![WTA250 Chennai Open: All Indians lose in Frisrt round - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/11/Untitled-1_0.jpg.webp?itok=dhES3Uyq)
చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణులకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్‌లో బరిలోకి దిగిన ఐదుగురు ప్లేయర్లు సౌజన్య బవిశెట్టి, లక్ష్మీ ప్రభ, రియా భాటియా, రుతుజా భోస్లే, సాయి సంహిత తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. శనివారం చెన్నైలో జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య 4–6, 0–6తో క్యోకా ఒకమురా (జపాన్) చేతిలో ఓడిపోయింది.
ఇతర మ్యాచ్‌ల్లో లక్ష్మీ ప్రభ 4–6, 1–6తో యుకీ నైటో (జపాన్) చేతిలో... సంహిత 1–6, 0–6తో నావో హిబినో (జపాన్) చేతిలో... రియా 4–6, 0–6తో మికుల్‌స్కైటీ (లిథువేనియా) చేతిలో... రుతుజా 3–6, 2–6తో ఎన్‌షువో లియాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. భారత్‌కే చెందిన అంకిత రైనా, కర్మన్‌కౌర్‌లకు మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు వైల్డ్ కార్డు కేటాయించారు.
చదవండి: US Open 2022: ‘నంబర్‌వన్’ సమరం
Comments
Please login to add a commentAdd a comment