
ట్రోఫీతో కెనడా ప్లేయర్లు (PC: Davis Cup)
Davis Cup- ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ డేవిస్‌కప్‌లో కెనడా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. స్పెయిన్‌లో జరిగిన ఫైనల్లో కెనడా 2–0తో ఆస్ట్రేలియాపై గెలిచింది. తొలి సింగిల్స్‌లో షపోవలోవ్ 6–2, 6–4తో కొకినాకిస్‌పై నెగ్గాడు.
ఇక రెండో సింగిల్స్‌లో ఫెలిక్స్ అలియాసిమ్ 6–3, 6–4తో అలెక్స్ డిమినార్‌ను ఓడించి 122 ఏళ్ల డేవిస్‌కప్ చరిత్రలో కెనడాకు తొలిసారి టైటిల్ అందించాడు. 2019లో కెనడా ఫైనల్‌కు చేరినా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
Take a bow, @denis_shapo 🤯🤩
— Davis Cup (@DavisCup) November 28, 2022
Was this the shot of the #Final8? 💫#DavisCup #byRakuten | @TennisCanada pic.twitter.com/96vU0TU7AW
చదవండి: కామెరూన్‌ను కాపాడిన అబుబాకర్
దోహా: కామెరూన్ స్ట్రయికర్ విన్సెంట్ అబుబాకర్ సెర్బియా గెలుపురాతను మార్చేశాడు. 3–1తో సెర్బియా గెలుపుబాట పట్టిన దశలో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ అబుబాకర్ ఒక గోల్ చేయడంతో పాటు మరో గోల్‌కు తోడయ్యాడు. దీంతో గ్రూప్ ‘జి’లో సోమవారం సెర్బియా, కామెరూన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ చివరకు 3–3 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది.
సెర్బియా తరఫున పావ్లోవిచ్ (45+1వ ని.లో), మిలింకోవిచ్ (45+3వ ని.లో), మిత్రోవిచ్ (53వ ని.లో) గోల్ చేశారు. కామెరూన్ తరఫున క్యాస్టె లెటో (29వ ని.లో), అబుబాకర్ (63వ ని.లో), మోటింగ్ (66వ ని.లో) గోల్ సాధించారు. ర్యాంకింగ్, ఆటతీరు పరంగా కామెరూన్ కంటే సెర్బియా గట్టి ప్రత్యర్థి. ఇందుకు తగ్గట్లే తొలి అర్ధభాగాన్ని 2–1తో ముగించింది.
రెండో అర్ధభాగం మొదలైన కాసేపటికే మిత్రోవిచ్ గోల్ చేయడంతో 3–1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో మైదానంలోకి వచ్చిన విన్సెంట్ సెర్బియాకు కొరకరాని కొయ్యగా మారాడు. 63వ నిమిషంలో గోల్ చేసిన అతను మూడు నిమిషాల వ్యవధిలో మోటింగ్ గోల్ చేసేందుకు సాయపడ్డాడు.
చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8!
FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్