
సాక్షి, హైదరాబాద్: అబీర్టో టాంపికో ఓపెన్ డబ్ల్యూటీఏ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్, తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో సహజ పరాజయం పాలైంది.
టాప్ సీడ్, ప్రపంచ 97వ ర్యాంకర్ నూరియా పారిజా దియాజ్ (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 284వ ర్యాంకర్ సహజ 5–7, 4–6తో ఓటమి చవిచూసింది. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది.