భారత్‌కు తొలి ఓటమి | First defeat for the Indian team | Sakshi
Sakshi News home page

భారత్‌కు తొలి ఓటమి

Apr 11 2024 10:09 AM | Updated on Apr 11 2024 10:09 AM

First defeat for the Indian team - Sakshi

చాంగ్షా (చైనా): బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా జోన్‌ మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. పటిష్టమైన చైనా జట్టుతో బుధవారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 0–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సహజ యామలపల్లి 2–6, 3–6తో ప్రపంచ 43వ ర్యాంకర్‌ జిన్‌యు వాంగ్‌ చేతిలో... రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 0–6, 0–6తో ప్రపంచ 7వ ర్యాంకర్‌ క్విన్‌వెన్‌ జెంగ్‌ చేతిలో ఓడిపోయారు.

మూడో మ్యాచ్‌లో రుతుజా భోస్లే–ప్రార్థన ద్వయం 1–6, 1–6తో హాన్‌యు గువో–జియు వాంగ్‌ జోడీ చేతిలో పరాజయం పొందడంతో భారత ఓటమి ఖరారైంది. నేడు జరిగే మూడో మ్యాచ్‌లో చైనీస్‌ తైపీతో భారత్‌ ఆడుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement