
ఎవరైనా రావొచ్చు..
పూజార్లు ఉంటున్నా ఇక్కడ మంత్రాలు, ప్రత్యేక హోమాలు, పూజలు అంటూ ఏమీ జరగవు. ఎవరైనా అమ్మవారి దగ్గరకు వచ్చి పూజ చేసుకోవచ్చు. ప్రతి ఆది, మంగళవారం భక్తులు సంబరాలు నిర్వహిస్తుంటారు. భక్తులకు అసౌకర్యం లేకుండా గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తుంటారు.
– కొచ్చెర్ల పేరయ్య, ఆలయ ప్రధాన పూజారి
భక్తులతో కళకళ..
తులసమ్మను మనసులో స్మరించుకొని బలంగా కోరుకుంటే ఆ కోరిక నెరవేరాల్సిందే. కరోనా సమయంలో సైతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఆలయాలు మూతబడినా.. తులసమ్మ ఆలయం మాత్రం భక్తులతో కళకళలాడేది. ప్రతీ ఏడాది ఏప్రిల్ రెండో ఆదివారం పెద్ద ఎత్తున ఉత్సవాన్ని నిర్వహిస్తుంటాం.
– దక్కత చంద్రయ్య, భక్తుడు, లొద్దపుట్టి

ఎవరైనా రావొచ్చు..