Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Cabinet transfer of lands worth Rs 3,000 crore to anonymous company1
కేంద్ర సంస్థలకు రూ.కోట్లలో..'ఉర్సాకు ఊరికే'!

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర సంస్థలకైతే ఎకరా రూ.4 కోట్లు.. ఆర్మీకైనా సరే కోటికి తగ్గేది లేదు..! ఉర్సాకైతే ఊరికే! ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? ఊరూ పేరు లేని కంపెనీపై ఔదార్యం వెనుక గుట్టు ఏమిటి? ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు ఏర్పాటవుతుంటే ఏ ప్రభుత్వమైనా స్వాగతించి వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి భూముల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తుంది! కానీ.. ప్రముఖ కేంద్ర సంస్థల నుంచి ఎకరా రూ.నాలుగు కోట్ల చొప్పున వసూలు చేస్తూ.. ఊరూ పేరు లేని ఓ డొల్ల కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్లకుపైగా విలువ చేసే అత్యంత విలువైన దాదాపు 60 ఎకరాలను ఎకరా 99 పైసలకే కట్టబెట్టడం నాకింత.. నీకింత లాంటి లాలూచీ వ్యవహారాలకు పరాకాష్ట! పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలకు గతంలో చంద్రబాబు సర్కారు అమరావతిలో ఎకరా రూ.4 కోట్లు చొప్పున భూములను కేటాయించింది. హడ్కో, ఎల్‌ఐసీ, గెయిల్, ఎఫ్‌సీఐ, ఆర్బీఐ, ఎస్‌బీఐ, విజయా బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, రైల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనమిక్‌ సర్వీస్‌ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లు చొప్పున భూ కేటాయింపులు చేశారు. చివరకు దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్‌ ఆర్మీకి సైతం ఎకరా రూ.కోటి చొప్పున భూమిని కేటాయించడం గమనార్హం. ఇలా కేంద్ర, జాతీయ సంస్థలకు భూములిచ్చినందుకు భారీగా వసూలు చేస్తూ ఊరూ పేరు లేని అనామక ఉర్సా కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్ల విలువైన 59.86 ఎకరాల ఖరీదైన భూమిని అత్యంత కారు చౌకగా కట్టబెడుతూ తన బంధువులు, బినామీలు, సన్నిహితులకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడంలో చేతికి ఎముకే లేదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు మాత్రం మార్కెట్‌ ధరను తెరపైకి తేవడం.. బంధుగణం, బినామీలకు మాత్రం కారుచౌకగా ప్రభుత్వ భూములను రాసిచ్చేయడం సీఎం చంద్రబాబుకు రివాజు అని పారిశ్రామికవేత్తలు, అధికార వర్గాలే స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ తనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీ రావుకు చెందిన బోగస్‌ కంపెనీ ఐఎంజీ భారత్‌కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు.. శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో 450 ఎకరాల భూమిని కేటాయించడం చంద్రబాబు భూ సంతర్పణకు పరాకాష్టగా పేర్కొంటున్నారు. విభ­జన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను కొనసాగించారని ప్రస్తావిస్తున్నారు. భూ పందేరానికి ఆధారాలివిగో.. నారా లోకేశ్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్‌ తండ్రి ఎం.పట్టాభిరామారావుకు చెందిన వీబీసీ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన 498.93 ఎకరాల భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయిస్తూ 2015 జూలై 15న నాటి చంద్రబాబు సర్కార్‌ ఉత్తర్వులు (జీవో ఎంఎస్‌ నెంబరు 269) జారీ చేసింది. బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఆ భూముల విలువ అప్పట్లోనే రూ.498 కోట్లు. ఆ తర్వాత ఆ భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోకి తెస్తూ 2015 సెపె్టంబరు 22న ఉత్తర్వులు (జీవో ఎంస్‌ నెంబరు 207) జారీ చేయడం ద్వారా వాటి విలువను మరింతగా పెంచుకున్నారు. సత్తా లేని సంస్థకు సంతర్పణ..! జనసేన, బీజేపీతో జట్టుకట్టి 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన బంధువులు, సన్ని­హి­తులు, బినామీలకు ప్రభుత్వ భూములను ఇష్టారీతిన ధారాదత్తం చేస్తున్నారు. ఊరూ పేరూ లేని ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విశాఖలోని ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు.. ఎకరం కేవలం 99 పైసలకే కేటాయించడమే అందుకు నిదర్శనం. వాస్తవంగా ఆ భూముల విలువ రూ.3 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేవలం రెండు నెలల క్రితం ఏర్పాటైన కంపెనీకి రూ.5,278 కోట్ల పెట్టుబడి పెట్టి డేటా సెంటర్‌ ప్రాజెక్టును నెలకొల్పే సామర్థ్యం ఉందా.. లేదా? అన్నది పరిశీలించుకోకుండా భూ కేటాయింపులు చేశారంటే.. ఆ సంస్థ ఎవరి బినామీలదో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర సంస్థలకు మార్కెట్‌ ధరకే.. విశాఖలో గతంలో టీడీపీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మార్కెట్‌ ధరకే భూమిని కేటాయించారు. కీలకమైన నావికాదళ స్థావరం ఏర్పాటుకు ఇండియన్‌ నేవీతో పాటు ఎన్‌టీపీసీ విద్యుత్‌ ప్లాంటుకు కూడా మార్కెట్‌ ధరకే భూమి ఇచ్చారు. దీనికి భిన్నంగా ఉర్సాకు విశాఖలో అత్యంత ఖరీదైన ఐటీ పార్కులో 3.5 ఎకరాలతో పాటు కాపులుప్పాడలో ఏకంగా 56.36 ఎకరాలను కేటాయించేందుకు టీడీపీ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉర్సా కంపెనీ గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని నివాస ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాటు అడ్రస్‌తో ఏర్పాటు కాగా ‘ఎక్స్‌’ ఖాతాలో ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక పోస్టు పెట్టింది. అది కూడా భూ కేటాయింపులపై విమర్శల నేపథ్యంలో వివరణ ఇస్తూ చేసిన పోస్టు మాత్రమే. ఇక ఈ ఖాతాను కేవలం ఒకే ఒక్కరు ఫాలో అవుతుండటం గమనార్హం. దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రక్షణ వ్యవస్థలో భాగ­స్వామిగా ఉన్న ఇండియన్‌ నేవీకి కూడా మార్కెట్‌ ధరకే భూమిని కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఉర్సాకు మాత్రం నామమాత్ర ధరకే సంతర్పణ చేయడం వెనుక భారీ వ్యవహారమే ఉందనే ఆరోపణలున్నాయి. విశాఖలోని కీలకమైన ఏపీ సెజ్‌లో ఎకరా ధర లీజు రూ.35 లక్షల మేర పలుకుతోంది. ఏ సంస్థకు భూమి కావాలన్నా ఇదే ధర చెల్లించి భూమిని లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ సంస్థ కార్యాలయం నిర్మాణం కోసం అనకాపల్లిలోని రాజుపాలెం వద్ద మార్కెట్‌ ధర మేరకు ఎకరా రూ.80 లక్షల చొప్పున సర్వే నెంబరు 75/3లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 25 జనవరి 2016న టీడీపీ సర్కారు 326/2016 జీవోను జారీ చేసింది. నిబంధనలు ఏం చెబుతున్నాయి?2012లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు (జీవో నెంబరు 571– 14–9–2012) ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో.. మార్కెట్‌ విలువ మీద వార్షిక లీజు రెంటల్‌ పది శాతం కంటే తక్కువ ఉండకూడదు. లీజును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్‌æ ధర ఆధారంగా సవరించాలి. విశాఖలో టీసీఎస్‌తో పాటు ఉర్సాకు ఇవ్వనున్న భూమి రిజిస్ట్రేషన్‌ ధరల మేరకే చదరపు గజం రూ. 30 వేల వరకు ఉంది. ఇక మార్కెట్‌ ధరను గనుక తీసుకుంటే రూ.లక్ష వరకూ పలుకుతోంది. ఇంత విలువైన భూమిని ఊరూ పేరు లేని ఉర్సాకు ఎకరం 99 పైసలకే ఇచ్చేందుకు టీసీఎస్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి కథ నడిపినట్లు స్పష్టమవుతోంది.

Kuppam Municipal Chairman Election Updates2
కుప్పం మున్సిపల్‌ చైర్మైన్‌ ఎన్నిక.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల రాక

కుప్పం మున్సిపల్‌ చైర్సన్‌ ఎన్నికల అప్‌డేట్స్‌..కుప్పంలో 144 సెక్షన్‌నేడు ఉదయం 11 గంటలకు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికబెంగళూరు క్యాంపు నుంచి వైఎస్సార్‌సీపీ పార్టీ కౌన్సిలర్లతో కుప్పంకు ట్రైన్‌లో బయలుదేరిన ఎమ్మెల్సీ భరత్కుప్పం రైల్వేస్టేషన్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు పోలీస్ భద్రతతో రానున్న కౌన్సిలర్లుఎమ్మెల్సీ భరత్ ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశంబెంగళూరు క్యాంపు నుంచి వస్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు బందోబస్తు కల్పించాలని హైకోర్టు ఆదేశాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 మంది కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన రెండో వార్డు కౌన్సిలర్ మునిరాజా ఈరోజు కుప్పంలో 144 సెక్షన్ అమలు..పోలీసుల కనుసన్నల్లోనే కుప్పంమున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులుఅడిషనల్ ఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, ఐదు మంది సీఐలు, ఏడుగురు ఎస్సై లు, కానిస్టేబుల్స్, 92 మందితో మున్సిపల్ ఎన్నికలు గుంటూరు..నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికబలం లేకపోయినా మేయర్ అభ్యర్థి నిలబెట్టిన కూటమి ప్రభుత్వంగుంటూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 57 డివిజన్లువైఎస్సార్‌సీపీ-46, టీడీపీ-9, జనసేన-2 స్థానాల్లో గత ఎన్నికల్లో విజయంవైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన నాయకులుఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టి తమ వైపుకు తిప్పుకున్న కూటమి నేతలువైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు కూటమి నేతలు ప్రలోభాలు, బెదిరింపులుకార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్న కూటమి నేతలుమేయర్ ఎన్నికల్లో విప్ జారీచేసిన వైఎస్సార్‌సీపీ..అచ్చాల వెంకటరెడ్డిని మేయర్ అభ్యర్థిగా ఎన్నుకున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు 👉ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో దౌర్జన్యం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వైఎస్సార్‌సీపీకి సంఖ్యా బలం అధికంగా ఉన్నప్పటికీ.. ప్రలోభాలు, దౌర్జన్యాలతో ఎలాగైనా సరే ఆ పదవిని చేజిక్కించుకోవడానికి టీడీపీ బరితెగించింది. కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.👉వైఎస్సార్‌సీపీకి చెందిన డా. సుధీర్‌ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్‌పర్సన్‌ పదవితో పాటు కౌన్సిలర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం 25 వార్డులకు గాను వైఎస్సార్‌సీపీ 19, టీడీపీ కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సుధీర్‌ రాజీనామా చేసినప్పటికీ 18 మందితో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయినప్పటికీ టీడీపీ ‘ముఖ్య’ నేత సూచన మేరకు ఆ పార్టీ నేతలు కొందరు బరితెగిస్తూ నేరుగా రంగంలోకి దిగారు. బెదిరింపులు, తాయిలాలతో కౌన్సిలర్లను దారిలోకి తెచ్చుకుని చైర్మన్‌ గిరీ కొట్టేయాలని కుట్రకు తెరతీశారు. నేడు విశాఖ, గుంటూరు మేయర్ల ఎన్నిక👉అలాగే.. విశాఖపట్నం, గుంటూరు నగర మేయర్‌ పదవులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు మున్సిపాలిటీలలో మొత్తం తొమ్మిది పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కుప్పం, తుని, పాలకొండలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులకు.. మాచర్ల, తాడిపత్రి (2), తునిలో వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఈనెల 22న నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

China Closely Following India-Pakistan Situation3
భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్‌లోకి చైనా

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇందులో భాగంగా పాకిస్తాన్‌ విషయంలో భారత్‌ పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌- పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలని చైనా భావిస్తోంది అంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి చెప్పుకొచ్చారు.తాజాగా చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఈ క్రమంలో వాంగ్‌ యీ మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌, భారత్‌ మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్‌ భావిస్తోంది. పరస్పరం ముందుకు సాగాలని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తోంది’ అని చెప్పినట్లు చైనా మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు వ్యవహారంలో రష్యా, చైనాలు జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్‌ కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ‘ఈ ఘటన దర్యాప్తు విషయంలో రష్యా, చైనా లేదా పశ్చిమ దేశాలు సానుకూల పాత్ర పోషించగలవు. భారత్‌, మోదీ అబద్ధం చెబుతున్నారా? లేదా.. పాకిస్తాన్‌ నిజం చెబుతుందా? అనేది వెలికితీసేందుకు దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు’ అని కథనాలు వెలువడ్డాయి.China breaks its silence on the ongoing tensions between India and Pakistan.Chinese Foreign Minister Wang Yi spoke with Pakistan’s Deputy PM Ishaq Dar today and said that China supports Pakistan in safeguarding its sovereignty and security interests. pic.twitter.com/wIUt1Yz0UJ— Salt News (@SaltNews_) April 27, 2025మరోవైపు.. పహల్గాంలో ఉగ్ర దాడిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ ఖండించారు. ఈ విషయంలో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న బెదిరింపులను ఈ దాడి గుర్తు చేసిందని పేర్కొన్నారు. దాడి అనంతరం భద్రతా దళాలు స్పందించిన తీరును ప్రశంసించారు. ‘కశ్మీర్‌లో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన వారికి ఎఫ్‌బీఐ సంతాపం తెలుపుతోంది. భారత్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.పహల్గాం ఉగ్ర దాడిని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ ఖండించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి ప్రాంతీయ సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి తాను ఫోన్‌ చేసి దాడిని ఖండించినట్లు ఆయన ప్రకటించారు. పహల్గాం దుర్ఘటనలను ఈ ప్రాంతంలోని దేశాలు ఉమ్మడి బాధ్యతగా తీసుకుని స్పందించాలని సూచించారు. ఇరాన్‌లో పర్యటించాలని ప్రధాని మోదీకి ఆయన ఆహ్వానం పలికారు.

IPL 2025: Virat Kohli Adds Meaning To Chase Master Title4
IPL 2025: మరోసారి 'ఆ బిరుదుకు' సార్థకత చేకూర్చిన విరాట్‌ కోహ్లి

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి హవా కొనసాగుతుంది. నిన్న (ఏప్రిల్‌ 27) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ చేసిన అతను.. లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా అవతరించాడు. ఈ సీజన్‌లో విరాట్‌ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 6 అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద సెంచరీలు ఛేజింగ్‌లో చేసినవే కావడం విశేషం.ఫార్మాట్‌ ఏదైనా విరాట్‌కు ఛేజింగ్‌ మాస్టర్‌గా బిరుదు ఉంది. ఆ బిరుదుకు విరాట్‌ మరోసారి సార్థకత చేకూర్చాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ ఛేజింగ్‌కు దిగిన నాలుగు సందర్భాల్లో విరాట్‌ 4 అర్ద సెంచరీలు చేసి తన జట్టును గెలిపించాడు. ఇందులో మూడు సార్లు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించినా విరాట్‌లో ఇంకా చేవ తగ్గలేదు.బ్యాటర్‌గా సూపర్‌ ఫామ్‌లో ఉండటమే కాకుండా తన జట్టును దాదాపు ప్రతి మ్యాచ్‌లో గెలిపిస్తున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో విరాట్‌ విఫలమైన మ్యాచ్‌ల్లో మాత్రమే ఆర్సీబీ ఓడింది. విరాట్‌ 30కి పైగా స్కోర్‌ చేసిన ప్రతి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. అంతలా విరాట్‌ ఈ యేడు ఆర్సీబీ విజయాలను ప్రభావితం చేస్తున్నాడు. ప్రస్తుతం విరాట్‌ను చూస్తుంటే కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.ఇదే జోరును అతను మరో ఐదారు మ్యాచ్‌లు కొనసాగిస్తే ఆర్సీబీ ఈసారి టైటిల్‌ గెలవడం ఖాయం. ఆర్సీబీ ఈ సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనంత జోష్‌లో కనిపిస్తుంది. జట్టులో అందరూ రాణిస్తున్నారు. కెప్టెన్‌గా పాటిదార్‌ తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు. కోహ్లి భీకర ఫామ్‌లో ఉన్నాడు. బౌలర్లలో హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కృనాల్‌ ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొడుతున్నాడు. పడిక్కల్‌, టిమ్‌ డేవిడ్‌ ఇరగదీస్తున్నారు.పాటిదార్‌ బ్యాటర్‌గా ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. జితేశ్‌ శర్మ, రొమారియో షెపర్డ్‌కు తమను తాము నిరూపించుకునే అవకాశం రాలేదు. యువ స్పిన్నర్‌ సుయాశ్‌ శర్మ వికెట్లు తీయలేకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నాడు. పేసర్‌ యశ్‌ దయాల్‌ నాట్‌ బ్యాడ్‌ అనిపిస్తున్నాడు.విరాట్‌ ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌గా ఎవరూ సెట్‌ కాకపోవడమే ప్రస్తుతం ఆర్సీబీ వేధిస్తున్న ఏకైక సమస్య. సాల్ట్‌ ఓ మ్యాచ్‌లో మెరిసినా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జేకబ్‌ బేతెల్‌ను ప్రయోగించినా అతను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఒక్క సమస్యను పక్కన పెడితే ఈ సీజన్‌లో ఆర్సీబీ టైటిల్‌ ఫేవరెట్లలో ముందు వరుసలో ఉంది. కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్‌వుడ్‌ 2, యశ్‌ దయాల్‌, కృనాల్‌ తలో వికెట్‌ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (41), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్‌ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్‌ (47 బంతుల్లో 51; 4 ఫోరు​), కృనాల్‌ (47 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్‌ తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్‌ డేవిడ్‌ (5 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ‌ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటిన కృనాల్‌ పాండ్యాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) సీఎస్‌కేతో (బెంగళూరులో) తలపడనుంది.

Pakistan Violates Ceasefire Across Line Of Control5
LoC వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. దీటుగా బదులిచ్చిన భారత్

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో పాక్‌ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎల్‌వోసీ వెంబడి పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడింది. కుప్వారా, పూంచ్‌లో భారత భద్రతా బలగాలపై కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌పై అంతే దీటుగా బదులిచ్చింది. మరోవైపు, పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్‌ స్పందించింది. భారత్ - పాకిస్తాన్ మధ్య జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని సరిహద్దును వేరు చేసే సైనిక నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద పాక్‌ వరుసగా నాలుగు రోజుల నుంచి సీజ్‌ ఫైర్‌ నిబంధల్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోంది. ఏప్రిల్‌ 27,28వ తేదీలలో కుప్వారా,పూంచ్‌ జిల్లాలో ఎల్‌వోసీ వద్ద పాక్‌ సైన్యం భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. భారత సైన్యం అదే రీతిలో వేగంగా బదులిచ్చింది’ అని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.ఏప్రిల్‌ 22న పహల్గాంలో పాక్‌ ఉగ్రవాదులు 26మంది టూరిస్టులపై కాల్పులు జరిపి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. ఈ దాడి జరిపింది పాక్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థకు లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని తేలింది. అందుకు తగ్గ ఆధారాల్ని సైతం భారత దర్యాప్తు సంస్థలు సేకరించాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎలోవోసీ వెంబడి పాక్‌ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని భారత సైన్యం వెల్లడించింది.

Limitations of depositing cash in bank account6
బ్యాంకులో క్యాష్‌ వేస్తున్నారా..? జాగ్రత్త!!

నగదు .. అంటే కరెన్సీ నోట్లను బ్యాంకు అకౌంటులో జమచేయడం మీద ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. » పాన్‌ నెంబర్‌ వేయకుండా, అంటే అవసరం లేకుండా ఒక వ్యవహారంలో రూ.50,000 దాటకుండా డిపాజిట్‌ చేయవచ్చు. » అలా అని ఒకరోజు మొత్తంలో రూ. 2 లక్షలు దాటి తీసుకోరు. » ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు డిపాజిట్లు చేసారంటే మీరు జాగ్రత్త పడాలి.ఈ పరిమితిని ఒక ఆంక్షలాగే భావించాలి. మొదటగా పాన్‌ నెంబర్‌ ఇవ్వాలి. అంతేకాకుండా సదరు బ్యాంకు బ్రాంచి ఏ పొదుపు ఖాతాలో నగదుగా రూ.10 లక్షలు, అంతకన్నా ఎక్కువగా డిపాజిట్‌ అయ్యిందో, వారి అకౌంటు వివరాలు... సంవత్సర కాలంలో నగదు మొత్తం ఎంత జమ అయ్యిందో, సమాచారం తెలియజేస్తారు. ప్రతి బ్యాంకుకి వారి వారి పాలసీలు కూడా అమలులో ఉన్నాయి. ఈ క్రింది కేసులు/వ్యవహారాలు గమనించండి.ఈశ్వరరావు పాలబూత్‌లో కార్డులు, అరువులు కాకుండా రోజూ నగదు రూపేణా రూ.20 వేల అమ్మకాలు ఉండేవి. రోజూ ఉదయం బ్యాంకు తెరవగానే ఆ మొత్తాన్ని డిపాజిట్‌ చేసేవాడు. ఏడాదికి గాను రూ.72 లక్షలు డిపాజిట్‌ అయ్యాయి. నోటీసులు వచ్చాయి. నగదుగా చేసిన డిపాజిట్‌ నుంచి సరఫరా చేసే డైయిరీఫాం వారికి పెద్ద పెద్ద మొత్తాలు చెక్కు/డీడీ రూపంలో చెల్లించేవాడు. డిపాజిట్‌ చేసిన మొత్తం పాల విక్రయం ద్వారా ఏర్పడింది. కానీ అది నూటికి నూరు పాళ్ళు ఆదాయం కాదు. లాభమూ కాదు. నోటీసులకు జవాబులిచ్చి బయటపడేసరికి తలప్రాణం తోకకి వచ్చింది. ఇలా కొన్ని వ్యాపారాలు/వృత్తుల్లో ప్రైవేటు హాస్పిటల్స్, సినిమా పరిశ్రమ, రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగం, హోటల్స్, సినిమా హాల్స్, షాపింగ్‌ మాల్స్‌లో నగదు వస్తుంటుంది. తగిన జాగ్రత్త వహించాలి. అలాగే గుడి, గోపురాల్లో కూడా.దామోదర్‌ రెడ్డికి నగరశివార్లలో ఒక పెద్ద కాంప్లెక్స్, 12 ఫ్లాట్లు ఉన్నాయి. అద్దెలు వస్తున్నాయి. వయస్సు పెద్దది. సమయం, ఓపిక లేదు. అందరూ నగదే చెల్లిస్తున్నారు. అందరిని తన పొదుపు ఖాతాలోకి నగదు రూపంలో డిపాజిట్‌ చేయమనేవాడు. వారందరూ మాట ప్రకారం అకౌంట్లోనే జమచేసేవారు. లక్షల్లో తేలేది అద్దె ఆదాయం. నోటీసులు తథ్యం. అకౌంటు చేయక తప్పలేదు. వీరభద్రానికి పెద్ద ఇల్లు. నలుగురు పిల్లలు. భారీ సంపాదన. అంతా చెక్కు రూపంలోనే స్వీకరించేవారు. నగదు విత్‌డ్రా చేయడం ఖర్చులన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని నగదు ద్వారా బ్యాంకులో డిపాజిట్‌ చేసేవారు. ఇలా చేసిన డిపాజిట్లు రూ.10 లక్షల దాటాయి. నోటీసులు... కథా కమామీషు.👉ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుంది: గోల్డ్ మైనర్ అంచనాహస్తవాసి ఉన్న డాక్టర్‌ ఆనంద్‌రావు ఖాతాలు, ఎన్నో గుళ్లు గోపురాలు ప్రతిష్ట చేసిన బ్రహ్మ గారి ఖాతాలు, లంచాలు లాగి.. లాగి అమాయకంగా బ్యాంకులో నగదు డిపాజిట్‌ చేసిన లంచావతారం ఖాతాలు, అదర్శ రైతు అవార్డు పొందిన రైతుగా తన వ్యవసాయ ఆదాయాన్ని బ్యాంకు అకౌంటులో డిపాజిట్‌ చేసిన నాగయ్య, ఎన్నో ఇళ్లు కట్టిన మేస్త్రిగా మంచి పేరు పొందిన కొండయ్య, బొటిక్‌ పెట్టి మంచి పేరుతో డబ్బులు సంపాదించి బ్యాంకులో డిపాజిట్‌ చేసిన రాణి, కేటరింగ్‌తో లక్షలు సంపాదించి నగదు డిపాజిట్‌ చేసిన శ్రీను.. ఇలా ఎందరో నగదు డిపాజిట్‌దారులు.. ఎన్నెన్నో కథలు. ప్రయివేటు చిట్టీల్లో వచ్చిన మొత్తాలు... భూములు, పొలాలు, ఇండ్లు అమ్మగా వచ్చిన మొత్తాలు... స్నేహితులు, చుట్టాలు ఇచ్చిన రుణాలు... అప్పులు... ఇలా ఎంతమందినైనా చెప్పవచ్చు. ఎన్నో వ్యవహారాలు ప్రస్తావించవచ్చు. అన్నీ డిపాజిట్ల ఆదాయం కాకపోవచ్చు. సరైన, సమగ్రమైన, సంతృప్తికరమైన వివరణ ఇస్తే బయపడవచ్చు. లేదంటే ఈ డిపాజిట్లలో నగదును ఆదాయంగా భావించే ప్రమాదం ఉంది. 1.4.2024 నుంచి 31.3.2025 మధ్య ఇటువంటి డిపాజిట్లు ఉంటే విశ్లేషించుకోండి. విషయాన్ని బయటపెట్టండి. ::కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య, ట్యాక్సేషన్‌ నిపుణులుపన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌ పంపించగలరు.

Moderate Rain Forecast To AP7
ఏపీకి వర్షం అలర్ట్‌.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షసూచన

సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఏపీలో రాబోయే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ మాట్లాడుతూ.. సోమవారం.. కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందన్నారు. ఇక, మంగళవారం.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.ఇదిలా ఉండగా.. కొన్ని జిల్లాలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్సార్‌ జిల్లా వేంపల్లిలో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక, తెలంగాణలో గత కొద్ది రోజులుగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదివారం హైదరాబాద్‌ సహా అనేక జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై.. మోస్తరు వర్షం కురసింది. దీంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలో వర్షం కారణంగా కల్లాల్లో పోసిన ధాన్యం వర్షం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Gadwal right now. As expected, dangerous storms smashing the district 😱Zaheerabad - Vikarabad too on ALERTVC :- @chaitanyak19142 pic.twitter.com/S3cmnQ4UMy— Telangana Weatherman (@balaji25_t) April 27, 2025

Nani: If You Not Like Hit 3 Then Don't Watch SSMB298
హిట్‌ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని ఇరికించేశాడుగా!

నేచురల్‌ స్టార్‌ నాని (Nani) యాక్షన్‌ అవతార్‌లో కనిపించనున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్‌ 3: థర్డ్‌ కేస్‌ మూవీ (HIT: The Third Case) మే 1న విడుదల కానుంది. ఆదివారం (ఏప్రిల్‌ 27) ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అలాగే హిట్‌ 1 హీరో అడివి శేష్‌, హిట్‌ 2 హీరో విశ్వక్‌ సేన్‌ అతిథులుగా వచ్చారు.ప్రేమగా హగ్‌ ఇచ్చారంటే..ఈ వేదికపై నాని మాట్లాడుతూ.. నా ప్రతి సినిమా మార్నింగ్‌ షోకి ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా వస్తున్నారా? అని చెక్‌ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్‌ అడిగేవాడిని. ప్రేమగా హగ్‌ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్‌ చేస్తాం అన్నారంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో ఈ అలవాటుకు కాస్త బ్రేక్‌ పడింది.సొంత సినిమాలా ప్రమోషన్స్‌..ఈ మే 1న రాజమౌళి (SS Rajamouli) మార్నింగ్‌ షో చూడాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ రోజు ఆయనకు ఏదైనా పనులుంటే తన పాస్‌పోర్ట్‌ లాగేసుకుంటాను. శ్రీనిధి శెట్టి గురించి చెప్పాలి. మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలకు సినిమాలో సగం లవ్‌స్టోరీనే ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ, అలాంటిదేం ఉండదు. ప్రమోషన్స్‌ కూడా ఒక్కటీ మిస్‌ అవకుండా తన సొంత సినిమాలా చేసింది. సినిమా సక్సెస్‌ ఈవెంట్‌లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను.హిట్‌ 3 నచ్చకపోతే..కోర్ట్‌ సినిమా నచ్చకపోతే హిట్‌ 3 చూడొద్దని చెప్పాను. ఈసారి ఎవరిని తాకట్టుపెడదాం అని చూస్తున్నాను. హిట్‌ 3 మీ అంచనాలను అందుకోలేకపోతే వచ్చే ఏడాది రిలీజవుతున్న SSMB29 (సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు- రాజమౌళి కలయికలో వస్తున్న మూవీ)ని చూడొద్దు.. సరదాగా అంటున్నాను. ఆ సినిమాను తాకట్టు పెట్టినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఆ సినిమా ప్రపంచమంతా చూసి తీరాల్సిందే! మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్‌ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్ ను ఇస్తానని నేను ప్రామిస్‌ చేస్తున్నా అని నాని అన్నాడు. ఇక ఇదే స్టేజీపై ఫైట్‌ మాస్టర్‌ సతీశ్‌.. శ్రీనిధి శెట్టికి ఒక ఫైట్‌ సీన్‌ కూడా ఉందన్న విషయాన్ని లీక్‌ చేసేశాడు. దీంతో శ్రీనిధి షాకై నోరెళ్లబెట్టింది. వెంటనే అక్కడున్న సుమ.. కథంతా చెప్పేసేలా ఉన్నారని వారించింది. చదవండి: కోర్ట్‌ తర్వాత సారంగపాణి జాతకం నాకో వరం: ప్రియదర్శి

IRCTC Karnataka Tour Package:  Karnatakas Temple And Tourist Spots9
ఐఆర్‌సీటీసీ డివైన్‌ కర్నాటక ప్యాకేజ్‌..! ఏమేమి దర్శించొచ్చంటే..

