
Babar Azam bowls for the first time in international cricket: ఢాకా వేదికగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ రెండో టెస్ట్‌లో అసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం బౌలింగ్ వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా అంతర్జాతీయ స్ధాయిలో బాబర్ బౌలింగ్ చేయడం ఇదే తొలి సారి. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 26వ ఓవర్ బౌలింగ్ చేసిన బాబర్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా బాబర్ బౌలింగ్‌లో బంగ్లా బ్యాటర్ తైజుల్ ఇస్లాం క్యాచ్‌ను స్లిప్ ఫీల్డర్ జారవేయడంతో తృటిలో తొలి వికెట్‌ను చేజార్చుకున్నాడు.
కాగా బాబర్ లిస్ట్ -ఏ కేరిర్‌లో 12 వికెట్లు సాధించాడు. ఇక బాబర్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఏంటి బాబర్..నీకు బౌలింగ్ కూడా వచ్చా? అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ విజయానికి చేరువలో ఉంది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 300-4 వద్ద డిక్లేర్ చేయగా, బంగ్లాదేశ్ కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో స్పిన్నర్ సాజిద్ ఖాన్ ఒక్కడే 8 వికెట్లు పడగొట్టాడు. కాగా ఫాలోఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ తడబడుతుంది.
Babar Azam's 1st Over of his
— School Education Department & Government of Pak (@SedCorners) December 8, 2021
International Cricket Career.
Babar Azam So Beautiful Bowling@babarazam258 #PAKvBAN #Pakistan #CricketTwitter pic.twitter.com/h9U6nqhSAS