Srikakulam District Latest News
-
పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. పిల్లలంతా ఇంట్లో కంటే గ్రౌండ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మరికొద్ది రోజుల్లో వార్షిక పరీక్షలు కూడా ముగియనున్నాయి. సెలవులు వస్తే ఆ సందడి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఓపెన్ టోర్నీలు, లీగ్ మ్యాచ్‌లతో మైదానాలు కళకళలాడుతున్నాయి.
ఆటాడుకుందాం.. రా అంటూ మైదానం పిలుస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి. మరికొద్ది రోజుల్లో చిన్నారులకు వేసవి సెలవులు సైతం ప్రారంభంకానున్నాయి. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు, విద్యార్థులు మైదానం బాట పట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికితోడు ఐపీఎల్ మేనియా బాగా పనిచేస్తోంది. తమ అభిమాన ఆటగాళ్లను అనుకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మైదానాల్లో సందడి.. ఆటపాటలతో మైదానాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు కళింగపట్నం, సింగుపురం, ఇచ్ఛాపురం, సోంపేట, మకరాంపురం, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, టెక్కలి, నరసన్నపేట ఆమదాలవలస, ఎచ్చెర్ల, రణస్థలం తదితర ప్రాంతాల్లోని క్రీడాకారులు, విద్యార్థులు, యువత, చిన్నారులు మైదానాల్లో సందడి చేస్తున్నారు. వివిధ క్రీడాంశాల్లో నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకునేందుకు రెడీ అయిపోతున్నారు. దీనికితోడు త్వరలో మొదలయ్యే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను కూడా వినియోగించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. మరికొంతమంది త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు దేహ దారుఢ్యాన్ని పెంచుకోవడంలో తలమునకలవుతున్నారు. ఇక్కడే అన్నీ.. ఒకప్పుడు స్పోర్ట్స్ మెటీరియల్స్ కోసం విశాఖ తదితర ప్రాంతాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లా కేంద్రంలో విస్తారంగా స్పోర్ట్స్ దుకాణాలు వెలిశాయి. క్రీడా దుస్తుల విక్రయాలతోపాటు క్రికెట్ కిట్లు (బాల్స్, బ్యాట్స్, ప్యాడ్స్, గ్లోవ్స్, ఇతరాలు), వాలీబాల్, షటిల్ రాకెట్స్ మొదలుకుని క్రీడా సామగ్రి విక్రయాలతో షాపుల్లో సందడి వాతావరణం నెలకొంది. వీటితోపాటు ఫిట్నెస్ మెరుగు కోసం వివిధ యాంత్రిక పరికరాలు, బండిల్స్ విక్రయాలు కూడా జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. టోర్నీలు, లీగ్ మ్యాచ్‌లతో హడావుడి వేసవి సెలవుల్లో భాగంగా యువత, విద్యార్థులు పలు క్రీ డాంశాల్లో మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి, అంతర్రాష్ట్ర క్రీడా టోర్నీలు, లీగ్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళిక వేస్తున్నారు. కొన్ని చోట్ల టోర్నమెంట్లను కూడా మొదలుపెట్టేశారు. ముఖ్యంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యా డ్మింటన్, క్రీడాంశాల్లో టోర్నీలకు చురుగ్గా ఏర్పా ట్లు జరుగుతున్నాయి. వీటితోపాటు ఫుట్‌బాల్, చెస్, క్యారమ్స్, కరాటే, తైక్వాండో, జూడో క్రీడాంశాల్లోను పోటీలకు కసరత్తులు చేసుకుంటున్నారు. జిల్లాస్థాయి, ఓపెన్ టోర్నీలు, లీగ్ మ్యాచ్‌ల సన్నద్ధతతో మైదానాల్లో సందడి క్రీడాసామగ్రి విక్రయాలతో స్పోర్ట్స్ షాపులు కళకళ వేసవిలో మైదానాల బాట పడుతున్న విద్యార్థులు మరికొద్ది రోజుల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు మొదలు ఎండలతో జాగ్రత్తలు తప్పనిసరి.. మండే ఎండల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత ఉష్ణాగ్రతల నేపథ్యంలో ఉదయం గరిష్టంగా 10.30 వరకు, మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత మాత్రమే మైదానాల్లో ఆడుకోవడం ఉత్తమం. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు గ్లూకోజ్, నిమ్మరసం, ఆరెంజ్ వంటి ద్రావణాలను అధిక మోతాదులో తీసుకోవాలి. కొబ్బరిబొండాలు, మజ్జిగ తీసుకోవడం మంచిది. – డాక్టర్ బొడ్డేపల్లి సురేష్‌కుమార్, వైద్యులు, సన్‌రైజ్ హాస్పటల్ ఎండీ శ్రీకాకుళం మన్నికై నవి వాడాలి.. క్రీడాదుస్తులు, క్రీడా సామగ్రి కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ సామగ్రి కూడా వచ్చేస్తున్నాయి. ఒకటికి రెండుసార్లు చూసి కొనుక్కోవాలి. మన్నికై నవి తీసుకుంటే ఎక్కువ రోజులు వినియోగించవచ్చు. – మొజ్జాడ వెంకట రమణ, సీనియర్ పీడీ, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడుఅటు టెన్త్, ఇటు ఇంటర్ పరీక్షలు ముగిశాయి. తదుపరి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతూనే.. విద్యార్థులు ఆటలపోటీల్లో నిమగ్నమవుతున్నారు. ఆటలన్నాక గెలుపోటములు సహజం. ఈ రోజు ఓటమి రేపటికి గెలుపునకు నాంది. రెండింటినీ సమానంగా తీసుకోవాలి. తోటి ఆటగాళ్లపై స్నేహభావంతో మెలగాలి. – సంపతిరావు సూరిబాబు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా సీఈఓ -
డయాలసిస్ సేవలకు అంతరాయం
● తీవ్రంగా ఇబ్బంది పెట్టిన విద్యుత్ అంతరాయాలు ● ఆరుసార్లు ఆగిపోయిన డయాలసిస్ యంత్రాలుకాశీబుగ్గ: పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ సెంటర్లో శుక్రవారం డయాలసిస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. 20 బెడ్లతో ఉన్న సముదాయాన్ని నెఫ్రోప్లస్ సంస్థవారు నడుపుతున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి విద్యుత్ సమస్యతో అన్ని డయాలసిస్ మిషన్లు ఆరు సార్లు ఆగిపోయాయి. సాయమ్మ అనే పేషెంట్ ఉదయం పదకొండు గంటలకు వచ్చినా రాత్రి ఏడుగంటల వరకు ఉంచేయడంతో ఆయాసం అధికమై ప్రాణాప్రాయ స్థితికి చేరుకుంది. నెఫ్రోప్లస్ వారు నిర్వహిస్తున్న ఈ యూనిట్లో జనరేటర్ ఉన్నప్పటికీ సాంకేతిక సమస్య తలెత్తడంతో అక్కడి సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దలేకపోయారు. డయాలసిస్ కేంద్రంలో ఎలక్ట్రీషియన్ లేకపోవడంతో తిరిగి ప్రభుత్వం నియమించిన కిడ్నీ ఆస్పత్రి ఎలక్ట్రీషియన్‌తో మరమ్మతులు చేయించారు. ఇదే విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్ వద్ద ప్రస్తావించగా ఇంతవరకు ఇలాంటి సమస్య రాలేదని, మరమ్మతులు చేసినప్పటికీ పలుమార్లు ట్రిప్ అవ్వడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటామని అన్నారు. -
ఆరోగ్య సేవలు విస్తృతం చేస్తాం
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్యశాఖకు మంచి పేరు తీసుకొచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని డాక్టర్ కె.అనిత స్పష్టం చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా ఆమె శుక్రవారం పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో పలు విభాగాల అధికారులతో పలు కీల కాంశాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో అత్యధిక సర్వీసు చేశానని, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అవకాశం రావడాన్ని సంతృప్తిగా స్వీకరిస్తున్నానన్నారు. జిల్లాలో ఉన్న అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో వైద్య సేవలను మరింత విస్తృతం చేసేలా విజిట్స్ ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి 14 రోజులకొకసారి పీహెచ్సీ పరిధిలో ఫ్యామిలి డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయాలన్నారు. జిల్లాలో వైద్యశాఖకు ఇటీవల చెడ్డపేరు వచ్చిందన్న అంశాన్ని ప్రస్తావించగా, కచ్చితంగా మార్పు చూపిస్తామని, వచ్చే వారం మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష చేయనున్నట్లుగా సమాచారం వచ్చిందన్నారు. ఈమేరకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈనెల 9వ తేదిన జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా విశాఖపట్నం రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ బి.సుజాత ను నియమిస్తూ వైద్యశాఖ డైరక్టర్ డాక్టర్ బండారు సుబ్రహ్మణేశ్వరి రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఈమె జిల్లాలో డీఎంహెచ్‌ఓగా విధుల్లో చేరలేనని, తనని తప్పించాలని కోరుతూ విన్నవించుకోగా.. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ తదుపరి శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో ఆర్ఎంఓగా విధుల్లో ఉన్న డాక్టర్ కె.అనితకు ఎఫ్ఏసీ బాధ్యతలను అప్పగిస్తూ గురువారం రాత్రి కొత్త ఉత్తర్వులను డైరక్టరేట్ జారీ చేసింది. నూతన డీఎంహెచ్ఓ డాక్టర్ అనిత తనను విధుల నుంచి తప్పించాలని వేడుకున్న డాక్టర్ సుజాత -
ఇలాంటి సంస్కృతి ఏ రాష్ట్రంలోనూ లేదు..
పత్రికా విలేకరి ఎవరైనా కథనం రాస్తే అవతలివారికి పరువు భంగం కలిగిందనకుంటే లీగల్‌గా వెళ్లవచ్చు. కానీ రాసే వార్తను ఆధారంగా చేసుకు ని ఎడిటర్లపైన, యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు పెట్టే సంస్కృతి ఏ రాష్ట్రంలోనూ లేదు. మనకే ఆ దౌర్భాగ్యం. ఒక రాష్ట్రంలో నమోదైన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ మరో రాష్ట్రంలో మరో విధంగా నమోదు కావడం అన్యాయం. కూటమి ప్రభుత్వం ఇకనైనా ఇలాంటివి విరమించి రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నామన్న సందేశమివ్వాలి. – నల్లి ధర్మారావు, స్సామ్నా రాష్ట్ర అధ్యక్షులు, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు ● -
సమ్మర్ క్యాంప్‌లు ఇలా..
● శ్రీకాకుళం పట్టణంలో నృత్యం నేర్చుకోవాలనుకువాళ్లకు సంప్రదాయం కూచిపూడి గురుకులం, కళ్లేపల్లిలో కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతంపై వేసవి శిక్షణ తరగతులు మే 1 నుంచి జూన్ 5 వరకు జరుగుతాయి. ● పట్టణంలోని పాతశ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రాయింగ్‌పై ఉచిత వేసవి శిక్షణ నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్ ఎల్.నందికేశ్వరరావు తెలిపారు. ఈ నెల 28 నుంచి జూన్ 5 వరకు నిర్వహిస్తారు. ● రఘుపాత్రుని శ్రీకాంత్, శివశ్రీ నృత్య కళానికేతన్, న్యూసెంట్రల్ స్కూల్స్‌లో మే 1నుంచి జూన్ 5 వరకు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యం కూడా నేర్పుతారు. ● శాంతినగర్‌లో ఎన్పీ కవిత, అభినయ నృత్య నికేతన్‌లో తిమ్మరాజు నీరజ, శృతిలయ సంగీత నిలయంలో రెడ్డి సత్యనారాయణ, సుసరాపు లక్ష్మీగణపతి శర్మ, శ్రీరాజరాజేశ్వరీ సంగీతం పీఠంలో శాసీ్త్రయ నృత్య, సంగీతాలు నేర్పిస్తారు. ● అకీరా డ్యాన్స్ ప్లానెట్స్లో చిన్నారుల కోసం వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. ఇక్కడి స్పోకెన్ ఇంగ్లిష్, యోగా, అబాకస్, చెస్, డ్రాయింగ్, వెస్ట్రన్ డ్యాన్స్, భగవద్గీత, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పుతారు. ● పట్టణంలో పాండురంగవీధిలో ఉన్న వీఆర్ ఇన్స్టిట్యూట్లో కీబోర్డు, గిటార్, వోకల్ శిక్షణ ప్రారంభమైంది. మాస్టర్ సిహెచ్. వేంకటరావు ఆధ్వర్యంలో వేసవిలో రెండు నెల లపాటు ఈ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
అటు ఆళ్వారు.. ఇటు ఆదిత్యుడు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ‘దొంగదోపు ఉత్సవం’ ఆకట్టుకుంది. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఉద్యానవన తోటల్లో జరిపించిన ఈ వేడుకల్లో భాగంగా ఆలయం నుంచి శ్రీ ఉషా పద్మి ని ఛాయాదేవేరులతో శ్రీసూర్యనారాయణ స్వామి వారి కల్యాణమూర్తులను వెండి సింహవాహనంలో తిరువీధిగా మాడవీధుల నుంచి ఉద్యానవన తోట (చిన్నతోట)లో వేంచేసింపజేశారు. అలాగే మరో ఉద్యానవన తోట (పెద్దతోట)లో శ్రీ తిరుమంగయాళ్వారు చరిత్రలో భాగంగా ఆళ్వారును ఆశీనులు చేశారు. అనంతరం ఆళ్వారుకు, ఆదిత్యునికి మధ్య జరిగిన సంవాదం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆదిత్యుని తరఫున భాస్కరభట్ల నర్సయ్య శర్మ, బంకుపల్లి రమేష్‌శర్మ, ఆళ్వారు తరఫున భాస్కరభట్ల శ్రీరామమూర్తి శర్మ, డాక్టర్ పులఖండం శ్రీనివాసరావులు సంవాదం చేసుకున్నారు. శనివారం ఉదయం చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఇంద్రపుష్కరిణిలో స్వామి వారి కల్యాణమూర్తుల చక్రతీర్థ స్నానాల కార్యక్రమం జరుగనుందని, అలాగే రాత్రి పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈఓ వై.భద్రాజీ తెలియజేశారు. -
అధికారులు మౌనం
ఆక్రమణల గానం.. నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేటలో ప్రభుత్వ భూములు స్వాహా చేస్తున్నారు. ఇప్పటి వరకూ రోడ్డు పోరంబోకు స్థలాలు, రోడ్డు మార్జిన్లలో ఉన్న ఖాళీ స్థలాలను చేజిక్కుంచుకున్న కూటమి కార్యకర్తలు ఇప్పుడు ఏకంగా కోట్ల విలువైన స్థలంపై కన్నేశారు. మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఎస్ఆర్ షాపింగ్‌మాల్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుట్టు చప్పుడు కాకుండా కొట్టేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు రెవెన్యూ, ఇటు పంచాయతీ అధికారులకు ఆ నోటా.. ఈ నోటా సమాచారం తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పది రోజుల క్రితం మెయిన్ రోడ్డులో సీసీ డ్రైన్‌కు రోడ్డుకూ మధ్యలో కొందరు వ్యాపారులు తమ షాపుల ముందు రాకపోలకు వీలుగా మట్టిని వేసుకుంటే పంచాయతీ అధికారులు అదే పనిగా వారం రోజుల పాటు జేసీబీ అద్దెకు తీసుకొని రోడ్డు మార్జిన్లో ఉన్న మట్టిని ఆక్రమణల పేరుతో తొలగించారు. ఇప్పుడు రూ.కోట్లు విలువ చేసే ఆస్తి ఆక్రమణలకు గురవుతున్నా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గొట్టిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 96/9 లో కాలువ పోరంబోకు స్థలం ఉంది. దీన్ని కాజేసేందుకు కుట్ర జరుగుతోంది. 1997లో అప్పటి టీడీపీ ప్రభుత్వ కాలంలో ఒక సీనియర్ కార్యకర్తకు ఈ సర్వేలో ఉన్న ఐదు సెంట్లు భూమిని మార్కెట్ ధరకు కట్టబెట్టారు. తర్వాత ఆ స్థలంలో ఆయన షాపులు నిర్మించుకొని ఇన్నాళ్లూ ఉన్నారు. అప్పటి నుంచీ ఈ షాపుల వెనుక భాగం ఖాళీగానే ఉండేది. పాత ఇనుము సామాన్లు సేకరించే ఒకాయన తాత్కాలిక పద్ధతిలో చిన్న రేక్ షెడ్ వేసుకొని ఉండేవాడు. ఈ స్థలంలో పక్కాగా ఆయన షాపులు నిర్మించేందుకు గత ప్రభుత్వ కాలంలో ప్రయత్నించగా అప్పటి సర్పంచ్, అధికారులు అంగీకరించలేదు. ఇప్పుడు అధికారం అండతో ఆ స్థలంలో ఉన్న రేకు షెడ్‌ను తొలగించి ఆ స్థలం కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో నిర్మించిన షాపులు తొలగించి ఆ స్థలంతో పాటు వెనుక ఉన్న ప్రభుత్వ స్థలం కూడా కలిపి భవంతులు నిర్మించడానికి చూస్తున్నారు. దీనికి పట్టణానికి చెందిన కొందరు టీడీపీ మాజీ ఎంపీటీసీలు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కూటమికి చెందిన నియోజకవర్గం పెద్దలు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు సెంట్లకు పైగా స్థలం ఆక్రమణకు పాల్పడుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో గజం విలువ రూ.లక్షల్లో ఉంది. విలువైన స్థలం కబ్జా కాకుండా చూడాలని స్థానికు లు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలం ఎంత ఉంది, ఎక్కడ నుంచి ఉందనేది మార్కింగ్ చేయాలని, కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పక్క స్థలం పరిశీలిస్తామని, ఆర్ఐతో పాటు ఇతర సిబ్బందిని పంపి ప్రభుత్వ స్థలం ఎంత ఉందనేది నిర్ధారణ చేస్తామని తహసీల్దార్ సత్యనారాయణ అన్నారు. ఇదే విషయంపై నరసన్నపేట ఈఓ ద్రాక్షాయిని వద్ద ప్రస్తావించగా స్థలంలో ఎలాంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వ లేదని, పంచాయతీకి ఎవరూ అప్రోచ్ కాలేదని, అయితే ఆ స్థలానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురావాలని సంబంధిత వ్యక్తులకు సూచించామని తెలిపారు. పది రోజులైనా ఎవరూ రాలేదని, అనుమతి లేకుండా నిర్మాణ పను లు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు. నరసన్నపేట నడి బొడ్డున ప్రభుత్వ స్థలం ఆక్రమణకు యత్నం విలువైన స్థలం కొట్టేసే పన్నాగం పట్టించుకోని అధికారులు -
రాష్ట్ర కార్యక్రమంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు నగరంలోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం, శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులో నూతనంగా నిర్మించిన బీసీ భవన్‌ను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. పురుషోత్తపురంలో తగ్గుతున్న డయేరియా ఇచ్ఛాపురం టౌన్ : మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురంలో డయేరియా గురువారానికి తగ్గుముఖం పట్టింది. అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి జూహితా, ఇతర సిబ్బంది ఇంటింటా సర్వే చేసి వైద్య సేవలు అందజేశారు. పురుషోత్తపురంలో బావి నీరు ఉపయోగిస్తున్నారని, ఆ బావిలో చెత్త వేయకుండా చూసు కోవాలని వైద్యాధికారి జూహితా తెలిపారు. అయితే గ్రామంలో బహిరంగ మలవిసర్జన సమస్యగా ఉందని, దాన్ని అరికట్టాలని కొందరు కోరారు. కాలువల్లోనూ మురికి పేరుకుపోయి ఉందని తెలిపారు. టెక్కలి డీఎస్పీగా భార్గవి శ్రీకాకుళం క్రైమ్, టెక్కలి: టెక్కలి డీఎస్పీగా ఎన్.భార్గవి మర్రివాడ రానున్నారు. ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న ఈమె టెక్కలిలో తొలిపోస్టింగ్ దక్కించుకోవడం విశేషం. ఈ మేరకు మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు వచ్చాయి. టెక్కలిలో ఇదివరకు పనిచేసిన డీవీవీఎస్‌ఎన్ మూర్తి ఇటీవల ఉద్యోగవిరమణ పొందిన విషయం విదితమే. ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన సాక్షి టాస్క్‌ఫోర్స్: జలుమూరు మండలం పెద్దదూగాం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ధర్మాన రామారావు తాను మోసపోయానని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వీడి యో విడుదల చేశారు. బుద్ధల భాస్కరరావు అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఆయన ఆరోపించారు. విడతల వారీగా రూ.68 లక్షల వరకు కాజేశాడని, పిల్లల చదువులకు ఇప్పు డు తాను ఇబ్బందులు పడుతున్నానని వీడియోలో పేర్కొన్నారు. తన లాగానే పరిసర గ్రామాల ప్రజల వద్ద కూడా డబ్బులు వసూ లు చేశాడని, కూతురి పెళ్లి కోసం ఉంచుకున్న డబ్బును సైతం అతడికే ఇచ్చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. తన లాగా భాస్కరరావు మాయలో ఎవరూ పడవద్దని కోరారు. ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని, తనకు పోలీసులు న్యాయం చేయాలని, ఇది కేవలం తన వ్యక్తిగత సమస్య అని రాజకీయాలకు సంబంధం లేదని తెలిపారు. రేషన్ బియ్యం పట్టివేత పోలాకి: మండలంలోని చీడివలన గ్రామంలో పొట్నూరు అప్పన్న ఇంటివద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 2.6 క్వింటాళ్ల రేషన్ బియ్యంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్ఓ సూర్యప్రకాశ రావు, సీఎస్‌డీటీ రామకృష్ణ కచ్చితమైన సమాచారం మేరకు అక్కడకు చేరుకుని బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై 6ఎ కేసు నమోదు చేసినట్లు డీఎస్ఓ తెలిపారు. -
కిడ్నీ ఆస్పత్రి పరిశీలన
కిడ్నీవ్యాధితో వ్యక్తి మృతి టెక్కలి రూరల్: మండలంలోని సన్యాసినీతాపురం గ్రామానికి చెందిన బెహరా సింహాద్రి(45)అనే వ్యక్తి కిడ్నీవ్యాధితో గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీవ్యాధితో బాధపడుతూ శ్రీకాకుళం, టెక్కలిలోని ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకునేవాడు. అయితే గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కాశీబుగ్గ: పలాసలోని వైఎస్సార్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామారావు అనే బాధితుడిని పరామర్శించేందుకు వచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజతో కలిసి ఇన్‌పేషెంట్ విభాగం, కిడ్నీ రోగుల వార్డు, ప్రభుత్వ డయాలసిస్ యూనిట్లను పరిశీలించారు. రోజు రోజుకూ కిడ్నీ రోగులు పెరుగుతున్నారని వారికి అవసరమైన వైద్య సేవలు, మందులు పంపిణీ, ఆపరేషన్లు, పరీక్షలు, అన్ని విభాగాలను పనిచేసేలా చూడాలని అన్నారు. ఆయనతో పాటు మందస ఎంపీపీ డొక్కరి దానయ్య, ఎంపీటీసీలు బమ్మిడి దుర్యోధన రావు, గండు మోహనరావు, మాజీ ఎంపీపీ బత్తిని హేమేశ్వరరావు, నాయకులు శిష్టు గోపి, దువ్వాడ రవి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ కగార్ ఆపాల్సిందే’
పలాస: దండకారణ్యంలో ఆపరేషన్ కగార్‌ను కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిలుపుదల చేయాలని, కేంద్ర పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పలువురు వక్తలు ప్రభుత్వానికి విన్నవించారు. కాశీబుగ్గలోని ఓ రెసిడెన్సీలో గురువా రం సీపీఐ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ మాట్లాడుతూ దండకారణ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టుల పేరుతో ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయని, అమాయక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పోలీసుల చేతిలో మృతి చెందిన రేణుక బహుజనుల బిడ్డని, ఆమె ఎప్పుడు కూడా తుపాకీ పట్టిన దాఖలాలు లేవని, ఆమె ఒక రచయత, మేధావి అని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రకృతి వనరులను దోచుకోవడానికేనని దుయ్యబట్టారు. మానవ హక్కుల నేత ఎస్వీ కృష్ణ మాట్లాడుతూ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి మాత్రమే ఈ ఆపరేషన్ కగార్ అని వ్యతిరేకించారు. సదస్సులో మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు కేవీ జగన్నాథం, సీపీఐ ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, పత్రి దానేసు తదితరులు పాల్గొన్నారు. -
● గిరిపై సత్కార్యం
గిరిజన గ్రామాల్లో సాగుకు అవసరమైన నీటి వనరులు అందించేందుకు వాటర్ షెడ్డులు నిర్మించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో పాటుగా వివిధ శాఖల అధికారులు గురువారం టెక్కలి మండ లంలోని ముఖలింగాపురం పంచాయతీ పరిధి గిరిజన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొండపై నుంచి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు వాటర్ షెడ్డులను, చెక్ డ్యాంలు నిర్మాణం చేసేందుకు గాను అనుకూలమైన ప్రాంతాలను గుర్తించేందుకు పర్యటించారు. త్వరలోనే గ్రామసభలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం టెక్కలిలో గల పట్టుమహాదేవి కోనేరు గట్టుని పరిశీలించారు. – టెక్కలి రూరల్ -
రాజకీయ జోక్యం సరికాదు
మత్స్యకారుల వలసల నిర్మూలన, జీవన ప్రమాణాల మెరుగు, ఉపాధికి బుడగుట్లపాలెం ఫిషింగ్ హార్బర్ ఎంతగానో అవసరం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనువైన ప్రదేశం, అవసరం గుర్తించి నిర్మాణానికి ముందుకు వచ్చింది. నిర్మాణ పనులను అసంపూర్తిగా విడిచి పెట్టటం మంచిది కాదు. అభివృద్ధి పనుల్లో రాజకీయ జోక్యం సరికాదు. – గొర్లె కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అసంపూర్తిగా నిలిచిపోయిన ఫిషింగ్ హార్బర్ పనులు -
● ఇదీ ఘనకార్యం..!
మా పార్టీ బలం ఇదీ.. అంటూ టీడీపీ చెప్పుకుంటున్న సభ్యత్వ నమోదు అసలు గుట్టు ఇలా రట్టయ్యింది. బీమా ఉంటుందని చెప్పి తోవలో వెళ్తున్న వారందరికీ వంద రూపాయలు తీసుకొని సభ్యత్యం కల్పించారు. నరసన్నపేట నియోజకవర్గంలో సభ్యత్వ కార్డుల పంపిణీ స్వయంగా ఎమ్మెల్యేనే చేపట్టారు. తీరా చూస్తే ఆ కార్డులు ఇలా రోడ్డు పాలవుతున్నాయి. గురువారం సాయంత్రం జాతీయ రహదారిపై నరసన్నపేట మండలం సత్యవరం కూడలి వద్ద నరసన్నపేట నుంచి శ్రీకాకుళానికి వెల్లే సర్వీసు రోడ్డు పక్కన పోగుగా సభ్యత్వ కార్డులు రోడ్డుపై కనిపించాయి. వీటిని కొందరు కార్యకర్తలే వేసినట్లు సమాచారం. – నరసన్నపేట -
సాయిప్రియకు స్టేట్‌ఫస్ట్ ర్యాంక్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించిన రేడియోథెరపిస్ట్ ఎండీ పరీక్షలో శ్రీకాకుళం నగరానికి చెందిన కింతలి సాయిప్రియ స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌ను కై వసం చేసుకుంది. రేడియోలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా స్థిరపడాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలియజేశారు. తల్లిదండ్రుల సహకారంతోనే స్టేట్‌ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగానన్నారు. ఎంబీబీఎస్ కాకినాడ, ఎండీ, జీఎస్ఎల్ రాజమండ్రిలో పూర్తి చేసినట్లు తెలిపారు. సాయిప్రియ తల్లి గొండు వెంకటలక్ష్మి టీచర్‌గా పని చేస్తుండగా, తండ్రి కాళిదాసు బిజినెస్ చేస్తున్నారు. ఆమె చెల్లి అపర్ణ సైతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. -
పత్రికా విలేకరిపై ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న బాలు అనే ఒక పత్రికా విలేకరి (సాక్షి కాదు) తనను డబ్బులు కోసం వేధిస్తున్నాడని నగరంలోని పెద్దరెల్లి వీధికి కల్యాణి జ్యోతిప్రసాద్ ఎస్పీకి గురువారం ఫిర్యాదు చేశారు. విలేకరి తాను పనిచేస్తున్న పత్రికలో వ్యతిరేక కథనాలు రాస్తానని భయపెడుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసు ఉన్నతాధికారులకు చెప్పి కేసులు పెట్టిస్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి కొంత డబ్బులు తీసుకున్నాడన్నారు. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో భరించలేక తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నాడు. కులం పేరుతో కూడా దూషించాడని, ఎస్పీకి సంబంధిత ఆధారాలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను అందించానని తెలియజేశాడు. అదృశ్యమైన యువతులు సురక్షితంఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి కేంద్రం (సీ్త్ర సదన్ మహిళా ప్రాంగణం) నుంచి బ్యూటీషియన్ శిక్షణ పొందుతున్న ఇద్దరు యువతులు మంగళవారం అదృశ్యమైన విషయం తెలిసిందే. దీంతో సీ్త్ర సదన్ ఇన్చార్జి సనపల సత్యవతి ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గత రెండు రోజులుగా వీరికోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో యువతులు కనిపించారు. దీంతో వీరిని విశాఖపట్నం ఎన్టీఆర్ నైపుణ్య అభివృద్ధి కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. యువతులు సురక్షితంగా ఉండడంతో ప్రాంగణం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. యోగా పోటీల్లో సత్తాచాటిన దంపతులు ఆమదాలవలస: పట్టణంలోని పతాంజలి యోగా శిక్షణ కేంద్రం గురువు లగుడు అప్పన్న, ఆయన సతీమణి లగుడు లక్ష్మిలు శ్రీనగర్‌లో ఈనెల 6వ తేదీన జరిగిన యోగా పోటీల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో 50 సంవత్సరాల పైబడిన యోగా క్రీడా విభాగంలో వీరు వివిధ ఆసనాలు వేశారు. లగుడు అప్పన్న ఈ పోటీల్లో తృతీయస్థానం సాధించి కాంస్య పథకం పొందారు. అలాగే లగుడు లక్ష్మి ద్వితీయ స్థానంతో వెండి పతకం సాధించారు. వీరికి నేషనల్ యోగా అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రజిత్పాల్తో పాటు కమిటీ సభ్యులు పతకాలు అందజేశారు. అలాగే జిల్లా యోగా అసోసియేషన్ కార్యదర్శి బొడ్డేపల్లి దక్షణామూర్తి, ఉపాధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు అభినందించారు. తోటలో వ్యక్తి ఆత్మహత్య పాతపట్నం: మండలంలో పాశీగంగుపేట గ్రామ సమీపంలోని జీడి, మామిడి తోటలో అదే గ్రామానికి చెందిన బురల్లా మొఖలింగం అల్లుడు మహ్మద్ షఫీ (29) గురువారం సాయంత్రం మామిడి చెట్టుకు ఊరివేసుకుని మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాశీగంగుపేట రెల్లివీధికి చెందిన బురల్లా మొఖలింగం, అతని కుమార్తె బురల్లా రాములమ్మ 8 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ రాములమ్మకు మహ్మద్ షఫీతో పరిచయం పెరగడంతో పెళ్లి చేసుకున్నారు. కాగా ప్రస్తుతం మొఖలింగం తన కుమారుడు బురల్లా మురళీ వద్ద పాశీగంగుపేటలో ఉంటున్నాడు. మమ్మద్ షఫీ నాలుగు రోజుల క్రితం పాశీగంగుపేట గ్రామానికి మామ ఇంటికి వచ్చాడు. భార్య హైదరాబాద్‌లో ఉంది. గురువారం సాయంత్రం గ్రామస్తులు షఫీ ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఎస్ఐ బి.లావణ్య, పోలీసులు సంఘటన స్థలంకు చేరుకున్నారు. విషయాన్ని భార్య రాములమ్మకు ఫోన్లో తెలియజేయడంతో ఆమె భర్త మృతి అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. తన భర్తకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏమీ లేదన్నారు. సంఘటన స్థలం వద్ద క్లూస్ టీమ్ విచారణ చేపట్టింది. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
టీచర్లపై ఒత్తిడి చేయడం తగదు
ప్రైమరీ స్కూల్ ఉండాలి ప్రతీ గ్రామంలో బేసిక్ ప్రైమరీ స్కూల్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని పంచాయతీ కేంద్రాల్లో కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి, తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఐదు తరగతులకు ఐదు తరగతి గదులు, ఇతర మౌలిక వసతులను కల్పించి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని కోరారు. మోడల్ ప్రైమరీ స్కూల్ పేరుతో పంచాయతీల్లో ఉన్న స్కూల్స్‌ను ఫౌండేషన్ స్కూల్స్ మార్చడం అనే ఆలోచన సరైనది కాదన్నారు. దీనివలన ప్రైవేటు విద్యకు రెట్కార్పెట్ వేసినట్లు అవుతుందని ఆరోపించారు. అలాగే ఇప్పుడున్న ప్రాథమికోన్నత పాఠశాలలను అవకాశం ఉన్న దగ్గర 60+ రోల్ ఉంటే హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసి, మిగతా ప్రాథమికోన్నత పాఠశాలలను స్కూల్ అసిస్టెంట్లతో యథావిధిగా కొనసాగించాలని కోరారు. శ్రీకాకుళం న్యూకాలనీ: వివిధ అంశాల్లో ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం ఎంతమాత్రం తగదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లండ బాబూరావు, బమ్మిడి శ్రీరామమూర్తిలు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 117 జీవోను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా ప్రాథమిక పాఠశాలలు మరియు ప్రాథమికోన్నత పాఠశాలలను కుదించాలనే పన్నాగం చేస్తోందని మండిపడ్డారు. దీనికోసం గతంలో చేసిన ఎస్ఎంసీ తీర్మానాలకు విరుద్ధంగా, ప్రభుత్వానికి అనుకూల ఎస్ఎంసీ తీర్మానాలు చేసి అర్జెంటుగా ఆన్లైన్ చేయాలని ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనిని పాఠశాలల హెచ్ఎంల కంటే విద్యాశాఖ అధికారులే నేరుగా రంగంలోకి దిగి తమకు కావాల్సినట్లుగా చేసుకుంటే ఉపాధ్యాయులకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఇప్పటికే ఎస్ఎంసీ తీర్మానాలు చేసి మండల విద్యాశాఖ అధికారులకు, జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. మరలా ఇప్పుడు ఒకపక్క విద్యార్థులకు పరీక్షలు జరుతుండగా, ఎస్ఎంసీ తీర్మానాలు చేసి అప్లోడ్ చేయమని ఒత్తిడి చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ప్రతీ గ్రామంలో బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాల్సిందే ప్రభుత్వానికి యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల విజ్ఞప్తి -
తరలించొద్దు
మా పాఠశాలలో తరగతులను మరో పాఠశాలకు తరలిస్తామని చెబుతున్నారు. దీనివలన ప్రతీరోజూ ఇబ్బందులు పడుతూ పాఠశాలకు వెళ్లాల్సి వస్తుంది. రైల్వే ట్రాక్ దాటాల్సిన ఇబ్బంది ఉంది. మా ఊరులోనే ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి. – బి.కుసుమ, 7వ తరగతి, బొరిగిపేట, టెక్కలి మండలం తరలిస్తే చదువుకు దూరం చుట్టుపక్కల సుమారు 10 గ్రామాలకు మా పాఠశాల ఎంతో ఆసరాగా ఉంది. ఇటువంటి పాఠశాలలో ప్రాథమికోన్నత తరగతులు తరలిస్తే మేము అంగీకరించం. విలీనం ప్రతిపాదన రద్దు చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను విన్నవించాం. అన్ని రకాల సదుపాయాలు ఉన్న మా పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలి. – ఎస్.ఢిల్లేశ్వరరావు, విద్యార్థి తండ్రి, బొరిగిపేట, టెక్కలి మండలం తరలిపోతే ఇబ్బందులు మా ఊరులో ఉన్న బడిలో 6, 7, 8 తరగతులు మరో బడికి తరలిస్తారని చెబుతున్నారు. ఇలా చేస్తే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వంశధార కాలువతో పాటు ప్రమాదకరమైన రోడ్డు దాటి పోలవరం వెళ్లడానికి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. – పి.సరోజనమ్మ, విద్యార్థి తల్లి, పెద్దసాన, టెక్కలి మండలం ● -
ఉరి..!