ఉడుపి శ్రీకృష్ణుడిని చూడాలి. శృంగేరి శారదామాతను దర్శించాలి. కుక్కె సుబ్రహ్మణ్యం... మంగళాదేవి...కుద్రోలి గోకర్ణనాథేశ్వర స్వామి ఆలయం. కద్రి... ధర్మస్థల మంజునాథులనూ చూడాలి.అన్నింటినీ ఓకే ట్రిప్‌లో చుట్టేయవచ్చు. ఐఆర్‌సీటీసీ డివైన్‌ కర్నాటక ప్యాకేజ్‌ ఉంది. పై వాటితోపాటు మాల్పె... తన్నేర్‌బావి బీచ్‌లు. మినీ గోమఠేశ్వరుడు ఈ టూర్‌లో బోనస్‌.మొదటి రోజుఈ రైలు హైదరాబాద్‌లో బయలుదేరి తెలంగాణలో జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్‌ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్, డోన్, గుత్తి, యరగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తమిళనాడులోకి ప్రవేశించి కాట్పాడి, జోలార్‌పేట, సేలం జంక్షన్, ఈ రోడ్‌ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూర్‌ జంక్షన్‌ తర్వాత కేరళలో అడుగుపెట్టి పాలక్కాడ్, షోర్‌నూర్, తిరూర్, కోళికోద్, వాడకర, తలస్సెరి, కన్నూరు, పయ్యనూర్, కన్హాగాడ్, కాసర్‌గోడ్‌ దాటిన తర్వాత కర్నాటకలో ప్రవేశించి మొత్తం 33 గంటలకు పైగా ప్రయాణించి 1532 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుని మంగళూరు సెంట్రల్‌ స్టేషన్‌కు చేరుతుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక ఐదు దక్షిణాది రాష్ట్రాలను చుట్టేస్తుందన్నమాట. ఇది కేవలం మన గమ్యాన్ని చేరే ప్రయాణంగా భావిస్తే మంగళూరు చేరేలోపే బోర్‌ కొడుతుంది. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, కంటికి కనిపించిన అన్నింటినీ గమనిస్తూ, మనోనేత్రంతో విశ్లేషించుకుంటూ సాగితే ఐదు రాష్ట్రాల వైవిధ్యాన్ని, ప్రజల జీవనశైలిని ఒకే ప్రయాణంలో ఆస్వాదించవచ్చు.రెండోరోజుఉదయం తొమ్మిదన్నరకు మంగళూరుకు చేరుతుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉడుపికి ప్రయాణం. హోటల్‌లో చెక్‌ ఇన్‌. శ్రీకృష్ణ ఆలయ దర్శనం, మాల్పే బీచ్‌ విహారం తర్వాత రాత్రి బస ఉడుపిలోనే. ఉడుపిలోని శ్రీకృష్ణుడిని ద్వైత తత్వాన్ని బోధించిన మధ్వాచార్యుడు స్థాపించాడు. ఈ ఆలయానికి వెళ్లినప్పుడు కళ్లు మూసుకుని స్మరించుకుని వెనక్కి వచ్చేశారంటే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని కనులారా వీక్షించాలి. దర్శనం కోసం క్యూలో ఉన్నంత సేపు ఆలయ ప్రాంగణాన్ని, అక్కడి ఆచార సంప్రదాయాలను గమనించాలి. బయటకు వచ్చిన తర్వాత గోపురాన్ని, శిల్పాలను నిశితంగా పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే వెనుదిరగాలి. ఎందుకంటే ఈ నిర్మాణం ఓ వైవిధ్యం. ఇలాంటి ఆలయం దేశంలో మరొకటి లేదు. శ్రీకృష్ణుడి దర్శనం తర్వాత మాల్పె బీచ్‌ విహారానికి వెళ్లవచ్చు. దీనిని ఒక అడ్వెంచర్‌ పార్క్‌ అని చెప్పాలి. స్టాల్స్‌లో దొరికే కన్నడ చిరుతిళ్లను రుచి చూస్తూ అరేబియా తీరాన సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ సమయం గడపవచ్చు. టైమ్‌ ఉంటే సెయింట్‌ మేరీ ఐలాండ్‌కు వెళ్లిరావచ్చు. ఉడుపిలో ఉన్న రోజు మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనంలో రకరకాల ఉడుపి రుచులను ఆస్వాదించడం మర్చిపోవద్దు. ఉడుపి హోటళ్లలో శాకాహారంతోపాటు మాంసాహారంలో స్థానిక స్పెషల్‌ వంటకాలను రుచి చూడాలి. ఎప్పుడూ సందడిగా ఉంటాయి. దేశమంతటా విస్తరించిన ఉడుపి హోటళ్లు ఎప్పుడూ సందడిగా ఉంటాయి. అలాంటిది ఉడుపిలో అసలు సిసలైన ఉడుపి రుచులను అసలే మిస్‌ కాకూడదు. ఇక్కడ తుళు భాష ఎక్కువగా మాట్లాడతారు. తుళు అంటే... దేశ భాషలందు తెలుగు లెస్స అని మన తెలుగును ప్రశంసించిన కృష్ణదేవరాయల మాతృభాష.మూడోరోజుశృంగగిరి చల్లదనం..శారదామాత వీక్షణంశృంగేరిలోని శారదాపీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించిన పీఠాల్లో ఒకటి. రామాయణంలోని బాలకాండలో రుష్యశృంగుడి గురించిన ప్రస్తావన ఉంది. ఆ రుష్యశృంగుడు తపస్సు చేసుకున్న కొండ కావడంతో దీనికి శృంగగిరి శృంగేరి అనే పేరు వచ్చింది. ఎండకాలం చల్లగా ఉంటుంది. విద్యాశంకర ఆలయ నిర్మాణ కౌశలాన్ని ఆస్వాదించి, శారదామాత దర్శనంతో ఆశీస్సులు పొందిన తర్వాత ఆది శంకరాచార్యుని ఆలయం, శృంగేరి మఠం చూడాలి. హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి శృంగేరి వైపు సాగి΄ోవాలి. శారదాంబ ఆలయ దర్శనం తర్వాత మంగళూరుకు ప్రయాణం. రాత్రి బస మంగళూరులో.నాల్గోరోజునేత్రానందం మంజునాథాలయంధర్మస్థలకు ప్రయాణం, మంజునాథ ఆలయ దర్శనం, ఆ తర్వాత కుక్కె సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని సాయంత్రానికి మంగుళూరు చేరాలి. ఆ రాత్రి బస కూడా మంగళూరులోనే. ఇక ధర్మస్థల... నేత్రావతి నది తీరం. ఇక్కడ మంజునాథ ఆలయంతోపాటు మంజూష మ్యూజియాన్ని కూడా చూడాలి. ఇది పరిశోధన గ్రంథాల నిలయం. మాన్యుస్క్రిప్ట్‌లు, పెయింటింగ్‌లున్నాయి. పక్కనే ఒక కొండ మీద 39 అడుగుల గోమఠేశ్వరుడిని చూడాలి. ఇది యాభై ఏళ్ల కిందట చెక్కిన శిల్పం. బాహుబలిగా చెప్పుకునే అసలు గోమఠేశ్వరుడి విగ్రహం కాదిది. అసలు గోమఠేశ్వరుని ప్రతిరూపాలు మరో నాలుగున్నాయి కర్నాటకలో. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న వింటేజ్‌ కార్‌ మ్యూజియాన్ని కూడా విజిట్‌ చేయవచ్చు. పరశురాముడి క్షేత్రంకుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలయం... ఇది కుమారధార నది తీరాన ఉంది. ఐదు వేల ఏళ్ల నాటి ఆలయం. ఇది కార్తికేయుడి ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి పేరుతో పూజలందుకుంటున్నాడు. గరుడుని బారి నుంచి తప్పించుకోవడానికి వాసుకి ఇక్కడకు వచ్చాడని చెబుతారు. పురాణేతిహాసాల ప్రకారం ఈ ప్రదేశం పరశురాముడు స్థాపించిన ఏడు క్షేత్రాల్లో ఇదొకటి.ఐదోరోజుమంగళాదేవి ఆలయం విశాలంగా ఉంటుంది. చక్కటి గోపురం, లోపల నిర్మాణాలకు ఎర్ర పెంకు పై కప్పు, వర్షపునీరు జారి΄ోవడానికి వీలుగా ఏటవాలుగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంటుంది. కద్రి మంజునాథ ఆలయ గోపురం ప్రత్యేకమైన వాస్తుశైలిలో ఉంటుంది. ఇక టూర్‌లో సేదదీరే ప్రదేశం తన్నేర్‌బావి బీచ్‌. ఇది పర్యటనకు అనువైన ప్రదేశంగా బ్లూ ప్లాగ్‌ గుర్తింపు పొందిన బీచ్‌. వీలైతే సూర్యాస్తమయాన్ని వీక్షించవచ్చు. ఇక చివరగా కుద్రోలి గోకర్ణనాథేశ్వర ఆలయం కొత్తది. రాజులు నిర్మించినది కాదు. కేవలం వందేళ్ల దాటింది. కన్నడ సంప్రదాయ యక్షగాన కళాకారుడు, యుద్ధవిద్య గారడి విన్యాసాలు చేసేవాళ్లు సమూహంగా మారి నిర్మించుకున్నారు. ఆరవ రోజురాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు కాచిగూడకు చేరుతుంది. పర్యటన అలసట తీరే వరకు విశ్రాంతి తీసుకున్న తర్వాత టూర్‌ మొదటి రోజు చూసిన ప్రదేశాల విండో టూర్‌ను మరోసారి ఆస్వాదించవచ్చు.ప్యాకేజ్‌ ఇలా...ప్యాకేజ్‌లో బస త్రీ స్టార్‌ హోటల్‌లో ఉంటుంది. ఏసీ వాహనాల్లో ప్రయాణం. మూడు రోజులు బ్రేక్‌ఫాస్ట్‌ ఉంటుంది. భోజనాలు, ట్రైన్‌లో కొనుక్కునే తినుబండారాలు, సైట్‌ సీయింగ్‌ ప్రదేశాల ఎంట్రీ టికెట్‌లు, బోటింగ్‌ – హార్స్‌ రైడింగ్‌ వంటి వినోదాల ఖర్చులు ప్యాకేజ్‌లో వర్తించవు. ఈ రైలు వారానికొకసారి మాత్రమే ఉంటుంది. ప్రతి మంగళవారం కాచిగూడలో బయలుదేరుతుంది.సింగిల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపు 39 వేలవుతుంది. ట్విన్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 23 వేలవుతుంది. ట్రిపుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలవుతుంది.డివైన్‌ కర్నాటక (ఎస్‌హెచ్‌ఆర్‌086). ఇది ఆరు రోజులు ఐదు రాత్రుల టూర్‌ ప్యాకేజ్‌. ఇందులో ప్రధానంగా ధర్మస్థల, మంగళూరు, శృంగేరి, ఉడిపి కవర్‌ అవుతాయి.– వాకా మంజులారెడ్డి,సాక్షి, ఫీచర్స్‌ ప్రతినిది (చదవండి: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్‌ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..! స్పెషాలిటీ ఏంటంటే..)

