తాష్కెంట్: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల గ్రూప్–1 టెన్నిస్ టోర్నీని భారత్ ఓటమితో ముగించింది. శనివారం జరిగిన ఆఖరి పోరులో భారత్‌పై 2–1 తేడాతో కొరియా విజయం సాధించింది.
తొలి సింగిల్స్‌లో భారత్‌కు చెందిన వైదేహి చౌదరి 6–2, 4–6, 4–6 తేడాతో కిమ్ డాబిన్ చేతిలో పరాజయంపాలైంది. అయితే రెండో సింగిల్స్‌లో రుతుజ భోస్లే 7–5, 2–6, 6–2 తేడాతో క్యూ య్యూన్‌వును ఓడించింది.
అనంతరం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో కొరియా జోడి కిమ్ డాబిన్ – జీ హీ చొయ్ 6–4, 2–6, 6–3తో భారత ద్వయం అంకితా రైనా – రుతుజ భోస్లేపై విజయం సాధించింది. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లలో థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్‌లపై గెలుపొందిన భారత అమ్మాయిలు ఆ తర్వాత వరుసగా మూడు సమరాల్లో చైనా, జపాన్, కొరియా చేతుల్లో ఓడిపోయారు. ఈ క్రమంలో ఈ టెన్నిస్ టోర్నీలో భారత్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
చదవండి: కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన జితేశ్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment