
Courtesy: IPL Twitter
Virat Kohli Six Out Of Stadium.. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి అర్థ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి కొట్టిన సిక్స్ ఒకటి స్టేడియం అవతల పడడం విశేషం. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వచ్చిన ఆ సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్ నాలుగో బంతిని శార్దూల్ గుడ్‌లెంగ్త్‌తో వేశాడు. అయితే కోహ్లి డీప్ మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. అంతే మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అన్న రీతిలో కోహ్లి శార్దూల్‌కు ఒక లుక్ ఇచ్చాడు.
చదవండి: Kohli- Dhoni: ఏంటి కోహ్లి..మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా వదలవా!
ఇక మ్యాచ్‌లో సీఎస్‌కే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సీఎస్‌కే ఓపెనర్లు డుప్లెసిస్, రుతురాజ్ మంచి ఆరంభాన్ని ఇవ్వగా.. మొయిన్ అలీ, అంబటి రాయుడులు ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆఖర్లో ధోని, రైనాలు కలిసి ఫినిషింగ్ టచ్ ఇస్తూ జట్టుకు విజయాన్ని అందించారు.
— Simran (@CowCorner9) September 24, 2021