Billie Jean King Cup: India Tennis Team Lost To China - Sakshi
Sakshi News home page

Billie Jean King Cup: భారత్‌కు రెండో ఓటమి 

Apr 14 2022 9:55 AM | Updated on Apr 14 2022 10:48 AM

Billie Jean King Cup Asia: India Tennis Team Lost To  China - Sakshi

అంకిత రైనా

Billie Jean King Cup- అంటాల్యా (టర్కీ): బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. తొలి రోజు జపాన్‌ చేతిలో 0–3తో ఓడిపోయిన టీమిండియా... రెండో రోజు చైనాతో జరిగిన మ్యాచ్‌లోనూ 0–3తో పరాజయం పాలైంది.

తొలి సింగిల్స్‌లో రియా భాటియా 1–6, 3–6తో లిన్‌ జూ (చైనా) చేతిలో... రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 319వ ర్యాంకర్‌ అంకిత రైనా 4–6, 2–6తో ప్రపంచ 97వ ర్యాంకర్‌ కియాంగ్‌ వాంగ్‌ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. నామమాత్రమైన డబుల్స్‌ మ్యాచ్‌లో సౌజన్య బవిశెట్టి–రుతుజా బోస్లే జోడీ 5–7, 1–6తో జు యిఫాన్‌– జావోజువాన్‌ యాంగ్‌ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.

చదవండి: IPL 2022: ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement