ఏడో సీడ్‌పై నిశేష్‌ సంచలన విజయం | Nishesh sensational victory over the seventh seed | Sakshi
Sakshi News home page

ఏడో సీడ్‌పై నిశేష్‌ సంచలన విజయం

May 29 2024 4:08 AM | Updated on May 29 2024 4:08 AM

Nishesh sensational victory over the seventh seed

లిటిల్‌ రాక్‌ ఓపెన్‌ ఏటీపీ–75 చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో తెలుగు సంతతికి చెందిన అమెరికా యువతార నిశేష్‌ బసవ రెడ్డి సంచలన విజయం సాధించాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 19 ఏళ్ల నిశేష్‌ 7–5, 6–4తో ఏడో సీడ్, ప్రపంచ 252వ ర్యాంకర్‌ ఈథన్‌ క్విన్‌ (అమెరికా)పై నెగ్గాడు. 

93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిశేష్‌ ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు.  ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన నిశేష్‌ తల్లిదండ్రులు 1999లో అమెరికాకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement