Asia Oceania tournament
-
ఓటమితో ముగించిన భారత్
తాష్కెంట్: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా మహిళల గ్రూప్–1 టెన్నిస్ టోర్నీని భారత్ ఓటమితో ముగించింది. శనివారం జరిగిన ఆఖరి పోరులో భారత్‌పై 2–1 తేడాతో కొరియా విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో భారత్‌కు చెందిన వైదేహి చౌదరి 6–2, 4–6, 4–6 తేడాతో కిమ్ డాబిన్ చేతిలో పరాజయంపాలైంది. అయితే రెండో సింగిల్స్‌లో రుతుజ భోస్లే 7–5, 2–6, 6–2 తేడాతో క్యూ య్యూన్‌వును ఓడించింది. అనంతరం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో కొరియా జోడి కిమ్ డాబిన్ – జీ హీ చొయ్ 6–4, 2–6, 6–3తో భారత ద్వయం అంకితా రైనా – రుతుజ భోస్లేపై విజయం సాధించింది. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లలో థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్‌లపై గెలుపొందిన భారత అమ్మాయిలు ఆ తర్వాత వరుసగా మూడు సమరాల్లో చైనా, జపాన్, కొరియా చేతుల్లో ఓడిపోయారు. ఈ క్రమంలో ఈ టెన్నిస్ టోర్నీలో భారత్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. చదవండి: కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన జితేశ్ శర్మ -
Billie Jean King Cup 2023 tennis: యమ్లపల్లికి చోటు
న్యూఢిల్లీ: ఆసియా ఓషియానియా గ్రూప్ 1 ఫెడరేషన్ కప్ (బిల్లీ జీన్ కింగ్ కప్)లో పాల్గొనే ఐదుగురు సభ్యుల భారత జట్టును అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రకటించింది. ఈ టీమ్‌లో అంకితా రైనా (ప్రపంచ 241వ ర్యాంకర్), కర్మన్ కౌర్ తాండి (268), రుతుజా భోస్లే (419), వైదేహి చౌదరి (492)తో పాటు హైదరాబాద్‌కు చెందిన సహజ యమ్లపల్లి (454)కి స్థానం లభించింది. నగరానికి చెందిన సహజ అమెరికాలోనే చదువుకుంటూ అక్కడే శిక్షణ తీసుకుంటోంది. హైదరాబాద్‌కే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైంది. వైదేహి ఇటీవలే తన రెండో ఐటీఎఫ్ టైటిల్ గెలుచుకోగా, భారత క్రీడాకారిణుల్లో నాలుగో ర్యాంక్‌లో ఉన్న సహజకు కూడా తొలి సారి అవకాశం లభించింది. ‘నిలకడగా రాణిస్తున్న యువ ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేం భావించాం. అందుకే వైదేహి, సహజలను ఎంపిక చేశాం. వీరిద్దరు కొంత అనుభవం సాధిస్తే మున్ముందు తమ సీనియర్లను దాటి మంచి ఫలితాలు సాధించగలరనే నమ్మకం ఉంది’ అని ఏఐటీఏ ప్రతినిధి నందన్ బల్ వెల్లడించారు. మరో వైపు ఇతర సహాయక సిబ్బందిని కూడా కొత్తగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు కోచ్‌గా ఉన్న విశాల్ ఉప్పల్‌ను తప్పించి అతని స్థానంలో షాలిని ఠాకూర్ చావ్లాను ఎంపిక చేయగా...కోచ్‌గా రాధిక కనిత్కర్ వ్యవహరిస్తుంది. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్లో ఏప్రిల్ 10నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. -
ఇద్దరికి వైరస్... జట్టు మొత్తం వైదొలిగింది
న్యూఢిల్లీ: అయ్యో వైరస్... ఆడనీయవు, అర్హత కానీయవు. టోక్యో ఒలింపిక్స్ వేటలో పడేందుకు క్వాలిఫయింగ్ టోర్నీలో తలపడాల్సిన భారత జూడో జట్టు చివరి నిమిషంలో వైదొలిగింది. కిర్గిజిస్తాన్ దాకా వెళ్లిన 15 మంది సభ్యులు గల భారత జట్టు పోటీలకు దూరమైంది. ఈ బృందంలోని ఇద్దరు ప్లేయర్లు అజయ్, రీతూలకు కరోనా సోకింది. ఈ నెల 4న భారత జట్టు ఆసియా ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు బిష్కెక్ (కిర్గిజిస్తాన్)కు వెళ్లింది. అయితే మొదట 15 మంది జూడోకాలకు, నలుగురు కోచ్‌లకు నిర్వహించిన తొలి పరీక్షల్లో అంతా నెగెటివ్‌గానే బయటపడ్డారు. కానీ టోర్నీకి కాస్త ముందుగా 5న నిర్వహించిన పరీక్షల్లో అజయ్, రీతూ పాజిటివ్ అని తేలింది. కరోనా నేపథ్యంలోని టోర్నీ నిబంధనల ప్రకారం జట్టులో ఏ ఒక్కరికి కోవిడ్ సోకినా... మొత్తం జట్టంతా పోటీల నుంచి తప్పుకోవాలి. -
భారత్‌కు రెండో గెలుపు
దుబాయ్: ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్‌కు రెండో విజయం లభించింది. దక్షిణ కొరియాతో గురవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోసలే 7–5, 6–4తో జాంగ్ సు జియోంగ్ను ఓడించింది. రెండో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 4–6, 0–6తో నా లే హాన్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో సానియా మీర్జా–అంకిత రైనా జంట 6–4, 6–4తో నా లే హాన్–నా రి కిమ్ జోడీపై గెలిచి భారత్ విజయాన్ని ఖాయం చేసింది. -