Pakistan Army Chief Missing in Action10
పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఎక్కడ? 

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్‌ సయీద్‌ ఆసిఫ్‌ మునీర్‌ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్‌ వీడారు’’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్‌ బయట ఎక్కడా కని్పంచడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. మునీర్‌కు తీవ్ర భారత విద్వేషిగా పేరుంది. కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పాక్‌కు కశ్మీర్‌ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హిందువులు, ముస్లింలు భిన్న జాతులని ఇటీవలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తర్వాత రెండు రోజులకే పహల్గాం ఉగ్ర దాడి జరిగింది. ‘‘దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్‌ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్‌ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్‌ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’’ అని కథనాలు పేర్కొంటున్నాయి. మునీర్‌ పాక్‌లోనే ఉన్నారని, రావలి్పండి బంకర్లో తలదాచుకున్నారని మరికొందరు చెబుతున్నారు. ఈ పుకార్లలో సైన్యం మనోబలం దెబ్బ తింటుందని గ్రహించిన పాక్‌ ప్రభుత్వం నష్ట నివారణకు దిగింది. ప్రధాని షహబాజ్‌ షరీఫ్, ఉన్నత సైనికాధికారులతో శనివారం మునీర్‌ దిగిన గ్రూప్‌ ఫొటో అంటూ పాక్‌ పీఎంఓ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దాన్ని నమ్మలేమని, శనివారం సైనిక కాలేజీ ఉత్సవాల్లో ప్రధానితో పాటు మునీర్‌ పాల్గొన్నట్టుగా వచి్చన వార్తలూ నమ్మశక్యంగా లేవని మీడియా అభిప్రాయపడింది. మరోవైపు పాక్‌ సైన్యంలోని జనరల్స్, ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ఉన్నపళంగా దేశం దాటిస్తున్నట్టు చెబుతున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement