారణంగా... జొకో మళ్లీ మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి వీలుండదు. అంటే 2025 వరకు అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడే అవకాశం లేనట్లే! చదవండి: జొకోవిచ్ లడాయి కెప్టెన్సీ నుంచి తొలగిస్తారనే ఇలా ముందుగానే.. నాకిది అనుభవమే.. టీమిండియా మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు! View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
Novak Djokovic: రెండోసారి వీసాను రద్దు చేసే అధికారం ఉంది.. అదే జరిగితే..
Novak Djokovic In Australian Open Draw: సెర్బియన్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆడే విషయంలో అనిశ్చితి ఇంకా తొలగలేదు. కానీ ‘డ్రా’లో మాత్రం అతని పేరు ఖరారైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూసిన టెన్నిస్ టోర్నీ నిర్వాహకులు కాస్త ఆలస్యంగా ‘డ్రా’ను విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా ఉన్న ఈ సెర్బియా స్టార్ తొలి రౌండ్లో సహచరుడు మియోమిర్ కెమనొవిచ్తో తలపడనున్నాడు. వ్యాక్సినేషన్ వేయించుకోకపోయినా... ప్రత్యేక మినహాయింపుతో ఆస్ట్రేలియాకు వచ్చిన జొకో వీసాను రద్దు చేశారు. అయితే అతను న్యాయపోరాటం చేసి ఊరట చెందాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండోసారి వీసాను రద్దు చేసే అధికారం విదేశీ వ్యవహారాల మంత్రికి ఉంది. గురువారం తుది నిర్ణయం వెలువరిస్తారనే వార్తలు వచ్చినప్పటికీ ప్రభు త్వం తమ నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది. తను మాత్రం ప్రాక్టీస్‌లో తలమునకలై శ్రమిస్తున్నాడు. చదవండి: Virat Kohli: ఓడిపోతున్నామనే బాధ.. కోహ్లి అసహనం View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
Novak Djokovic: తప్పు ఒప్పుకొన్న జొకోవిచ్.. రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష.. కానీ..
Novak Djokovic- Australia Open: కోవిడ్–19 సోకిన తర్వాత స్వీయ నిర్బంధంలో గడపకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తాను తప్పు చేశానని సెర్బియన్ టెన్నిస్ స్టార్ జొకోవిచ్ అంగీకరించాడు. గత నెలలో తనకు కరోనా సోకిం దని, దాని వల్లే వ్యాక్సినేషన్ వేయించుకునే సమయం లభించలేదనే కారణంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక మినహాయింపు పొందాడు. దీంతో తనకు అచ్చొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేద్దామనుకున్న జొకోవిచ్‌కు కంగారూ గడ్డపై వచ్చీరాగానే అసలు కష్టాలు ఎదురయ్యాయి. మెల్బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లోనే అతన్ని నిలిపివేయడంతో పాటు వీసాను రద్దు చేశారు. చివరకు కోర్టు మెట్లెక్కి ఊరట పొందిన సెర్బియన్ తను చేసింది పొరపాటేనని అంగీకరిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశాడు. ఆటా? ఇంటిబాటా? జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేది లేనిది నేడు తేలనుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారులు, విదేశీ వ్యవహారాలు, బోర్డర్ ఫోర్స్ వర్గాలు అతను మినహాయింపునకు సమర్పించిన పత్రాలను స్క్రూటినీ చేస్తున్నారు. అతను తప్పుడు ధ్రువ పత్రాలు దాఖలు చేసి ఉంటే అది ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం కఠిన నేరమవుతుంది. ఈ నేరం కింద ఐదేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోపై కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. గురువారం టోర్నీ ‘డ్రా’ విడుదల కానుంది. ఇప్పటికే జొకోవిచ్‌కు టాప్ సీడింగ్ కేటాయించారు. అతడికి గట్టి మందలింపుతో సరిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) View this post on Instagram A post shared by Novak Djokovic (@djokernole) -
సానియా మీర్జాకు షాక్... టోర్నీ నుంచి అవుట్!
Adelaide Open: కొత్త ఏడాదిలో భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. అడిలైడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీలో సానియా (భారత్)–నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ సెమీఫైనల్లో పోరాడి ఓడిపోయింది. యాష్లే బార్టీ–స్టార్మ్ సాండెర్స్ (ఆస్ట్రేలియా) ద్వయంతో జరిగిన మ్యాచ్‌లో సానియా–కిచెనోక్ 1–6, 6–2, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓటమి చవిచూశారు. సెమీస్‌లో బోపన్న ద్వయం మరోవైపు అడిలైడ్ ఓపెన్ పురుషుల టోర్నీలో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ (భారత్) జంట సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రామ్6–1, 6–3తో బోంజి (ఫ్రాన్స్)–హుగో నిస్ (మొనాకో)లపై నెగ్గారు. చదవండి: SA vs IND: "కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా అతడే సరైనోడు" -
నాకు కరోనా పాజిటివ్.. మరేం ఫర్వాలేదు: టెన్నిస్ స్టార్
Covid 19 Positive: స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. అబుదాబి టోర్నీలో ఆడిన నాదల్ స్వదేశానికి తిరిగి రాగానే నిర్వహించిన టెస్టులో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అతడు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అయితే, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. ‘‘అబుదాబి టోర్నమెంట్ తర్వాత స్పెయిన్‌కు తిరిగి వచ్చాను. ఈ సందర్భంగా నిర్వహించిన పీసీఆర్ టెస్టులో కోవిడ్ సోకినట్లు నిర్దారణ అయింది. కాస్త ఇబ్బందిగా ఉంది. అయితే, కంగారు పడాల్సిందేమీ లేదు. నాతో సన్నిహితంగా మెలిగిన వాళ్లకు.. నాకు కరోనా సోకిన విషయం తెలిపాను ’’ అని నాదల్ పేర్కొన్నాడు. కాగా 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన నాదల్... కాలి గాయం కారణంగా పలు టోర్నీలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అబుదాబి వేదికగా జరిగిన ముబదాలా వరల్డ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌తో పునరాగమనం చేశాడు. ముర్రే చేతిలో ఓటమిపాలై ఇంటిబాట పట్టాడు. చదవండి: Ashes: 77 బంతుల్లో 12 ... 207 బంతుల్లో 26 పరుగులు.. స్టోక్స్, బట్లర్ పాపం.. Hola a todos. Quería anunciaros que en mi regreso a casa tras disputar el torneo de Abu Dhabi, he dado positivo por COVID en la prueba PCR que se me ha realizado al llegar a España. — Rafa Nadal (@RafaelNadal) December 20, 2021 -
Roger Federer: ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరం.. రిటైర్ అవుతున్నాడా..!
Roger Federer Likely To Miss Australian Open Not Thinking About Retirement: జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ ఆడే అవకాశాలు లేవని అతడి కోచ్ లుబిసిచ్ తెలిపాడు. అయితే 2022లోనే ఏదో ఒక టోర్నీ ద్వారా ఫెడరర్ పునరాగమనం చేస్తాడని లుబిసిచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో చివరిసారిగా ఆడిన ఫెడరర్... అనంతరం మెకాలికి మరోసారి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కోచ్ లుబిసిచ్ మాట్లాడుతూ.. ‘‘అతడు కోలుకుంటున్నాడు. టోర్నమెంట్లు ఆడాలని భావిస్తున్నాడు. పునరాగమనానికి అవకాశాలు ఉన్నాయి. వందకు వంద శాతం తను తిరిగి కోర్టులో అడుగుపెడతాడు. అయితే, ఆస్ట్రేలియా ఓపెన్‌కు మాత్రం అందుబాటులో ఉండడు. తనకు ఇప్పుడు 40 ఏళ్లు. కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అంతేగానీ రిటైర్మెంట్ ఆలోచన లేదు’’అని చెప్పుకొచ్చాడు. చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్! -
Novak Djokovic: వారెవ్వా జొకోవిచ్... అరుదైన రికార్డు
Novak Djokovic Wins 37 Masters Title: సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ తన కెరీర్లో 37వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను గెలిచాడు. ఆదివారం ముగిసిన పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ 4–6, 6–3, 6–3తో మెద్వెదేవ్ (రష్యా)పై గెలిచాడు. ఈ విజయంతో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (36 మాస్టర్స్ టైటిల్స్)ను వెనక్కి నెట్టి అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా అత్యధికంగా ఏడుసార్లు సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు సృష్టించాడు. పీట్ సంప్రాస్ (అమెరికా–6 సార్లు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సవరించాడు. చదవండి: Abu Dhabi Chief Curator: అబుదాబిలో భారత క్యూరేటర్ ఆత్మహత్య -
Srivalli Rashmika:: ముగిసిన శ్రీవల్లి రష్మిక ప్రయాణం
Rashmika Srivalli : ఫెనెస్టా ఓపెన్ జాతీయ సీనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రయాణం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–7 (4/7), 1–6తో టాప్ సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్) సెమీఫైనల్లో అడుగు పెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో నిక్కీ 6–4, 6–2తో పృథ్వీ శేఖర్ (తమిళనాడు)పై గెలిచాడు. ఇక మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ చిలకలపూడి శ్రావ్య శివాని జంట ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్లో టోర్నీ మూడో సీడ్ శ్రావ్య శివాని–షర్మదా బాలు (కర్ణాటక) 6–1, 3–6, 10–7తో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుముల– స్నేహల్ మానే (మహారాష్ట్ర) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో జరిగిన సెమీ ఫైనల్లో నిక్కీ పూనాచా–ప్రజ్వల్ దేవ్ (కర్ణాటక) 6–4, 7–5తో పారస్ దహియా (హరియాణా)– ఇక్బాల్ (వెస్ట్‌బెంగాల్) ద్వయంపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. చదవండి: T20 World Cup 2021 Aus Vs SL: కప్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్... వరుస విజయాలు -
Rohan Bopanna: బోపన్న జోడీ సంచలనం
St Petersburg Open: సెయింట్ పీటర్స్బర్గ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–5, 6–4తో రెండో సీడ్ రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–బెన్ మెక్లాచ్లన్ (జపాన్) జోడీపై విజయం సాధించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట పది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. చదవండి: IND vs PAK: ఆటా? మతవిద్వే షపు సయ్యాటా? -
Ostrava Open: సెమీఫైనల్లో సానియా మీర్జా జోడీ
Ostrava Open: ఒస్ట్రావా ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–షుయె జాంగ్ (చైనా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. చెక్ రిపబ్లిక్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సానియా–షుయె జాంగ్ ద్వయం 6–3, 3–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో డానిలినా (కజకిస్తాన్)–మరోజవా (బెలారస్) జంటను ఓడించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇరీ హోజుమి– నినోమియా (జపాన్) జోడీతో సానియా–షుయె జాంగ్ ద్వయం తలపడుతుంది. చదవండి: MS Dhoni: బ్రావో ఇలా చేశాడే అనుకుంటారు కదా.. ఆ విషయంలోనే మాకు ‘గొడవలు’! -
Naomi Osaka: మళ్లీ ఎప్పుడు ఆడతానో తెలీదు.. నిరవధిక విరామం
టోక్యో: వచ్చే నెలలో జరిగే ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి మాజీ చాంపియన్ నయోమి ఒసాకా వైదొలిగింది. ఇటీవల యూఎస్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఒసాకా అనూహ్యంగా మూడో రౌండ్లో కెనడాకు చెందిన లేలా ఫెర్నాండెజ్ చేతిలో ఓడింది. ఆ ఓటమి అనంతరం మళ్లీ తాను రాకెట్ పట్టేది ఎప్పుడో తనకు కూడా తెలీదంటూ నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత ఒసాకా ఆటకు నిరవధిక విరామాన్ని ప్రకటించింది. ఇండియన్ వెల్స్ టోర్నీ అక్టోబర్ 4 నుంచి 17 వరకు జరగనుంది. Ostrava Tennis Tournament: ఒస్ట్రావా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా–షుయె జాంగ్ (చైనా) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. చెక్ రిపబ్లిక్ లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్లో సానియా–షుయె జంగ్ ద్వయం 6–7 (3/7), 7–5, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇమీనా బెక్టాస్ (అమెరికా)–తారా మూర్ (బ్రిటన్) జోడీపై నెగ్గింది. చదవండి: Ind W Vs Aus W 2nd ODI: నిలవాలంటే గెలవాల్సిందే! -
డబుల్స్ సెమీస్‌లో సానియా మీర్జా జంట
క్లీవ్‌ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెక్‌హాలే (అమెరికా) జంట సెమీఫైనల్లో ప్రవేశించింది. అమెరికాలోని ఒహాయోలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 6–3, 6–3తో మూడో సీడ్ లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్)–షుయె జాంగ్ (చైనా) జంటపై సంచలన విజయం సాధించింది. 61 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసింది. సెమీఫైనల్లో ఐకెరి (నార్వే)–కేథరిన్ హ్యారిసన్ (అమెరికా) జంటతో సానియా–క్రిస్టినా జోడీ తలపడనుంది. -
మ్యాచ్ మధ్యలో ఆ టాప్ టెన్నిస్ స్టార్ ఏం చేశాడో చూడండి..