సిటీ రాకెట్
అందరిలా కాదు శివాని. ఏడేళ్ల వయసులోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాకెట్ పట్టి... కోర్టులోకి దిగి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తోంది. అమ్మానాన్నల ప్రోత్సాహం... కోచ్ సహకారం... వెరసి అద్వితీయ ప్రదర్శనతో అంతర్జాతీయ వేదికలపై నగర కీర్తిని ఘనంగా చాటుతోంది. ఆమె ఆటకు ముచ్చటపడ్డ ఎంపవర్ స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ అందిస్తోంది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఓషియానియా టోర్నీలో మంచి ప్రతిభ కనబరిచి సిటీకి తిరిగి వచ్చిన ఈ ‘జూనియర్ రాకెట్’ను ‘సిటీ ప్లస్’ పలుకరించింది. మేం సిటీకి వచ్చి సెటిలయ్యే నాటికి నా వయసు ఆరేళ్లు. నాన్న శ్రీనివాస్ పోలీస్ ఉద్యోగి కావడంతో మెదక్ జిల్లా సిద్ధిపేట నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చాం. అమ్మ సత్యవతి గృహిణి. సిటీకి వచ్చిన తరువాత నా ధ్యాసంతా టెన్నిస్పైకి మళ్లింది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఏడేళ్లప్పుడు బేగంపేట్ ఏస్ టెన్నిస్ అకాడమీలో తొలిసారి రాకెట్ పట్టా. కోచ్ ప్రవీణ్ భార్గవ్ శిక్షణలో ప్రావీణ్యం సంపాదించా. ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలు ఆడటం మొదలుపెట్టా. నా ప్రతిభను గుర్తించిన ఎంపవర్ స్పోర్ట్స్ చేయూతనిచ్చింది. విదేశాల్లో ఆడే టోర్నీలకు దొడ్లా డెయిరీ ప్రయాణపు ఖర్చులు, ట్రైనింగ్‌కు నిధులు సమకూరుస్తోంది. సక్సెస్ మంత్ర... క్రీడల్లో రాణించాలంటే ఫిట్నెస్ ప్రధానం. ఎలాంటి వాతావరణాన్నయినా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. అందుకు తగ్గట్టే శారీరక వ్యాయామంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవల్సి ఉంటుంది. డ్రైఫ్రూట్స్, ఎనర్జిటిక్ డ్రింక్స్‌కు ప్రాధాన్యమిస్తా. రోజూ ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు ప్రాక్టీసు చేస్తాను. ఉదయం వేళలో ఒక గంట ఫిట్నెస్, రెండు గంటలు టెన్నిస్ ప్రాక్టీసు, మళ్లీ సాయంత్రం వేళలో గంట ఫిట్నెస్, రెండు గంటలు టెన్నిస్ ప్రాక్టీస్. టోర్నీ సమయాల్లో ప్రత్యర్థుల బలబలాలు, ఆటతీరు ఆధారంగా నా శైలిని మార్చుకుంటాను. సిటీలో విక్టరీ... తొలినాళ్లలో సిటీలో జరిగిన వివిధ టోర్నీల్లో పాల్గొన్నా. ఎన్నో సవాళ్లు. అన్నింటినీ అధిగమించి విజయాలు సాధించా. ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలో పాల్గొనే అర్హత సాధించా. 2014 ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో జరిగిన అండర్ 14 సూపర్ సిరీస్ సింగిల్స్, డబుల్స్ విజేతనయ్యా. సిటీతో పాటు వివిధ నగరాల్లో జరిగిన టోర్నీల్లో సత్తాచాటా. అహ్మదాబాద్‌లో అండర్-14 నేషనల్స్ టోర్నీ రన్నర్‌గా నిలవడం లైఫ్‌లో మర్చిపోలేనిది. గతేడాది అండర్ -18 టాటా సిరీస్ నెగ్గా. ఇదేకాదు వివిధ నగరాల్లో జరిగిన టోర్నీల్లోనూ మంచి ప్రతిభ కనబరిచా. దీంతో అండర్ -14 ఇండియా టీమ్‌లో ఆడే అవకాశం దక్కింది. నాతో పాటు చండీఘర్ నుంచి ప్రింకుల్ సింగ్, మహారాష్ట్ర నుంచి మెహత్ జైన్‌కు అవకాశమొచ్చింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఓషియానియా టోర్నమెంట్లో భారత్ తరఫునా ఆడాం. సింగిల్స్‌లో సెమీఫైనల్ వరకు వెళ్లా. తద్వారా ఆసియా జూనియర్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరా. గతంలో దిల్లీలో జరిగిన రోడ్ టూ వింబుల్డన్‌లో ఎంపికైన 16 మందిలో నేను ఒకదాన్ని. త్వరలోనే మళ్లీ దిల్లీలో జరిగే ఇదే టోర్నీలో సత్తా చాటితే వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ జూనియర్ విభాగంలో ఆడే అవకాశం వస్తుంది. దీన్ని అందుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నా. ఐ లైక్ చార్మినార్... టైమ్ దొరికితే పుస్తకాలు చదువుతా. టీవీలో స్పోర్ట్స్ ఎక్కువగా చూస్తుంటా. ఫెదరర్, కిమ్ క్లియ్‌స్టర్స్ నాకు ఇష్టమైన క్రీడాకారులు. బంజారాహిల్స్ మెరిడియన్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నా. చార్మినార్ నచ్చిన స్పాట్. వీఎస్