
15 నుంచి సముద్రంలో వేట నిషేధం
అరసవల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారం సముద్ర జలాల్లో ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి రానుందని, జూన్ 14 అర్ధరాత్రి 12 గంటల వరకు నిషేధాంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ శనివారం ప్రకటించారు. నిషేధ కాలంలో వేటకు వెళ్లడం నేరంగా పరిగణిస్తారని, మత్స్యకారులు ఈ నిబంధనలను పాటించాలని కోరారు. కోస్టల్ ప్రాంతాల్లో గస్తీ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
పవర్ ప్లాంట్ చిమ్నీ కూల్చివేత
సంతబొమ్మాళి: మండలంలోని కాకరాపల్లి తంపరలో ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ యాజమాన్యం నిర్మించిన 173 మీటర్ల ఎత్తయిన చిమ్నీ (పొగ గొట్టం)ను బాంబులు పెట్టి శనివారం సాయంత్రం కూల్చివేశారు. 2009–2011 మధ్య ఈ చిమ్నీ నిర్మాణం చేపట్టారు. 2011 ఫిబ్రవరి 28న ఉద్యమకారులపై పోలీసు కాల్పులు జరపడం, ముగ్గురు చనిపోవడంతో పవర్ ప్లాంట్ నిర్మాణాలకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు 14 ఏళ్ల తర్వాత సంబంధిత లీజుదారు చిమ్నీని కూల్చివేశారు. దీని కోసం కలెక్టర్, ఎస్పీ నుంచి అనుమతి తీసుకొని ఎక్జూలివ్ యాక్ట్ ప్రకారం క్లోజ్ ద్వారా కంట్రోల్ బ్లాస్టింగ్ చేయించారని డీటీ హరి తెలిపారు.