సిన్సినాటి: మాస్టర్స్ 1000 టెన్నిస్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రపంచ నంబర్ 2 క్రీడాకారుడు డేనిల్ మెద్వెదెవ్(రష్యా), సహచర రష్యా ఆటగాడు ఆండ్రే రుబ్లెవ్ మధ్య మ్యాచ్ సందర్భంగా(రెండో సెట్) డేనిల్ మెద్వెదెవ్ బంతిని కొట్టబోయే క్రమంలో బేస్‌లైన్ వద్ద ఆన్ కోర్టు కెమెరాను ఢీకొన్నాడు. ఈ ఘటనలో మెద్వెదెవ్కు కానీ కెమెరామెన్‌కు గానీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, అప్పటికే తొలి సెట్(6-2)ను గెలుపొంది, రెండో సెట్లో వెనుకబడిన మెద్వెదెవ్ సహనం కోల్పోయి.. కెమెరాను ఇక్కడి తీసేయండి, దీని వల్ల నా చెయ్యి విరిగినంత పనైందంటూ కెమెరాను కాలితో తన్నాడు. అప్పుడే మెద్వెదెవ్ క్షేమ సమాచారంపై ఆరా తీసేందుకు వచ్చిన ఫీల్డ్ అంపైర్.. వరల్డ్ నంబర్ 2 క్రీడాకారుడు చేసిన పనిని చూసి అవాక్కయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. Why media is silent ? 🤪🤷🏻♂️ Daniil Medvedev KICKS THE CAMERA at Cincinnati Tennis Tournament!! https://t.co/79g1zZkxI4 via @YouTube pic.twitter.com/SAPkJCZJv5 — Yerik Ilyassov (@yerikilyassov) August 21, 2021 ఇదిలా ఉంటే, ఈ ఘటన అనంతరం లయ తప్పిన మెద్వెదెవ్ వరుసగా రెండు సెట్లు కోల్పోయి 6-2, 3-6, 3-6తో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. 2019లో ఈ టైటిల్‌ను నెగ్గిన మెద్వెదెవ్, ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అయితే, కెమెరాను ఢీకొట్టడం ద్వారా ఏకాగ్రతను కోల్పోయిన అతను సెమీస్‌లోనే నిష్క్రమించాడు. ప్రత్యర్ధి రుబ్లెవ్ ఆదివారం జరగబోయే ఫైనల్లో జర్మనీ ఆటగాడు జ్వెరెవ్‌ను ఢీకొంటాడు. జ్వెరెవ్ సెకెండ్ సెమీఫైనల్లో గ్రీక్ ఆటగాడు, ప్రపంచ నంబర్ 3 స్టెఫానోస్ సిట్సిపాస్ 6-4 3-6 7-6 (4)కు షాకిచ్చి ఫైనల్‌కు చేరాడు. చదవండి: సచిన్‌లో ఆ బలహీనత గమనించా.. దిగ్గజ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
French Open: అంకిత గెలుపు.. రెండో రౌండ్లోకి ఎంట్రీ
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి అంకిత రైనా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 182వ ర్యాంకర్ అంకిత 2 గంటల 9 నిమిషాల్లో 3–6, 6–1, 6–4తో ప్రపంచ 169వ ర్యాంకర్ అనస్తాసియా రొడియోనోవా (ఆస్ట్రేలియా)పై గెలిచింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో అంకిత నెట్‌వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు సంపాదించింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయిన అంకిత ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. రొడియోనోవా పది డబుల్ఫాల్ట్లతోపాటు 39 అనవసర తప్పిదాలు చేసింది. రెండో రౌండ్లో ప్రపంచ 125వ ర్యాంకర్ గ్రీట్ మినెన్ (బెల్జియం)తో అంకిత ఆడుతుంది. చదవండి: Telangana Boxer: క్వార్టర్ ఫైనల్లో హసాముద్దీన్ -
ఓటమి అంచుల్లో నుంచి నెగ్గిన నాదల్
రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో తొమ్మిదిసార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) అతికష్టమ్మీద క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. డెనిస్ షపవలోవ్ (కెనడా)తో 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ నాదల్ 3–6, 6–4, 7–6 (7/3)తో గెలుపొంది ఊపిరి పీల్చుకున్నాడు. రెండో సెట్లో 0–3తో... మూడో సెట్లో 1–3తో వెనుకబడిన నాదల్ చివరకు 5–6 స్కోరు వద్ద తన సర్వీస్‌లో ఏకంగా రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాపాడుకొని గట్టెక్కాడు. -
ఓడిన బొపన్న జంట: ప్రైజ్‌మనీ రూ. 6.69 లక్షలు
రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్ నుంచి రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపవలోవ్ (కెనడా) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. బోపన్న–షపవలోవ్ ద్వయం 4–6, 4–6తో డానియల్ (న్యూజిలాండ్)–ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా) జోడీ చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో ఓడిన బోపన్న జంటకు 7,500 యూరోల (రూ. 6 లక్షల 69 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
Alexander Zverev: జ్వెరెవ్ అదరహో...
మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో బలమైన ప్రత్యర్థులను ఓడిస్తూ సాగిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రయాణం ఘనంగా ముగిసింది. క్వార్టర్స్‌లో నాదల్‌ను, సెమీస్‌లో థీమ్‌ను ఓడించిన జ్వెరెవ్... ఫైనల్లోనూ అదే ప్రదర్శనను కనబరచి చాంపియన్‌గా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన టైటిల్ పోరులో జ్వెరెవ్ 6–7 (6/8), 6–4, 6–3తో మాటియో బెరెటిని (ఇటలీ)పై గెలిచాడు. మాడ్రిడ్ ఓపెన్‌ను జ్వెరెవ్ గెలవడం రెండో సారి. 2018లో అతను తొలిసారి ఈ టైటిల్‌ను నెగ్గగా...అతని కెరీర్లో ఇది నాలుగో మాస్టర్స్–1000 టైటిల్. మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించిన ప్రపంచ పదో ర్యాంకర్ బెరెటిని కీలక సమయాల్లో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్లో ఇద్దరు ప్లేయర్లు కూడా హోరాహోరీగా తలపడటంతో టై బ్రేక్‌కు దారి తీసింది. ఇందులో నెగ్గిన బెరెటిని తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో బెరెటిని సర్వ్ చేసిన తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్... ఆ తర్వాత తన గేమ్‌ను నిలబెట్టుకొని సెట్‌ను 6–4తో సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో సెట్లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన జ్వెరెవ్ ఆ సెట్‌ను గెలవడంతో లాంఛనం పూర్తి చేశాడు. మ్యాచ్‌లో బెరెటిని 50 అనవసర తప్పిదాలు చేయడంతో పాటు... మూడో సెట్లో జ్వెరెవ్ సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా వాటిని జారవిడిచి మ్యాచ్‌ను కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ్వెరెవ్ 3,15,160 యూరోల ప్రైజ్‌మనీ (సుమారు రూ. 2 కోట్ల 81 లక్షలు)ని అందుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో జరిగిన ఫైనల్లో మార్సెల్ గ్రనోలర్స్ (స్పెయిన్)– హరసియో జెబలోస్ (అర్జెంటీనా) జంట 1–6, 6–3, 10–8తో నికోలా మెక్టిక్–మాటె పవిచ్ (క్రొయేషియా) జోడిపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
ఇండో-పాక్ జోడీ మళ్లీ జతకట్టనుంది..
న్యూఢిల్లీ: టెన్నిస్‌లో ఇండో-పాక్ ఎక్స్‌ప్రెస్‌గా ఖ్యాతి గడించిన భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న, పాకిస్థాన్ క్రీడాకారుడు ఐసమ్ ఉల్ హక్ ఖురేషీల జోడీ మళ్లీ జతకట్టనుంది. వీరిద్దరి జోడీ ఏడేళ్ల తరువాత మెక్సికన్ ఓపెన్ టోర్నీ బరిలో దిగనుంది. వీరిద్దరి జోడీ చివరిసారిగా 2014 షెన్జన్ టోర్నీలో పాల్గొంది. ఆ టోర్నీలో వీరు క్వార్టర్స్‌లో నిష్క్రమించారు. ఆతరువాత వివిధ కారణాల వల్ల వీరు విడిపోయారు. వీరి జోడీ గతంలో ఐదు టైటిళ్లను సాధించి విజయంతమైన జోడీగా కొనసాగింది. 2010 వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరిన వీరు, అదే ఏడాది జరిగిన యూఎస్ ఓపెన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచారు. వీరి జోడీ 2011 పారిస్ మాస్టర్స్ టోర్నీ నెగ్గడంతో ఏటీపీ దబుల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా టాప్-10లోకి చేరుకున్నారు. డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం బోపన్న 40వ స్థానంలో, ఖురేషీ 49వ ర్యాంకులో కొనసాగుతున్నారు. కాగా, అకాపుల్కో వేదికగా జరుగనున్న ఈ ఏటీపీ 500 టోర్నీ ఈనెల 15న ప్రారంభంకానుంది. -
Australian Open 2021: ఒసాకాదే ధమాకా
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ ఆరంభ రౌండ్లలో సంచలనాలు నమోదైనా... చివరకు ఫైనల్లో మాత్రం కొత్త చాంపియన్గానీ, కొత్త చరిత్రగానీ లేదు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో జపనీస్ స్టార్ నయోమి ఒసాకా రెండోసారి విజేతగా నిలిచింది. అమెరికన్ బ్రాడీ సంచలనానికి ఏమాత్రం అవకాశమివ్వకుండా రెండే సెట్లలో ఆటను ముగించింది. నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శనివారం మహిళల సింగిల్స్‌లో తుదిపోరు జరిగింది. కానీ చూసేవాళ్లెవరికీ ఇది ఫైనల్‌గా కనిపించనే లేదు. ఓ సాదాసీదా మ్యాచ్‌లా ఏకపక్షంగా ముగిసింది. జపాన్ స్టార్ మూడో సీడ్ నయోమి ఒసాకా టైటిల్ పోరుకు తన రాకెట్ పవర్‌తో వన్‌సైడ్ వార్‌గా మార్చేసింది. ఫైనల్లో ఆమె 6–4, 6–3తో అమెరికాకు చెందిన 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీని చిత్తు చేసింది. గంటా 17 నిమిషాల్లోనే బ్రాడీ పనైపోయింది. ఒసాకా రెండోసారి విజేతగా నిలిచింది. జపనీస్ భామ 2019లో కూడా మెల్బోర్న్ పార్క్‌లో టైటిల్ గెలుచుకుంది. ఓవరాల్‌గా ఆమె నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండు యూఎస్ ఓపెన్ (2018, 2020) టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఫటాఫట్‌గా ముగించింది... ఒసాకా బుల్లెట్లా దూసుకొచ్చే ఏస్‌లతో బ్రాడీని చేష్టలుడిగేలా చేసింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థిని ఒక పాయింట్ అయినా గెలువనీయలేదు. మరుసటి గేమ్‌లో బ్రాడీ శ్రమించి సర్వీస్‌ను నిలబెట్టుకుంది. కానీ తర్వాత జపాన్ స్టార్ సర్వీస్‌తో పాటు బ్రేక్ పాయింట్ సాధించింది. బ్రాడీ కూడా తర్వాతి గేముల్లో దీటుగా బదులివ్వడంతో స్కోరు 4–4తో సమమైంది. ఈ దశలో ఒసాకా చకచకా రెండు పాయింట్లు సాధించి 41 నిమిషాల్లో 6–4 స్కోరుతో తొలిసెట్‌ను ముగించింది. ఇక రెండో సెట్లో ఒసాకా పదునైన షాట్లకు బదులివ్వలేకపోయిన బ్రాడీ సర్వీస్‌లను కూడా నిలబెట్టుకోలేకపోయింది. దీంతో ఒసాకా 4–0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌నే కోల్పోయే దశలో ఉన్నప్పటికీ అమెరికా స్టార్ కుంగిపోలేదు. ఐదో గేమ్‌లో చక్కని పోరాటం చేసి ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఈ గేమ్ సుదీర్ఘంగా సాగింది. తర్వాత తన సర్వీస్‌ను కొనసాగించిన బ్రాడీ కేవలం రెండు నిమిషాల్లోపే రెండో పాయింట్ సాధించింది. జాగ్రత్త పడిన ఒసాకా ఏడు, తొమ్మిదో గేముల్ని గెలుపొందడం ద్వారా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. రెండో సెట్ కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది. ఓవరాల్‌గా 6 ఏసుల్ని సంధించిన ఒసాకా రెండు సార్లు డబుల్ ఫాల్ట్ చేసింది. 16 విన్నర్లు కొట్టింది. 4 డబుల్ ఫాల్ట్‌లు చేసిన బ్రాడీ ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేయడంతో మ్యాచ్‌లో చిత్తయింది. మెర్టెన్స్–సబలెంక జంటకు ‘డబుల్స్’ మహిళల డబుల్స్ టైటిల్‌ను రెండో సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)–అరినా సబలెంక (బెలారస్) జంట కైవసం చేసుకుంది. తుదిపోరులో బెల్జియం–బెలారస్ జోడీ 6–2, 6–3తో చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బరా క్రెజికొవా– కెటరినా సినియకొవా జంటపై అలవోక విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో టైటిల్ మెట్టుపై చతికిల బడిన క్రెజికొవా మిక్స్డ్ డబుల్స్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)తో కలిసి విజేతగా నిలిచింది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ 6–1, 6–4తో ఆస్ట్రేలియన్ వైల్డ్‌కార్డ్ జంట సమంత స్టొసుర్–మాథ్యూ ఎడెన్‌పై విజయం సాధించింది. జొకోవిచ్ వర్సెస్ మెద్వెదెవ్ ► నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ ►మ.గం.2 నుంచి సోనీలో ప్రత్యక్షప్రసారం రెండేళ్లుగా మెల్బోర్న్ పార్క్‌లో టైటిల్ నిలబెట్టుకుంటున్న టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ ఇప్పుడు ‘హ్యాట్రిక్’ వేటకు సిద్ధమయ్యాడు. ఆసీస్ ఓపెన్‌లో ఈ టాప్‌సీడ్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఓవరాల్‌గా 17 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో దాదాపు సగం (8) టైటిల్స్ ఇక్కడే గెలిచాడు. ఇంతటి ఘనమైన రికార్డును, సూపర్ ఫామ్‌లో ఉన్న మేటి ఆటగాడైన నొవాక్‌ను ఓడించడం రష్యన్ స్టార్ మెద్వెదెవ్కు అంత సులువేమీ కాదు. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. నాలుగో సీడ్ మెద్వెదెవ్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడేదే మొదటిసారి. సెర్బియన్ దిగ్గజానికి ఎందులోనూ సరితూగని ప్రత్యర్థి. అయితే ఫైనల్ చేరేందుకు అతను బాగానే కష్టపడ్డాడు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా)ను, సెమీస్‌లో ఐదో సీడ్ సిట్సిపాస్లను ఓడించి టైటిల్ బరిలో నిలిచాడు. కానీ కొండంత ప్రత్యర్థి ముందు ఈ కష్టం ఏమాత్రం నిలుస్తుందో మరి... ఎందుకంటే టైటిళ్ల పరంగా చూసినా... ఫైనల్స్ పరంగా చూసినా కూడా నొవాక్... మెద్వెదెవ్ కంటే ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉన్నాడు.