Wimbledon 2022: Rafael Nadal Pulls Out Of Tourney Ahead Semi-Final - Sakshi
Sakshi News home page

Rafael Nadal: సెమీస్‌ నుం‍చి తప్పుకొన్న నాదల్‌.. టోర్నీ నుంచి అవుట్‌ 

Published Fri, Jul 8 2022 8:03 AM | Last Updated on Fri, Jul 8 2022 8:40 AM

Wimbledon 2022: Rafael Nadal Pulls Out Of Tourney Ahead Semis - Sakshi

రాఫెల్‌ నాదల్‌(PC: Wimbledon Twitter )

Rafael Nadal: పొత్తి కడుపు గాయంతో బాధపడుతున్న స్పానిష్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ వింబుల్డన్‌ సెమీఫైనల్‌ నుంచి తప్పుకున్నాడు. క్వార్టర్స్‌లో కూడా గాయంతోనే బాధపడుతూ ఆడిన అతనికి కండరాల్లో  7 మిల్లీమీటర్ల చీలిక వచ్చినట్లు తేలింది. దీంతో సెమీస్‌ ఆడరాదని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో దాంతో నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా) ఫైనల్‌కు చేరుకు న్నాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి జరిగే మరో సెమీస్‌లో జొకోవిచ్‌ (సెర్బియా)తో నోరీ (బ్రిటన్‌)తో తలపడతాడు.  ఇందులో గెలిచిన ఆటగాడు కిరియోస్‌తో తుదిపోరులో అమీతుమీ తేల్చుకుంటాడు. కాగా గతంలో నాదల్‌ రెండుసార్లు టైటిల్‌ గెలిచిన విషయం తెలిసిందే.

చదవండి: IND vs ENG 1st T20: హార్దిక్‌ ఆల్‌రౌండ్‌ షో.. టీమిండియా ఘన విజయం

<

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement