
సంప్రదాయమైన టెస్టు మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఏ జట్టైనా పూర్తి తెలుపు జెర్సీతోనే బరిలోకి దిగడం ఆనవాయితీ. అయితే తాజాగా టీమిండియా టెస్టు క్రికెట్ రూల్‌ను బ్రేక్ చేసింది. టెస్టుల్లో ఎప్పుడు తెల్ల జెర్సీతోనే ఆడిన టీమిండియా బంగ్లాదేశ్‌తో తొలిటెస్టులో మాత్రం సగం వైట్ జెర్సీతో(ముదురు గోదుమ రంగు) బరిలోకి దిగింది.
మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే భారత అభిమానులు ఈ విషయాన్ని గుర్తించి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. అయితే బీసీసీఐ జెర్సీ రంగును ఎందుకు మార్చిందనే దానిపై క్లారిటీ లేదు. కానీ టీమిండియా ఫ్యాన్స్ మాత్రం.. టీమిండియాను పాత వైట్ జెర్సీల్లోనే చూడాలని ఉందని.. ఇలా రంగు మారిస్తే మిగతా జట్లకు.. మనకు తేడా కనిపిస్తుందని.. కొత్త జెర్సీ స్థానంలో పాతవాటినే తిరిగి తేవాలని డిమాండ్ చేయడం కొసమెరుపు.
ఇక బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో అజేయంగా ఆడుతున్నాడు. పుజరా 90 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో రిషబ్ పంత్(46), శ్రేయాస్ అయ్యర్(82 నాటౌట్)తో కలిసి పుజారా మంచి భాగస్వామ్యాలు నిర్మించాడు. ముఖ్యంగా అయ్యర్, పుజారాలు కలిసి ఏదో వికెట్‌కు 149 పరుగులు జోడించారు. వీరిద్దరి ఇన్నింగ్స్‌తోనే టీమిండియా తొలిరోజు ఆట సవ్యంగా సాగింది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ 2, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.
India's jersey has changed from pure white to off-white? 🤔
— Naman Agarwal (@CoverDrivenFor4) December 14, 2022
చదవండి: FIFA WC: సెమీ ఫైనల్.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ
IND Vs BAN: రాణించిన పుజారా, శ్రేయస్.. పర్వాలేదనిపించిన పంత్