
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు కారణంగా పతకం కోల్పోయిన ఫోగాట్.. సోమవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్ వద్ద ఆమెకు అభిమానులు, మద్దతుదారులు ఆపూర్వ స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ వ్యాన్‌లో ర్యాలీగా ఆమెను ఊరేగించారు. ఈ సందర్భంగా వినేశ్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమైంది. ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, రెజర్లు సాక్షిమలిక్, బజరంగ్ పునియా తదితరులు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా 55 కేజీల విభాగంలో ఫైనల్‌కు ముందు 100 గ్రాములు అదనపు బరువు కారణంగా అనర్హతకు ఫోగాట్ గురైంది. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో అప్పీలు చేసినా సానుకూలంగా ఫలితం దక్కలేదు. ఆమె అభ్యర్ధనను స్పోర్ట్స్ కోర్డు కొట్టిపారేసింది.
#WATCH | Indian wrestler Vinesh Phogat receives a warm welcome at Delhi's IGI Airport
Congress MP Deepender Hooda, wrestlers Bajrang Punia, Sakshee Malikkh and others welcomed her. pic.twitter.com/rc2AESaciz— ANI (@ANI) August 17, 2024