ఊరు బడికి ● టెక్కలి మండలంలోని బొరిగిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం 84 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 6 నుంచి 8 తరగతుల్లో 35 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఇదే తరగతులను సీతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే తమ గ్రామంలోని ప్రాథమికోన్నత తరగతులను తరలిస్తే సహించేది లేదని, అవసరమైతే ఉన్నత పాఠశాలగా మార్చాలని గ్రామం మొత్తం విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. సీతాపురం ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే రైల్వే ట్రాక్, వంశధార ప్రధాన కాలువ దాటాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. టెక్కలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఎత్తుగడలు వేస్తోంది. దీనిలో భాగంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన తల్లికి వందనం పథకం ఒక ఏడాది ఎగ్గొట్టేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ట్యాబ్‌ల నిర్వాహణను గాలికొదిలేశారు. కాగా ఇప్పుడు కొన్ని గ్రామాల్లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులను ఎత్తివేసి, ఆయా గ్రామాలకు కొంతదూరంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. అయితే విలీనం కోసం విద్యాశాఖాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, గ్రామస్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత చోటుచేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రాథమికోన్నత స్థాయి తరగతుల విలీనం విధానంతో గ్రామాల్లోని విద్యార్థులు చదువులకు దూరం కావడమే కాకుండా, పరోక్షంగా ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. తరగతుల విలీనానికి ప్రభుత్వం చర్యలు పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రైవేటును ప్రోత్సహించడమేనని ఆరోపణలు -
జగన్ భద్రతపై కూటమి కుట్రలు
● వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ టెక్కలి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ధ్వజమెత్తారు. ఈ మేరకు టెక్కలిలో గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. దీంతో ఏదో రకంగా అల్లర్లు సృష్టించి దానిని వైఎసా్‌స్‌ర్‌సీపీ మీద నెట్టేయాలని కూటమి నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే రామగిరి పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతను కుదించారని దుయ్యబట్టారు. భద్రత విషయంలో ఎటువంటి తప్పిదాలు జరిగినా, దానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ టీడీపీ కార్యకర్తగా వ్యవహరించిన సంగతి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే, ఆ విషయం హోంమంత్రి అనితకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, టీడీపీ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసుల వలన పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందన్నారు. దీనికి తగినమూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందడంతో నడిరోడ్డుపై లింగమయ్యను హత్య చేశారని, దీంతో ఆ కుటుంబాన్ని జగన్ పరా మర్శించడానికి వెళ్లగా, దానిపై హోంమంత్రి బాధ్య తారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అలాగే ఒక మాజీ సీఎం భార్యపై నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వ్యక్తిపై కేవలం నామమాత్రపు చర్యలతో వదిలేస్తున్నారని మండిపడ్డారు. -
ఉపాధి వేతనదారుకి పాముకాటు
నరసన్నపేట: మండలంలో ని కోమర్తికి చెందిన ఉపాధి వేతనదారు పెరుమోల తులసి పాముకాటుకు గురైంది. పోలాకి చానల్లో గత వారం రోజులుగా ఉపాధి పని నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం పనికి అందరితో కలిసి తులసి కూడా వెళ్లింది. అయితే అక్కడ మట్టిని తొలగించేందు కు జంగిల్ తొలగిస్తున్నప్పుడు కాలికి పాము కరిచింది. వెంటనే అప్రమత్తమైన ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలి పారు. ముందు జాగ్రత్త చర్యగా రక్త పరీక్షలు చేసి అవసరమైన వైద్యమందిస్తున్నట్లు పేర్కొన్నారు. ముద్దాయికి ఏడాది జైలు శిక్ష పొందూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతికి కారణమైన ముద్దాయి లారీ డ్రైవర్ కిల్లాన శ్రీనుకు పొందూరు జూనియర్ సివిల్ జడ్జి బి.జ్యోత్స్న ఏడాది సాధారణ జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. 2019వ సంవత్సరంలో పొందూరు మండలంలోని గారపేట గ్రామానికి చెందిన అంబళ్ల సంతోష్, చీమల మణికంఠలు బైక్‌పై వెళ్తుండగా, రెడ్డిపేట జంక్షన్ వద్ద లారీతో కిళ్లాన శ్రీను ఢీకొనడంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. చీమల మణికంఠ తీవ్రగాయాలపాలైయ్యాడు. దీనిపై అప్పటి ఎస్ఐ మహ్మద్ యాసిన్ లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పొందూరు కోర్టులో విచారణ జరగగా డ్రైవర్ శ్రీనుకు జడ్జి శిక్ష విధించారు. -
సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
● ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకుల డిమాండ్ శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రెండు రోజుల ధర్నా కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు గురువారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన తెలిపారు. ఎన్ఎంయూ నాయకులు ఎన్వీఆర్ మూర్తి, ఎంఎన్ రాజు, వి.శాంతరాజులు మాట్లాడుతూ.. ఉద్యోగుల ఉద్యోగ భద్రతా సర్క్యూలర్ 1/2019ను వెంటనే అమలు చేయాలని, అక్రమ సస్పెన్షన్లు, అక్రమ రిమూవల్స్‌ను ఆపాలని డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని విన్నవించారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు వెంటనే మంజూరు చేయాలన్నారు. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగుల అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ద్వారా లేదా సంస్థ ద్వారా మాత్రమే కొనాలన్నారు. పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎన్ఎంయూ నాయకులు నవీన్‌బాబు, వీరబాబు, వీడీ రావు, ఎంఎస్సీ రావు, పార్వతి, అప్పలనరసమ్మ, కృష్ణవేణి పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
పుట్లూరు: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన భాగమతి (32)కి మూడేళ్ల క్రితం చైన్నెలోని పుట్లూరు మండలం గాండ్లపాడుకు చెందిన రామేశ్వరరెడ్డితో వివాహమైంది. వీరికి రెండేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. రెండేళ్ల కిందట రామేశ్వరరెడ్డి రెండు ఎకరాల భూమిని విక్రయించగా వచ్చిన రూ.30 లక్షలను ఇతరులకు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకున్న వ్యక్తి వడ్డీలు సక్రమంగా చెల్లించకపోగా, అసలు చెల్లింపులోనూ తాత్సారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మనస్తాపానికి గురైన భాగమతి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరి భారతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటనరసింహ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
నేటి నుంచి కొల్లవానిపేట రైల్వే గేట్ మూత
నరసన్నపేట: మండలంలోని కొల్లవానిపేట రైల్వే గేట్‌ను గురువారం నుంచి మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు శ్రీకాకుళ రోడ్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎం.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లవానిపేట గేట్ పరిసరాల్లో ట్రాక్ నిర్వహణ పనులు నిర్వహిస్తున్నందున గేట్ మూసి వేస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గేట్ మూత వేస్తున్నామని, వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. మహిళా ప్రాంగణంలో కలకలం ● ఇద్దరు యువతులు అదృశ్యం ● బ్యూటీషియన్ కోర్సులో శిక్షణకు వచ్చి మాయం ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్.టి.ఆర్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం (సీ్త్ర సదన్ మహిళా ప్రాంగణం)లో ఇద్దరు యువతులు అదృశ్యం కావడం కలకలంగా మారింది. బ్యూటీషియన్ శిక్షణ పొందుతున్న 21 ఏళ్ల యువతి, 18 ఏళ్ల యువతి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లంచ్ బ్రేక్‌కు బయటకు వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో సీ్త్రసదన్ ఇన్చార్జ్ సనపల సత్యవతి ఇన్చార్జ్ మహిళా ప్రాంగణం మేనేజర్ పి.విమల సూచన మేరకు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 6309990816, 63099 90816 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ ఇద్దరు యువతులదీ విశాఖపట్నం కాగా, ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. ఇందులో ఓ యువతికి దూరపు బంధువులు ఉన్నట్లు తెలిసింది. విశాఖపట్నం సీ్త్రసదన్లో బ్యూటీషియన్ కోర్సు లేకపోవటంతో వీరు ఎచ్చెర్ల కేంద్రంలో చేరి ఈ నెల ఒకటో తేదీ నుంచి శిక్షణ పొందుతున్నారు. శిక్షణ కాలం రెండు నెలలు. వీరిద్దరు స్నేహితులు. ఇద్దరి వద్దా ఫోన్లు లేదు. తోటి అభ్యర్థుల వద్ద ఫోన్ తీసుకుని హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉంటున్న ఇద్దరు వ్యక్తులతో తరచూ మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆ ఫోన్ నంబర్లు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ మేజర్లు కావటంతో ప్రేమ వ్యవహారమా? ఇతర కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలు ఉంటే స్థానిక అధికారుల వద్ద అనుమతి తీసుకొని వెళ్లవచ్చు. అలాకాకుండా సిబ్బంది కళ్లుగప్పి వెళ్లిపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 11న విదేశాల్లో ఉద్యోగాలకు జాబ్‌మేళా టెక్కలి: విదేశాల్లో వివిధ రకాల ఉద్యోగాల కోసం ఈ నెల 11న టెక్కలి అదిత్య ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. తెలంగాణ కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ గుర్తింపు పొందిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరి, జపాన్ వంటి దేశాల ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హెల్త్‌కేర్, నాన్ హెల్త్‌కేర్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు సౌదీ అరేబియా, కతార్, యూకే, కెనడా, జపాన్, జర్మనీ, ఇజ్రాయిల్, అమెరికాలోని ఆరోగ్య రంగంలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జపాన్, జర్మనీ, ఫిజి, గ్రీస్‌లలో ఆరోగ్యేతర రంగాల్లో ఉద్యోగాలు చేయడానికి అర్హులని తెలిపారు. 40 ఏళ్లలోపు వయసు కలిగి ఆసక్తి గలవారు జాబ్‌మేళాకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 8466096181, 9876339690 నంబర్లను సంప్రదించాలని కోరారు. జాతీయ హ్యాండ్‌బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ సబ్‌జూనియర్స్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో గొర్లె ఢిల్లేశ్వరరావు, బుగత రమేష్ ఉన్నారు. ఒడిశా వేదికగా జరగనున్న ఈ పోటీల కోసం ఇక్కడి నుంచి పయనమై వెళ్లారు. వీరిద్దరూ అల్లినగరం జెడ్పీహెచ్స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. ఢిల్లేశ్వరరావుది లావేరు మండలం సెగిడిపేట గ్రామం. రమేష్ ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామానికి చెందినవాడు. గతంలో వీరిద్దరూ అనేక రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించడంతోపాటు రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–14, అండర్–17 వయో విభాగాల్లో రజత, కాంస్య పతకాలతో సత్తాచాటారు. తాజాగా జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
● గ్రామాల్లో ఆటలమ్మ, గవదబిళ్లల కేసులు ● వేసవి నేపథ్యంలో పెరుగుతున్న తీవ్రత ● పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు పాతపట్నం: వేసవి వచ్చిందంటే చాలు కొందరికి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా చిన్నారుల్లో చికిన్పాక్స్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. గవదబిళ్లలు, ఆటలమ్మగా పిలిచే ఈ సమస్య బారిన పడిన వారికి జలుబు, జ్వరం, శరీరంపై పొక్కులు, దవడలకు ఇరువైపులా వాపు, నొప్పి వంటివి తీవ్రంగా బాధిస్తాయి. అన్ని వయసుల వారికి ఈ అంటువ్యాధులు సోకే అవకాశమున్నా, ప్రధానంగా చిన్నారుల్లో ఎక్కువగా వస్తుంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ముందు జాగ్రత్త, అప్రమత్తతతో వ్యవహరిస్తే దీని బారినపడకుండా రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పదేళ్లలోపు చిన్నారుల విషయంలో మరింత శ్రద్ధ చూపాలని చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువుంటే.. సాధారణంగా వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే చిన్నారులు బలవర్ధకమైన ఆహారం తీసుకునేలా తల్లిదండ్రులు చొరవచూపాలి. ఆటలమ్మ, గవదబిళ్లలు సోకిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ఆకలి లేకపోవడం, ఆహారం సరిగా తీసుకోలేకపోవడం వంటి చర్యలు వల్ల తీవ్రంగా నీరసించిపోతారు. శరీరంపై నీటి పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే ఆటలమ్మగా గుర్తించి వైద్యులను సంప్రదించాలి. వ్యాధి తీవ్రత ఆధారంగా వైద్యుల సూచన మేరకు యాంటీవైరస్, యాంటీ బయోటిక్ మందులు వాడాల్సి ఉంటుందిల్లీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఆటలమ్మ సోకిన వారిని మిగతా వారికి దూరంగా ఉంచాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఇవ్వడం మంచిది. గవదబిళ్లలు వచ్చిన వారికి గొంతునొప్పి తీవ్రంగా ఉంటుంది. తరచూ ద్రవపదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. ఆటలమ్మ, గవదబిళ్లలు వచ్చిన వారి విషయంలో ప్రజలు అపోహలు, మూఢ నమ్మకాలతో వైద్య సహాయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యాధులు సోకకుండా ఉండేందుకు పిల్లలకు గోరువెచ్చని నీరు, శుభ్రమైన ఆహారం ఇవ్వడంతో పాటు పరిసరాల్ని పరిశుభ్రంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం తగదు.. ఆటలమ్మ, గవదబిళ్లల వ్యాధులపై నిర్లక్ష్యం తగదు. చిన్నారులు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. వ్యాధి లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనలు మేరకు మందులు వాడాలి. – డాక్టర్ ఎస్.కృష్ణారావు, సూపరింటెండెంట్, సీహెచ్‌సీ, పాతపట్నం -
ప్రైవేట్ డిగ్రీ కాలేజీల సమస్యలు పరిష్కరించాలి
ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్ మెంట్ అసోషియేషన్ అధ్యక్షుడు పొన్నాన జయరాం డిమాండ్ చేశారు. సంఘ కార్యవర్గాన్ని కడపలో బుధవారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సన్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పొన్నాన జయరాం, జాయింట్ సెక్రటరీగా జిల్లాకు చెందిన బొంతు శ్రీనివాసరావు, రీజనల్ కో–ఆర్డినేటర్‌గా కోట మురళీధర్, కార్యవర్గ సభ్యునిగా దేవరాజులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త కోర్సులు ప్రారంభానికి అడ్డంగా ఉన్న జీవో 36 రద్దు చేయాలని, జీవో 22 రద్దు చేసి ఫీజులు నిర్ణయాధికారం స్థానిక వర్సిటీలకు అప్పగించాలని, పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలని, ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
బ్యాంకు ఉద్యోగి దుర్మరణం
నరసన్నపేట: నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసన్నపేట నాయుడువీధికి చెందిన హరినాథ్కుమార్నాయుడు (బాబీ)(46)మృతిచెందారు. ఈయన నెల్లూరు జిల్లా ముత్తుకూరు యాక్సిస్ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తిరుపతిలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తూ ముత్తుకూరు మండలం కొప్పలదొరువు సమీపంలో కుక్క అడ్డంగా రావడంతో అదుపుతప్పి పడిపోయారు. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బుధవారం వేకువజామున చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో నాయుడువీధిలో విషాదం అలముకుంది. మంచి మిత్రుడిని కోల్పోయామని గొద్దు చిట్టిబాబు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. -
చిల్లంగి నెపంతో చంపేశారు..
● అనుమానాస్పద మృతిని ఛేదించిన ఎచ్చెర్ల పోలీసులు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివేకానంద శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల క్యాంపస్ : తన కుమారుడిని చిల్లంగి పెట్టి చంపేశాడన్న మూఢ నమ్మకంతో ఓ వ్యక్తి తన కుటుంబీకులతో దారుణానికి ఒడిగట్టాడు. అన్యాయంగా ఓ వ్యక్తిని చంపేశాడు. ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఎచ్చెర్ల పోలీసులు చివరికి హత్య కేసుగా ధృవీకరించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద వివరాలు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా.. ఎచ్చెర్ల మండలం అజ్జరాం గ్రామానికి చెందిన బోర ఈశ్వరరావు గతేడాది డిసెంబరు 15న అదే గ్రామ పరిధిలోని కాష్యూ గార్డెన్ సమీపంలో మృతదేహంగా కనిపించాడు. ఎచ్చెర్ల ఎస్ఐ సందీప్ అదే రోజు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈలోగా మృతుని పోస్టుమార్టం రిపోర్టును సంబంధిత వైద్యులు ఇచ్చారు. అందులో మృతుడి మెడ చుట్టూ ఉన్న లిగేచర్ మార్క్, తలలో రక్తస్రావం ఆధారంగా మృతుడు ఈశ్వరరావుని ఎవరో తీవ్రంగా కొట్టి, మెడ నొక్కి చంపినట్లు గుర్తించారు. దీంతో కేసును జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అనేక విషయాలు.. అజ్జరాం గ్రామానికి చెందిన బోర ఆదినారాయణ కుమారుడు బోర సాయి గిరిధర్ రెడ్డి (24) జ్వరంతో బాధపడుతుండేవాడు. రూ.11 లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకపోవడంతో 2024 జూలైలో చనిపోయాడు. తన కుమారుని చావుకి బోర ఈశ్వరరావే కారణమని, చిల్లంగి పెట్టి చంపివుంటాడని గట్టిగా నమ్మాడు. దీంతో అతని సోదరుడు బోర సంజీవరెడ్డి, మేనల్లుడు నగిరెడ్ల గోవిందు (లావేరు మండలం, సీతాపురం)లతో కలిసి ఎలాగైనా ఈశ్వరరావును తుదముట్టించాలనుకున్నాడు. ఇలా చంపేశారు.. గతేడాది డిసెంబరు 15న అజ్జరాం గ్రామం సమీపంలోనే ఈశ్వరరావును దారి కాచి ముందుగా కొట్టారు. అనంతరం పురుగుల మందు తాగించి మెడ చుట్టూ తువ్వాలు చుట్టి బిగించి చంపేశారు. మంగళవారం సాయంత్రం ఏ–1 నిందితుడైన బోర ఆదినారాయణను అజ్జరాంలోని అతని తోట వద్దే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని అంగీకరించాడు. బుధవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి తువ్వాలు, పురుగుల మందు సీసా స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ అవతారం ఆధ్వర్యంలోని ఎచ్చెర్ల పోలీసులను డీఎస్పీ వివేకానంద అభినందించారు. -
పురుగు మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య
మెళియాపుట్టి : మండలంలోని జర్రిభద్ర గ్రామానికి చెందిన దుంపల సూర్యారావు(80) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూర్యారావుకు ఐదుగురు కుమారులు. చాలా సంవత్సరాల క్రితమే భార్య చనిపోవడంతో నెలకొక కుమారుడి ఇంటి వద్ద ఉంటున్నాడు. ప్రస్తుతం కుమారుడు నాగేశ్వరరావు వద్ద ఉండేవాడు. ఏం జరిగిందో గానీ మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం గ్రామానికి కొంతదూరంలో ఉన్న పంటపొలాల్లో వాంతులు చేసుకుంటూ పడిపోయాడు. స్థానికులు గమనించి సమాచారం అందించగా మరో కుమారుడు అప్పారావు 108 అంబులెన్సులో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. పురుగుల మందును నీటిలో కలిపి తాగినట్లు పోలీసులు గుర్తించారు. కుమారుడు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రమేష్ బాబు తెలిపారు.బంగారం కోసం వృద్ధురాలిపై దాడి సోంపేట : మండలంలోని కొర్లాం పంచాయతీ బ్రాహ్మణ కొర్లాంకు చెందిన వృద్ధురాలు బంగారు దమయంతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి ఆమె వద్ద ఉన్న బంగారంతో పరారయ్యాడు. బారువ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దమయంతి పాలు అమ్ముకుని ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ముక్కున ధరించిన బంగారాన్ని దోచుకుని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ బి.మంగరాజు, ఎస్ఐ హరిబాబునాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రైలు ఢీకొని యువకుడు మృతి టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం–తిలారు రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తెలుపు షర్టు, నలుపు ఫ్యాంట్ ధరించాడని, 30 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియలేదు. వివరాలు తెలిసిన వారు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డి.హరినాథ్(8985021143)కు తెలియజేయాలని కోరారు. -
అంతే వీరు.. మారదు తీరు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ తీరు మారడం లేదు. ఏ సీటు చూసినా ఏమున్నది గర్వకారణం.. శాఖ సమస్తం అవినీతిమయం అన్న రీతిలో ఇక్కడ వసూళ్లు జరుగుతున్నాయి. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇన్చార్జిల నియామకం, బిల్లులు పెట్టడం, ఇలా ప్రతి పనికీ ఒక రేటును నిర్ణయించారు. ఇక్కడి సిబ్బందే అవినీతి గురించి బాహాటంగా చెబుతున్నారు. అ‘ధనపు’ బాధ్యతలు శాఖలో ఇష్టానుసారం అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉన్న పని చేసేందుకే ఇబ్బందులు పడుతుంటే.. అదనపు వసతి గృహాల బాధ్యత తీసుకుంటున్న ఏకై క శాఖ బీసీ సంక్షేమమే. కనీసం హాస్టళ్ల మధ్య దూరమైనా పరిగణనలోకి తీసుకోకుండా ఇన్చార్జిలను నియమిస్తున్న వైనం విస్మయపరుస్తోంది. వార్డెన్ పోస్టుల నియామకాలు లేకపోవడం, పదో న్నతులు, ఉద్యోగ విరమణలు వంటి కారణాలతో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. దీంతో ఇన్చార్జిలపై ఆధారపడక తప్పని పరిస్థితి. ఇదే అదనుగా చాలా మంది వసూళ్లకు తెర తీస్తున్నారు. వీరి వల్ల నిజాయితీగా ఉండేవారికి కూడా చెడ్డపేరు వస్తోంది. నరసన్నపేట బీసీ బాలికల వసతి గృహాన్ని పొందూరులోని హెచ్డబ్ల్యూకి అప్పగించారు. ఈ రెండింటి మధ్య దూరం 50 కిలోమీటర్లు. రెండు హాస్టళ్ల మధ్య చాలా హాస్టళ్లు ఉన్నాయి. అయినా బాధ్యతల అప్పగింతలో ఇవేవీ చూసుకోలేదు. బీసీ సంక్షేమ శాఖ వార్డెన్‌ను కాదని, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌కు బాధ్యతలు అప్పగించడం మరో విచిత్రం. ఇచ్ఛాపురం–బారువ, రాజపురం–పలాస–కంచిలి, కింతలి–మురపాక వంటి హాస్టళ్ల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉన్నా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం ఆశ్చర్యకరం. మామూళ్ల మత్తులో బీసీ సంక్షేమ శాఖ పనిని బట్టి రేటు.. లేదంటే సాకు ఇవి ఇక్కడ షరా ‘మామూలే’ ఇటీవల బీసీ కళాశాల వసతి గృహంలో ఒక విద్యార్థినిపై దాడి జరిగింది. ఇక్కడి వార్డెన్‌పై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అయితే అక్కడ సీసీ కెమెరాలు, ఇతర వసతులు కల్పించాల్సి ఉంది. ఆ శాఖ ఉన్నతాధికారి అన్ని ఖర్చులు వార్డెన్ చేత పెట్టించి బిల్లులు మాత్రం ఉన్నతాధికారి అప్పగించారు. పోలవరంలో విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఆ వార్డెన్ విద్యార్థుల కోసం పెట్టిన ఖర్చు కంటే ఉన్నతాధికారుల కోసం పెట్టిన ఖర్చు చాలా ఎక్కువ. ఒక వేళ ఎవరి గురించైనా పేపర్లో వార్త వస్తే ఉన్నతాధికారులు దాన్నీ సొమ్ము చేసుకుంటారని భోగట్టా. స్టడీ సర్కిల్‌కు చైర్లు కొనడానికి కలెక్టర్ డబ్బులిచ్చినా.. ప్రతి వార్డెన్ చేత రెండేసి కుర్చీలు కొనిపించి తీసుకున్నారు. -
పురుషోత్తపురంలో డయేరియా
ఇచ్ఛాపురం టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురంలో డయేరియా ప్రబలుతోంది. ఈ ప్రాంతంలో ఐదుగురు డయేరియాతో బాధ పడుతున్నారు. దీంతో ఒకటో వార్డు కౌన్సిలర్, వైఎస్సార్సీపీ నాయకుడు ప్రేమ్‌కుమార్ మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్‌కు వినతి పత్రం అందించారు. ఆ మేరకు కమిషనర్ పురుషోత్తపురంలో గల బావి, వీధుల్లో క్లోరినేషన్ చేయించారు. అర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ జూహిత, ఇతర వైద్య సిబ్బంది బుధవారం గ్రామంలో ఇంటింటా సర్వే చేసి రోగులకు మందులు అందజేశారు. వైద్య శిబిరం నిర్వహించి అవగాహన కల్పించారు. ఘనంగా ఆగ్నేయ స్థాలిపాక హోమం అరసవల్లి: ఆదిత్యుని వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయ మండపాల్లో ఘనంగా ఆగ్నేయ స్థాలిపాక హో మాలు జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకు డు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం భారతి రమేష్ ప్రము ఖ గాయకుడు భారతి రమేష్ ఆధ్వర్యంలో భక్తి గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించారు. 1800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసంసోంపేట,మందస: సోంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో నవోదయం 2.0లో భాగంగా బుధవారం ఎక్సైజ్ అధికారులు ముమ్మర దాడులు చేప ట్టారు. ఇందులో భాగంగా స్టేషన్ పరిధిలోని మందస మండలం చీపి పంచాయతీ పుట్టూరులో దాడి చేసి 1800 లీటర్ల బెల్లం ఊట, 75 కిలోల బెల్లాన్ని ధ్వంసం చేసినట్టు సోంపేట ఎ కై ్సజ్ సీఐ కె.బేబి తెలిపారు. అలాగే 40 లీటర్ల నాటు సారాతో సవర కుమారిని అరెస్టు చేశామన్నారు. బెల్లం ఊట నిల్వ చేసేందుకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వంశధార పనుల పరిశీలన హిరమండలం: వంశధార రిజర్వాయర్ పనులను వేగంగా పూర్తిచేయాలని చీఫ్ ఇంజినీర్ డి.రామ్‌గోపాల్ అన్నారు. బుధవారం ఎస్ఈ తిరుపతిరావుతో కలిసి వంశధార రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. పెండింగ్ పనుల గురించి ఆరా తీశారు. పనులకు సంబంధించి మ్యాప్ పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఖరీఫ్‌నకు సాగునీరు అందించాలన్నారు. పెండింగ్ పనులపై దృష్టిపెట్టామని, స్పిల్ వేతో పాటు గేట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు. అనంతరం వంశధార నదిలో ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను సైతం పరిశీలించారు. అక్కడ అధికారులతో పాటు నిర్మాణ సంస్థలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వారి వెంట డీఈఈ శ్రీహరి, సిబ్బంది సురేష్, రామకృష్ణ తదితరులు ఉన్నారు. వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత మందస: రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వన్య ప్రాణుల రక్షణ అందరి బాధ్యతని ఎఫ్ఆర్ఓ మురళీకృష్ణంనాయుడు అన్నారు. ఆర్ఓ రాముతో కలిసి ఆయన మంగళవారం చీపి, కృష్ణపురం, పిల్లిబుదరిసింగి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వేసవిలో వన్య ప్రాణులు నీరు తాగేందుకు బయటకు వస్తుంటాయని, వాటికి హాని తలపెట్టకూడదని తెలిపారు. జంతువులు కనిపిస్తే వాటిని సంరక్షించాలన్నారు. -
రాకాసి అలలకు బోటు ధ్వంసం
సంతబొమ్మాళి: మండలంలోని లక్కివలస పంచాయతీ గెద్దలపాడు తీర ప్రాంతంలో సముద్ర అలల ధాటికి ఓ బోటు ధ్వంసమై రూ. 20 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. వివరాల్లోకి వెళితే మంగళవారం సముద్రపు వేట ముగించుకొని 50 బోట్ల ను సముద్రంలో లంగరు వేశారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం గెద్దలపాడు గ్రామానికి చెందిన మత్స్యకారులు వేటకు బయల్దేరారు. తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో లంగరు వేసిన బోట్లు ఏమవుతాయని ఆందోళనతో 50 మంది మత్య్సకారులు తెప్పలపైన సము ద్రంలోకి వెళ్లారు. మూడు గంటలు కష్టపడి లంగరు వేసిన 49 బోట్లను ఒడ్డుకు చేర్చగా అందులో ఒక బోటు కనిపించలేదు. కొద్దిసేపు మత్య్సకారులు గాలించగా బోటు సముద్రంలో మునిగిపో యి ఉండడాన్ని గమనించారు. తాళ్ల సాయంతో సుమారు వందమంది మత్య్సకారులు బోటును తీరం ఒడ్డుకు చేర్చడానికి కష్టపడ్డారు. అయితే అల ల ఉద్ధృతికి బోటు ధ్వంసమై వలలు చిరిగిపోయి సుమారు రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత మత్స్యకారుడు శ్రీరంగం వీరాస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ధ్వంసమైన బోటు, వలను ఫిషరీస్, రెవెన్యూ అధికారులతో పాటు మైరెన్ పో లీసులు పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. బోటు మీద ఆధారపడి జీవిస్తున్న 20 మ త్య్సకార కుటుంబాలు వీధిన పడ్డాయని, ప్రభుత్వం ఆదుకోవాలని మత్య్సకార నాయకులు చింతల రాజులు, శ్రీరంగం రాజులు కోరారు. -
ఢిల్లీలో దొరికాడు
శ్రీకాకుళం క్రైమ్ : విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి యూనివర్సిటీలో ఫీజులు కట్టకుండా ఎగ్గొట్టిన వ్యక్తిని ఎట్టకేలకు రెండో పట్టణ పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ అంశంపై ఏడుగురు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గత ఏడాది జులై 29న ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కజికిస్తాన్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కొందరు విద్యార్థుల నుంచి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌కు చెందిన హరీష్ గంగాధర్ ఒప్పందం ప్రకారం ఒక్కొక్కరి వద్ద రూ. 25 లక్షల నుంచి రూ. 45 లక్షల లోపు వసూలు చేశాడు. కజకిస్తాన్‌లో కళాశాల, వసతిగృహానికి సంబంధించి ఒక సంవత్సర ఫీజును మాత్రమే చెల్లించి మిగతా సొమ్ము సుమారు రూ. 2 కోట్లు కాజేశాడని సీఐ తెలిపారు. ఎప్పటి నుంచో తప్పించుకుని విదేశాల్లో తిరుగుతున్న హరీష్ గంగాధర్‌ను పట్టుకునేందుకు లుకౌట్ నోటీస్ పంపామని, ఎట్టకేలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకుని తమ కు సమాచారం అందించారన్నారు. దీంతో ఢిల్లీ తమ పోలీసులను పంపి హరీష్ గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నామని బుధవారం మధ్యా హ్నం 3 గంటలకు అరెస్టు చేసి రిమాండ్ కోసం కోర్టుకు తరలించామని సీఐ ఈశ్వరరావు వెల్లడించారు. -
చేను మేసింది
ట్రెంచేబైరిలోనూ అదే పరిస్థితి బైరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా నదిలోకి నేరుగా రోడ్డు వేసేశారు. అనుమతి ఉన్న ర్యాంపుగా చెప్పుకుని అడ్డగోలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. నదీ గమనాన్ని మార్చేసేలా రోడ్డు వేయడమే కాకుండా నదిలో ప్రవహిస్తున్న నీటిని మళ్లించేలా పైపులతో చిన్న పాటి వంతెనను కూడా నిర్మించేశారు. అంతటితో ఆగకుండా పరిమితికి మించి, లోతైన గోతులు తవ్వి, ఇసుకను తోడేస్తున్నారు. అక్రమార్కులు విధ్వంసానికి నది స్వరూపమే మారిపోయి, ప్రమాదకరంగా తయారైంది. -
మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలి
● పోలీసులతో సమీక్షలో హోంమంత్రి అనిత శ్రీకాకుళం క్రైమ్ : మహిళలు, బాలికల భద్రతలో భాగంగా వారిపై జరిగే అఘాయిత్యాలు అరికట్టాలని రాష్ట్ర హోంమంత్రి అనిత పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాకు బుధవారం విచ్చేసిన హోంమంత్రి ముందుగా పోలీసు కార్యాలయానికి వచ్చి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం డీఐజీ గోపినాథ్ జెట్టి, శ్రీకాకుళం, విజయనగరం ఎస్పీలు కేవీ మహేశ్వరరెడ్డి, వకుల్ జిందాల్, మన్యం–పార్వతీపురం ఏఎస్పీ అంకిత సూరానలు మంత్రికి పుష్పగుచ్ఛం అందించి దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. అనంతరం మూడు జిల్లాల అధికారులతో మంత్రి సమీక్షించారు. ముందుగా ఎస్పీ మహేశ్వరరెడ్డి జిల్లాలో మహిళలు, బాలికలకు సంబంధించిన నేరాలు, పోక్సో, గంజాయి ఇతర మాదక ద్రవ్యాల కేసులు, గ్రేవ్ ప్రాపర్టీ కేసుల నమోదు, నేర నియంత్రణ చర్యలు, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఛేదించిన తీరును వివరించారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ ఫింగర్ ప్రింట్ పరికరాలు, డ్రోన్, సీసీ కెమెరాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు శక్తి బృందాల ద్వారా సెల్ఫ్ డిఫెన్సు శిక్షణ తరగతులు నిర్వహించాలని, డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటుచేయాలన్నారు. సైబర్ పోలీస్‌స్టేషన్‌ను అందుబాటులోకి తెస్తామని, సాంకేతిక పరిజ్ఞానంపై నైపుణ్యం ఉన్న సిబ్బందిని నియమించి కేసులు త్వరితగతిన ఛేదించాలన్నారు. హోంమంత్రి రాకతో ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురానికి చెందిన తప్పిట గుళ్లు కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీలు పి.శ్రీనివాసరావు, పి.సౌమ్యలత, డీఎస్పీలు వివేకానంద, అప్పారావు, శేషాద్రి, రాంబాబు, భవ్యారెడ్డి, , రాఘవులు, శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లతశ్రీ హోం మినిస్టర్ కలవాలనే కోరిక వ్యక్తం చేయడంతో ఆమెను అనిత కలిసి యోగక్షేమాలు అడిగారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. -
హోం మంత్రి వ్యాఖ్యలు అర్థరహితం
నరసన్నపేట: నడిరోడ్డుపై లింగమయ్యను హత్య చేస్తే దాన్ని కుటుంబ వివాదంగా హోం మంత్రి అనిత మాట్లాడటం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. లింగమయ్య హత్య తదనంతర పరిస్థితులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శకు వెళ్లడంపై హోం మంత్రి మాటలు బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. కేసు దర్యాప్తును నీరు గార్చేలా హోం మంత్రి మాటలు ఉన్నాయని ఆందోళన చేశారు. ఆమె ఒక టీడీపీ నాయకురాలిగా మాట్లాడుతున్నారే తప్ప ఒక రాష్ట్రానికి హోం మంత్రిలా మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. లింగమయ్యది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని అన్నారు. ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించడాన్ని హోం మంత్రి తప్పుపట్టడం దారుణమన్నారు. ఒక హత్య కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు అధికార ప్రతినిధులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఉన్నా దాన్ని పక్కన పెట్టి బాధ్యత గల ఒక హోం మంత్రి ఇలా మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు ప్రజల మద్దతు ఉన్నందు వలనే టీడీపీ భయపడుతోందని తెలిపారు. వైఎస్ జగన్‌లో ఉన్న నిజాయితీని ప్రజలు గుర్తిస్తారని అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
అకాల వర్షంతో రైతుల అవస్థలు
నరసన్నపేట: మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం రైతులు అవస్థలు పడ్డారు. రబీలో పండిన ధాన్యం కళ్లాల్లో, రోడ్లపైన ఉంచారు. వర్షానికి ఈ ధాన్యం తడిచి ముద్దయ్యాయి. పండిన ధాన్యం అమ్ముకోలేక నానా అవస్థలు పడుతుండగా ఈ దశలో వర్షానికి ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందారు. కరగాం, కంబకాయ, నరసన్నపేట, మాకివలస, దేవాది, పోత య్యవలస తదితర గ్రామాల్లో రైతుల ధాన్యం వర్షానికి తడిచాయి. అలాగే రబీ పంటలకు ఈ వర్షం అనుకూలమని వేసవి దుక్కులు కూడా చేసుకో వచ్చని వ్యవసాయాధికారులు అంటున్నారు. -
టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో హైడ్రామా
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం హైడ్రామా నడిచింది. ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లిన ఓ వ్యాపారిపై పోలీసులు చెంపదెబ్బ కొట్టారని అతని భార్య ఆడియో వైరల్ కాగా.. అదే సమయంలో అతను ధ్యానముద్రలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పడం గమనార్హం. ఓ వైపు హోంమంత్రి అనిత అదే సమయంలో జిల్లాకు రానుండటం, ఈ విష యం ఎక్కడ సంచలనంగా మారుతుందోనని పోలీసులు కలవరపాటుకు గురయ్యారు. సీఐ ఈశ్వరరావు, ఫిర్యాదుదారులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. సకలాభక్తుల హరిహరకుమార్, మల్లా సంతో ష్కుమార్లు టీటీడీ కల్యాణ మండపం సమీపంలో వలలు తయారు చేసే దుకాణాలు నడుపుతున్నా రు. ఇద్దరూ బంధువులు కావడం, లావాదేవీల్లో తేడాలు రావడం, హరిహరకుమార్ కుమారుడు సచిన్.. సంతోష్‌కుమార్‌తో గొడవపడటంతో టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు బుధవారం ఉదయం 9:45 గంటలకు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. స్టేషన్లో ఏమైందంటే.. సంతోష్‌కుమార్ భార్య సంధ్య మీడియాకు వాట్సాప్ ద్వారా ఆడియో రికార్డు రిలీజ్ చేశారు. తన భర్త ఫిర్యాదివ్వడానికి వెళ్తే పోలీసులు చెంపదెబ్బ కొట్టారని, కాసేపయ్యాక స్పృహ కోల్పోయారని పేర్కొన్నారు. ఈ విషయమై స్టేషన్ ఎస్ఐ–2 రామారావు వద్ద ప్రస్తావించగా.. తాను సంతోష్‌కుమార్‌ను చెంపదెబ్బ కొట్టలేదని కొద్దిగా దూరం వెళ్లి కూర్చోమని తోయగా అక్కడే ధ్యానం చేస్తూ కూర్చుండిపోయాడని చెప్పారు. స్పృహ కోల్పోలేదని స్పష్టం చేశారు. స్టేషన్‌కు వచ్చిన సమయంలో సంతోష్‌కుమార్ అడ్డంగా పడుకుని ఉన్నాడని, అతని భార్యకు చెబితే ఆమైపెనే చేయి చేసుకున్నాడని పేర్కొన్నారు. ఇదే విషయమై స్టేషన్ ఎస్‌హెచ్‌వో, సీఐ ఈశ్వరరావు వద్ద ప్రస్తావించగా సంతోష్‌కుమార్ అనే వ్యక్తి హరిహరరావు వద్ద రూ. 30 లక్షలు ఛీటింగ్ చేశాడని, ఇందుకు సంబంధించిన పత్రాలు వారి వద్ద ఉన్నాయని, స్టేషన్లో ఎవరూ అతన్ని కొట్టలేదని, థర్డ్‌పార్టీ స్టేట్మెంట్ కూడా తీసుకున్నామని, అతను హరహరరావుపై పెట్టిన కేసు గుర్తింపదగనిదిగా గుర్తించి కేసు నమోదు చేయలేదన్నారు. సంతోష్‌కుమార్‌పై మాత్రం ఛీటింగ్ కేసు నమోదైందన్నారు. ఆసుపత్రిలో సైతం సంతోష్‌కుమార్ విచిత్రంగా ప్రవర్తిస్తూ వైద్యులకు విసుగు తెప్పించాడన్నారు. అంబులెన్సు కూడా తమ స్టేషన్ వద్దకు రాలేదని చెప్పారు. -
ముమ్మాటికీ కూటమి ప్రభుత్వ కుట్రే
● ఎమ్మెల్సీ నర్తు రామారావు కవిటి/ఇచ్ఛాపురం రూరల్ : దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ఒకరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం అడుగడుగునా కుట్రకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత భద్రత విషయంలో కూటమి సర్కారు అనుసరిస్తున్న వైఖరిపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పాపిరెడ్డి పల్లెలో మంగళవారం జరిగిన పర్యటనలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం దారుణమన్నారు. జగన్‌ను చూసేందుకు ఎగబడిన జనాలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. హెలిప్యాడ్ వద్ద అరకొర సిబ్బంది ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ధ్వజమెత్తారు. -
30 ఎకరాల గడ్డివాములు దగ్ధం
నరసన్నపేట: మండలంలోని తోటాడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పెద్దిని రమణయ్య, కొంకాన తిరుపతిరావులకు చెందిన 30 ఎకరాల గడ్డవాములు దగ్ధమయ్యాయి. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. మధ్యాహ్నం 12.30 సమయంలో ఒక్కసారిగా గడ్డివాముల నుంచి మంటలు రావడంతో వెంటనే రైతులు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా గాలి తీవ్రత అధికంగా ఉండటంతో మరింతగా వ్యాపించాయి. వైఎస్సార్సీపీ నాయకులు ఆడంగి సూర్యనారాయణ ఇచ్చిన సమాచారంతో నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే గడ్డివాములు కాలిపోయాయి. ఇదే కళ్లంలో ఉన్న ధాన్యం బస్తాలను రైతులు వెంటనే ఇతర ప్రాంతానికి తరలించడంతో నష్టం తగ్గింది. రైతుల కళ్లాలపై నుంచి విద్యుత్ వైర్లు ఉండటం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు రైతులు అనుమానిస్తున్నారు. పశువుల కోసం ఉంచిన గడ్డి వాములు కాలిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. -
వస్త్ర వ్యాపారి అనుమానాస్పద మృతి
పొందూరు: మండల కేంద్రం పొందూరుకు చెందిన వస్త్ర వ్యాపారి ఉండ్రాళ్ల కిషోర్‌కుమార్(50) అనుమానాస్పదంగా మృతిచెందారు. బుధవారం ధర్మపురం గ్రామ సమీపంలోని బావిలో మృతదేహం తేలడంతో గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీయగా పొందూరుకు చెందిన వస్త్ర వ్యాపారి కిషోర్‌గా గుర్తించారు. వెంటనే భార్య అనూషకు సమాచారం అందించారు. మంగళవారం రాత్రి ధర్మపురంలో బాకీలు వసూలు చేసేందుకు వెళ్లాడని, బావిలో పొరపాటున కాలుజారి పడిపోయి ఉంటారని అనూష ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి.సత్యనారాయణ చెప్పారు. మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కిషోర్‌కుమార్‌కు భార్య అనూష, కుమారుడు శ్రీనిత్, కుమార్తె శ్రీయ ఉన్నారు. కాగా, పొందూరులో దశాబ్దాలుగా కిషోర్ కుటుంబీకులు వస్త్రవ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో ఒడిదుడుకులు రావడం, కస్టమర్లకు ఎక్కువగా అరువులు ఇవ్వడం, దీనికి తోడు బ్యాంకు రుణం ఉండటంతో కొన్నాళ్లుగా ఆందోళన చెందుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పొందూరులో సుపరిచితుడైన కిషోర్ మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి. -
ఎస్సీ వర్గీకరణను ఐక్యతతో అడ్డుకుందాం
శ్రీకాకుళం (పిఎన్ కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చుపెట్టి వివాదాలు సృష్టిస్తున్నాయని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.బెంజమన్ మండిపడ్డారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదివారంపేటలో అంబేడ్కర్ విగ్రహం నుంచి ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని అంబేడ్కర్ ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాల మధ్య వర్గీకరణ పేరుతో కుంపట్లు పెట్టి అశాంతి సృష్టించడం తగదన్నారు. వర్గీకరణ సాధ్యం కాదని ప్రభుత్వాలకు తెలిసినా అధికారం కోసం కొందరిని అడ్డం పెట్టుకొని చిచ్చురేపుతున్నారని ధ్వజమెత్తారు. విభజనను అడ్డుకుని తీరుతామని, అవసరమైతే ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.అంబేడ్కర్, విశ్రాంత తహశీల్దార్ రామప్పడు, సంజీవరావు ఆర్.సూర్యనారాయణ, డి.గోవిందరావు, కె.తవితయ్య, కె.రాజులు, గెడ్డపు రమణ, పి.అప్పన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
ఆమదాలవలస/శ్రీకాకుళం రూరల్: పురపాలక సంఘ పరిధిలోని నాలుగో వార్డు గేదెలవానిపేట కసింవలస మధ్య ఊర చెరువులో చేపల వేటకు దిగి మత్స్యకారుడు మృతిచెందాడు. మెట్టక్కివలస మండల వీధికి చెందిన గయా బాల (47) సోమవారం రాత్రి తోటి మత్స్యకారులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. అందరూ ఒడ్డుకు చేరుకున్నా ఆయన కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే చెరువు మధ్యలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు వివాహాలైన కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
చెట్టు నుంచి జారిపడి విశ్రాంత జవాన్ మృతి
నరసన్నపేట: మండలంలోని లుకలాంలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి బొత్స శ్రీరాములు (50) ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 9 గంటలకు చింత చెట్టు బొట్టలు దులిపేందుకు శ్రీరాములు వెళ్లారు. సూరోడమ్మ ఇంటి పనులు ముగించుకొని చెట్టు వద్దకు వెళ్లేసరికి శ్రీరాములు చెట్టు కింద పడి కనిపించారు. కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి స్థానికుల సహకారంతో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. చెట్టు పైనుంచి పడిపోయే సమయంలో ఎవరూ లేకపోవడంతో మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు. శ్రీరాములుకు ఇద్దరు కుమార్తెలు. నరసన్నపేట పోలీసులు ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. భార్య సూరోడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రశ్నించకపోతే రూ.50 వేలు ఇస్తారట: ఎంపీపీ మొదలవలస
ఎచ్చెర్ల మండలంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ కింద సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, చాలా చోట్ల నాణ్యత పట్టించుకోవడం లేదని ఎంపీపీ మొదలవలస చిరంజీవి అన్నారు. కాంట్రాక్టర్లతో పీఆర్ ఇంజినీర్లు కుమ్మకై ్క 10 శాతం పీసీలు వసూళ్లు చేసుకుని నాణ్యత లేకుండా రోడ్లు నిర్మిస్తున్నారని చెప్పారు. దీనిపై తాను అధికారులను ప్రశ్నిస్తే ‘రూ.50 వేలు ఇస్తాం.. నాణ్యత విషయంలో మాత్రం అడగవద్దు’ అని అన్నారని ఎంపీపీ ఆరోపించారు. దీనిని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా పరిగణించి.. పరిశీలించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై వాగ్వాదాలు పెరుగుతున్న తరుణంలో జెడ్పీ చైర్పర్సన్ విజయ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. -
అధికారులదే బాధ్యత
జనం రోడ్డెక్కితే.. ● రైతులు రెండో పంట వేయవద్దన్నా వినడం లేదు ● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ● నరసన్నపేటలో రూ.80 లక్షల స్కామ్: ఎమ్మెల్యే బగ్గు ● ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు: ఎమ్మెల్సీ విక్రాంత్ అరసవల్లి: జిల్లాలో స్థానిక సంస్థల పరిధిలో ప్రొటోకాల్ ఉల్లంఘనలు, పాలక పార్టీకి అధికారులు కొమ్ముకాయడం, అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించడం, తాగునీటికి వేసవి ప్రణాళిక తదితర అంశాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, డ్వామా, విద్యుత్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, జిల్లా పంచాయతీ, వైద్యారోగ్యశాఖ తదితర శాఖల ప్రగతి నివేదికలపై చర్చించారు. ముందుగా దివంగత జెడ్పీ చైర్మన్, మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం మృతి పట్ల నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, తూర్పు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజా తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య రాకూడదు.. జిల్లాలో చాలా చోట్ల తాగునీటికి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటికై నా ప్రణాళికపరంగా పనిచేయాలని, ఇక ఎక్కడైనా నీటి కోసం రోడ్డెక్కితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.జల్‌జీవన్ మిషన్(జేజేఎం) పథకానికి సంబంధించి పైపులు తవ్వి పనులు వదిలేసిన కాంట్రాక్టర్లను మళ్లీ పిలిపించి వెంటనే పని పూర్తి చేయించాలని, లేకుంటే కాంట్రాక్ట్ రద్దు చేయాలని ఆదేశించారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలు మినహా మిగిలిన ఆరు నియోజవర్గాల్లో జేజేఎం పనులకు ఈ ప్రభుత్వం రూ.2 వేల కోట్లను కేటాయించిందని, వాస్తవానికి ఈ ఏడాది జూన్‌తోనే పథకం ముగియాల్సి ఉన్నా సీఎం చంద్రబాబు చొరవతో మరో మూడేళ్లు పొడిగించారని వివరించారు. జిల్లాలో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని, ఇప్పటికే వంశధారలో నీరు లేదని, చెరువులు, వాగులన్నీ ఇంకిపోయాయని, అయినా రైతులకు రెండో పంట వెయ్యొద్దని చెప్పినా వినలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వరి పంటకు ప్రత్యామ్నయంగా ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లేకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని జెడ్పీటీసీ సభ్యులను కోరారు. జిల్లా వైద్యారోగ్యశాఖ పనితీరు దారుణంగా ఉందని, ఎన్నడూ లేనంతగా అక్రమాలు పెరిగిపోయాయని, ఏళ్లతరబడి కొందరు ఉద్యోగులు తిష్టవేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో కలెక్టర్‌తో కలిసి సమీక్ష చేస్తామన్నారు. ఆక్వా రైతులు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే యూనిట్ విద్యుత్ రూ.1.50 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ●నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో వెలుగు పథకంలో రూ.80 లక్షల స్కామ్ జరిగిందని, సీఎఫ్ సీసీలు ఏకంగా బ్యాంకు ఖాతాల నుంచి వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు జమ చేసుకున్నట్లు ఆధారాలతో దొరికిపోయారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. పోలా కి మండలంలో జేజేఎం కుళాయి పనులు ఆపేశారని, కాంట్రాక్ట్‌ను రద్దు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ●శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం డివిజన్ పీఆర్ ఈఈ పోస్టు పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు తరలిపోయిందని, జిల్లా అవసరాల దృష్ట్యా మళ్లీ ఇక్కడికి తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కోరారు. ● పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ పాతపట్నం, హిరమండలంలో దాహం కేకలు వినిపిస్తున్నాయని. ఇప్పటికే హిరమండలంలో జనం రోడ్డెక్కారని, తక్షణమే వేసవి ప్రణాళిక పనులు ప్రారంభించాలని కోరారు. -
పలాస రైల్వేస్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
పలాస వరకు ప్రయాణం సాఫీగానే సాగింది. అక్కడ బండి ఆగడం.. మళ్లీ బయల్దేరడం సజావుగానే జరిగింది. కానీ పది నిమిషాల్లోనే పరిస్థితి మారిపోయింది. ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఇంజిన్‌కు అనుసంధానమై ఉన్న బోగీలు మందస వరకు వెళ్లిపోగా.. వెనుక ఉన్న బోగీలు మాత్రం సుమ్మాదేవి వద్దే ఆగిపోయాయి. బోగీల లింక్ తెగిపోయిందని తెలుసుకునేలోపే ఇంజిన్ దాదాపు పది కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మూడు గంటల పాటు పడరాని పాట్లు పడ్డారు. లక్ కలిసిరావడంతో పెను ప్రమాదం తప్పి ఊపిరి పీల్చుకున్నారు.కాశీబుగ్గ / ఇచ్ఛాపురం టౌన్ / కంచిలి: సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12704)కు మంగళ వారం పలాస మండలం సుమ్మాదేవి గేటు వద్ద పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వేశాఖ అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి రైల్వే సిబ్బంది, స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు.. ● సికింద్రాబాద్ నుంచి సోమవారం ప్రారంభమైన ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మంగళవా రం ఉదయం ఏడు గంటల సమయంలో పలాస రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు దింపి భువనేశ్వర్ వైపు బయలుదేరింది. ● పలాస రైలు నిలయం నుంచి ఏడుకిలోమీటర్ల దూరంలో ఉన్న సుమ్మాదేవి రైల్వేస్టేషన్‌కు అతి వేగంగా చేరుకునే సమయంలో 7 : 10 నిమి షాలకు సున్నాదేవి స్టేషన్ ముందు గేటు వద్ద రెండు బోగీల మధ్య ఇనుప లింకు తెగిపడింది. ● దీంతో ఫలక్‌నుమా రైలు 14 బోగీలు ఒకవైపు 08 బోగీలు మరో వైపు విడిపోయాయి. ● ఎ–1, ఎం–6 బోగీల మధ్య లింకు తెగిపోయింది. ● ఇంజిన్‌తో ఉన్న బోగీలు సమీప మందస రైల్వేస్టేషన్‌కు చేరుకోగా మిగిలిన బోగీలు నెమ్మదిగా రైలు పట్టాలపై నిలిచిపోయాయి. ● రైలులో ఉండే గార్డు లోకో పైలెట్‌కు సమాచారం ఇచ్చే సమయానికి పది కిలోమీటర్ల దూరంలో మందస వెళ్లిపోగా అక్కడ రైలు బోగీలను పరిశీలన చేశారు. ● మరో సారి వెనుక నుంచి రైళ్లు వచ్చి ఢీకొంటాయేమోనని ప్రయాణికులు రైలు నుంచి దిగి చెట్ల కింద తలదాచుకున్నారు. రైల్వేశాఖ తక్షణమే స్పందించినా ఇంజిన్‌ను సున్నాదేవి వరకు తీసుకువ చ్చి అక్కడ ఉన్న బోగీలకు లింకు చేసి పంపించే సరికి సమయం సుమారు 10.20 దాటింది. సు మారు మూడు గంటల పాటు ప్రయాణికులు పాట్లు పడ్డారు. మందస, ఇచ్ఛాపురం, బ్రహ్మ పురం రైలు నిలయాలలో ప్రయాణికులకు అవసరమైన తాగునీరు, ఫలహారాలను రైల్వేశాఖ తరఫున అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించగా రైల్వే సిబ్బంది వారికి అందజేశారు. లింకు తెగిపోవడానికి గల కారణాలపై రైల్వే శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. సూపర్ ఫాస్ట్ రైలు ట్రాక్‌పై ఉండిపోయిందని తెలియడంతో ఒక్కసారిగా అటుగా రాకపోకలు జరిపే రైళ్లను మూడు గంటల పాటు ఆలస్యంగా నడిపారు.ఆలస్యంగా నడిచిన రైళ్లు సుమ్మాదేవి సమీపంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు తెగిపోయిన ఘటనతో పలు రైలు ఆలస్యంగా నడిచాయి. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ తర్వాత ఆ మార్గంలో వచ్చిన రైళ్లు ఉదయం పూట వచ్చేవన్నీ నిర్దేశించిన సమయానికి సుమారు గంటన్నర ఆలస్యంగా వచ్చాయి. సోంపేట స్టేషన్‌కు ఉదయం 9.30 గంటలకు రావల్సిన చైన్నె–పూరి(రైలు నంబర్:22860) వీక్లీ ఎక్స్‌ప్రెస్ 10.52 గంటలకు వచ్చింది. అదేవిధంగా 9.33 గంటలకు రావాల్సిన తిరుపతి–పూరీ(రైలు నంబర్:17480) వీక్లీ ఎక్స్‌ప్రెస్ 11.15 గంటలకు వచ్చింది. ఇక గుణుపూర్–పూరీ(రైలు నంబర్:18418) ఎక్స్‌ప్రెస్ 11.25కు వచ్చింది. ఇలా పలు రైళ్లు ఆ మార్గంలో నడిచేవి ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చైన్నె–పూరీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను నౌపడ స్టేషన్లో గంటన్నరపాటు ఆపేశారు. ఇక తిరుపతి–పూరీ ఎక్స్‌ప్రెస్‌ను కోటబొమ్మాళి స్టేషన్లో గంటకు పైగా నిలిపివేశారు. ఇలా ఈ మార్గంలో వచ్చే రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేయడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. బోగీల మధ్య లింకు తెగిపోవడంతో ఘటన తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు మూడు గంటల ఆలస్యంతో పాట్లు పడిన వైనం ఆలస్యంగా నడిచిన పలు రైళ్లు నీరు లేక ఇబ్బంది ప్రమాదం జరిగిన చోట నీరు, ఆహారం లేక చాలా మంది ఇబ్బందిపడ్డారు. మందసలో పనులు ఆలస్యంగా చేశారు. – మితిన్ బెహరా, పాత్రపురం, ఒడిశా -
తెలంగాణలో రోడ్డు ప్రమాదం
సరుబుజ్జిలి: తెలంగాణా రాష్ట్రం మియాపూర్ వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నల్లాన సింహాచలం(40) సోమవారం రాత్రి లారీ ఢీకొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మృతిచెందాడు. మృతుడి స్వగ్రామం సరుబుజ్జిలి మండలం చిగురువలస. తండ్రి త్రినాధరావు ఇటీవలే గుండెపోటుతో మృతిచెందాడు. సింహాచలంకు భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 15 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అందరితో మంచిగా ఉండే సింహాచలం మృతి చెందడం పట్ల గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. చిగురువలసకు చెందిన హోంగార్డు మృతి -
ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని మూడు బాలురు, ఆరు బాలికల బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేసిన ట్లు ఆ సంస్థల జిల్లా కో ఆర్డినేటర్ ఎన్.బాలాజీ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం నాడు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థు లు వారికి హాల్ టిక్కెట్లో కేటాయించిన పరీక్షా కేంద్రానికి మాత్రమే హాజరుకావాలని సూచించారు. apbragcet.apcfss.inనుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, హాల్ టికెట్‌తో పాటు గా ఆధార్ కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకోవాలని తెలిపారు. వివరాలకు 9701736862 – 9000314209 నంబర్‌ను సంప్రదించాని తెలిపారు. ‘జిల్లా అభివృద్ధిపై దృష్టి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన సహచర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లా నరేగా పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.500 కోట్ల మెటీరియల్ కాంపోనేంట్ పనులు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో గుంతలు లేని రోడ్ల పనులు ఇ ప్పటికే 96 శాతం పూర్తయ్యాయని, వేసవి ముగిసేలోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాగోలులో జెమ్స్ ఎదుట రూ.2.92 కోట్లతో సైనిక్ భవన్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన జరగనున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకకు వీలుగా అనుకూలమైన ముహూర్తాలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. కిడ్నీ సంబంధిత మరణాలపై పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. అంతకుముందు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. సమా వేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, మామిడి గోవిందరావు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి పోషణ పఖ్వాడా పోస్టర్‌ను ఆవిష్కరించారు. నాటుసారా ముద్దాయిలపై బైండోవర్ పలాస: పలాస మండలంలోని పెదంచల, చినంచల, పెంటిభద్ర, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నాటు సారా కేసులో దొరికిన 35 మంది పాత ముద్దాయిలపై పలాస ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం బైండోవర్ కేసులు కట్టించారు. పలాస డిప్యూటీ తహసీల్దార్ టి.లక్ష్మీనారాయణ సమక్షంలో వారి కార్యాలయంలో ఈ కేసులు కట్టించారు. ఒక ఏడాది కాలపరిమితికి రూ.లక్ష జరిమానా బాండుతో ఈ కేసులు కట్టినట్టు పలాస ఎకై ్సజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.మల్లిఖార్జునరావు చెప్పారు. మే 10న జాతీయ లోక్ అదాలత్ శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 10న జిల్లా స్థాయిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. మంగళవారం ఆయన తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయపరమైన సమస్యలు ఎ దుర్కొంటున్న పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, లోక్ అదాలత్ ద్వారా శాంతియుతంగా, పరస్పర అంగీకారంతో తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పేద కుటుంబంపై కక్ష సాధింపు
● ఆక్రమణల పేరిట సాగుభూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు ● బాధితులు ఎదురు తిరగడంతో రంగంలోకి దిగిన పోలీసులుక్రైం కార్నర్..పోలాకి: మండలంలోని రాజపురం గ్రామంలో ఓ కుటుంబంపై అధికార పార్టీ కక్షసాధింపు చర్యలకు దిగింది. గ్రామానికి చెందిన అవ్వ శాంతమ్మ, గేదెల శారద తదితర కుటుంబాలు వైఎస్సార్సీపీకి మద్దతు పలికారనే కారణంతో అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగారు. దాదాపు నలభై ఏళ్లుగా సాగులో ఉన్న పొలాన్ని చెరువు ఆక్రమణ పేరుతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడికి తెచ్చి తొలగించారు. ఇటీవల అక్కడికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై బాధిత కుటుంబాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇదేం అన్యాయం అంటూ తిరగబడటంతో మంగళవారం దాదాపు 30 మంది పోలీసులు, మరో పది మంది రెవెన్యూ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. తహశీల్దార్ సురేష్‌కుమార్ సమక్షంలో బాధితులకు చెందిన 38 సెంట్ల పొలాన్ని తొలగించారు. తాము అదే రెవెన్యూలో వీఆర్ఏలు పనిచేస్తున్న వ్యక్తుల కుటుంబాల వద్ద కొనుగోలు చేశామని, కొంత సమయం ఇవ్వాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని, అధికార పార్టీ కార్యకర్తల ఆలోచనలే అమలు చేశారని బాధితులు ఆరోపించారు. ఈ విషయమై తహశీల్దార్ ఆర్.సురేష్‌కుమార్ వద్ద ప్రస్తావించగా.. గ్రామస్తుల ఫిర్యాదు మేరకే రాజపురంలో కప్పచెరువు ఆక్రమణలు తొలగించామని చెప్పారు. సర్వే నెంబర్ 26, 28లలో చెరువుతో పాటు శ్మశానానికి చెందిన 1.95 ఎకరాల్లో మొత్తం 14 మందికి చెందిన ఆక్రమణలను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించామన్నారు. కచ్చితమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే మిగిలిన చెరువుల ఆక్రమణలను సైతం తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీకి ఓటు వేశామనే.. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓటేశామనే అక్కసుతోనే ఇలా చేశారు. కావాలనే మాపై కొందరు టీడీపీ నాయకులు కక్ష సాధిస్తున్నారు. పెద్ద మనుషుల ముసుగులో వీరు చేస్తున్న దోపిడీలు, అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తాం. – గేదెల శారద, బాధిత మహిళ, రాజపురం -
అదుపు తప్పిన బైక్..ముగ్గురికి గాయాలు
నరసన్నపేట: కోమర్తి వద్ద జాతీయ రహదారిపై వంతెనపై మంగళవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. పాతపట్నం మండలం కొరసవాడకు చెందిన యువకులు శ్రీను, వాసు, మనోజ్‌లు ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ చేరిన గార ఎస్బీఐ బాధితుల ఆందోళన శ్రీకాకుళం క్రైమ్ : గార ఎస్బీఐలో తనఖా బంగారం మాయం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసులు, వ్యవస్థలను తప్పుదోవపట్టించి బ్యాంకు ఉన్నతాధికారులు ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని, ఓ మహిళా ఉద్యోగిని నిండుప్రాణాన్ని బలిగొన్నారని ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జిల్లావాసులు సోమవారం ఆందోళనకు దిగారు. వీరిలో చనిపోయిన బ్యాంకు ఉద్యోగిని ఉరిటి స్వప్నప్రియ కుటుంబీకులున్నారు. ఆర్ఎం టీఆర్ఎం రాజును బర్తరఫ్ చేయాలని, శ్రీకాకుళం రీజియన్‌లో ఎస్బీఐలో జరిగిన కుంభకోణాలన్నింటిపై విచారణ చేపట్టాలని, స్వప్నప్రియ మరణానికి కారకులను శిక్షించాలంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేపట్టారు. ఎస్బీఐ ఛైర్మన్ కార్యాలయానికి తప్పుడు నివేదికలు అందించడంతో ఫిర్యాదు చేసి ఆరునెలలు గడుస్తున్నా టీఆర్ఎం రాజుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన కుటుంబానికి అన్యాయం చేసిన రాజుతో పాటు డీజీఎంపై కూడా చర్యలు తీసుకోవాలని స్వప్నప్రియ తల్లి సరళ కోరారు. ‘పేపర్లు తెచ్చి బళ్లు పట్టుకెళ్లండి’ శ్రీకాకుళం క్రైమ్ : ఎప్పటి నుంచో జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోలీసు తనిఖీల్లో దొరికిన 48 ద్విచక్ర వాహనాలు ఉండిపోయాయి. ఇప్పటికై నా వాహన యజమానులు సంబంధిత పత్రాలను ఈనెల 12 లోగా తెచ్చి తమ తమ వాహనాలను పట్టుకెళ్లిపోవచ్చని ట్రాఫిక్ సీఐ నాగరాజు మంగళవారం స్పష్టం చేశారు. లేదంటే ద్విచక్రవాహనాలు ఆక్షన్(వేలం)లో వేరేవారి సొంతమవుతాయని పేర్కొన్నారు. వాహన యజమానులు పత్రాలతో పాటు ఆధార్‌కార్డు తీసుకురావాలన్నారు. -
ఆకలితో అలమటించాం..
చైన్నె నుంచి సోంపేటకు వస్తున్న మేము ప్రయాణిస్తున్న రైలు ఫలక్‌నుమా ట్రైన్ ఘటనతో ఆలస్యంగా నడిచింది. దీంతో గంటన్నర ఆలస్యంగా వచ్చాము. దీంతో ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. – మధుస్మితా పండా, కుమార్తె చిన్మయి పండా, ప్రయాణికురాలు, జలంత్రకోట గ్రామం, కంచిలి మండలం ఆందోళన కలిగింది.. మా ముందు వెళ్తున్న రైలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పిందని తెలిసిన తర్వాత మొదట ఆందోళనకు గుర య్యాం. చివరికి ప్రయాణికులెవ్వరికీ ఏమీ కాలేదని తెలిశాక తర్వాత ఊపిరి పీల్చుకున్నాం. – గేదెల మోహనరావు, ప్రయాణికుడు, ఆర్. కరాపాడు గ్రామం, కవిటి మండలం భయపడ్డాం పలాస దాటిన తర్వాత కాసేపటికి మేము ఉన్న బోగీ వేగం తగ్గింది. ఇంతలో ట్రైన్ ఆగి చుట్టుపక్కల ఉన్న వా రు కొన్ని బోగీలు తెగిపోయాయని తెలిపారు. దీంతో భయపడ్డాం. చాలా సమయం తర్వాత వేరే ఇంజిన్ వచ్చి బోగీలను ట్రైన్ వద్దకు తీసుకెళ్లింది. – ఎం బలరాం, చీకటి గ్రామం, ఒడిశా చాలా సమయం పట్టింది పలాస దాటిన తర్వాత ప్రమాదం జరిగింది. ప్రమా దం జరిగిన స్థలం నుండి మందస వరకు వచ్చి అక్కడ ట్రైన్ రిపేరు చేసి ఇచ్ఛాపురం వచ్చేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. – ఎం.పద్మ, చీకటి గ్రామం, ఒడిశా ● -
కిలిమంజారో పర్వతారోహణకు చిరంజీవి
శ్రీకాకుళం అర్బన్: టెక్కలి మండలం కొండభీంపురం గ్రామానికి చెందిన బీపీఈడీ విద్యార్థి సారా చిరంజీవి కిలిమంజారో పర్వతం, రష్యా ఎల్రోస్ పర్వతాల అధిరోహణకు అర్హత సాధించాడని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి డాక్టర్ పైడి సింధూర అన్నారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆర్థిక స్థోమ త లేక పర్వతారోహణకు ఆటంకాలు ఎదురవుతున్నాయని, దాతలు సహకరిస్తే మౌంట్ ఎవరెస్ట్ లాంటి పెద్ద పెద్ద పర్వతాలను అధిరోహించి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పారు. లయన్స్‌క్లబ్ తరఫున తమవంతు సహకారం తప్పక అందిస్తామన్నారు. చిరంజీవి మాట్లాడుతూ ఆక్సిజన్ సిలిండర్లు లేకుండా అధిరోహించడం తన లక్ష్యమని పేర్కొన్నారు. తనను ప్రోత్సహిస్తున్న లయన్స క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం వారికి, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏజీపీగా సుదర్శనరావు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ డివిజన్) అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా బొత్స సుదర్శనరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన మూడేళ్ల పాటు కొనసాగుతారు. ‘డ్వాక్రా’ అభ్యున్నతిపై ఒడిశా బృందం ఆరా గార: రాష్ట్రంలో మహిళా సంఘాల బలోపేతం, జీవనోపాధి మార్గాలు తదితర అంశాలపై ఒడిశా రాష్ట్ర బృంద సభ్యులు ఆరా తీశారు. మంగళవారం గార మండల మహిళా సమాఖ్య సభ్యులతో అడిషనల్ సీఈవో మహాపాత్, డైరెక్టర్ ఎస్.రావత్ సమావేశమై అంశాల వారీగా తెలుసుకున్నారు. గ్రామ సంఘం రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకొని నాయకత్వ మార్పిడి, సభ్యత్వ వాటాదనం, పొదుపు వాడకం, రుణాల వినియోగం, చెల్లింపుల్లో జరిగే ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. మండల సమాఖ్య సంఘం ఆడిట్, పుస్తకం నిర్వహణ, కుటుంబ వ్యవస్థకు ఆర్థిక చేయూత వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మండల ఈసీ సభ్యులు రుణాల రికవరీపై వివరించారు. కార్యక్రమంలో విజయవాడ సెర్ప్ కార్యాలయ అధికారి వీరశేఖర్, లైవ్లీ హుడ్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ అధికారి ఎస్.ఎస్.మూర్తి, బ్యాంకు లింకేజీ అధికారులు, ఏరియా కో ఆర్డినేటర్లు, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు. -
ప్రజలకు రక్షణ కల్పించండి
టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడి అండతో టీడీపీ కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాల నుంచి సామాన్య ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు అధికారులకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో పాటు ఎస్పీ కె.వి.మహేశ్వర్‌రెడ్డిని సోమవారం కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఇటీవల సంతబొమ్మాళి మండల టీడీపీ అధ్యక్షుడు జీరు భీమారావు కలెక్టర్, ఆర్డీవోపై చేసిన దూషణతో పాటు మూలపేట సర్పంచ్ జీరు బాబురావును చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కోటబొమ్మాళి మండలం సింహాద్రిపురం గ్రామంలో సామాన్య రైతులకు చెందిన భూముల్లో దౌర్జన్యంగా రోడ్లు వేయడమే కాకుండా, అడ్డువచ్చిన వారిపై దాడులు చేసిన ఘటనలను వివరించారు. అలాగే సంతబొమ్మాళి మండలం జగన్నాథపురం సర్పంచ్ రాములమ్మకు చెందిన స్థలంలోని కొబ్బరి చెట్లును రాజకీయ కక్షతో అన్యాయంగా తొలగించడమే కాకుండా, ఆమైపె కేసులు నమోదు చేశారని తెలిపారు. కమలనాభపురం గ్రామంలో అన్యాయంగా వృద్ధాప్య పింఛన్ల నిలిపివేతపై ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు మరికొన్ని దౌర్జన్యాలు, కక్ష సాధింపు చర్యలపై జిల్లా అధికారులకు విన్నవించారు. ఆయనతో పాటు కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, నాయకులు ఎస్.హేమసుందర్‌రాజు, బి.మోహన్‌రెడ్డి, పి.వెంకట్రావు, రాములమ్మ, బాబురావు, శివారెడ్డి తదితరులు ఉన్నారు. -
వంశధారను ఆధునీకరిస్తాం
నరసన్నపేట: జిల్లాలోని రైతులకు రెండు పంటలకు సాగునీరు అందేలా వంశధారను ఆధునీకరిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. మండలంలోని ఉర్లాం పంచాయతీ బడ్డవానిపేట వద్ద నూకాలమ్మ చానల్‌పై ప్రధానమంత్రి సడక్ యోజన నిధులు రూ.2.60 కోట్లతో నిర్మించనున్న వంతెన పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశధార ఆధునీకరణకు రూ.1,000 కోట్లు అవసరమని భావిస్తున్నామన్నారు. ఈ నిధులు ఎలాగైనా సమీకరించి పనులు చేయిస్తామన్నారు. అలాగే షట్టర్ల విషయంపై కూడా చర్చించి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా ఉర్లాం రైల్వేస్టేషన్‌ను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. విశాఖ–భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌కు అనుమతి తీసుకు వస్తామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. షట్టర్లు బాగు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో ఉర్లాం సర్పంచ్ పోలాకి నర్సింహమూర్తి, వైఎస్సార్సీపీ నాయకుడు నడిమింటి శాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదిత్యపురిలో పెళ్లి సందడి
అరసవల్లి: సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవానికి ఆదిత్యపురి సిద్ధమైంది. వివాహ క్రతువులో భాగంగా సోమవారం ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీ వారి కల్యాణ మూర్తులను అనివెట్టి మండపంలో వేంచేసింప జేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణలు, మంగళధ్వనుల మధ్య సుగంధ ద్రవ్యాల మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమాన్ని నిర్వహించారు. దుంప పసుకుకొమ్ములు, జాజికాయ, జాపత్రి, వట్టివేళ్లు, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు తదితర సుగంధద్రవ్యాలను దంచుతూ... ‘సువ్వి’ అంటూ ఉత్సవ సంప్రదాయ కీర్తనలను శంకరశర్మ బృందం ఆలపించారు. స్వామివారి వార్షిక కల్యాణోత్సవం మంగళవారం రాత్రి 8.30 గంటల నుంచి జరగనుంది. జాబ్‌మేళా పోస్టర్ విడుదల శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఐటీఐ, బి ఫార్మసీ, చదువుకుని 18–30 ఏళ్ల మధ్య వయసు గల నిరుద్యోగ యువత అర్హులని తెలిపారు. ఈ నెల పదో తేదీన గురువారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాతపట్నంలో జాబ్‌మేళా నిర్వహిస్తారని, 15 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. -
ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళంలో హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో ఇస్తున్న శిక్షణను అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల డీఎంలు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మ కోరారు. శ్రీకాకుళం ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 20వ బ్యాచ్‌ను కాంప్లెక్స్ కార్యాలయ ఆవరణలో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల డీఎంలు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకిత భావంతో అభ్యర్థులు శిక్షణను నేర్చుకోవాలన్నారు. 21వ బ్యాచ్‌లో చేరుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నామని తెలిపారు. లైట్ వెహికల్ లైసెన్స్, ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలని, 21 ఏళ్లు నిండిన వారు ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్‌కు అర్హులని పేర్కొన్నారు. మొత్తము శిక్షణ 40 రోజులు ఉంటుందని తెలిపారు. ఫీజు, ఇతర వివరాల కోసం 7382923293, 7095040608 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ పర్సనల్ ఆఫీసర్ కృష్ణవేణి, శ్రీకాకుళం 1, 2 డిపోల అసిస్టెంట్ మేనేజర్లు వి.రమేష్, ఎ.గంగరాజు, శిక్షకుడు జీఎన్ రావు, సుమన్ పాల్గొన్నారు. -
టీడీపీ నేతలపై చర్యలు తీసుకోండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అధికార బలంతో గ్రామాల్లో టీడీపీ నేతలు అడ్డగోలుగా చేపడుతున్న పనులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. పొందూరు మండలంలోని తానేం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రైవేటు లే అవుట్‌కి రోడ్డు వేశారని తెలిపారు. నిజానికి ఆ రోడ్డుకి ఆనుకొని ఎటువంటి నివాసాలు లేవని పేర్కొన్నారు. దీనికోసం సుమారుగా రూ.28 లక్షల నిధులు దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆమదాలవలసలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. నకిలీ బిల్లులతో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నంకు విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నారన్నారు. అదేవిధంగా సరుబుజ్జిలి మండలంలోని గోనెపాడు పంచాయతీలో రైతుల రెవెన్యూ రికా ర్డులు సరిచేయాలని కోరారు. చిగురువలస పంచాయతీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కోర్టులో పెండింగ్ ఉన్న స్థలంలో అక్రమంగా రాత్రికి రాత్రి సీసీ రోడ్డు నిర్మాణం చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బూర్జ మండలం నీలాదేవిపురంలో ఉపాధి పనుల మేట్ల నియామకాల్లో మండల అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని వివరించారు. పొందూరు మండలంలోని గోకర్ణపల్లి గ్రామంలో అక్రమంగా తొలగించిన వీవోఏని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. -
అర్ధరాత్రి వచ్చి పొమ్మంటే ఎలా..?
టెక్కలి: రోడ్డు విస్తరణ పేరుతో అర్ధరాత్రి వచ్చి తెల్లవారింటికి ఇళ్లు ఖాళీ చేయాలని చెబితే ఎక్కడికి పోతాం అంటూ.. అంబ్కేడర్ జంక్షన్ సమీపంలో ని వాసం ఉంటున్న వారంతా సోమవారం రాత్రి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను నిలదీశారు. అంబేడ్కర్ జంక్షన్ నుంచి చెట్లతాండ్ర మార్గంలో రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టిన క్రమంలో ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన పనులు చేపట్టారు. అయితే సోమవారం రాత్రి పంచాయతీ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి ఉదయాన్నే ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో, అక్కడ నివసిస్తున్న వారంతా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఇన్చార్జి తహసీల్దార్ రవికుమార్ వద్ద సమస్యలు ఏకరువు పెట్టారు. అయితే ముందుగా దుకాణాలు తొలగిస్తామని, ఆ తర్వాత ఇళ్లు ఖాళీ చేయిస్తామని ఆయన సర్దిచెప్పారు. ఇల్లు కోల్పోయిన వారందరికీ ఇల్లు ఇస్తామని మంత్రి చెప్పారని ఇప్పుడు ఉన్నఫలంగా ఇల్లు ఖాళీ చెయ్యమంటే, పిల్లలతో ఎక్కడకు వెళ్లాలని వారంతా నిలదీశారు. గతంలో ఇంటి స్థలం మంజూరు కాకపోయిన వారందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని తహసీల్దార్ చెప్పడంతో అంతా వెనుదిరిగారు. ముందుగా ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత విస్తరణ పను లు చేయాలి తప్ప ఇలా అర్ధరాత్రిళ్లు వచ్చి తెల్లవారింటికి ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు చెప్పడం సమంజసం కాదంటూ బాధితులు మండిపడ్డారు. -
ప్రశ్నపత్రాలను స్కూల్ పాయింట్ వద్దకే చేర్చాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షల ప్రశ్నాపత్రాలను స్కూల్ పాయింట్ వద్దకే చేర్చాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్వీ రమణమూర్తి, జి.రమణ ప్రభుత్వానికి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు ఉదయానికే పాఠశాలకు చేరుకొని, ఆ తర్వాత పరీక్ష ప్రశ్నాపత్రాలు తీసుకోవడానికి వెళ్లేటప్పుడు అనేక సమయాల్లో ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు ప్రశ్నాపత్రాలకు వెళ్లి పాఠశాలకు వస్తుండగా యాక్సిడెంట్ జరిగి మృత్యువాతపడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం ఎంతమాత్రం సరికాదన్నారు. స్కూల్ పాయింట్ వద్దకే ప్రశ్నాపత్రాలు చేరవేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని విన్నవించారు. ఎస్పీ స్పందనకు 81 వినతులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ స్పందనకు 81 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా అధికారులతో ఎస్పీ జూమ్ కాల్లో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదులకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాటుసారా స్థావరాలపై దాడులు మెళియాపుట్టి: మండలంలోని హడ్డివాడ గ్రామంలో టెక్కలి ఎకై ్సజ్ సీఐ షేక్ మీరా సాహెబ్ అధ్వర్యంలో పాతపట్నం ఎకై ్సజ్ సిబ్బంది సమన్వయంతో నాటుసారా తయారీ స్థావరాలపై సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 450 లీటర్ల పులిసిన బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. అలాగే 80 లీటర్ల సారాతో కొసింటి నరసింహ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సారా తయారీకి వినియోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మట్టి ట్రాక్టర్లు పట్టివేత రణస్థలం: మండల పరిధిలోని రామతీర్థాలు రహదారిలో ఆదివారం రాత్రి నాలుగు మట్టి ట్రాక్టర్లను జే.ఆర్.పురం పోలీసులు పట్టుకున్నారు. అయితే జే.ఆర్.పురం సర్కిల్ పోలీస్‌స్టేషన్ వద్ద ట్రాక్టర్లను ఉంచి తదుపరి కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అలాగే మండల తహసీల్దార్ ఎన్.ప్రసాద్ అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై భూగర్భ గనులశాఖ అధికారులు రూ.3,500 అపరాధ రుసుము విధించారు. వీటిపై జే.ఆర్.పురం ఎస్ఐ ఎస్.చిరంజీవికి వివరణ కోరగా మట్టి ట్రాక్టర్లును అదివారం రాత్రి పట్టుకున్నామని, అయితే ఒక నిర్మాణ దశలో ఉన్న ఇంటికి తీసుకెళ్తున్నట్లు తెలిసి విడిచిపెట్టామన్నారు. మరో గ్రావెల్ ట్రాక్టర్‌కు మైన్సు అధికారులు ఫైన్ వేసి విడిచిపెట్టమని అర్డర్ రావడంతో వదిలేశామని తెలియజేశారు. సేవా దృక్పథం అలవర్చుకోవాలి ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థులు సేవా దృక్పథం అలవర్చుకోవాలని శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) డైరెక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ అన్నారు. జాతీయ సేవా పథకం విద్యార్థులకు సోమవారం వాలంటీర్ సర్వీస్ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సేవా పథకంలో ప్రతీ విద్యార్థి చేరాలన్నారు. కార్యక్రమంలో ఏవో మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ పాల్గొన్నారు. -
రేషనలైజేషన్ తీరు సరికాదు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాను పక్కాగా అమలు చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం, ఆచరణలో మాత్రం ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు శూన్యంగానే ఉన్నాయని జిల్లా పీడీ, పీఈటీ సంఘ అధ్యక్షుడు మొజ్జాడ వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బీవీ రమణలు అన్నారు. ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తాజాగా రేషనలైజేషన్ పేరిట 199 జేఎల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను, ఇతర సబ్జెక్టులకు మార్పు చేయడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం అందుబాటులో ఉన్న పీడీ, పీఈటీలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇంటర్ విద్య అధికారులు తీసుకుంటున్న చర్యలను ఖండిస్తూ ప్రజాప్రతినిధులకు లేఖలు రాశారు. త్వరలో సీఎం చంద్రబాబును, విద్యాశాఖమంత్రి లోకేష్‌ను కలిసి ఇంటర్ విద్యలో ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ల అవసరాన్ని వివరిస్తామన్నారు. పదోన్నతుల ద్వారా జరగాల్సిందే ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ హైస్కూల్స్‌లో పనిచేస్తున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లను పదోన్నతల ద్వారా జేఎల్‌లుగా ఉన్నతీకరణ చేసే ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇంటర్ విద్య డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎండగట్టారు. ఏకపక్ష విధానంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను ఇతర సబ్జెక్టులకు ఎలా కన్వర్షన్ చేస్తారని ప్రశ్నించారు. కనీసం సంబంధిత అధికారులు, ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు, వివిధ వర్గాల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలు ఏవిధంగా తీసుకుంటారన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ఇంటర్‌విద్య అధికారుల రేషనలైజేషన్ మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ పెద్దలకు తెలిసి ఈ చర్యలు ఉంటాయని తాము భావించడంలేదని, కాలేజీల్లో నాలుగు గోడల మధ్యన క్లాసుల ఒత్తిడిలో నిలిగిపోతూ మానసికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంతో అవసరమని గుర్తు చేశారు. ఇంటర్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్‌గేమ్స్ అండర్–19 పాల్గొనే బాలబాలికల క్రీడా భవిష్యత్తు సైతం అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాయామ విద్యను బతికించాలని ప్రభుత్వానికి విన్నవించారు. సమావేశంలో పీడీలు చల్లా జగదీష్, లక్ష్మీనారాయణ, గురుగుబెల్లి రాజశేఖర్, ఎన్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. పీడీ పోస్టులను కన్వర్షన్ చేయవద్దు జిల్లా పీఈటీ సంఘ నాయకులు -
‘ఆధార్ సేవలు వినియోగించుకోండి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆధార్ సేవలు ప్రజలకు సులభంగా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక అమలు చేస్తోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు సోమ వారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 732 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి ఐదు సచివాలయాలకు ఒక ఆధార్ సెంటర్ ఏర్పా టు చేశామని, ఇప్పటివరకు 146 ఆధార్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించా రు. ఇంకా 37 కేంద్రాలు ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానున్నాయని, ఆధార్‌కు సంబంధించిన కొత్త కార్డు నమోదు, డాక్యుమెంట్ అప్డేట్, 5 నుంచి ఏడేళ్లు, 15 నుంచి 17 సంవత్సరాల వయసుగలవారి మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్, మొబైల్ నెంబర్ అనుసంధా నం వంటి సేవలు ఈ ఆధార్ కేంద్రాల్లో లభ్యమవుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి నెలలో 8 రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో క్యాంప్ మోడ్‌లో ఆధార్ సేవలు అందిస్తున్నారని వివరించారు. ముఖ్యంగా ఆరేళ్లలోపు పిల్లలు తమ జనన తేదీ వివరాలతో సమీప ఆధార్ కేంద్రాన్ని సంప్రదించి ఆధార్ నమోదు చేయించుకోవాలని సూచించారు. ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ధర్నా మందస: జిల్లాలో ఐటీడీఏ లేక గిరిజన ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆదివా సీ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరుతూ మందసలో సోమవారం ధర్నా నిర్వహించారు. గిరిజనుల హక్కులు రక్షించాలని, అటవీ భూముల ఆక్రమణలు ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సవర గురునాఽథ్, జిల్లా కమిటీ సభ్యుడు సవర ఫాల్గుణరావు డిమాండ్ చేశారు. గిరిజన గ్రామలను షెడ్యూలు జాబితాల్లో చేర్చాలని, 50 శాతానికి పైగా గిరిజనులు ఉన్న పంచాయతీలను విడదీసి గిరిజన పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం విన తి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణకు అందజేశారు. కార్యక్రమానికి రైతుల సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గణపతి సంఘీభావం తెలిపారు. తాగి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు : ఎస్పీ శ్రీకాకుళం క్రైమ్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే సంబంధిత వాహనదారుల లైసెన్సులను రద్దు చేస్తామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే 70 మందివి లైసెన్సులు రద్దు చేశామని, మరో 60 మంది లైసెన్సుల రద్దునకు జిల్లా రవాణా కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించామన్నారు. శ్రీకాకుళంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ద్విచక్రవాహనదారులు, ఆటోలు పార్కింగ్‌కు కేటాయించిన ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు. ఆర్టీసీ కాంప్లెక్సు, రైతు బజారు, ఏడురోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆటోలు అధిక సంఖ్యలో రహదారి మార్గంలో నిలిపితే త్రోయింగ్ వాహనంలో స్టేషన్‌కు తరలిస్తామన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే బాధ్యులుగా వారి తల్లిదండ్రులు లేదా సంబంధిత వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని, త్రిబుల్ డ్రైవింగ్ చేస్తే జరిమానాలతో పాటు కేసులుంటాయని, సిగ్నల్స్ జంపింగ్ చేయొద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కడతామని హెచ్చరించారు. -
జీతాలిచ్చేసి.. తీసేయండి
● ఆదిత్యాలయంలో 49 మంది దినసరి వేతనదారులకు పెండింగ్ జీతాల చెల్లింపుపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ ● 15 రోజుల్లోగా ఔట్సోర్సింగ్ అవసరాలపై నివేదిక కోసం త్రీమెన్ కమిటీ నియామకం అరసవల్లి: ఏళ్ల తరబడి ఆదిత్యాలయంలో పనిచేసిన 49 మంది దినసరి వేతనదారులకు ఎట్టకేలకు పెండింగ్ జీతా ల చెల్లింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ నుంచి సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు వచ్చేశాయి. ఈ శుభవార్త వినగానే దినస రి వేతనదారులంతా ఎగిరి గంతేశారు. అయితే ఇంతలోనే ఆ ఉత్తర్వుల్లో అసలైన మెలిక అర్థమై నీరసించిపోయారు. ‘గత 14 నెలలుగా ఉన్న పెండింగ్ జీతాలన్నీ వారికి చెల్లించేసి వెంటనే వారందరినీ ఆలయ విధుల నుంచి తొలిగించండి’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెండింగ్ జీతాలు రూ.70 లక్షలు అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో గత కొన్నేళ్లుగా మొత్తం 49 మంది దినసరి వేతనదారులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి గత ఏడాది ఫిబ్రవరి నుంచి నేటి వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. అన్నదానం విభాగంలో 8 మంది, ప్రసాదాల తయారీ విభాగంలో ఏడుగురు, భజంత్రీ సిబ్బంది ఆరుగురు, పరిచారిక సిబ్బంది ఇద్దరు, అలాగే మిగిలిన పరిపాలన, టిక్కెట్లు విక్రయ కౌంటర్లు, కంప్యూటర్ విభాగ సిబ్బంది, స్వీపర్లు, పారిశుద్ధ్య సిబ్బంది 26 మంది కలిపి మొత్తంగా 49 మందికి నెలకు సుమారుగా రూ.5,50,500 వరకు జీతాలు కింద చెల్లించాల్సి ఉంది. ఈ ప్రకారం 14 నెలలకు గా ను సుమారుగా రూ.70 లక్షల వరకు పెండింగ్ కింద జీతాలను ఆలయం నుంచే వారికి చెల్లించాల్సి ఉంటుంది. ఆలయంలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇక్కడ ఇంతవరకు భక్తు ల సౌకర్యార్థం 49 మంది దినసరి వేతనదారులే విధులను నిర్వర్తించేవారు. అయితే తా జాగా రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రాప్తికి వీరికి పెండింగ్ జీతాలిచ్చేసి వెంటనే తొలిగించాల్సి ఉంది. అనంతరం ఆల య అవసరాలకు వాస్తవంగా ఎంత మంది సిబ్బంది అవసరమన్న అంశంపై ప్రత్యేక నివేదిక కోరుతూ త్రిమెన్ కమిటీని కూడా కమిషనర్ నియమించారు. ఈమేరకు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ (విశాఖపట్నం), జిల్లా దేవదాయ శాఖాధికారి (శ్రీకాకుళం)తో పాటు అరసవల్లి ఆలయ ఈఓ (డిప్యూటీ కమిషనర్)లతో కూడిన కమిటి రానున్న 15 రోజుల్లోగా ఆదిత్యాలయానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది కావాలన్న నివేదికను సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఇకమీదట ఆలయంలో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ నైపుణ్యతతో కూడిన సిబ్బంది మాత్రమే విధుల్లో ఉండనున్నారని స్పష్టమౌతోంది. ఎన్నో ఏళ్లుగా స్వామి ఆలయాన్ని నమ్ముకుని పనిచేసుకుంటున్న తమ కు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకూడదని చెప్పడంపై దినసరి వేతనదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జీతాలిమ్మని ఆదేశాలు వచ్చాయి ఆలయంలో దినసరి వేతనదారులుగా పనిచేస్తున్న 49 మందికి పెండింగ్ జీతాలిమ్మని, అలాగే వారిని వెంటనే తొలగించాలని కూడా ఆదేశాలు వచ్చాయి. అలాగే ఔట్సోర్సింగ్ నియామక అవసరాల కోసం త్రీమెన్ కమిటీ నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. – వై.భద్రాజీ, ఆలయ ఈఓ -
ఆదిత్యుని సన్నిధిలో మాజీ మంత్రి కొట్టు
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం ఆలయ విశిష్టత, పర్వదినాలపై వివరించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యుడు మండవిల్లి రవి తదితరులు పాల్గొన్నారు.నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళంఅరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆడిట్ అధికారి వలివేటి శ్రీదేవి తన అన్నయ్య దివంగత జయరామారావు పేరిట రూ.1,00,001 విరాళాన్ని ఈవో వై.భద్రాజీకి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రూ.లక్ష అంతకు మించి విరాళాలు ఇచ్చిన దాతలకు పర్వదినాల్లో విశిష్ట దర్శనం కోసం పాస్ అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.ఉత్సాహంగా వాలీబాల్ పోటీలుగార: అంపోలు జెడ్పీ హైస్కూల్ మైదానంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 8న జరగనున్న గ్రామదేవత ఉత్సవాలు (శివయ్య పండగ) సందర్భంగా స్థానిక యువత ఏర్పాటు చేసిన ఈ పోటీలను ఉదయం పోటీలను డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఎంపీపీ గొండు రఘురామ్, సర్పంచ్ గొండు జయరాం, గొండు అచ్యుతరావు, వెలమల శ్రీనువాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం సంతోషకరమన్నారు.విద్యార్థి నిజాయితీఇచ్ఛాపురం టౌన్ : పట్టణంలోని గిలాయి వీధికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి బి.చంటి తనకు దొరికిన సెల్‌ఫోన్‌కు పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. ఆదివారం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా చంటికి సెల్‌ఫోన్ దొరికింది. అక్కడ వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఇంటికి వెళ్లి తన తండ్రి శ్రీనివాస్‌కు విషయం చెప్పాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ ఎం.చిన్నమనాయుడుకు ఫోన్‌ను అప్పగించాడు. పట్టణంలోని డబ్బూరివీధికి చెందిన పి.ఆకాష్ ఫోన్‌గా గుర్తించి విద్యార్థి చేతుల మీదుగా ఫోన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా చంటిని సీఐ, పట్టణ ఎస్ఐ ఎం.ముకుందరావు అభినందించారు.ఆకట్టుకున్న సంగీత విభావరిశ్రీకాకుళం కల్చరల్: నగరంలోని పాలకొండ రోడ్డులో కోదండ రామాలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం సంగీత విభావరి నిర్వహించారు. డి.రామారావు ఆధ్వర్యంలో మహిళలు శ్రీరాముడి కీర్తనలు, గీతాలను చక్కగా ఆలపించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
రామగిరి క్షేత్రంలో ఐటీడీఏ పీఓ
కొత్తూరు: మండలానికి ఆనుకుని ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పులిపుట్టి సమీపంలో ఉన్న కన్నెధార కొండపై నిర్మించిన రామగిరి క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు. సీతారాములను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు పీఓను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సీతారాముల కల్యాణోత్సవానికి కొత్తూరు, సీతంపేట మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలోహాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పిండి శ్రీనివాసరావు, రామగిరి క్షేత్రం కమిటీ అధ్యక్షుడు ఎస్పీ పెంటయ్య, జి.రాములునాయుడు, రాజారావు, రాములు, జి.ప్రసాదబాబు, భాస్కరరావు ప్రిన్సిపాల్ నవీన్ పాల్గొన్నారు. -
ఆదిత్యా నమోస్తుతే..!
అరసవల్లి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఆదిత్యుని వార్షిక కల్యాణ మహోత్సవాలు (బ్రహ్మోత్సవాలు) జరుగుతున్న క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంద్రపుష్కరిణి వద్ద సంప్రదాయక పూజలు నిర్వహించి ప్రసాదాలను స్వామికి నివేదించారు. ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాలు పూజలు చేయించుకున్నారు. ఎండ వేడిమి తీవ్రంగా ఉన్న కారణంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయించారు. విధుల్లోకి సిబ్బంది.. శనివారం విధులకు దూరంగా ఉన్న దినసరి వేతనదారులు ఆదివారం మాత్రం విధులకు వచ్చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రమంలో వారికి సౌకర్యాల కల్పన నుంచి ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు, అన్నదానం, ప్రసాదాల తయారీ, విక్రయాలన్నీ దినసరి వేతనదారులే చూసుకున్నారు. ఈవో సూచన మేరకు ఈనెలాఖరు వరకు వేచిచూద్దామనే భావనను వ్యక్తం చేసి విధులను యధావిధిగా కొనసాగించారు. వివిధ దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.1,12,600, పూజలు, విరాళాల ద్వారా రూ.60,521, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 1,15,880 వరకు ఆదాయం లభించినట్లు ఈవో వివరించారు. భారీగా తరలివచ్చిన భక్తులు విధుల్లోకి దినసరి వేతనదారులు -
వైద్యం కోసం కిడ్నీ బాధితుడి పోరాటం
కాశీబుగ్గ: ఆయాసం వచ్చిందని పలాస కిడ్నీ పరిశోధన కేంద్రానికి వెళ్తే అత్యవసరంగా శ్రీకాకుళం వెళ్లిపోవాలని రిఫర్ చేయడం, అందుకు బాధితుడు అంగీకరించకపోవడం వివాదానికి దారితీసింది. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన టి.రమణ పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో కొన్నాళ్లుగా డయాలసిస్ సేవలు పొందుతున్నాడు. ఒక్కసారిగా ఆయాసం రావడంతో ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు అష్టకష్టాలుపడి చేరుకున్నాడు. అయితే అక్కడి నుంచి రిఫర్ చేసేందుకు వైద్యసిబ్బంది ప్రయత్నాలు చేశారు. ప్రాణాలు పోయినా ఇక్కడే వైద్యం పొందుతానని, శ్రీకాకుళం వెళ్లి వైద్యం పొందే స్థోమత తనకు లేదని రమణ తేల్చిచెప్పాడు. రిఫరల్ పేరుతో వైద్యం అందించకుండా పంపించేయడం తగదని వాపోయాడు. దీంతో సిబ్బంది చివరికి పలాస కేంద్రంలోనే చికిత్స చేసేందుకు అంగీకరించారు. కాగా, కిడ్నీ బాధితులు, వారి కుటుంబాలతో ఆస్పత్రి సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అధికారులు స్పందించి కౌన్సిలింగ్ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
8న ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ
రణస్థలం: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏపీ దళిత మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.బెంజమన్ పిలుపుమేరకు ఈ నెల 8న జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రణస్థలం మండల శాఖ అధ్యక్షుడు టొంపల సూరప్పడు తెలిపారు. ఈ మేరకు జె.ఆర్.పురం హైస్కూల్ వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం నుంచి అధిక సంఖ్యలో ఎస్సీ సభ్యులు తరలివెళ్లి వర్గీకరణకు వ్యతిరేకమనే సంకేతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికగా తెలియజేయాలని తీర్మానించినట్లు చెప్పారు. కార్యక్రమంలో దళిత మహాసభ జిల్లా నాయకులు కుప్పిలి సీతప్పడు, జిల్లా ఉపాధ్యక్షులు దత్తి గోవింద, గౌరవ అధ్యక్షులు సాకేటి పోతయ్య, నాయకులు పల్ల నీలయ్య, కుప్పిలి పైడిరాజు, దుక్క ఆదినారాయణ, నడుపూరి ఆనంద్, సోమాధుల రమణ, లండ చినబాబు, యామల గోపాల్, బోనెల పరశురాం, మామిడి జగదీష్, ముక్కు రాము, కోండ్రు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ఆమదాలవలస : శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలోని ఊసవానిపేట గేటు సమీపంలో ఆదివారం రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి ఒడిశా వైపు వెళ్లే రైలులో ప్రయాణం చేస్తున్న అసోంకు చెందిన బలిన్ దుర(35) ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ జారిపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు జీఆర్పీ పోలీసులు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. -
15లోగా పెద్దమార్కెట్ కూల్చేయండి
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు కూరగాయల మార్కెట్(పెద్ద మార్కెట్)ను ఈ నెల 15 లోగా కూల్చేయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు అచ్చెనాయుడులు ప్రకటించడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండగా వ్యాపారాలను ప్రత్యామ్నాయ స్థలాల్లోకి మార్చాలని ఆదేశించడం ఏకపక్ష నిర్ణయమని పలువురు వ్యాపారాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దూడ భవానీశంకర్ మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద మార్కెట్లో ఆకస్మిక తనిఖీ పేరుతో పర్యటించి కోటి రుపాయలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దానిని హామీగానే మిగిల్చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో 2004లో మార్కెట్ సమస్యను అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రూ.4 కోట్లతో మార్కెట్‌ను అభివృద్ధి చేసిన విషయాన్ని వ్యాపార వర్గాలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. వ్యాపారుల్లో రెండు వర్గాలు కోర్టులను ఆశ్రయించడం, కొందరు కుఠిల రాజకీయాలు చేయడంతో మార్కెట్లోని 40 శాతం దుకాణాలు ఖాళీగా ఉండిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించి షాపులన్నీ అందుబాటులోకి తీసుకువస్తే సమస్య ఉండదు. అలాకాదని, అభివృద్ధి చేయడం మంచిదే అయినప్పటీకీ వ్యాపార వర్గాలను సంప్రదించకుండా వారమే గడువిచ్చి షాపులు ఖాళీ చేయించాలని హుకుం జారీ చేయడం పట్ల వ్యాపార వర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి. మార్కెట్లో వ్యాపారం చేస్తున్నవారు చాలా మంది నష్టాల బారిన పడి ఐపీ పెట్టి వెళ్లిపోవడం, కొందరు కనిపించకుండా పోవడం వంటి ఎన్నో జరిగాయి. ఇటువంటి వాటిని తలచుకొని పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఏకపక్ష నిర్ణయం మండిపడుతున్న వ్యాపారులు రాష్ట్రానికి ఆదర్శంగా పొట్టిశ్రీరాములు మార్కెట్ శ్రీకాకుళం: నగరంలోని పొట్టి శ్రీరాములు కూరగాయల మార్కెట్‌ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చి దిద్దుతామని కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు చెప్పారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్‌తో కలిసి మార్కెట్‌ను పరిశీ లించారు. ఈ నెల 15లోగా ప్రత్యామ్నాయ స్థలంలోకి మార్చి యూ ఆకారంలో షాపులు నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ అస్తవ్యస్తంగా ఉందని, వినియోగదారులు నడిచేందుకు, షాపింగ్ చేసేందుకు అనుకూలంగా లేదన్నారు. వ్యాపారులతో సదస్సు నిర్వహంచి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించనున్నట్లు వివరించారు. మున్సిపాల్ కార్యాలయాన్ని ప్రజా భాగస్వామ్యంతో పునర్నిర్మిస్తామని, ఒక అంతస్తులో కార్యాలయం, మిగిన వాటిలో వ్యాపార సముదాయాలు ఉంటాయన్నారు. త్వరలో ఇంటిగ్రేట్‌డ్ కలెక్టరేట్‌లోకి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోతాయని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రసాదరావు, వర్తక సంఘం అధ్యక్షుడు కోరాడ హరగోపాల్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ పాల్గొన్నారు. -
అగరబత్తీలు తయారుచేస్తున్న ప్రత్యేక అవసరాల పిల్లలు
శ్రీకాకుళం కల్చరల్: వారంతా మానసిక దివ్యాంగులు. సొంతంగా ఆలోచించే శక్తి తక్కువ. అయితేనేం.. తమను ప్రోత్సహిస్తే సకలాంగులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. సహజ సిద్ధ వనరులను ఉపయోగిస్తూ అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, రంగులు, దీపావళి ప్రమిదలు తయారు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని బెహరా మనోవికాస కేంద్రంలో 74 మంది బుద్ధిమాంద్యం గల వారు ఉన్నారు. వీరికి కేంద్రం నిర్వాహకులు ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వారిలో మానసిక స్థైర్యం పెంపొందిస్తున్నారు.ప్రత్యేక శిక్షణ..బెహరా మనోవికాస కేంద్రంలో క్రాఫ్టిజెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు పర్యావరణ హాని లేని వస్తువుల తయారీపై శిక్షణ ఇప్పించారు. స్కిల్లింగ్ అనే కార్యక్రమం ద్వారా అగరబత్తీల తయారీ, హోలి రంగులు, కొవ్వొత్తులు, పేపర్ బ్యాగులు వంటి ఉత్పత్తులను ఏ విధంగా తయారు చేయాలో నేర్పించారు. ప్రధానంగా అగరబత్తీలను తయారు చేయడంలో ఇక్కడి చిన్నారులు ప్రావీణ్యం సంపాదించారు.అగరబత్తీ తయారీ ఇలా..అగరబత్తీని తయారు చేసేందుకు పెద్ద మొత్తంలో వివిధ రకాల పూలు సేకరిస్తారు. గాలిలో బాగా ఆరబెట్టి పూర్తిగా ఎండాక మిషన్‌లో వేసి పౌడర్‌గా తయారు చేస్తారు. అందులో మిక్సింగ్ పౌడర్, ఎసెన్స్ కలిపి ముద్దగా చేస్తారు. దానిని పుల్లలకు చుట్టి నీడలో ఆరబెడతారు. పూర్తిగా ఎండిపోయాక 50 పుల్లలను ఒక ప్యాకెట్‌గా సిద్ధం చేస్తారు. వీటితో పాటు ధూప్ స్టిక్స్ కూడా తయారు చేస్తున్నారు. ఒకప్యాకెట్ ధర రూ.30, ధూప్ స్టిక్స్ ప్యాకెట్ రూ.15గా అమ్మకం చేస్తున్నారు. వీరు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయడానికి కూడా సంస్థ ప్రతినిధులు సహకరిస్తున్నారు. దీంతో పిల్లలకు శారీరక, మానసిక ఉల్లాసం కలిగి వారి ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో పాటు కొంత ఆర్థిక స్వావలంబన చేకూరుతోంది.ఉత్సాహంగా ఉంది..అగరబత్తీలు చేయడం ఉత్సాహాన్నిస్తోంది. పూల పౌడర్‌ను ఎసెన్స్‌తో కలిపి ముద్దను తయారు చేసి తర్వాత పుల్లలతో అగరబత్తీను తయారు చేస్తాం. – గోపి, బెహరా మనోవికాస కేంద్రంశిక్షణ ఇచ్చారుఅగరబత్తీల తయారీకి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అందరం కలసి నేర్చుకున్నాం. హోలీ రంగులు కూడా తయారు చేస్తాం. వీటిని చేసేటప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది.– సాయితేజ, బెహరా మనోవికాస కేంద్రంమానసిక ఎదుగుదలకు కృషిప్రత్యేక అవసరాల పిల్లల మెదడుకు పదును పెట్టి సృజనాత్మకత పెంచేందుకు వివిధ వస్తువుల తయారీలో శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడి వచ్చే సందర్శకులు వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా మానసిక దివ్యాంగులకు ప్రోత్సాహం అందించిన వారవుతారు.– శ్యామల, మనోవికాస కేంద్రం నిర్వాహకురాలుఎండిన పూలతో..ఎండిన పూలను మిషన్‌లో వేసి పౌడర్ చేస్తాను. ఒకే రంగులొ ఉన్నవి ఒకేసారి మిషన్‌లో వేస్తాం. అలా రకరకాల పౌడర్లు సిద్ధం చేసి అగరబత్తీలు చేయడం బాగుంది.– శివ, బెహరా మనోవికాస కేంద్రం -
పలాస కిడ్నీ ఆస్పత్రిలో పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
కాశీబుగ్గ: పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ విధానంలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఏప్రిల్ 6వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటివరకు మొత్తం 267 దరఖా స్తులు అందాయని తెలిపారు. ఈ దరఖాస్తుల్లో జనరల్ డ్యూటీ అటెండెంట్స్ పోస్టులకు 81 మంది, సీ–ఆర్మ్ టెక్నీషియన్ పదవులకు 16 మంది, డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులకు 26 మంది, రిసెప్షన్ కమ్, రిజిస్ట్రేషన్ క్లర్క్ ఉద్యోగానికి అత్యధికంగా 86 మంది, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగానికి 15 మంది దరఖాస్తు చేసినట్లు ఆమె వివరించారు. -
‘డైట్’లో అధ్యాపక ఖాళీల భర్తీ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని వమ్మరవల్లి డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బందిని ఫారిన్ సర్వీస్ నియామక నిబంధనల మేరకు డిప్యుటేషన్ పద్ధతిలో నియామకం చేయనున్నట్టు జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య తాజాగా విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ/జిల్లా పరిషత్/మున్సిపల్ యాజమాన్య పాఠశాలల్లో పని చేస్తూ.. ఆసక్తి కలిగిన స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వమ్మరవల్లి డైట్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5 సీనియర్ సీనియర్ లెక్చరర్ల పోస్టులు, మరో 17 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. డీడీఓల ద్వారా సంబంధిత హెచ్ఎంలు, ఎంఈఓలు, డీఈఓ ల ద్వారా డైట్ ప్రిన్సిపాల్‌కు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు 2025 మార్చి 31వ తేదీ నాటికి 58 ఏళ్లలోపు ఉండాలన్నారు. సంబంధిత సబ్జెక్టులో 50 శాతం, ఎంఈడీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, కనీ సం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసి ఉండాలన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 10వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగుస్తుందని, ఈనెల 11 నుంచి 13వ తేదీల మధ్యలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని, అర్హత పొందిన దరఖాస్తుదారులకు ఈ నెల 16, 17వ తేదీల్లో రాత పరీక్ష జరుగుతుందని, 19వ తేదీన ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారికి డిప్యుటేషన్ ఉత్తర్వు లు ఈ నెల 21వ తేదీన అందజేయనుండగా, 22న విధుల్లో చేరాల్సి ఉంటుందని షెడ్యూల్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు ఫారం కోసం ‘డీఈఓ శ్రీకాకుళం ఓఆర్జీ’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని డీఈఓ సూచించారు. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం 16, 17వ తేదీల్లో రాత పరీక్ష, 19న ఇంటర్వ్యూల నిర్వహణ డిప్యుటేషన్ విధానంలో 5 సీనియర్ లెక్చరర్స్, 17 లెక్చరర్స్ పోస్టుల భర్తీ -
వెంటాడిన మృత్యువు
ఎచ్చెర్ల క్యాంపస్కేశవరావుపేట పంచాయతీ పరిధి కింతలిమిల్లు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్వా హరిప్రసాద్ (23) అనే యువకుడు మృతి చెందారు. వెనుక కూ ర్చున్న జలుమూరు వేణు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీకాకుళం నుంచి వీరిద్దరూ డ్యూక్ బైక్‌పై ఎచ్చెర్ల వైపు వస్తున్నారు. కింతలిమిల్లు నుంచి వీరు కొన్ని సెకన్ల వ్యవధిలో సర్వీస్ రోడ్డుకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న వ్యాను ను బైక్‌తో ఢీకొట్టారు. దీంతో బండి అదుపు తప్పి ఓ లారీని తాకింది. దీంతో ఇద్దరూ బైక్‌పై నుంచి తుళ్లి పడిపోయారు. అదే సమయానికి అటుగా ఆర్టీసీ బస్సు వస్తుండడంతో సరిగ్గా బస్సు వెనుక చక్రం కింద పడిపోయారు. టైరు శరీరం మీద నుంచి వెళ్లిపోవడంతో హరిప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. వేణు కళ్లు, ఇతర శరీర భాగాలపై నుంచి బస్సు టైరు వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి 108 సాయంతో అతడిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. హరిప్రసాద్ మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఆర్టీసీ బస్సును స్టేషన్‌కు తరలించారు. బస్సులో ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్ కుమార్‌తో కూడిన పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించి, సహాయ చర్యలు చేపట్టారు.వీరే ఆధారం..మృతి చెందిన బస్వా హరిప్రసాద్ శ్రీకాకుళం పట్టణంలో బంగారు దుకాణంలో పని చేస్తున్నాడు. తల్లి రమణమ్మ వస్త్ర దుకాణంలో చేస్తుంది. కష్టాన్ని నమ్ముకుని వీరు బతుకుతున్నారు. తండ్రి కుంటుంబానికి దూరంగా ఉన్నా తల్లి పిల్లలను పెంచి పెద్దచేసింది. మృతునికి దిలీప్ అనే అన్నయ్య ఉన్నారు. హరి మృతితో జరజాం గ్రామంలో విషాదం అలముకుంది.అలాగే గాయపడిన వేణుది ఎచ్చెర్ల గ్రామం. పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. హరి, వేణులు ప్రాణ స్నేహితులు. వేణు తండ్రి గోపి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తుండేవారు. 2020లో కోవిడ్‌తో మృతి చెందాడు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లారు. అతివేగం, ప్రమాద సమయంలో బండిపై నియంత్రణ కోల్పోవడం ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంపై ఎచ్చెర్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సందడిగా సాగర తీరం
వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వలరేవులో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఉద యం పెద్ద సంఖ్యలో మహిళలు, యువతీ యువకులు గ్రామ పెద్దలు, బెహరాలు, పూజారులతో కలిసి రామాలయం వద్ద శ్రీరాముడి జెండాను ఆవిష్కరించారు. కల్యాణ వేడుకలలో భాగంగా అలయం వద్ద పందిరి రాట వేసి ముత్తైదువులు అంతా కలిసి గుమ్మాలు అర్చించారు. అనంతరం అధిక సంఖ్యలో భ క్తులు ఆలయం వద్ద బారులు తీరారు. అలాగే గ్రామ దేవత బృందావతి అమ్మవారికి సైతం ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ నవమి వేడుకల్లో ప్రధాన ఘట్టమైన సీతారాములు కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. 10న పాతపట్నంలో జాబ్‌మేళా పాతపట్నం: పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీరాములు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని, పదో తరగతి, ఇంటర్, డిప్లమా, డిగ్రీ చదివిన నిరుద్యోగులు మేళాను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. ‘రఘువంశం’ పుస్తకావిష్కరణ శ్రీకాకుళం కల్చరల్: స్థానిక ఉపనిషన్మందిరంలో జరుగుతున్న శ్రీరామ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కర్రి భాస్కరరావు అందించిన ‘రఘువంశం’ పుస్తకావిష్కరణ మందిరం ఉపాధ్యక్షులు పప్పు పతంజలి శాస్త్రి చేతులమీదుగా జరిగింది. పుస్తక పరిచయాన్ని డాక్టర్ సనపల నారాయణమూర్తి చేస్తూ మహా కవి వాల్మీకి మహర్షి తర్వాత అంతటి గొప్ప కవి కాళిదాసని, ఉపమానం చెబితే కాళిదాసే చెప్పాలని అన్నారు. ఈ పుస్తకంలో 20 అంశాలు అన్ని విషయాలను స్పృశిస్తూ రచయిత అందించారని అన్నారు. కార్యక్రమంలో చాగంటి బాపయ్యపంతులు, పట్నాయిక్, మందుల మోహనరావు, కోమలరావు, నిష్టల నరసింహమూర్తి, వెంకటరమణ, ఈశ్వరరావు, మల్లేశ్వరరావు, కామేశ్వరరావు, విశ్వేశ్వరరావు, సీత, పద్మావతి, ఉమ తదితరులు పాల్గొన్నారు. ‘ఎస్సీ వర్గీకరణలో లోపాలున్నాయి’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఎస్సీ వర్గీకరణ చేయటంలో అనేక లోపాలున్నాయని, సమగ్ర సమాచారం లేకుండా అసంపూర్తిగా ఉందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు అన్నారు. ఈ మేరకు ఆదివారం అంబేడ్కర్ విజ్ఞాన మందిర్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ కులంలో కొందరిపై కక్ష కట్టి వర్గీకరణ చేయడం వెనుక ప్రభుత్వ దురుద్దేశం ఉందన్నారు. సరైన డేటా లేకుండా, కనీసం అసెంబ్లీలోనూ, శాసనమండలిలోనూ, చర్చించకుండా నిరంకుశంగా తప్పుడు సమాచారం ఆధారంగా వర్గీకరణ చేయడం సరికాదన్నారు. జిల్లాల యూనిట్‌గా వర్గీకరణ చేయాలని, పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంచాలని, జోనల్ స్థాయిలో ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ జరిగే విధానంలో లోపాలపై ఇంప్లీడ్ పిటిషన్లు వేసి వర్గీకరణ రద్దయ్యే వరకు కోర్టు ద్వారా పోరాటం చేస్తామన్నారు. లేదంటే భవిష్యత్‌లో ఎస్సీల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పోత ల దుర్గారావు, లింగాల అప్పన్న, అంపోలు ప్రతాప్, నూతలపాటి భరత్ భూషణ్‌రాజ్, దండాసి రాంబాబు (జాన్), డి.రామప్పడు, ధర్మాన గణేష్, సీర రమేష్ బాబు, పడాల ప్రతాప్ కుమార్, కరగాన దామోదర్ రావు, కన్నేపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి కాలువ ఆక్రమణ
సంతబొమ్మాళి: రియల్ ఎస్టేట్ వ్యాపారుల దౌర్జన్యం రైతుల పాలిట శాపంగా మారింది. కల్వర్టులు కప్పే సి, సాగునీటి కాలువ ఆక్రమించుకోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నౌపడ నుంచి టెక్కలి వైపు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డులో ఇజ్జువరం పంచాయతీ రైల్వేగేట్‌కు సమీపంలో సర్వే నంబర్ 355–1ఈ–355–1ఎఫ్‌లో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్‌ను వేశారు. ఈ లేఅవుట్లో గ్రావెల్ వేసి ఎత్తు చేసే క్రమంలో సాగునీటి కాలువను కప్పేసి దర్జాగా లే అవుట్లో కలిపేశారు. అంతటితో ఆగకుండా సాగునీరు ప్రవహించే కల్వర్టును కూడా కప్పేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఖరీఫ్‌లో తమ పొలాలకు నీరెలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. వంశధార అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చినా అవేమీ పట్టించుకోకుండా వారు తమ పనిని కొనసాగిస్తున్నారు. దీనిపై సంతబొమ్మాళి ఏఈ కె.అప్పలరెడ్డి మాట్లాడుతూ సాగునీటి కాలువ ఆక్రమించి కల్వర్టును కప్పేయడంతో సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మేమెలా బతకాలి?
జీతాలివ్వకపోతే.. ● అరసవల్లి ఆదిత్యాలయంలో దినసరి వేతనదారుల ఆవేదన ● విధులు బహిష్కరించిన 48 మంది సిబ్బంది ● ప్రసాదాల తయారీ, విక్రయాలు, అన్నదానం నిలిపివేత ● నెలాఖరు వరకు గడువు కోరిన ఈవో భద్రాజీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎంతో ఇష్టమైనవి పులిహోర, లడ్డూ ప్రసాదాలే. మధ్యాహ్నం భక్తదాతలిచ్చిన విరాళాలతో నిర్వహించే అన్నదాన ప్రసాదానికి సైతం తాకిడి అధికంగానే ఉంటుంది. వీటిని తయారుచేస్తున్న వారిలో 99 శాతం మంది దినసరి వేతనదారులే. వీరంతా శనివారం నిరసనకు దిగడంతో ఉదయం నుంచి వంట మొదలు పెట్టలేదు. పులిహోర సిద్ధం చేయలేదు. ఉదయం 6 గంటల నుంచే అమ్మకాలు ప్రారంభం కావాల్సిన ప్రసాదాల కౌంటర్‌కు తాళాలు పడ్డాయి. నిత్యం పంపిణీ చేసే ఉచిత ప్రసాదాలు నిలిపివేశారు. అన్నదాన ప్రసాదం తయారిపై కూడా మధ్యాహ్నం 11 గంటల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ఆ తర్వాత ఈవో భద్రాజీ, విభాగ బాధ్యుడు కె.వి.రమణమూర్తిల విజ్ఞప్తి మేరకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన 100 మంది భక్తులకు అన్నదాన ప్రసాదాలు అందేలా దినసరి వేతనదారులే వంటను పూర్తి చేసి భోగం పెట్టించిన అనంతరం భక్తులకు వడ్డించారు. అరసవల్లి ఆలయ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి పరిస్థితి రాలేదు. ప్రసాదాలు లేని రోజులు రావడం.. ఇదే తొలిసారి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద శనివారం ఉదయం 6 గంటలకే సర్వదర్శనాల కోసం గుడి తలుపులు తెరుచుకున్నాయి.. వందలాదిగా భక్తులు దర్శనాలకు వచ్చేశారు. కానీ ఆలయం ముందు చెత్తాచెదారాలు అలాగే ఉన్నాయి.. ప్రసాదాల కౌంటర్లు తెరవలేదు..ఉచిత ప్రసాదంతో పాటు లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీ జరగలేదు..అసలేం జరుగుతుందో తెలియక అధికారులు అయోమయానికి గురయ్యారు. ఆలయంలో ఎన్నాళ్ల నుంచో పనిచేస్తున్న 48 మంది దినసరి వేతనదారులంతా తమకు రావా ల్సిన పెండింగ్ జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూనే.. ఆలయ విధులకు హజరుకాకుండా నిరసనకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గుర్తించారు. దర్శనాలు చేసుకుని తిరిగి వస్తున్న భక్తులకు ప్రసాదాలు లేవనే సమాధానం చెబుతుంటే.. ఆదిత్యాలయానికి ఏమయ్యిందనే ప్రశ్నలు భక్తుల నుంచి వ్యక్తమయ్యాయి. ఇలా ఎన్నడూ జరగలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తరుణంలో శనివారం దినసరి వేతనదారులు విధులు బహిష్కరించారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న తమ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈవో వై.భద్రాజీ కార్యాలయం ఎదుట భైఠాయించారు. ఇంతవరకు జీతాలు ఇస్తామంటూ కాలయాపన చేశారని.. వారం రోజులుగా విజయవాడ వెళ్లి కూడా తమ సమస్యకు పరిష్కారం చూపకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా చాలాసార్లు ఈవో చెప్పారని, ఎమ్మెల్యే చెప్పారని ఊరుకున్నామని.. ఆఖరికి మంత్రి కూడా భరోసా ఇచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో నష్టపోయామని, కుటుంబాలతో నెట్టుకురావడం కష్టమైపోయిందని..ఇకనైనా తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆలయ పారిశుద్ధ్యం, అన్నదాన వంట, ప్రసాదాల తయారి తదితర కీలక విభాగాలతో పాటు టికెట్ల విరాళాలు, ఆర్జిత సేవల టికెట్ కౌంటర్ల విధులకు దినసరి వేతనదారులెవ్వరూ వెళ్లకుండా నిరసనను కొనసాగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే.. గత ప్రభుత్వం ఉన్నంతవరకు అరసవల్లి ఆలయంలో దినసరి వేతనదారులు ఎప్పటికప్పుడు జీతాలను అందుకునే వారు. రెగ్యులర్ నియామకాలు లేకపోవడంతో దినసరి వేతనదారులే అన్ని పనులకు కీలకంగా మారారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ పనిచేస్తున్న 48 మందిపై వేటు వేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. మంత్రి అచ్చెన్నాయుడు అయితే జిల్లా కలెక్టర్, కీలక అధికారుల సమక్షంలో వీరిని తొలిగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అలా వీరంతా రోడ్డున పడ్డారు. అప్పటి వరకు వస్తాయనుకున్న పెండింగ్ జీతాలు నిలుపుదల చేశారు. తర్వాత రథసప్తమి ఉత్సవాల సందర్భంగా బాధితులంతా మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్లను వేడుకున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఏదో ఒక రూపంలో తమ నిరసనను కొనసాగిస్తామంటూ కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు వేతనదారులు ‘సాక్షి’ వద్ద స్పష్టం చేశారు. ఈవో చర్చలు.. ప్రసాదాల్లేవ్.. అన్నదానం లేదు..రెగ్యులర్ సిబ్బంది మినహా మిగిలిన దినసరి వేతనదారులంతా నిరసనకు దిగడం సంచలనంగా మారింది. దీంతో హుటాహుటిన ఆలయానికి వచ్చిన ఈఓ భద్రాజీ.. దినసరి వేతనదారులను పిలిపించి చర్చించారు. వార్షిక కల్యాణ మహోత్సవాలు జరుగుతున్న వేళ ప్రసాదాలు తయారీ, అన్నదానాన్ని ఆపేసి నిరసనలకు దిగడమేంటని ప్రశ్నించారు. పెండింగ్ జీతాల అంశం రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ వద్ద ప్రస్తావించామని, ఈ నెలాఖరు వరకు నిరసనలు చెయ్యొద్దని..తర్వాత మీ ఇష్టమని స్పష్టం చేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ కల్యాణ మహోత్సవాలు జరుగుతున్న తరుణంలో ఇలా భక్తులకు ఇబ్బందులు పెట్టొద్దని, ఉన్నతాధికారులు ఈనెలాఖరులోగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని..అంతవరకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ దినసరి వేతనదారులు ఎలాంటి స్పందనను తెలియజేయకుండానే వెనుదిరిగారు. తమ సమస్యలపై ఎప్పుడు అడిగినా ఇలాగే చెబుతున్నారని, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రైవేటు బస్సు–లారీ ఢీ
ఇచ్ఛాపురం: మండలంలోని బెల్లుపడ జంక్షన్లో జాతీయ రహదారిపై శనివారం ప్రైవేటు బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఇద్దరికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశాకు చెందిన సంకటతరణి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బరంపురం నుంచి జరడా వైపు బయలుదేరింది. ఒడిశాలోని గొలంత్ర వద్ద చైతన్య పాఠశాల విద్యార్థులు తరుష్(8వ తరగతి), లోహిత్(9వ తరగతి) స్వగ్రామమైన లొద్దపుట్టి వచ్చేందుకు బస్సులో ఎక్కారు. అనంతరం ఇచ్ఛాపురం బస్టాండ్‌లో లొద్దపుట్టి గ్రామానికి చెందిన కృష్ణారావు అనే ప్రయాణికుడు ఎక్కాడు. మరోవైపు భీమవరం నుంచి పశ్చిమబెంగాల్‌కు చేపల లోడుతో లారీ వెళ్తోంది. ప్రైవేటు బస్సు లారీనీ గమనించక బెల్లుపడ జంక్షన్ నుంచి జాతీయ రహదారి–16పైకి ఒక్కసారిగా వచ్చింది. లారీ డ్రైవర్ హఠాత్పరిణామంతో లారీనీ అదుపు చేయలేక బస్సును ఢీకొట్టడంతో బస్సు అద్దాలు పూర్తిగా విరిగిపోయాయి. ఈ ఘటనలో బస్ డ్రైవర్ పక్కసీటులో కూర్చున్న ప్రయాణికుడు ఎగిరిపడి బయటకు జారిపడ్డాడు. ఈ ఘటనలో చాతీ, కాళ్లకు గాయాలయ్యాయి. ఇదే బస్సులో ఉన్న విద్యార్థి తరుష్కి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో క్షతగాత్రులను స్థానిక సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. ప్రయాణికుడిని మెరుగైన చికిత్స నిమిత్తం బరంపురం మెడికల్ ఆస్పత్రికి తరలించారు. ఇచ్ఛాపురం పట్టణ ఎస్సై ముకుందరావు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. ఇద్దరికి గాయాలు ముగ్గురే ప్రయాణికులు ఉండటంతో తప్పిన పెను ప్రమాదం -
ఆడపిల్లలు పుట్టారని అడుగుపెట్టనివ్వడం లేదు
● అత్తింటి వద్ద పిల్లలతో కలిసి వివాహిత నిరసన టెక్కలి రూరల్: ఆడపిల్లలు పుట్టారనే నెపంతో తనను అత్తవారింట అడుగుపెట్టనివ్వడం లేదని ఓ వివాహిత శనివారం పిల్లలతో కలిసి మండుటెండలో నిరసన వ్యక్తం చేసింది. స్థానికులు, బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. కోటబొమ్మాళి మండలం సరియా బొడ్డపాడు పంచాయతీ బడ్డిపేటకు చెందిన ఉపాధ్యాయుడు మెట్ట గోపాలకృష్ణతో టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన రాణికి 2017లో వివాహం జరిగింది. వీరికి వేద్విక, స్వాతి అనే ఇద్దరు ఆడ పిల్లలు పుట్టడంతో రెండేళ్లుగా భర్త, అత్తమామలు తమవెంట తీసుకెళ్లడం లేదు. దీంతో రాణి రెండేళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. మెళియాపుట్టి మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తన భర్తతో రాణి అనేక సార్లు మాట్లాడినా తీసుకెళ్లలేదు. చివరకు ఫోన్ నంబర్ సైతం బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశారు. దీంతో శనివారం పోలవరం నుంచి గ్రామపెద్దలతో కలిసి తన అత్తవారింటికి వచ్చింది. తలుపులు తీయకపోవడంతో ఇంటి వద్ద పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేసింది. అనంతరం కోటబొమ్మాళి పోలీసులను ఆశ్రయించింది. ఎస్ఐ సత్యనారాయణ వివరాలు సేకరించారు. భర్తను పిలిపించి మాట్లాడతామని తెలిపారు. -
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యార్థుల జీవన గమనాన్ని, వారి భవిష్యత్తును నిర్దేశించేది విద్య మాత్రమేనని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి జిల్లా కేంద్రంలో భారత్, స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనం ప్రాంగణంలో శనివారం పాఠశాల విద్యా శాఖ–సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన పిల్లల అవసరాలు గుర్తించడం ప్రభుత్వ బాధ్యతని, వారికి పరికరాలు అందజేసే కార్యక్రమం చాలా గొప్పదన్నారు. భారత్, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు నూతన భవనం నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం స్కౌట్స్ గైడ్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ సంపతిరావు శశిభూషణ్, ఆర్.విజయకుమారి, జి.రాజేంద్రప్రసాద్, సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ బుడుమూరు గోవిందరావు, సెక్టోరియల్ అధికారులు, స్కౌట్స్గైడ్స్ అధికారులు, టీచర్లు పాల్గొన్నారు. -
దళిత నాయకుల నిరసన
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రంలోని అరసవిల్లి మిల్లు కూడలిలో శనివారం బాబూ జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు కలిసి ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమానికి తమను సభా వేదికపైకి ఆహ్వానించలేదంటూ కొంతమంది దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్, ఎమ్మెల్యేలు దళిత నాయకులకు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం దళిత నాయకులను సభావేదికపైకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.వి.వి.ఎస్.ప్రసాదరావు, శ్రీకాకుళం తహసిల్దార్ గణపతి, మాజీ మునిసిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, అరవల రవీంద్ర, దళిత నాయకులు తైక్వాండో శ్రీను, కల్లేపల్లి రాంగోపాల్, ఎస్వీ రమణ మాదిగ, బోసు మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల విజేతగా కావ్యశ్రీ
ఆమదాలవలస: భారత తపాలా శాఖ జాతీయ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన (లేఖా రచన) పోటీల్లో ఆమదాలవలస శ్రీవాణి విద్యానికేతన్‌లో 8వ తరగతి చదువుతున్న ఇ.కావ్యశ్రీ విజేతగా నిలిచింది. పోస్ట్ కార్డు, ఇన్‌ల్యాండ్ లెటర్, ఎన్వలప్ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక పాఠశాలలో తల్లిదండ్రుల సమక్షంలో శ్రీకాకుళం హెడ్ పోస్టాఫీసు సూపరింటెండెంట్ వండాన హరిబాబు రూ.25,000 చెక్‌ను అందజేశారు. సుమారు ఎనిమిది వేల మంది పాల్గొన్న ఈ పోటీల్లో కావ్యశ్రీ విజేతగా నిలవడం జిల్లాకు దక్కిన గౌరవమని సూపరింటెండెంట్ అభినందించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల సమక్షంలో బహుమతి అందుకోవడం ఆనందంగా ఉందని కాశ్యశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా కావ్యశ్రీకి శిక్షణ ఇచ్చిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు కె.వి.రాజారావును పాఠశాల డైరెక్టర్ బి.వెంకటేశ్వర్లు, బి.నారాయణమూర్తి, విశ్రాంత ఎంఈఓ ఎస్.వి.రమణ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు లు సంపత్, ప్రణవి, తరుణ్, ఇందుమతి, హరిబాబు, అప్పలనాయుడు, పోస్టల్ శాఖ స్టెనో పూజారి దివాకర్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లు అడ్డుకోకపోవడం దారుణం శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముస్లింలకు అండగా ఉంటామని మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఇప్పుడు వక్ఫ్ బిల్లును అడ్డుకునేందుకు కావాల్సిన బలం ఉన్నా అడ్డుకోకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జోనల్ ఇన్చార్జి ఎంఏ రఫీ, జిల్లా అధ్యక్షులు ఎం.ఎ.బేగ్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం అమలుకు బాహాటంగా మద్దతిచ్చి పూర్తిస్థాయిలో బిల్లును పాస్ చేయడానికి చంద్రబాబు ప్రత్యక్ష కారణమయ్యారని ధ్వజమెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12, 13లో ఉన్న ముస్లింల పరిరక్షణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచిందని దుయ్యబట్టారు. దేశ సౌభాగ్యానికి ప్రతీకలమని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు నష్టపరిచే ప్రక్రియకు చేయి కలపడం సరికాదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఎస్.అమానుల్లా, నియోజకవర్గ అధ్యక్షుడు ముజీబుర్ రెహమాన్, పట్టణ అధ్యక్షుడు అబూబకర్, ఉపాధ్యక్షుడు సర్ఫరాజ్ భయ్యా, జహంగీర్, అజ్గర్, అలీబేగ్, సయ్యద్ రషీద్, ఎంఏ సిరాజుద్దీన్, బహదూర్ జానీ, కేఎస్ మదీనా పాల్గొన్నారు. రూ.10 లక్షల విలువైన చెట్లు దగ్ధం ఆమదాలవలస: మండలంలోని లొద్దలపేటలో పూజారి శ్రీలత అనే రైతు తోటలో గురువారం అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో 200 శ్రీగంధం చెట్లు, 200 సర్వీ చెట్లు, కొన్ని మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితురాలు వాపోయారు. భర్త ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నందున ఆమదాలవలసలో నివాసం ఉంటున్నామని, ఊరిలో తాము లేని సందర్భం చూసుకొని దుండగులు నిప్పు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని కోరారు. బెల్లం క్రషర్ షెడ్ దగ్ధం ఆమదాలవలస: మండలంలో చేపేనపేటలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో బుడితి సాంబమూర్తికి చెందిన బెల్లం క్రషర్ షెడ్ కాలిపోయింది. పక్కనున్న పొలంలో పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. షెడ్‌తో పాటు బెల్లం తయారీలో ఉపయోగించే ఇనుప పెనాలు, క్రషర్ ఇంజన్ దగ్ధమైందని, సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఆమదాలవలస అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసినట్లు చెప్పారు. -
చెరువులో గుర్తు తెలియని మృతదేహం
గార: మండలంలోని వాడాడ పంచాయతీ యాబాజీఖాన్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం మధ్యాహ్నం వాడాడకు చెందిన కొందరు వ్యక్తులు చెరువులోని గొయ్యిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. మృతదేహం ఎండిన స్థితిలో కనిపించడంతో వెంటనే సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఆర్.జనార్దనరావు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంతో తనిఖీలు జరిపించారు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని, నలుపు నిక్కరు, జేబులో ఖైనీ ప్యాకెట్, నోటు, చిల్లర పైసలు ఉన్నాయని చెప్పారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని కేశవరావుపేట పంచాయతీ కింతలి మిల్లు కూడలి వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. విజయనగరం జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఈయన ద్విచక్ర వాహనంపై చిలకపాలెం వైపు వెళ్తుండగా.. కింతలి మిల్లు సమీపంలో పంక్చర్ కావటంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్లాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రామకృష్ణను 108 అంబులెన్సు ద్వారా శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేయగా.. ఆస్పత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటబొమ్మాళి మండలానికి చెందిన సీహెచ్ రవి, డి.ప్రసాద్‌లు ద్విచక్ర వాహనంపై టెక్కలి వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి రహదారి పక్కగా ఉన్న కల్వర్టులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరూ గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హైవే అంబులెన్స్‌లో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
అనుమానంతోనే అంతమొందించాడు
ఐదు నెలల గర్భిణి.. ఆమె కాలు తూలితేనే చూసిన వారి గుండెలు జారుతాయి. అలాంటిది ఆమైపె ఓ నలుగురు కర్కశంగా రాడ్డులతో దాడి చేశారు. నిలువునా అనుమానపు భూతం ఆవహించిన భర్త.. మృగంలా మారి దగ్గరుండి మరీ ఈ మారణ హోమం జరిపించాడు. వేగంగా పరిగెత్తి పారిపోలేని ఆమె అశక్తతను అదనుగా తీసుకుని కనికరం లేకుండా కొట్టి చంపేశారు. నమ్మి వెనక వెళ్తే ఉసురు తీశాడు. కవిటి : ప్రేమించి.. పెద్దలను ఒప్పించి అదే ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. వివాహమై ఐదేళ్లు అయ్యింది.. అన్యోన్య దాంపత్యానికి మూడేళ్లు పాప జన్మించింది. రెండేళ్లుగా ఏమైందో ఏమో.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈలోగా భార్య గర్భం దాల్చింది.. తనకు పుట్టబోయే సంతానంపైనా అనుమానం కలిగి భార్యపై విపరీత ద్వేషం పెంచుకున్నాడు..ఎలాగైనా అంతమొందించాలని పథకం రచించాడు.. మరో ముగ్గురి సహకారంతో భార్యను గర్భిణి అని కూడా చూడకుండా దారుణంగా హతమార్చాడు. కవిటి మండలం అర్.కరాపాడు గ్రామానికి చెందిన కొంతాల మీనాక్షి భర్త దిలీప్ కుమార్ కర్కశత్వానికి బలైంది. దీనికి సంబంధించి ఇచ్ఛాపురం పోలీసులు కేసును శుక్రవారం ఛేదించారు. దిలీప్‌కుమార్‌తో పాటు హత్యలో పాలుపంచుకున్న మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరించారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ వి.వి.అప్పారావు ఇచ్ఛాపురం సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. రూ. 3.50 లక్షలకు కిరాయి.. ఆర్.కరాపాడులోనే ఎలక్ట్రీషియన్‌గా ఉన్న దిలీప్‌కు అదే గ్రామానికి చెందిన మీనాక్షితోనే 2020 జులై 29న ప్రేమ వివాహమైంది. రెండేళ్లుగా భార్య మీనాక్షిపై అనుమానం పెంచుకున్న దిలీప్ కుమార్ గర్భిణి అని కూడా ఆలోచించకుండా చంపాలని మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం పాత్రాపుర్ బ్లాక్ కేశరపడకు చెందిన మెట్టూరు రవికి రూ. 3.50 లక్షల కిరాయికి మాట్లాడాడు. ఇతను స్వతహాగా ఆటో డ్రైవర్ కావడం, పందుల వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఇదే వ్యాపారం చేస్తున్న విశాఖపట్నం అరిలోవ కాలనీ దుర్గా బజారుకు చెందిన వనము దాసుతో వ్యాపార పరిచయముండటంతో అతనిని ఒప్పించగలిగాడు. కవిటి మండలం జాడుపూడిలో ఖాళీగా తిరుగుతున్న తోట భానుప్రసాద్‌ను కూడా హత్యలో పాలుపంచుకునేలా పురమాయించారు. ఎలా హత్య చేశారంటే.. మీనాక్షిని వైద్యపరీక్షల నిమిత్తం భర్త దిలీప్‌కుమార్ మార్చి 28న సోంపేట వెళ్లారు. తిరుగు పయనంలో రాత్రి 8.30 గంటలకు ఆర్.కరాపాడు రైల్వేగేటు దగ్గరకు వచ్చేసరికి కొంతమంది దుండగులు భర్త ఉంటుండగానే కిరాకతకంగా దాడి చేసిన విషయం విధితమే. ఈ ఘటన జరిగిన వెంటనే భర్త దిలీప్ కుమార్ పరారవ్వడం, ఇచ్ఛాపురం సీఐ చిన్నంనాయుడు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించడం, దర్యాప్తు ప్రారంభించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా పథకం ప్రకారం దారి దోపిడీలా చిత్రీకరించాలనుకున్నారు. ఆటో, ద్విచక్రవాహనాలపై ఆర్.కరాపాడు గేటు వద్ద దారిలో కాపుకాచారు. అప్పటికే ద్విచక్రవాహనంపై భార్య మీనాక్షితో కలిసి వస్తున్న దిలీప్ బండి ఆపేయడంతో ముందుగా భానుప్రసాద్ తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్‌తో దాడి చేయడం, ఆ తర్వాత మిగతా ఇద్దరూ పిడిగుద్దులు గుద్దడం ఆరంభించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి చేర్చినట్టు నటించి భర్త అక్కడి నుంచి పరారయ్యారు. అనుకున్న ఒప్పందం ప్రకారం మెట్టూరు రవికి భార్యను చంపాక దిలీప్‌కుమార్ రూ. 2.50 లక్షలు ఇచ్చాడని, రూ. లక్ష ఇవ్వలేదని విచారణలో తెలిసింది. ఈ మేరకు నిందితుల నుంచి ఐరన్‌రాడ్, రెండు ద్విచక్రవాహనాలు, గోల్డ్ చైన్, నాలుగు మొబైళ్లు స్వాధీనం పోలీసులు చేసుకున్నారని డీఎస్పీ వివరించారు. కిరాయి ఇచ్చి గర్భిణిని చంపించిన భర్త ముగ్గురితో రూ.3.50 లక్షలకు ఒప్పందం కేసును ఛేదించిన ఇచ్ఛాపురం పోలీసులు భర్తతో సహా నలుగురికి రిమాండ్ -
మిస్టర్ ఆంధ్రా పోటీల్లో సిక్కోలు హవా
శ్రీకాకుళం న్యూకాలనీ: మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ పోటీల్లో శ్రీకాకుళం బాడీబిల్డర్లు సత్తాచాటారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం నిర్వహించిన మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో కవిటి చెందిన దుదిస్టీ మజ్జి 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచారు. ఎస్.వైకుంఠరావు(శ్రీకూర్మం) 60 కేజీల విభాగంలో 4వ స్థానం, కె.అవినాష్ (పలాస) తదితరులు రాణించారు. వీరిని భీమవరానికి చెందిన ఎమ్మెల్యే అంజిబాబు, సంఘ రాష్ట్ర అసోసియేట్ సెక్రటరీ వి.విజయ్ బహుమతులు అందజేశారు. వీరిని శ్రీకాకుళం జిల్లా సెక్రటరీ కె.గౌరీశంకర్, అధ్యక్షులు తారకేశ్వరరావు, చీఫ్ పేట్రన్ డాక్టర్ బాడాన దేవభూషణరావు, వడ్డాది విజయ్‌కుమార్, బలగ ప్రసాద్, సీనియర్ బాడీబిల్డర్లు, జిమ్ నిర్వాహకులు, కోచ్‌లు అభినందించారు. వన్యప్రాణుల సంహారం.. నలుగురిపై కేసు సారవకోట: వన్య ప్రాణుల సంహారం చేస్తున్న నలుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సారవకోట సెక్షన్ ఆఫీసర్ ఎల్.ఈశ్వరరావు తెలిపారు. సారవకోట రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని పలు చోట్ల నాటుబాంబులు ఉపయోగించి వన్య ప్రాణులను సంహరిస్తున్నారని సమాచారం అందడంతో శుక్రవారం సారవకోట, పాతపట్నం అటవీ శాఖాధికారులు మాటు వేశారు. సరుబుజ్జిలి మండలం యరగాం సమీపంలో 19 నాటుబాంబులతో సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సీతంపేటకు చెందిన మోహనరావు, సరుబుజ్జిలి మండలానికి చెందిన సింహాచలం, త్రినాథరావు, ఎల్ఎన్ పేటకు చెందిన జగన్నాథంలుగా గుర్తించారు. -
టెక్కలిని మున్సిపాలిటీగా మారుస్తాం
టెక్కలి/సంతబొమ్మాళి: జిల్లా కేంద్రానికి ధీటుగా టెక్కలిని అభివృద్ధి చేస్తామని.. అయితే పంచాయతీగా ఉంటే సాధ్యం కాదు కాబట్టి దశల వారీగా మున్సిపాలిటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. సుమారు రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో టెక్కలి–చెట్లతాండ్ర రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా మార్గంలో పర్యటించే క్రమంలో చిరు వ్యాపారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఇక్కడే జీవనోపాధి చేస్తున్నామని ఇప్పుడు రోడ్డు విస్తరణతో రోడ్డున పడతామని వాపోయారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. టెక్కలిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామన్నారు. అంతకుముందు టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నూతన బస్సులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఆర్అండ్బీ ఎస్ఈ కె.జాన్ సుధాకర్, టీడీపీ నాయకులు కె.హరివరప్రసాద్, బి.శేషగిరి, కె.లవకుమార్, ఎం.దమయంతి, ఎం.రాము, ఎల్.శ్రీనివాస్, కె.కామేష్, ఆర్ అండ్ బీ అధికారులు డీఈ రవికాంత్, జేఈ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు -
పెను ప్రమాదం తప్పింది!
హమ్మయ్యా.. ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారిపై ఫరీదుపేట కూడలి కొయ్యరాళ్లు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారికి స్వల్ప గాయాలు కాగా, ఆమె తల్లిదండ్రులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసింహమూర్తి అనే ఉపాధ్యాయుడు విధులు ముగించుకుని శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీలోని తన నివాసానికి కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఒడిశా వైపు వెళుతున్న కారు కొయ్యరాళ్లు సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పి ఉపాధ్యాయుడి కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో టీచర్ కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఒడిశా వైపు వెళ్తున్న కారులో చిన్నారి లిఖితకు స్వల్ప గాయాలయ్యాయి. భార్యాభర్తలకు ఎటువంటి గాయాలు కాలేదు. ఎచ్చెర్ల ఎస్సై సందీప్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. హైవేపై రెండు కార్లు ఢీ చిన్నారికి గాయాలు.. క్షేమంగా బయటపడిన తల్లిదండ్రులు -
రెండు కేజీల గంజాయితో ముగ్గురు అరెస్టు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో 2 కేజీల 140 గ్రాముల గంజాయితో ముగ్గురు వ్యక్తులను పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి. వెంకట అప్పారావు తెలిపారు. ఇచ్ఛాపురం సీఐ కార్యాలయం ఆవరణంలో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన లక్ష్మికాంత్ బలియార్, అతని బావ మోహన్దాస్ప్రదాన్లు ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో గంజాయి వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో లక్ష్మికాంత్ గంజాయిని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో విక్రయించి వచ్చిన మొత్తాన్ని సమానంగా పంచుకునేవారు. ఈ క్రమంలో అక్కడి గంజాయి వ్యాపారి షాహాజి రామజాదవ్తో సికింద్రాబాద్‌లో పరిచయం ఏర్పడింది. తనకు కిలో గంజాయి అందజేస్తే రూ.7500 చెల్లిస్తానని చెప్పడంతో గంజాయి కొనుగోలు చేసి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్దకు వచ్చారు. వీరితో పాటు అక్కడికి వచ్చిన రామజాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
రిమ్స్‌లో ఇన్ని సమస్యలా?
శ్రీకాకుళం: జిల్లాకే ప్రధాన ఆస్పత్రిగా ఉన్న రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో ఇన్ని సమస్యలు ఉంటే ఎలా అని కలెక్టర్ దినకర్ పుండ్కర్ హాస్పిటల్ అధికారులను ప్రశ్నించారు. రోగులు, విద్యార్థులు, వైద్యులు పడుతున్న ఇబ్బందులపై ఇటీవల ‘సాక్షి’లో పలు కథనాలు రావటంతో పాటు వ్యక్తిగతంగా కొన్ని ఫిర్యాదులు అందటంతో శుక్రవారం రిమ్స్ ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య ఉందని గుర్తించిన కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. పెద్దగా సమస్య లేదని రిమ్స్ అధికారులు చెప్పగా.. అక్కడే ఉన్న వాష్ బేసిన్ వద్ద ట్యాప్ విప్పగా నీరు రాలేదు. దీంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. రెండో బోరు ఏర్పాటు చేయాలని ఏపీహెచ్ఎంహెచ్ఐడిసీ ఈఈని ఆదేశించారు. లిఫ్టు సమస్యలపై ఆరా తీశారు. హాస్టల్ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం హెచ్ఓడీలతో సమావేశమయ్యారు. ఖాళీ పోస్టుల వివరాలను తెలియజేస్తే భర్తీకి చర్యలు తీసుకుంటానని చెప్పారు. మే మొదటి వారం నాటికి ఆస్పత్రి సలహా మండలి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ షకీల, ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలం, ఆర్‌ఎంఓలు డాక్టర్ సుభాషిని, డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ షర్మిళ, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ సీపీ శ్రీదేవి, డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ డి.పార్వతి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అసంతృప్తి -
తేలని వాటా.. తెచ్చిన తంటా
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి బాల మురళీకృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోవడం సంచలనమైంది. అయితే ఆయనతో పాటు సీసీ సురేష్‌కుమార్ కూడా బుక్కవ్వడం వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఈ దాడుల వెనుక కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం అన్నీ కార్యాలయ ముఖ్య విభాగాధికారిగా పనిచేస్తున్న ‘ఆయన’ అని వైద్యారోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. కాంతమ్మ అనే దివ్యాంగురాలు, సీనియర్ అసిస్టెంట్‌ను అడ్డం పెట్టుకుని కథను నడిపించారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొంప ముంచిన వాటాలు వైద్యారోగ్య శాఖలో అవినీతి ఇప్పుడు బహిర్గతమైంది గానీ.. ఇక్కడ మామూళ్ల వసూలు చాలా మామూ లు విషయమన్న సంగతి అన్ని విభాగాలకు తెలుసు. ఫైలుకు ఓ రేట్ పెట్టుకుని వ్యవహారాలు నడుస్తున్న ఈ కార్యాలయంలో కొత్తగా డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన బాలమురళీకృష్ణ తన క్యాంపు క్లర్క్‌లను మార్చేసి జిల్లాకు చెందిన ఓ బడా నేత సిఫారసుతో సురేష్‌కుమార్‌ను సీసీగా నియమించుకున్నా రు. ఇక్కడే వైద్యారోగ్య శాఖ సిబ్బందిలో లుకలుకలు బయటపడ్డాయి. కొత్త సీసీ వచ్చాక డీఎంహెచ్ఓ ఎవరితోనూ సంబంధం లేకుండా తన సొంత దుకా ణం తెరుచుకున్నారు. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు కూడా ప్రచురితమైన సంగతి విదితమే. దీంతో అంతవరకు సాగిన ‘మూమూళ్ల’ వ్యవహారంలో తేడాలు వచ్చాయి. అప్పటివరకు ప్రతి ఫైల్ మూవ్ ఆర్డర్‌కు కూడా విభాగానికి ఒక్కో వాటా వెళ్లేది. కొన్ని రోజులుగా అన్ని విభాగాలు వాటాలు క్యాన్సి ల్ అయిపోయి నేరుగా డీఎంహెచ్ఓ చాంబర్‌కే మామూళ్లు చేరిపోయాయి. దీంతో వివాదాలు పెరిగి ఏసీబీకి తమ వారితో ఫిర్యాదు చేసేంత స్థాయికి చేరిపోయాయి. ఫలితంగా ఏకంగా జిల్లా అధికారి ఏసీబీ చేతికి చిక్కాల్సి వచ్చింది. పైగా ఫిర్యాదుదారురాలు కాంతమ్మపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయన్న సంగతి కూడా పాఠకులకు తెలిసిందే. ఈమె కొంత మంది నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట వసూ ళ్లు చేయడంతో బాధితులంతా నిలదీయడంతో కొ న్ని నెలల పాటు విధులకు వెళ్లకుండా మాయమైపోయింది. ఇవే సెలవుల అనంతరం వైద్యశాఖ రీజనల్ డైరక్టర్ వద్ద నుంచి రీపోస్టింగ్కు ఆదేశాలు పొందినప్పటికీ మూవ్ ఆర్డర్ ఇవ్వాల్సిన డీఎంహెచ్ఓ లంచం డిమాండ్ చేయగా కాంతమ్మ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించింది. దీనివెనుక విభాగాధిపతి ఉన్నారన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. ఈ వ్యవహారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ జాయినింగ్ ఆర్డర్లు వ్యవహారంలో కూడా ఆ కీలక ఉద్యోగి పాత్ర ఉందన్న సంగతిపై తేల్చాలని కూడా మంత్రి ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. డీఎంహెచ్‌ఓపై ఏసీబీ దాడుల వెనుక పెద్ద ప్లాన్ వాటాల సమస్యే కొంపముంచిందంటున్న వైద్యశాఖ వర్గాలు -
శ్రీకాకుళం
అనుమానంతోనే.. ఐదు నెలల గర్భిణి హత్య కేసు తేలింది. అనుమానంతో భర్తే చంపేసినట్టు పోలీసులు నిర్ధారించారు. –8లోఆదిత్యా క్షమించవా..ఆదిత్యుని వార్షిక కల్యాణ క్రతువుకు ప్రచారం కరువైంది. ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కూడా జరగలేదు. –8లోవెళ్లొస్తాం నేస్తం.. రిమ్స్‌లో ఇన్ని సమస్యలా..? రిమ్స్ ఆస్పత్రిని కలెక్టర్ పరిశీలించారు. సమస్యలు చూసి నిర్ఘాంతపోయారు. –8లో శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025తేలినీలాపురం గ్రామంలో ఉన్న విదేశీ పక్షుల విడిది కేంద్రంలో ఉన్న సైబీరియా పక్షులున్యూస్రీల్ -
ఆధార్‌కు దారి కష్టాలు
టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో గల హెడ్ పోస్టల్ కార్యాలయంలో ఆధార్ నమోదు కోసం వచ్చిన వినియోగదారులు శుక్రవారం గేటు బయట పడిగాపులు కాశారు. పశు సంవర్ధక శాఖ కార్యాలయం ప్రాంగణం నుంచి పోస్టల్ కార్యాలయానికి ఉన్న గేటు మార్గాన్ని పశు సంవర్ధక శాఖాధికారులు మూసివేశారు. దీంతో ఆధార్ నమోదుకు వచ్చిన వారితో పాటు పోస్టల్ సిబ్బంది గేటు బయట పడిగాపులు కాశారు. కొంత సమయం తర్వాత పశు సంవర్ధక శాఖ డీడీ జయరాజ్ కార్యాలయానికి చేరుకోవడంతో, పోస్టల్ సిబ్బందికి డీడీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోస్టల్ సిబ్బంది మాట్లాడుతూ.. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే మార్గా న్ని వినియోగిస్తున్నామని, ఇప్పుడు ఆధార్ నమోదు కోసం వచ్చిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిని ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు గుర్తు చేశారు. అయితే తమ కార్యాలయం ప్రాంగణం నుంచి పోస్టల్ కార్యాలయానికి వెళ్లే వారంతా పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారంటూ పశు సంవర్ధక శాఖాధికారులు చెప్పడం గమనార్హం. -
ఆన్లైన్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: డీఎస్సీ రాయనున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత ఆన్లైన్ శిక్షణ అందించనున్నామని, ఈ శిక్షణ కు గాను ఈనెల 10వతేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమాధికారి ఇ.అనురాధ తెలిపారు. మెగా డీఎస్సీ టెట్ పరీక్షలో అర్హత సాధించిన శ్రీకాకుళం జిల్లా వాసులైన బీసీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ కేటగిరీలకు చెందిన వారు ఉచిత శిక్షణకు అర్హులని తెలిపారు. టెట్ ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులని, టెట్ పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో శ్రీకాకుళంలోని 80 అడుగులు రోడ్డులో గల ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం ఫోన్ నంబర్లు 7382975679, 9295653489ను సంప్రదించాలని తెలిపారు. అభ్యర్థులు పది, ఇంటర్మీడియెట్, డిగ్రీ మార్కుల జాబితాలు, టెట్ మార్కుల జాబితా, రెండు ఫొటోలు అందజేయాలని తెలిపారు. రిమ్స్‌లో ప్రత్యేక ఓపీ క్లినిక్‌లు శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని రిమ్స్ ప్రభుత్వ ఆస్పత్రిలో కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాలకు ప్రత్యేక ఓపీ క్లినిక్‌లను కొన్ని రోజుల పాటు నిర్వహించనున్నామని రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక క్లినిక్‌లో సంబంధిత వ్యాధి లక్షణాలు గల వ్యక్తులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. ఈ క్లినిక్‌లో పా ల్గొనే వారంతా వ్యాధికి సంబంధించిన పాత రికార్డులు, వారి ఆధార్ కార్డుతో పాటు సంబంధిత వ్యక్తి మొబైల్ నంబర్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఈనెల 7వ తేదీన మూర్ఛ వ్యాధి, 10వ తేదీన రొమ్ము వ్యాధులు, 11వ తేదీన థైరాయిడ్ సమస్యలు, 15వ తేదీన హె ర్నియా, కడుపులో వాపులు, బీర్జాలు, 16వ తేదీన పచ్చ కామెర్లు, కాలేయం తదితర సంబంధిత సమస్యలు, 23వ తేదీన పాదాల వ్యాధులు, మధుమేహంకు సంబంధించిన పాదాల సమస్యలున్న వారంతా హాజరుకావచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ ప్రత్యేక ఓపీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటిలో గ్యాస్ లీక్ హిరమండలం: హిరమండలంలోని చిన్నకోరాడ వీధిలో పెను ప్రమాదం తప్పింది. వీధిలో ని దేవరశెట్టి శ్రీనివాసరావు భార్య శ్రీదేవి శుక్రవారం ఇంటిలో వంటచేయడానికి గ్యాస్‌స్టవ్‌ను వెలిగించగా.. ట్యూబ్ ద్వారా గ్యాస్ లీకై సిలిండర్‌లో మంటలు చేలరేగాయి. దీంతో ఆమె భయంతో ఇంటి బయటకు పరుగులు తీశారు. వెంటనే చిన్నకోరాడ సెంటర్లో హోటల్ నిర్వహిస్తున్న భర్తకు విషయం చెప్పారు. అప్పటికే ఇంటి నిండా పొగలు కమ్ముకున్నాయి. గ్యాస్ ఏజెన్సీకి, కొత్తూరు అగ్ని మాపక కేంద్రానికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో.. గ్యాస్ కార్యాలయం నుంచి వచ్చిన కృష్ణంరాజు సిలిండర్ నుంచి వచ్చిన మంటలను పూర్తిగా అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి మంటలు అదుపులోకి వచ్చాశాయి. -
వారు చెప్పిందే ముహూర్తం
సమస్యలు సరిదిద్దుతాం ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి ఇరు పార్టీలు హాజరైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా పూర్తిచేయడం జరుగుతోంది. స్లాట్ బుకింగ్ ఈ రోజే ప్రారంభం కావడంతో చిన్నచిన్న సమస్యలున్నా సరిదిద్దుతాం. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు స్లాట్ బుక్ చేసుకున్న తరువాతే రిజిస్ట్రేషన్‌కు వస్తే మంచిది. – నాగలక్ష్మి, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్‌శాఖ డీఐజీ, శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్ ● స్లాట్ బుక్ చేస్తేనే రిజిస్ట్రేషన్ ● చలానా తీశాకే రూ.200తో స్లాట్ ● స్లాట్ సమయంలో వెళ్లకుంటే డబ్బులు పోయినట్లే ● సాంకేతిక, సమస్యలతో తప్పని తిప్పలు ● ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): భూముల క్రయవిక్రయాలకు జనం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి 1 నుంచి కూటమి ప్రభుత్వం భారీగా భూములు ధరలు పెంచి ప్రజల నెత్తిన భారం వేసింది. నిత్యావసరాల సంగతి సరేసరి. విద్యుత్ బిల్లుల భారం ఇప్పుడిప్పుడే అందరికీ తెలిసి వస్తోంది. ఏదో ఒక రూపేణా ప్రజల నెత్తిన భారం వేసి ప్రభుత్వ ఆదాయం పెంచుకుపోవడమే కూటమి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా స్లాట్ బుకింగ్ సిస్టమ్ తెరపైకి తీసుకొచ్చి మరో రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. సాధారణంగా మంచి ముహూర్తం చూసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం రివాజు. కానీ ఈ కొత్త పద్ధతితో వారు చెప్పిందే ముహూర్తంగా మారుతోంది. స్లాట్ బుకింగ్‌తో తప్పని తిప్పలు భూముల కొనుగోలు, అమ్మకాలు చేసుకునే వారు డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లి సంబంధిత డాక్యుమెంట్ తయారు చేయించుకుని ఐజీఆర్ఎస్ సర్వీ స్లో వివరాలన్నీ నమోదు చేసుకుని సంబంధిత వ్యక్తులు సంతకాలు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా చేసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇవన్నీ చేస్తూ ముందస్తుగానే చలానా తీస్తేనే స్లాట్ బుక్ చేయడం జరుగుతుంది. స్లాట్ సమయానికి ఒక వేళ ఏదైనా కారణం వల్ల రిజిస్ట్రేషన్‌కు హాజరు కాలేకపోయినా.. సాంకేతిక పరమైన సమస్యలు ఉండి రిజిస్ట్రేషన్ కాకపోయినా స్లాట్ డబ్బులు పోయినట్లే. ఆ రోజులో ఎన్నిసార్లు స్లాట్ బుక్ చేస్తే అన్ని రూ.200 చెల్లించాల్సిందే. ఓ మంచి ముహూ ర్తాన రిజిస్ట్రేషన్ ఎవరైనా చేయించాలనుకుంటే ఆన్లైన్లో స్లాట్ దొరికితేనే వారికి రిజిస్ట్రేషన్ లేకుంటే అంతే సంగతులు. స్లాట్ బుక్ చేసుకున్నాక కొనుగోలు చేసిన వారికో అమ్మిన వారికో అనారోగ్యం వచ్చినా, డబ్బులు ఎడ్జస్ట్మెంట్ కాకపోయినా, బ్యాంక్‌లో చలానా తీయడం ఆలస్యం కావడం లాంటి సంఘటనలు ఎదురైతే రిజిస్ట్రేషన్ జరగదు. స్లాట్ సమయానికి సబ్ రిజిస్ట్రార్లు, సంబంధిత సిబ్బంది అందుబాటులో లేకపోయినా డబ్బులు వృధాగా పోతాయి. స్లాట్లు సరిగా జరగకపోవడంతో రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయంలో గంటల కొద్ది వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ఆర్థిక సాయం
వజ్రపుకొత్తూరు: మంచినీళ్లపేట గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు బుంగ ధనరాజు, వంక కృష్ణలు మంగళవారం చేపల వేట సాగిస్తుండగా జరిగిన తెప్ప ప్రమాదంలో గల్లంతై మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేతలు పార్టీ తరఫున మృతుని కుటుంబాలకు రూ.50,000 చొప్పున గురువారం ఆర్థిక సాయం అందించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో మృతుల కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఆర్థిక సాయం అందించిన వారిలో పార్టీ నాయకులు ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్, పాలిన శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వాడ మధుకేశ్వరరావు, వైస్ ఎంపీపీ వంక రాజు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తిర్రి రాజారావు, మత్య్సకార ఐక్యవేదిక నాయకులు ఉన్నారు. 11 ఇసుక ట్రాక్టర్ల పట్టివేతహిరమండలం: వంశధార నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ఎన్.హనుమంతురావు, ఎస్ఐ ఎండీ యాసిన్ హెచ్చరించారు. వంశధార నది నుంచి అక్రమంగా తరలిస్తున్న 11 ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్, ఎస్ఐలు గురువారం ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు. ఇసుక తరలిస్తున్న వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని భగీరథిపురం, పిండ్రువాడ, ఎంఎల్పురం గ్రామాల పరిధిలో వంశధార నది నుంచి ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందని, ట్రాక్టర్ల యజమానులతో కూడా మాట్లాడామని, ఇక్కడ రీచ్ లేదని వివరించామని తెలిపారు. ట్రెంచ్‌లు ఏర్పాటు చేసినా వాటిని కప్పి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని, దీనిపై సమాచారం రావడంతో పోలీసులతో కలిసి దాడి చేశామన్నారు. దాడి లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లతోపాటు నదిలో ఉన్న 3 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిపారు. వీరికి మెదటి హెచ్చరికగా అపరాధ రుసం వేస్తున్నట్లు తెలిపారు. హిరమండలంలో ఇసుక రీచ్ లేదని, ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ స్థాయి హాకీ పోటీలకు వినయ్ శ్రీకాకుళం న్యూకాలనీ: 15వ ఆలిండియా సీనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి తుంగాన వినయ్ ఎంపికయ్యాడు. ఈ పోటీలు ఈనెల 4 నుంచి 15వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నగరం వేదికగా జరగనున్నా యి. ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల హాకీ జట్టుకు వినయ్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ పోటీల కోసం ఇప్పటికే ఆంధ్రా జట్టుతో కలిసి యూపీ చేరుకున్నాడు. గతనెల 6 నుంచి 8 వరకు గుంటూరులో జరిగిన రాష్ట్రపోటీల్లో రాణించడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. శ్రీకాకుళం నగరం ఫాజుల్‌బాగ్‌పేట వీధికి చెందిన తుంగాన గోపి కుమారుడు వినయ్. -
ఇదే పెద్ద పండగ..
ఊరంతా పందిరి వేయాలి.. ఇంటింటా పచ్చ తోరణాలు కట్టాలి.. మంగళ వాద్యాలు ప్రతి వీధిలోనూ వినిపించాలి.. సాగర ఘోషతో సమానంగా వేదమంత్రాలు ప్రతిధ్వనించాలి.. ఆ సందడి మధ్య రామచంద్రుడి పెళ్లి జానకమ్మతో జరగాలి.. ఇది నువ్వలరేవు కట్టుబాటు. అనాదిగా పాటిస్తున్న ఆచారం. రాముడి పెళ్లికి ఆ ఊరివారంతా పెళ్లి పెద్దలుగా మారిపోతారు. ఇంటి ఆడపడుచుకు కన్యాదానం చేసినంత సంబరంగా సీతమ్మను రామ చంద్రుడి చేతిలో పెడతారు. పెళ్లి చేయగానే పండగ కాదు.. కదా మరో ఆరు రోజులాగి రావణ సంహారాన్ని కూడా కానిచ్చి నవమి వేడుకలు పూర్తి చేస్తారు. ● సాగర తీరంలో సీతారాముల పరిణయం ● నువ్వలరేవులో ఆధ్యాత్మిక శోభ ● 12వ తేదీ వరకు అట్టహాసంగా శ్రీరామనవమి ఉత్సవాలు వజ్రపుకొత్తూరు రూరల్: వలస పక్షులు వచ్చి వాలిపోయాయి. చలువ పందిళ్లు కొలువు దీరాయి. శుభరాట కూడా ఠీవిగా నిలబడింది. మొత్తానికి నువ్వలరేవు మినీ అయోధ్యలా మారిపోయింది. జిల్లాలోనే అతి పెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వలరేవు రామనవమికి సిద్ధమైంది. పెద్దలు పెట్టిన కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటించే ఈ గ్రామంలో సీతారాముల కల్యా ణం చేయడం తమ బాధ్యతగా భావిస్తారు. ఈ మత్స్యకార గ్రామంలో సుమారు 3,300 ఇళ్లు ఉండగా దాదాపుగా 12 వేల మంది జనాభా ఉన్నారు. కేవలం బెహరా, మువ్వల, బైనపల్లి ఇంటి పేర్లతో ఉండే ఈ గ్రామంలో ‘బెహరా’లను గ్రా మ పెద్దగా నిర్ణయిస్తారు. పెద బెహరా, చిన బెహరాలు చెప్పే మాటలకు కట్టుబడి కార్యక్రమాలు చేపడతారు. గ్రామంలో జరిగే అన్ని ఉత్సవాల కంటే సీతారాముల కల్యాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఏటా వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా మార్చి 30 (ఆదివారం) నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిపేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమాలు ఇవే రామ నవమి వేడుకల కోసం గ్రామంలో పెద్దలంతా సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమాలను రూపొందించారు. గత నెల 30న సాయంత్రం దాసుడు ఇంటి నుంచి దేవరతో బయలుదేరి ఠక్కురాణి అమ్మవారికి పూజలు చేసి జెండా ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు వచ్చే నెల 12న జరిగే రావణ సంహారంతో ముగియనున్నాయి. ఉత్సవాల్లో ప్రధా న ఘట్టం శ్రీరామనవమి. ఆ రోజున ముందుగా గ్రామ దేవత బృందావతి అమ్మవారి ఆలయం వద్ద జెండాను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే రామాలయం వద్ద మరో జెండాను ఆవిష్కరించి హోమం, యజ్ఞాలతో పండితులు వేదమంత్రోచ్ఛరణల మధ్య సీతారాములు కల్యాణం కనుల పండువగా జరుపుతారు. తర్వాత రోజు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఇందులో భాగంగా యువకులు డ్యాన్స్‌లు, పగటి వేషాలతో అలరిస్తారు. కర్రసాము, పాండురంగ నాటకం, రామ నాటకం, రామయ్య పట్టాభిషేకం, మంతాము ఎక్కడ ఉన్నా గ్రామ దేవత బృందావతి అమ్మవారి చల్లన దీవెనలు, సీతారాముల కరుణా కటాక్షాలు తమపై ఎల్లప్పుడూ ఉంటాయని గ్రామస్తుల విశ్వాసం. అందుకే సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చించి అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని పెద్ద పండగగా ఏటా జరుపుకుంటారు. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో ఊరంతా మెరిసిపోతోంది. ఉత్సవాలు చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా వస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల చొరవతో గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు ముస్తాబైన నువ్వలరేవు గ్రామం ఆచారాలకు పెద్ద పీట తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేస్తాం. వలస కూలీలు ఎక్కడ ఉన్నా స్వగ్రామానికి చేరుకుని ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, పూజారులు, యువకులు సహకారంతో ఉత్సవాలు జరుపుకుంటాం. – బైనపల్లి నవీన్, సొసైటీ అధ్యక్షుడు, నువ్వలరేవు● వేడుకలకు సిద్ధ్దమైన రామాలయం డపారాధన, కోయి డ్యాన్స్, రావణ దహనం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగిస్తారు. ఐకమత్యంతో నవమి ఉత్సవాలు తరతరాలుగా వస్తున్న శ్రీరామ నవమి ఉత్సవాలు ఐకమత్యంతో జరుపుకుంటున్నాం. మా ఇంటి ఇలవేల్పుగా బృందావతి అమ్మవారిని కొలుచుకుంటూ మాకు అదర్శ దైవంగా నిలిచిన శ్రీరాముడు, సీతమ్మలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏటా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. – మువ్వల పూర్ణచంద్రరావు, సర్పంచ్, నువ్వలరేవు -
7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అఫిలియేషన్ డిగ్రీ కళాశాలల నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు యూజీ ఎగ్జామినేషన్స్ డీన్ పి.పద్మారావు చెప్పారు. పరీక్ష కార్యాలయంలో గురువారం వివరాలు వెల్లడించారు. పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. 54 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. రెగ్యులర్‌గా, సప్లిమెంటరీ విధానంలో 9000 మంది వరకు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. పీజీ పరీక్షల నిర్వహణకు నోటిఫికేషన్ ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పలు పీజీ పరీక్షల నిర్వహణకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పీజీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ గురువారం తెలిపారు. పీజీ నాల్గో సెమిస్టర్ పరీక్ష రాసేవిద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని అన్నా రు. ఈ నెల 21 నుంచి 30 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బీటెక్ 8వ సెమిస్టర్ పరీక్షకు సంబంధించి ఈ నెల 14వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని, పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. వర్సిటీ అఫిలియేషన్ బీపీఈడీ, డీపీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నెల 14వ తేదీ లోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. ‘అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలి’ పలాస: అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని సి.పి.ఐ ఎం.ఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మంది రం వద్ద గురువారం కరపత్రాలను, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్ర కమిటీ పిలుపు మేరకు భారత విప్లవోద్యమంలో అగ్రనాయకుల్లో ఒకరైన పైలా వాసుదేవరావు 15వ వర్ధంతి సభ ఈనెల 13న పలాసలో జరగనుందని, అలాగే అమరవీరులు రాయల సుభాష్ చంద్రబోస్, చండ్రపుల్లారెడ్డి, మాదాల నారాయణస్వామి వర్ధంతిలు కూడా ఇదే నెలలో ఉన్నాయని, వారి జ్ఞాపకార్థం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభలు నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు గొరకల బాలకృష్ణ, జుత్తు వీరాస్వామి, పోతనపల్లి కుసుమ, వంకల పాపయ్య, కుత్తుం హేమ, మురిపింటి తాతారావు, సార జగన్, మద్దిల వినోద్, బదకల ఈశ్వరి, జడ్డే అప్పయ్య పాల్గొన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు పాతపట్నం : నిషిద్ధమైన ఆహార పదార్థాలను విక్రయిస్తే అలాంటి దుకాణాలను శాశ్వతంగా మూసివేయడంతోపాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని శ్రీకాకుళం ఫుడ్ కంట్రోల్ అధికారి కె.వెంకటరత్నం హెచ్చరించారు. పాతపట్నంలో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కిరాణా, స్వీట్స్, టీ, తదితర దుకా ణాలను తన బృందంతో కలిసి గురువారం తనిఖీ చేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఒడిశా నుంచి తీసుకువచ్చిన నకిలీ వస్తువులు చెలామణీ చేస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. రంగులు కలిపిన ఆహార పదార్థాలు ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి కె.లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయితో వ్యక్తి అరెస్టు
సోంపేట: మండలంలోని కొర్లాం జాతీయ రహదారి వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బారువ ఎస్ఐ హరిబాబునాయుడు అరెస్టు చేశారు. సోంపేట సర్కిల్ పోలీస్‌స్టేషన్ వద్ద సీఐ బి.మంగరాజు గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కొర్లాం జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. తనిఖీ చేయగా 1.050 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితుడు ఒడిశా నుంచి బాపట్లకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో బారువ ఎస్ఐ హరిబాబునాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వం దోచేస్తారు
షికారుకెళ్తారు.. శ్రీకాకుళం క్రైమ్ : బండిపై సాయంత్రం అలా షికారుకి వెళ్లినట్లు తామెంచుకున్న గ్రామానికి వెళతారు.. వెంట తీసుకెళ్లిన ఫోన్లను స్విచ్చాఫ్ చేసి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి తిరిగి వెళ్లిపోతారు.. అదే రోజు రాత్రి చోరీ ఎక్కడ చేద్దామనుకున్నారో.. ఆ ఇంటికి కాస్త దూరంలో బండి పార్కింగ్ చేసి వారి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డు, స్క్రూ డ్రైవర్‌తో ఇంటి తాళాలు పగులగొడతారు.. బీరువా తలుపులు విరగ్గొట్టి అందులో ఉన్న నగదు, బంగారం, వెండి దోచుకుని పరారవుతారు.. ఇలా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 17 చోట్ల చోరీలు చేసి ఎట్టకేలకు కాశీబుగ్గ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి 37 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండిని స్వాధీనపర్చుకున్నారు. ఈ మేరకు నిందితు లైన పార్వతీపురం మన్యం జిల్లా సీతానగ రం మండలం జోగింపేటకు చెందిన పోలా భాస్కరరావు, శ్రీకాకుళం ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామానికి చెందిన ముద్దాడ నర్సింగరావులను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. కాశీబుగ్గ పోలీసులకు చిక్కి.. గతేడాది మే 24న కాశీబుగ్గ పీఎస్ పరిధిలో బంగారం, వెండి చోరీ చేసిన కేసులో నిందితులైన భాస్క ర్, నర్సింగరావులు గురువారం నర్సిపురం రైల్వేగే ట్ ఎక్స్–సర్వీస్‌మ్యాన్ క్యాంటీన్ ఎదురుగా వాహన తనిఖీల్లో భాగంగా కాశీబుగ్గ పోలీసులకు చిక్కారు. కాశీబుగ్గ డీఎస్పీ వి.వి.అప్పారావు ఆధ్వర్యంలో సీఐ చంద్రమౌళి నిందితులను విచారించగా వారు చేసిన ఒక్కొక్క నేరం వెలుగులోకి వచ్చాయి. కాశీబుగ్గ, మెళియాపుట్టి, జె.ఆర్.పురం, టెక్కలి పీఎస్‌ల పరిధిలో ఒక్కొక్కటి, శ్రీకాకుళం రూరల్, వన్‌టౌన్, టూ టౌన్లో మూడేసి చోరీలు, పాతపట్నంలో రెండు చోరీలు చేయగా మన్యం జిల్లా పాలకొండలో రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలివే.. 17 కేసుల్లో 76 తులాలకు గాను రూ.36.80 లక్షల విలువైన 37 తులాల బంగారు ఆభరణాలు, 184.58 తులాల వెండికి గాను 20 తులాల వెండి, రూ.5 లక్షలు విలువ చేసే డైమండ్ ఆభరణాలకు గాను రూ.2 లక్షలు విలువైన డైమండ్ బ్రాస్లెట్, డైమండ్ లాకెట్, రూ. 3.44 లక్షల నగదుకు గాను రూ.25 వేలు నగదు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష విలువైన రెండు బైక్‌లు, రూ.2 లక్షలు విలువైన ఓ స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించడంలో కృషిచేసిన కాశీబుగ్గ పోలీసులను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన గజదొంగలు 17 చోరీలు చేసిన ఇద్దరు నిందితుల అరెస్టు ఒకరిది ఎచ్చెర్ల మండలం ముద్దాడ, మరొకరిది పార్వతీపురం మన్యం జిల్లా జోగంపేట 37 తులాల బంగారం, 20 తులాల వెండి రికవరీ వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి లెక్కకు మించి కేసులు.. నిందితుల్లో ఒకరైన పోలా భాస్కరరావుపై శ్రీకాకుళంలో 19. విజయనగరంలో 16, విశాఖపట్నం(రూరల్–2) జిల్లాల్లో 37 చోరీ కేసులు నమోదవ్వగా ఎనిమిదింటి లో నేరారోపణ రుజువై జైలు శిక్ష అనుభవించాడు. నర్సింగరావుపై 17 కేసులుండ గా (శ్రీకాకుళం–9, విజయనగరం–4, విశాఖపట్నం సిటీ–3, పార్వతీపురం మన్యం–1) మూడింటిలో నేరారోపణ రుజువై జైలు శిక్ష అనుభవించాడు. చిన్నప్పటి నుంచే.. భాస్కరరావు తన తొమ్మిదో సంవత్సరంలోనే అప్పయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ కాలనీలో ఓ ఇంట్లో డబ్బులు దొంగిలించడంతో సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో జువైనల్ కేసు నమోదైంది. మూడు నెలలు పాటు విశాఖ అబ్జర్వేషన్ హోంలో ఉన్నాడు. అప్పటి నుంచే నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడు. ఇక నర్సింగరావు శ్రీకాకు ళం జిల్లా కేంద్రంలోని ఓ బైక్ షోరూంలో పనిచేస్తూ బై క్‌ను దొంగిలించి జైలుకి వెళ్లాడు. ఇద్దరికీ విశాఖపట్నం సెంట్రల్ జైలులో పరిచయమేర్పడి బయటకొచ్చాక రాత్రిపూట చోరీలు చేయడం మొదలుపెట్టారు. -
తండ్రీకొడుకులపై ఆర్మీ జవాన్ దాడి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం చిన్నసాన పంచాయతీ గంగుపేట గ్రామంలో తండ్రీకొడుకులపై ఓ ఆర్మీ జవాన్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగుపేట గ్రామానికి చెందిన చదునుపల్లి అప్పన్నకు తన అన్న కుమారుడైన ఆర్మీ జవాన్ చదునుపల్లి రాముకు మధ్య కొంతకాలంగా పొలం విషయంలో తగాదాలు ఉన్నాయి. గురువారం ఉదయం ఈ విషయమై అప్పన్నకు రాముకు మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో రాము కత్తితో చిన్నాన్న అప్పన్నపై దాడి చేశాడు. తొడ, చేతులను తీవ్రంగా గాయపరిచాడు. అప్పన్న కుమారుడు హరిబాబు అడ్డుకునే ప్రయ త్నం చేయగా అతనికి సైతం గాయాలయ్యాయి. గ్రామస్తులు కలుగచేసుకుని గొడవను ఆపి బాధితులను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్ప న్న పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వై ద్యం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కోటబొమ్మాళి ఎస్ఐ సత్యనారాయ ణ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పొలం విషయంలో గొడవ కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చేరిన బాధితులు -
టెన్త్ స్పాట్ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, సమీపంలోనే మహాలక్ష్మినగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాల రెండు కేంద్రాలుగా మూల్యాంకనం మొదలైంది. తొలిరోజే మొత్తం 7 సబ్జెక్టుల పేపర్లకు దిద్దుబాటు ప్రక్రియ మొదలైంది. బాలికోన్నత పాఠశాలలో హిందీ, ఇంగి్ల్ష్, ఆల్ ఒరియా సబ్జెక్టుల పేపర్ల మూల్యాంకనం చేశారు. మిగిలిన అన్ని సబ్జెక్టుల మూల్యాంకనాన్ని శ్రీచైతన్య పాఠశాల కేంద్రంలో చేపడుతున్నారు. కొద్దిమంది మినహా నియామకాలు అందుకున్న ఉపాధ్యాయులంతా స్పాట్లో పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీనాటికి స్పాట్‌ను ముగించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర పరిశీలకులు హాజరు.. పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ స్పాంట్ కేంద్రాలను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్/ఏసీ లియాకత్ ఆలీఖాన్, ఉపవిద్యాశాఖాధికారులు/డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు ఆర్.విజయకుమారి, పి.విలియమ్స్, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. 1229 మంది వరకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొన్నారు. వీరికి అధికారులు పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 7 రోజుల్లో స్పాట్‌ను పూర్తిచేసేలా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. స్పాట్ కేంద్రాలకు దూరంగా తిరుమల చైతన్య.. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ తిరుమల చైతన్య స్పాట్ కేంద్రాలకు దూరంగా ఉన్నారు. స్పాట్ కేంద్రంలో సెల్ఫోన్లు నిషేధమని అధికారులు చెప్పినా.. అది మాటలకే పరిమితమైంది. 2 కేంద్రాల్లో.. ఏడు పేపర్లకు మొదలైన మూల్యాంకనం 7 రోజుల్లో పూర్తిచేసేలా అధికారులు చర్యలు స్పాట్ కేంద్రాలకు దూరంగా డీఈఓ తిరుమల చైతన్య -
రోడ్డు ప్రమాదంలో షిఫ్ట్ ఆపరేటర్ మృతి
నందిగాం: మండల కేంద్రమైన నందిగాం ఫ్లై ఓవర్ వంతెనపై గురువా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలా స సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ సంపతి రావు రవికిరణ్(38) మృతి చెందాడు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలుమూరు మండలం కరవంజ పంచాయతీ తుంబయ్యపేటకు చెందిన రవికిరణ్ పలాస విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై పలాస వెళ్తుండగా నందిగాం ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైకి వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఎగిరిపడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికు ల సమాచారం మేరకు హైవే అంబులె న్స్ సిబ్బంది వచ్చి రవికిరణ్‌ను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలమకున్నాయి. రవికిరణ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం హెడ్ కానిస్టేబు ల్ బి.వి.రమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నాలుగు గంటలకే ఆధార్ సేవలు బంద్
సోంపేట: ఈకేవైసీలో భాగంగా ఆధార్ అప్డేట్ కో సం విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్ప డం లేదు. సోంపేట మండలం జింకిభద్ర పంచాయతీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బెంకిలి, జింకిభ ద్ర పంచాయతీల ప్రజల కోసం గురువారం ఆధార్ డ్రైవ్ నిర్వహించారు. అయితే డిజిటల్ అసిస్టెంట్ సురేష్ సాహు నాలుగు గంటలకే సేవలు ముగించడంతో అంతవరకు వేచి ఉన్న లబ్ధిదారులు నిరాశ తో వెనుదిరిగారు. ప్రస్తుతం వేరే సచివాలయానికి వెళ్లి సేవలు అందిస్తామని, శుక్రవారం పలాసపురం పంచాయతీ వద్ద కూడా ఆధార్ డ్రైవ్ నిర్వహిస్తామని, అక్కడికి వచ్చి అప్డేట్ చేసుకోమని చెప్పడం గమనార్హం. ఈ విషయమై ఎంపీడీఓ సీహెచ్ ఈశ్వరమ్మ వద్ద ప్రస్తావించగా విద్యార్థులు, తల్లిదండ్రుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఐదు గంటలకు వరకు పేర్లు నమోదు చేసి ఆధార్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఎస్సీ రైతుల భూముల్లో.. అక్రమంగా మట్టి తవ్వకాలు
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నరసన్నపేట మండలం బొడ్డవలసకు చెందిన ఎస్సీ రైతు కుటుంబాలు శ్రీరాంపురం వద్ద సాగు చేసి పంటలు పండించుకుంటున్న భూముల్లో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి తహసీల్దార్ అనుమతి ఇచ్చారంటూ వందల కొద్దీ ట్రాక్టర్ల మట్టిని తవ్వేస్తున్నారు. పంట భూముల్లో మట్టిని తవ్వితే పంటలు ఎలా పండుతాయి.. తిండి గింజలు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ ఎస్సీ రైతులు కూన అప్పలరామన్న, కూన రామారావు, కూన ఉపేంద్రలు వాపోతున్నారు. మండలంలోని రావులవలస పంచాయతీ శ్రీరాంపురం రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నంబర్ 25లో ఎల్పీ నంబరు 359లో తమకు మూడు ఎకరాల పొలం ఉందని, దీనిని 60 ఏళ్లుగా సాగు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు దౌర్జన్యంగా తమ భూముల్లో మట్టిని తవ్వి పంటలు పండించుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నారని వాపోయారు. న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వెళ్లే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రావులవలస, గుండవల్లిపేటలకు చెందిన కొందరు ఎమ్మెల్యే పేరు చెప్పి మట్టి తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపుతామని బెదిరిస్తున్నారని, కులం పేరుతో దూషించి దుర్భాషలాడుతున్నారని వాపోయారు. తహసీల్దార్ వద్దకు వెళ్లగా వెంటనే స్పందించి ఆర్ఐ, వీఆర్వోలను పంపారని, అయినా మట్టి తవ్వకాలు ఆపడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయమై కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయిస్తామని తెలిపారు. రోడ్డు పనులకు అవసరమంటూ తవ్వకాలు ట్రాక్టర్ లోడు రూ.500కు అమ్ముకుంటున్న టీడీపీ నాయకులు పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుల ఆవేదన అనుమతి ఇవ్వలేదు.. రైతుల భూముల్లో మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. మాకు సమాచారం వచ్చిన వెంటనే ఆర్ఐ, వీఆర్వోలను పంపి మట్టి తవ్వకాలను ఆపించాం. మళ్లీ తవ్వుతున్నట్లు మాకు తెలియదు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణ, నరసన్నపేట తహసీల్దార్ -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి జిల్లాకు చెందిన బచ్చు వరలక్ష్మి లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆలయ సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులకు విరాళ చెక్కును అందించారు. ఈ సందర్భంగా శోభనాద్రాచార్యులు మాట్లాడుతూ రూ.లక్ష అంతకుమించి విరాళాలిచ్చిన దాతలకు రథసప్తమి వంటి పర్వదినాల్లో విశిష్ట దర్శనానికి డోనర్ పాసులిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పాల్గొన్నారు. పీఆర్ ఇంజినీరింగ్ ఎస్ఈగా రవి అరసవల్లి: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగ పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్ఈ)గా గిద్దలూరి రవి గురువారం స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఈయన పాలకొండ పీఆర్ ఈఈగా బాధ్యతలు నిర్వర్తించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లాలో డివిజన్ల ఈఈలు ఇతర సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి రవికి శుభాకాంక్షలు తెలియజేశారు. పీఆర్ ఇంజినీర్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి గౌరవపూర్వకంగా కలిశారు. జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం సేవలను మరింత విస్తరిస్తానని రవి తెలిపారు. 6న ఎస్సీ వర్గీకరణ సమావేశం రణస్థలం: ఎస్సీ వర్గీకరణ అనే అంశంపై సూచనలు, సలహాలు, చర్చ నిర్వహించేందుకు ఈ నెల 6న జిల్లా కేంద్రంలోని ఇలిసిపురం వద్ద అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాల ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్ల జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకట న విడుదల చేశారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీపీగా భాగ్యలక్ష్మి శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏపీపీ)గా గొద్దు భాగ్యలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె నియామకం పట్ల జిల్లా బార్ అసోసియే షన్ అధ్యక్షుడు తంగి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదర్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు గురువారం అభినందనలు తెలియజేశారు. ఆన్లైన్లో కూచిపూడి నాట్య శిక్షణ శ్రీకాకుళం కల్చరల్: కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు నగరానికి చెందిన ప్రముఖ నాట్యకారిణి స్వాతి సోమనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ కోర్సు, డిప్లమో కోర్సులు, ఎంఏ కూచిపూడి డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9849107426 నంబరును సంప్రదించాలని కోరారు. -
ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి
శ్రీకాకుళం రూరల్: విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని, పకడ్బందీ ప్రణాళికతో లక్ష్యా న్ని చేరుకోవచ్చునని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. గురువారం రాగోలు జెమ్స్ ఆస్పత్రి ఆడిటోరియంలో వైద్య, ఆరోగ్య రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ కోర్సు చదివితే భవిష్యత్‌లో బాగా స్థిరపడతామో ఆ కోర్సునే ఎంచుకోవాలన్నారు. అందులో తగిన నైపుణ్యత సాధిస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. విద్యార్థులు ప్రతి విషయానికీ తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంతంగా ఎలా ఎదగాలో అలవర్చుకోవాలన్నారు. ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జెమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌రెడ్డి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీలలిత, బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తిరుగుబాటు తప్పదు...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలు, దాడులు దౌర్జన్యకాండ చేస్తున్నారు. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాళి మండలంలో మారుమూల గ్రామాల్లో బయట సమాజానికి తెలియని ఇటువంటి దౌర్జన్యాలు ఎన్నో జరుగుతున్నాయి. పింఛన్లు ఆపివేయడం.. రేషన్ బియ్యం ఆపివేయడం చేస్తున్నారు. ఇప్పుడు సింహాద్రిపురం గ్రామంలో రైతుల అనుమతి లేకుండా వారి పొలాల్లోని మట్టితోనే దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారు. అధికారం వస్తే మంచి చేయాలి తప్పా ఇలా కక్ష సాధింపు చర్యలు, దౌర్జన్యాలు చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. సింహాద్రిపురం గ్రామంలో జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలి. –ఎస్.హేమసుందర్‌రాజు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, కోటబొమ్మాళి. ● -
నేటి నుంచే స్పాట్
కలెక్టర్‌తో చర్చలు సఫలం ఏర్పాట్లు పూర్తిచేశాం.. జిల్లాలో నేటి నుంచి మొదలయ్యే టెన్త్‌క్లాస్ జవాబుపత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు, జిల్లా కలెక్టర్, ఆర్జేడీ, డీఈఓ సూచనల మేరకు అధికారు లు, ఎగ్జామినర్లు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – లియాకత్ ఆలీఖాన్, ఎగ్జామినేషనల్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాకుళం ●శ్రీకాకళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2025 జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో గురువారం నుంచి మొదలయ్యే మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. స్పాట్లో భాగస్వామ్యమయ్యే ఉపాధ్యాయులు తొలిరోజు బహిష్కరిస్తామని తొలుత చెప్పినా బుధవారం సాయంత్రం కల్లా స్పష్టత రావడంతో యథావిధిగా స్పాట్ ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలతోపాటు సమీపంలోనే మహాలక్ష్మినగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య స్కూల్ కేంద్రాలుగా మూ ల్యాంకనం నిర్వహించనున్నారు. క్యాంప్ ఆఫీసర్‌గా డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య నేతృత్వంలో స్ట్రాంగ్ రూమ్ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్/ అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ ఆలీఖాన్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లుగా ఉప విద్యాశాఖాధికారులు ఆర్.విజయకుమారి(శ్రీకాకుళం), పి.విలియమ్స్(టెక్కలి/పలాస) వ్యవహరించనున్నారు. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు(వాల్యుయేషన్)గా మరో ఏడుగురు సీనియర్ హెచ్ఎంలను నియమించారు. జవాబుపత్రాలను దిద్దే అన్ని గదుల్లో సీసీ కెమెరాలను అమర్చారు. శరవేగంగా కోడింగ్ ప్రక్రియ.. స్పాట్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ఆర్జేడీ, డీఈఓ, ఇతర అధికారులు ఆరా తీశారు. టెన్త్ జవాబుపత్రాలకు సంబంధించి తెలుగు/సంస్కృతం/ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు(లాంగ్వేజ్ పేపర్లు), మాథ్స్, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్స్టడీస్ మొత్తం 7 పేపర్లకు సంబంధించి 24 పేజీల బుక్‌లెట్స్‌తో కూడిన 1,81,367 జవాబు పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. కోడింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. తెలుగుమీడియం, ఇంగ్లీషు మీడియం, ఒరియా మీడియం జవాబుపత్రాల మూల్యాంకనం జరగనుంది. 1229 మంది సిబ్బంది.. టెన్త్ స్పాట్‌కు1229 మంది టీచర్లు భాగస్వామ్యం అవుతున్నారు. సబ్జెక్టు టీచర్లు పూటకు 20 పేపర్ల చొప్పున రోజుకు 40 పేపర్లను దిద్దనున్నారు. పేపర్‌కు రూ.10 చొప్పున 40 పేపర్లకు రూ.400 కేటాయిస్తారు. డీఏగా సుదూర ప్రాంతాల పాఠశాలల నుంచి హాజరయ్యే ఉపాధ్యాయులకు అవుట్‌స్టేషన్ అలవెన్స్‌గా రూ.400 చెల్లిస్తారు. స్పెషల్ అసిస్టెంట్లకు రోజుకు రూ.300 చొప్పున చెల్లిస్తారు. అరకొరగా ఉండే ఈ మొత్తాలని గత ఏడాదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. జిల్లాలో మొదలుకానున్న టెన్త్ మూల్యాంకన ప్రక్రియ శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో కోడింగ్ ప్రక్రియ జిల్లాకు చేరిన 1.81 లక్షల జవాబుపత్రాలు మరో ముగ్గురు టీచర్లపై సస్పెన్షన్లు ఎత్తివేత స్పాట్ కేంద్రాలకు దూరంగా డీఈఓ శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం పాతబస్టాండ్: కుప్పిలి కాపీయింగ్ ఘటనలో టీచర్ల సస్పెన్షన్ నేపథ్యంలో స్పాట్ బహిష్కరిస్తామంటూ ఉపాధ్యాయ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ విజ్ఞప్తి మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రంగంలోకి దిగారు. ద్యోగ సంఘాల జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం మధ్యవర్తిత్వం ద్వారా బుధవారం ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కన్వీనర్లు చౌదరి రవీంద్ర, తంగి మురళీమోహన్, మజ్జి మదన్‌మోహన్‌లతో కలెక్టర్ తన కార్యాల యంలో చర్చలు జరిపారు. ప్రధాన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సస్పెన్షన్‌కు గురై హోల్డ్‌లో ఉన్న నలుగురు ఉపాధ్యాయుల్లో ముగ్గురిపై బుధవారం రాత్రి సస్పెన్షన్ ఎత్తివేశారు. ఉపాధ్యాయులపై ఉన్న క్రిమినల్ కేసులను ఎత్తివేసేందుకు నిర్ణయించారు. స్పాట్ కేంద్రాలకు డీఈఓను దూరంగా ఉంచేందుకు కూడా అంగీకరించారు. విచారణ కమిటీ నివేదిక ప్రకారం డీఈఓపై తగు చర్యలు చేపడతామని చెప్పారు. -
అదుర్స్
ఆలోచనలు శ్రీకాకుళం న్యూకాలనీ: ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుందని, పాఠశాల స్థాయి నుంచే పరిశోధనా దృక్పథాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా బుధవారం వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం (ఈఎండీపీ) పేరిట ప్రాజెక్టుల ప్రదర్శన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి 40 పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. పలాస మండలం బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన అన్వేషి ప్రాజెక్ట్, కోటబొమ్మాళి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన సేఫ్ వీల్స్ ప్రాజెక్ట్‌లు తొలి రెండుస్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి ప్రదర్శనకు అర్హత సాధించాయి. ప్రాజెక్టుల్లో భాగస్వాములైన విద్యార్థులు, గైడ్ టీచర్లను ఆర్జేడీతోపాటు డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య అభినందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి, జిల్లా సైన్స్ అధికారి ఎన్.కుమారస్వామి, డీసీఈబీ సెక్రటరీ జి.రాజేంద్రప్రసాద్, ఉద్యం స్టేట్ లీడ్ సుశాంత్, జిల్లా మేనేజర్ ఎ.అనూష, ఉపాధ్యాయలు, సైన్స్ అధికారులు పాల్గొన్నారు. పాఠశాల: ఎస్జీబీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, కోటబొమ్మాళి విద్యార్థులు: ఎస్.భావన, ఎ.జాహ్నవి, పి.కీర్తి గైడ్ టీచర్: సీహెచ్‌వీ రోజామణి అంశం: మద్యం తాగి వాహనం నడపడటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సేఫ్ వీల్స్ వ్యవస్థను వాహనాల్లో అమర్చడం ద్వారా అందులో ఉండే ఆల్కహాల్ సెన్సార్లు.. డ్రైవర్ మత్తును గుర్తించడంతోపాటు మైక్రో కంట్రోలర్ ద్వారా విశ్లేషణ చేసి బజర్ మోగించి వాహనాన్ని నిలుపుదల చేస్తుంది. దీంతో కొంతమేర ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని విద్యార్థులు తెలియజేశారు. ప్రాజెక్ట్ సేఫ్ వీల్స్ ప్రాజెక్ట్ అన్వేషి పాఠశాల: బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పలాస మండలం. విద్యార్థులు: పి.ప్రణీత్, ఎస్.కార్తీక్, కె.మోక్షజ్ఞ గైడ్ టీచర్: కొయ్యల శ్రీనివాసరావు అంశం: చాలా మంది చిన్నారులు, మూగవా రు, అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వృద్ధులు తప్పిపోయినప్పుడు వారి అడ్రస్, వివరాలు వంటివి చెప్పలేరు. అలాంటి వారికి ఉపయో గపడేలా అన్వేషి ప్రాజెక్ట్ రూపొందించారు. అల్జీమర్స్ సమస్యతో బాధపడేవారు నిత్యం ఉపయోగించే వస్తువులకు క్యూఆర్ కోడ్లను అమర్చితే.. తప్పిపోయినప్పుడు ఎవరైనా మొబైల్‌ఫోన్‌తో స్కాన్ చేసి కుటుంబ సభ్యుల కు వివరాలు చేరవేయవచ్చు. సర్టిఫికెట్లు, నగ లు, పెంపుడు జంతువులు ఇలా విలువైన వస్తువులు పోగొటుకున్న వారికి సైతం ఇలాగే అందజేయవచ్చని విద్యార్థులు తెలియజేశారు. ముగిసిన ఈఎండీపీ జిల్లా ఎక్స్పో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి రెండు ప్రాజెక్టుల ఎంపిక -
మెకానిక్ కుమారుడికి రెండు ఉద్యోగాలు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని మహారాణిపేటకు చెందిన కోసూరు నవీన్‌కుమార్ ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించాడు. కాశీబుగ్గలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న కోసూరు భాస్కరరావు, నిర్మల దంపతుల కుమారుడైన నవీన్ 2021లో బీఎస్సీ పూర్తి చేసి విశాఖలో కోచింగ్ తీసుకున్నాడు. పలుమార్లు బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమై విఫలమైనా వెనకడుగు వేయకుండా పట్టుదలతో సాధన చేశాడు. తాజాగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పీఓగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌గా ఎంపికయ్యాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను విజయం సాధించానని నవీన్ తెలిపారు. సైనికుడికి సలాం బూర్జ: మండలంలోని అన్నంపేట గ్రామానికి చెందిన మామిడి సింహాచలం 22 ఏళ్లు సైన్యంలో సర్వీసు పూర్తి చేసి ఉద్యోగ విరమణ పొంది గ్రామానికి వచ్చినందుకు బుధవారం స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం లవ్లీయూత్ సంఘం ఆధ్వర్యంలో సింహాచలం, సునీత దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు అప్పలనాయుడు, మాణిక్యం, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలకు ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: ఈ నెల 4న భీమవరంలో జరగనున్న రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు సంబంధించి శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో బుధవారం ఎంపికలు నిర్వహించారు. 55 కేజీల విభాగంలో బి.అభి, వైకుంఠం, 60 కేజీల విభాగంలో విభాగంలో ఎస్.బన్నీ, సుమంత్, 65 కేజీల విభాగంలో ఎం.రాంబా బు ఎంపికయ్యారు. కార్యక్రమంలో సంఘ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ బాడాన దేవభూషణ్, జిల్లా అధ్యక్షుడు తారకేశ్వరరావు, కార్యదర్శి కె.గౌరీశంకర్, సీనియర్ బాడీ బిల్డర్లు బి.విజయకుమార్ సందీప్, చరణ్ పాల్గొన్నారు. -
ఐటీడీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలి
మందస/కాశీబుగ్గ: పలాస నియోజకవర్గంలోని మందస కేంద్రంగా గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మందసలో శ్రీకాకుళం జిల్లా గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ ఎస్.హైమావతికి వినతిపత్రం అందజేశారు. పలాస నియోజకవర్గంలో గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. గిరిజన ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు దశాబ్ధాలుగా సాగు చేస్తున్న భూములకు హక్కులు కల్పించి పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని విన్నవించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, 1/70 చట్టాన్ని అమలు చేయాలని, గిరిజన గ్రామాల్లో సాగునీటి వసతులు కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు చాపర సుందర్‌లాల్, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి సవర హరికృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవి, గిరిజన సంఘం నాయకులు సవర ఎంగిలాకు, సవర సోంబారమ్మ, సవర నీలకంఠం, సవర కిరణ్‌కుమార్, దండాసి రవి, సవర రమేష్, సవర జునాస్, సవర కురామణి, సవర భువనేశ్వర్ దులాయ్ తదితరులు పాల్గొన్నారు. -
పండుటాకులపై ప్రతాపమా..?
● రెండు నెలలుగా 8 మంది వృద్ధులకు అందని పింఛన్లు ● ఇన్చార్జి ఎంపీడీవోను నిలదీసిన వైఎస్సార్సీపీ నేతలు టెక్కలి: కోటబొమ్మాళి మండలం కమలనాభపురం గ్రామంలో దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణలకు వృద్ధాప్య పింఛన్లు రెండు నెలలుగా అధికారులు అందజేయడం లేదు. దీంతో గ్రామ సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి, నాయకులు అన్నెపు రామారావు, ఎస్.హేమసుందర్‌రాజు, కె.సంజీవరావు, దుక్క రామకృష్ణారెడ్డి, ఎస్.జనార్ధన్‌రెడ్డి, బి.వెంకటరమణ, జి.సోమేష్, శివారెడ్డి, ఎస్.నారాయణరాజు తదితరులు బాధిత పింఛనుదారులతో కలిసి బుధవారం కోటబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఇన్చార్జి ఎంపీడీవో జయంత్ప్రసాద్ను నిలదీశారు. నిన్నటివరకు విధుల్లో ఉన్న ఎంపీడీవో ఫణీంద్రకుమార్ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి రమేష్ గత నెలలో పింఛన్లు ఆపివేశారని తెలిపారు. దీనిపై అప్పుడు అడిగితే ఏప్రిల్ నెలలో పింఛన్లు ఇస్తామని చెప్పారని గ్రామ సర్పంచ్ ధనలక్ష్మి గుర్తు చేశారు. అయితే ఈనెల 1వ తేదీన గ్రామంలో చేపట్టిన పింఛన్ల పంపిణీలో మరలా 8 మంది వృద్ధులకు పింఛన్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటివరకు విధుల్లో ఉన్న ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌ను ఈ విషయంపై సంప్రదిస్తే 2వ తేదీన పింఛన్లు ఇచ్చేస్తామని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారని అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు హేమసుందర్‌రాజు మండిపడ్డారు. ఏమని దర్యాప్తు చేస్తారు..? అయితే నిలిపివేసిన పింఛన్లపై దర్యాప్తు చేస్తామని ఇన్చార్జి ఎంపీడీవో జయంత్‌ప్రసాద్ చెప్పగా, డీఆర్డీఏ నుంచి కాకుండా స్థానికంగా కక్ష సాధింపులో భాగంగా పింఛన్లు ఆపేస్తే ఏమని దర్యాప్తు చేస్తారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. నిరుపేద వర్గాలకు చెందిన వృద్ధుల పింఛన్లను రెండు నెలలుగా ఆపివేసి ఇప్పుడు కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలు చెబితేనే పింఛన్లు ఆపివేశామని కాగితంపై రాసిచ్చేయండి అంటూ వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు దుయ్యబట్టారు. అయితే సాయంత్రంలోగా పింఛన్లు ఇచ్చేస్తామంటూ సెలవుపై వెళ్లిన ఎంపీడీవో ఫణీంద్రకుమార్ ఫోన్లో సమాధానం చెప్పాడు. తీరా సాయంత్రానికి అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే కాకుండా, పంచాయతీ కార్యదర్శి రమేష్ సైతం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని నాయకులు వెల్లడించారు. బాధిత పింఛన్‌దారులకు పింఛన్ డబ్బులు ఇచ్చేవరకు న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. -
మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు
శ్రీకాకుళం క్రైమ్ : మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని టౌన్ హాల్ రోడ్డులోని ఆర్సీఎం సెయింట్ థామస్, చినబజారు రోడ్డులో ఉన్న చర్చి రక్షణ గోడలపై అన్యమత రాతలు రాసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని గూనపాలెం మేదరవీధికి చెందిన నర్రు దుర్గాప్రసాద్ (25) అలియాస్ ప్రసాద్ ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో బాయ్‌గా, అదే వీధికి చెందిన గ్రంధి సోమశేఖర్ (23) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 9:30 ప్రాంతంలో ఇద్దరూ స్కూటీపై వచ్చి సెయింట్ ఽథామస్ చర్చి రక్షణ గోడపై అన్యమత రాతలు రాశారు. అనంతరం తెలుగు బాప్టిస్ట్ చర్చి వద్దకు చేరుకున్నారు. సోమశేఖర్ ఎలక్ట్రీషియన్ కావడంతో అక్కడ విద్యుత్‌ను నిలుపుదల చేసి ఇద్దరూ రక్షణ గోడ, లోపల అన్యమత రాతలు రాసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి డీఎస్పీ వివేకానందకు ఆదేశాలు జారీ చేయడంతో ఒకటి, రెండో పట్టణ సీఐలను ఘటనాస్థలికి పంపించారు. అక్కడి స్థానికులను విచారించి సీసీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం నిందితులిద్దరినీ గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అరసవల్లి మామిడి తోట వద్ద సీఐ పైడపునాయుడు బృందం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫేమస్ అవుదామనే.. జిల్లాలో ఇటీవల జలుమూరులో జరిగిన అన్యమత రాతల ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారిగా ఫేమస్ అవుదామనే ఇద్దరు యువకులు ఇలా రాతలకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలిందన్నారు. కేసును డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో చాకచక్యంగా ఛేదించిన సీఐ పైడపునాయుడు, ఎస్ఐలు హరికృష్ణ, జనార్ధన, ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా మందిరాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలను ఎస్పీ వివరించారు. కుల, మత, రాజకీయ వర్గాల మధ్య మతపరమైన అవాస్తవాలు ప్రచారం చేస్తూ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా.. సోషల్ మీడియాలో పోస్టులను పెట్టినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మందిరాల నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, స్థానికులతో యూత్ కమిటీ, శాంతి కమిటీలను ఏర్పాటుచేయాలని సూచించారు. రాత్రి పూట ఇద్దరేసి కమిటీ సభ్యులు ఉండాలన్నారు. హుండీలకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. -
హెచ్చరిక బోర్డు ఏర్పాటు
ఇచ్ఛాపురం రూరల్: తమ స్థలానికి ఎదురుగా ఉన్న రచ్చబండను తొలగించి, ఆ స్థలాన్ని సొంతం చేసుకునేందుకు కె.శాసనాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరు ఇటీవల తన అనుచరులతో కలిసి రచ్చబండను తొలగించారు. దీనిపై సాక్షి దినపత్రికలో ‘పచ్చ తమ్ముడి బరితెగింపు’ శీర్షికతో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు బుధవారం స్పందించారు. ‘ఇది ప్రభుత్వ భూమి.. ఆక్రమణదారులు శిక్షార్హులు’ అని పేర్కొంటూ హెచ్చరిక బోర్డు తహసీల్దార్ కె.వెంకటరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేశారు. 16 గొర్రె పిల్లల సజీవదహనం మెళియాపుట్టి: మండలంలోని కరజాడ గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, దాసరి ఢిల్లేశ్వరరావు, సార రామయ్యలకు చెందిన 16 గొర్రె పిల్లలు సజీవ దహనమయ్యాయి. మార్చి 30వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగినట్లు పెంపకందారులు చెబుతున్నారు. బుధవారం పలువురు పెంపకందారులతో మాట్లాడగా గిట్టని వాళ్లెవరో ఇటువంటి దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సుమారు రూ.50 వేల వరకు నష్టం జరిగిందని, అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
హేతుబద్ధత లేని వర్గీకరణ ఆపాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: హేతుబద్ధత లేని వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని జాతీయ రెల్లి ఎస్సీ గ్రూపు కులాల సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి గ్రూపు కులాలకు జరగనున్న అన్యాయాన్ని నిరసిస్తూ నగరంలోని పెద్దరెల్లివీధి నుంచి ఏడురోడ్ల జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ బుధవారం నిర్వహించారు. కలెక్టరేట్ చేరుకొని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ.. రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రాజ్యాంగ ఫలాలను అందజేయాలని కోరారు. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ నియామకాల్లో ఆర్టికల్ 371 (డి) అనుసరించి జిల్లా, జోన్, రాష్ట్రంలో అవకాశాలు కల్పించాలని కోరారు. అలా కాని పక్షంలో రెల్లి గ్రూపు కులాల అభ్యర్థులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వర్గీకరణను వ్యతిరేకించడం లేదని, హేతుబద్ధత లేని వర్గీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు వర్గీకరణ చేయాలని కోరుతున్నామన్నారు. దీనిలో భాగంగా రెల్లి గ్రూపు కులాల విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం పెద్ద మనసుతో సహకరించాలని విన్నవించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అర్జి కోటి, నగర అధ్యక్షుడు ఎ.ఈశ్వరరావు, రెల్లి ఉప కులాల నాయకులు కాశీ రథో, గోడలి మిన్ను, దండాసి దుర్యోధన, బైరి శివప్రసాద్, దేవర రాము, లోకొండ లక్ష్మణరావు, మజ్జి బాబ్జి, విశాఖపట్నం రవి, వీరగొట్టం ఆనంద్, రణస్థలం ఫణి కుమార్, జలగడుగుల శ్రీరామ, కె వెంకటరావు, జె గోవిందరావు, ఎ.గోవిందరావు, విజయ్, ఎం.రామారావు, జె.శ్రీను, ఇంటి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
30 శాతం ఐఆర్ ప్రకటించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధ్యాయులకు తక్షణమే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ బమ్మిడి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ జనరల్ పడాల ప్రతాప్ కుమార్‌లు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో సభ్య సంఘాల నాయకులు మజ్జి మదన్మోహన్, ఎస్.కిషోర్ కుమార్, చౌదరి రవీంద్ర, లండ బాబురావు, టెంక చలపతిరావు, బి.రవి కుమార్, ఎస్వీ రమణమూర్తి, పూజారి హరి ప్రసన్న, కొమ్ము అప్పలరాజు, వాల్తేటి సత్యనారాయణ, జి.రమణ, సీర రమేష్ బాబు, జగన్మోహన్ ఆప్తా, బలివాడ ధనుంజయరావు, కొత్తకోట శ్రీహరి, గొంటి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో సమావేశమై రెవెన్యూ, గ్రామ సచివాలయాలు, నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, అంగన్వాడీ కేంద్రాల పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. పల్లె పండుగ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఉపాధి హామీ పథకంలో పని దినాలను పెంచాలన్నారు. గృహ నిర్మాణాలు వేగవంతమయ్యేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు. వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్ బ్యాంక్ నిర్వహణ, కోర్టు కేసుల పరిష్కారం, వక్ఫ్ ఆస్తుల సర్వే తదితర అంశాలపై సమగ్రంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సీపీవో ప్రసన్నలక్ష్మి, డీపీఓ భారతి సౌజన్య, వ్యవసాయాధికారి కోరాడ త్రినాథస్వామి, ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీ, డ్వామా పీడీ సుధాకర్, హౌసింగ్ పీడీ నగేష్ పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్..!
భవితకు.. ● ఉమ్మడి జిల్లాలో 10 కళాశాలలు ● ఐదు ప్రభుత్వ కళాశాలల్లో 780 సీట్లు ● ఐదు ప్రైవేట్ కళాశాలల్లో 1,801 సీట్లు ● ఈనెల 30న పాలీసెట్ పరీక్ష ఎచ్చెర్ల క్యాంపస్: పేద, మధ్య తరగతి విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణత తర్వాత ప్రాధాన్యతనిచ్చే కోర్సుల్లో పాలిటెక్నిక్ కోర్సు ఒకటి. ఈ కోర్సులో చేరడం వలన తక్కువ వయస్సులో ఉద్యోగం, ఆసక్తి ఉంటే ఇంజినీరింగ్ చదివేందుకు అవకాశం ఉంటుంది. సాంకేతిక విద్యాశాఖ సైతం పారిశ్రామిక రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా కరిక్యులమ్ తీర్చిదిద్దుతోంది. మిగతా కోర్సులతో పోల్చిచూస్తే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్లేస్మెంట్లు ఎక్కువ. రైల్వే, డిఫెన్స్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఉచిత శిక్షణ ప్రభుత్వ కళాశాలల్లో పాలీసెట్ – 2025కు సాంకేతిక విద్యాశాఖ ఉచిత శిక్షణ ఇస్తోంది. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పురుషులకు, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో బాలికలకు, ఆమదాలవలస, టెక్కలి, సీతంపేట పాలిటెక్నిక్ కళాశాలల్లో బాలురు, బాలికలకు గురువారం నుంచి శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ఈనెల 28వ తేదీ వరకు ఉంటుంది. నమూనా పరీక్ష సైతం శిక్షణ ముగింపు చివరిలో నిర్వహిస్తారు. ప్రారంభంలో స్టడీ మెటీరియల్ సైతం అందజేస్తారు. దరఖాస్తుల స్వీకరణ ప్రస్తుతం పాలీసెట్ – 2025 దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లో కొనసాగుతోంది. మార్చి 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సౌలభ్యం కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు విద్యార్థులు http://apsbtet.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. పరీక్షను ఈనెల 30వ తేదీన నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుము బీసీ, ఓసీ విద్యార్థులకు రూ.400 లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.100లుగా నిర్ణయించారు. 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం నుంచి 50 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. రెండు గంటల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి పదో తరగతి పరీక్షలు పూర్తవ్వడంతో ప్రభుత్వ పాలిటెక్నక్ కళాశాలల్లో పాలీసెట్ –2025 శిక్షణ 3వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ శిక్షణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. నిపుణులతో శిక్షణ ఇవ్వడం, నమూనా పరీక్ష నిర్వహించడం, స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. సాంకేతిక విద్యాశాఖ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకొని సిలబస్‌ను సైతం తీర్చిదిద్దింది. – బి.జానకి రామయ్య, శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల ఇన్చార్జిమెరుగైన ప్లేస్‌మెంట్స్ మిగతా కోర్సులతో పోల్చితే పాలిటెక్నిక్ విద్యలో ప్లేస్‌మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రారంభం నుంచి మూడేళ్ల పాటు పారిశ్రామక అవసరాలపై శిక్షణ ఉంటుంది. ప్రయోగ విద్యకు ప్రాధాన్యత ఉంటుంది. కాలానుగుణంగా సిలబస్‌లో సైతం సాంకేతిక విద్యాశాఖ మార్పులు చేస్తోంది. – మురళీకృష్ణ, సీనియర్ అధ్యాపకులు జిల్లాలో ఐదు ప్రభుత్వ కళాశాలల్లో 780, ఐదు ప్రైవేట్ కళాశాలల్లో 1,801 సీట్లు ఉన్నాయి. మొత్తం 2,581 సీట్లు ఉన్నాయి. సీసీపీ, సివిల్, మెకానికల్, ఈఈఈ, ఎంఈసీ బ్రాంచ్‌లు ప్రధానంగా ఉన్నాయి. బాలికలకు ప్రత్యేక శిక్షణ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో బాలికలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. పాలిటెక్నిక్ విద్య తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆసక్తి మేరకు ఉన్నత విద్య సైతం చదవవచ్చు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. – టి.విక్టర్ పాల్, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, ప్రిన్సిపాల్ -
ఉపాధ్యాయా.. ఇదేందయ్యా..!
● టీడీపీ అవిర్భావ దినోత్సవంలో టీచర్ ● వెల్లువెత్తిన విమర్శలువజ్రపుకొత్తూరు: మండలంలోని పూండిగల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మూల ఉపేంద్ర సందడి చేశారు. అమలపాడు ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఇతను చురుకుగా కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీంతో ఇతని వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ నాయకుడు దువ్వాడ జయరాం చౌదరి, ఇతర కార్యకర్తలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంతా తానై ముందుకు నడిపించి, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఇలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అవగాహన సదస్సు రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఐదో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్‌పై అవగాహన సదస్సు ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నట్లు తిరుమల విద్యాసంస్థల అధినేత ఎన్.తిరుమలరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలోని రాజులతాళ్లవలస తిరుమల క్యాంపస్‌లో ఉదయం 10 గంటల నుంచి సదస్సు జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 98489 86450, 98489 86451 నంబర్లను సంప్రదించాలని కోరారు.పచ్చ నేతల హల్చల్ ఇచ్ఛాపురం రూరల్: బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో కూటమి నాయకులు హల్చల్ చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కె.రామారావు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఇంటర్వ్యూలకు 402 మంది దరఖాస్తుదారులు హాజరయ్యారు. అయితే ఈ సమయంలో కూటమి నాయకులు బ్యాంకు అధికారుల పక్కనే కూర్చొని తమ అనుచరులకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. దీంతో సబ్సిడీ రుణాల మంజూరుపై బ్యాంకు అధికారులను సైతం కూటమి నాయకులు ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించడం సరికాదని పలువురు బహిరంగంగా విమర్శించారు. రైలుకింద పడి మహిళ మృతి కాశీబుగ్గ: పలాస జీఆర్పీ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సోంపేట రైల్వేస్టేషన్ యార్డ్ నందు గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి బుధవారం మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో లభించిందని తెలిపారు. మృతురాలు గులాబీ, పసుపు రంగు కలిగిన పంజాబీ డ్రెస్ ధరించి ఉందన్నారు. చామనచాయ రంగు కలిగి ఉండి, శరీరం రెండుగా విడిపోయి ఉందని కానిస్టేబుల్ డి.హరినాథ్ వివరించారు. వివరాలు తెలిసినవారు 99891 36143 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. 8 మంది పేకాటరాయుళ్లు అరెస్టు కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 8వ వార్డు పరిధిలో ఉన్నటువంటి నర్సిపురం కాలనీలో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులు కాశీబుగ్గ పోలీసులకు బుధవారం పట్టుబడ్డారు. నర్సిపురం కాలనీ లే అవుట్లో పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ పోలీసులు పక్కా ప్లాన్‌తో ఆడుతున్న స్థలానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పేకాటరాయుళ్లు నుంచి రూ.60,400ల నగదు, పేక ముక్కలు, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ ఎస్ఐ ఆర్.నరసింహామూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్త పాసులు ఇవ్వకపోవడం సరికాదు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం నగరంలోని కాంప్లెక్స్ వద్ద కొత్తగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కొత్తపాసులు ఇవ్వకపోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అండ్ కాలేజీస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగు మన్మథరావు, ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు మాధవ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చందు, హరీష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి చివరిలో జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ, పారామెడికల్ కౌన్సిలింగ్లో విద్యార్థులు పలు కళాశాలల్లో నూతనంగా అడ్మిషన్లు పొందారన్నారు. వీరు తమ కళాశాలల ప్రిన్సిపాల్స్ నుంచి బోనిఫైడ్ సర్టిఫికెట్తో ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వెళ్తే కొత్తపాసులు మంజూరు చేసేందుకు నిరాకరించడం దారుణమన్నారు. పేద విద్యార్థులు కావడంతో పాసులు మంజూరు చేయకపోతే రాకపోకలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. -
సమస్యలు పరిష్కరించాలి
● ఆర్టీసీ ఈయూ జోనల్ కార్యదర్శి మూర్తి శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో ఆర్టీసీ పరిధిలోని శ్రీకాకుళం–1, 2 డిపోలు, టెక్కలి, పలాస తదితర నాలుగు డిపోల్లో పేరుకుపోయిన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి బి.కె.మూర్తి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కాంప్లెక్స్ ఆవరణలోని ఈయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ సస్పెన్షన్లు, అక్రమ బదిలీలు రద్దు చేసి 1/2019 సర్క్యూలర్ అమలు చేయాలని కోరారు. ఆర్టీసీలో కొంతమంది ఉద్యోగులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉద్యోగులను ఉద్యమాలవైపు నెడుతున్నారన్నారు. ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 3, 4 తేదీల్లో జిల్లాలోని నాలుగు డిపోల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విజయనగరం జోన్లో 19 డిపోల్లో ఉద్యమం చేస్తామన్నారు. ఆయనతో పాటు ఈయూ నాయకులు ఎ.దిలీప్‌కుమార్, జి.త్రినాథ్, కేజీరావు తదితరులు ఉన్నారు. -
వ్యాన్ ఢీకొని బంక్ ఆపరేటర్ మృతి
సంతబొమ్మాళి: మండలంలోని బోరుభద్ర గ్రామంలో వినాయకుడి ఆలయం వద్ద సోమవారం అర్థరాత్రి దాటాక రోడ్డు దాటుతుండగా రొయ్యల వ్యాన్ ఢీకొట్టడంతో కాపుగోదాయవలసకు చెందిన నందిగాం కాళీ దుర్గాప్రసాద్ (55) మృతి చెందాడు. ఇతను బోరుభద్ర పెట్రోల్ బంక్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలించారు. కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొమ్మాళి పోలీసులు తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతి సోంపేట: మండలంలోని కొర్లాం గ్రామంలో తారకేశ్వర శివాలయం వద్ద చెరువులో పడి వృద్ధుడు మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బారువ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మందస మండలం బాలిగాం గ్రామానికి చెందిన గున్న గున్నయ్య(70) పరిసర ప్రాంతాల్లో యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో మృతిచెందాడు. ఎస్ఐ హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై కొండముచ్చుల దాడి కంచిలి: మండలంలోని డోలగోవిందపురంలో కొండముచ్చుల దాడిలో అదే గ్రామానికి చెందిన సింధు మూళి అనే బాలిక తీవ్ర గాయాలపాలయ్యింది. మంగళవారం తల్లి ఢిల్లీశ్వరితో కలిసి మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అమ్మవారి గుడికి వెళుతుండగా మూడు కొండముచ్చులు ఒక్కసారిగా వచ్చి గాయపరిచాయి. వెంటనే బాలికను మఠం సరియాపల్లి పీహెచ్సీలో చేర్పించి చికిత్స చేయించారు. గ్రామంలో చాలా రోజులుగా కోతులు, కొండముచ్చులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
బాలల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం అర్బన్: బాలల సంక్షేమం, రక్షణ విషయంలో గ్రామ, వార్డు సంక్షేమ, రక్షణ కమిటీలు కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సూచించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తల్లిపాలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. అనంతరం బాలల హక్కుల మిషన్ వాత్సల్య సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారులతో సమావేశమయ్యారు. బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. తరచూ శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. బాల కార్మికుల భిక్షాటన, బాల్య వివాహాల నిర్మూలన, దివ్యాంగ పిల్లలకు చేయూత, బాలల హక్కుల పరిరక్షణకు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా మహిళా సంరక్షణ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి కె.వి.రమణ, సిబ్బంది పాల్గొన్నారు. -
పాలనను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
శ్రీకాకుళం అర్బన్: కూటమి ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం ఇందిరా విజ్ఞానభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని అమలు పరచడానికి గత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చిందని కుంటి సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో కరపత్రం విడుదల చేసి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయకుండా అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర, వలంటీర్లకు గౌరవ వేతనం రూ.10వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. కాగా, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడిగా అంబటి దాలినాయుడు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా చాన్ బాషాను నియమించామని చెప్పారు. జిల్లా ఇన్చార్జి గాదం వెంకట త్రినాథరావు సమక్షంలో నియామకపత్రాలు అందజేశామని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్‌ఎస్ ఈశ్వరి, కొత్తపల్లి రాంప్రసాద్, సైదుల్లా ఖాన్, ఎస్.కె.బాషా, బాబు, చోడవరం చంద్రశేఖర్, చోడవరం లీలావతి, సూరియా బేగం పాల్గొన్నారు. -
జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలకు వేళాయె..
శ్రీకాకుళం న్యూకాలనీ: యువ, వర్ధమాన క్రికెటర్లకు జిల్లా క్రికెట్ సంఘం శుభవార్త చెప్పింది. కొత్త సీజన్లో ఏసీఏ అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించనున్న పురుషుల వన్డే, టీ–20 జట్ల ఎంపికలకు సన్నద్ధమైంది. ఈ నెల 4న అండర్–23 ఎంపికలు, 5న అండర్–19 ఎంపికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారుచేసింది. చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజనీరింగ్ కళాశాల క్రికెట్ మైదానం వేదికగా ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారుల్లో అండర్–19 విభాగానికి 2006 సెప్టెంబర్ ఒకటి తర్వాత, అండర్–23కి 2002 సెప్టెంబర్ ఒకటి తర్వాత జన్మించి ఉండాలని జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు స్పష్టం చేస్తున్నారు. గతంలో వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో సెలక్షన్ కమిటీలను నియమించి అత్యంత పారదర్శకంగా జిల్లా జట్లను ఎంపికచేసేందుకు సన్నద్ధమౌతున్నారు. క్రీడాకారులు విధిగా జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ తెలిపారు. తెలపు యూనిఫాంతోపాటు ఎవరి క్రికెట్ కిట్లను వారే తీసుకురావాలని సూచించారు. -
గడ్డి కుప్ప దగ్ధం
టెక్కలి రూరల్: మండలంలోని నంబాలపేట గ్రామంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నంబాల ఉదయ్బాస్కర్కు చెందిన గడ్డి కుప్ప దగ్ధమైంది. పక్కన పొలంలో రైతు చెత్తకు అగ్గిపెట్టడంతో అది కాస్త అంటుకుని సమీపంలో ఉన్న గడ్డికుప్పకు అంటుకుని దగ్ధమైంది. దానితో పాటు అక్కడే ఉన్న సుమారు 50 సెంట్ల టెట్టంగి పంటకు సైతం మంట అంటుకోవడంతో రైతు అగ్నిమాక కేంద్రానికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.35వేలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. -
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలంటే కష్టం
● జాబ్‌మేళాలో మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి: అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం కష్టమని.. ప్రైవేట్, స్వయం ఉపాధి రంగాల్లో ఉపాధి కలిగించేలా నైపుణ్యత శిక్షణ అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. మంగళవారం కోటబొమ్మాళి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమక్షంలో నిర్వహించిన జాబ్‌మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 32 కంపెనీల ద్వారా 1200 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామో తెలియడానికి ఆన్లైన్ చేస్తున్నామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 9 నెలల పాలనలో 7 లక్షల పెట్టుబడులు తీసుకువచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ విభాగానికి అధిక శాతం ఉద్యోగాలకు దరఖాస్తులు వస్తున్నాయని మంత్రి వెల్లడించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ వేతనాలు, ప్రదేశాలతో సంబంధం లేకుండా ముందుగా ఉద్యోగాల్లో చేరాలన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఏపీఎస్ఎస్డీసీ జిల్లా అధికారి యు.సాయికుమార్, జిల్లా ఉపాధి అధికారి కె.సుధ, సెట్‌శ్రీ సీఈఓ ప్రసాదరావు, నెహ్రూ యువకేంద్రం డీడీ ఉజ్వల, ఉపాధి కల్పన అధికారి వంశీ, నాయకులు కె.హరివరప్రసాద్, బి.రమేష్, బి.రమణమ్మ, టి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల ధర్నా
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మున్సిపల్ కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలు వెంటనే నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, నగర కన్వీనర్ ఆర్.ప్రకాష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలు ప్రభుత్వం మానుకోవాలని, తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ మంగళవారం శ్రీకాకుళం ఏడు రోడ్లు కూడలి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంన్నారు. ఆప్కాస్ రద్దుచేసి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనుకోవడం అన్యాయమన్నారు. ఆప్కాస్ వల్ల ఇన్నాళ్లూ దళారీల దోపిడీ, వేధింపులు లేవని, జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ వాటా నిధుల్లో కోతలు లేవని చెప్పారు. ప్రైవేటు ఏజెన్సీలైతే సకాలంలో వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. విలీన పంచాయతీ కార్మికులకు జీఓ 3 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నగర విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ సిబ్బంది సంఖ్యను పెచంఆలని కోరారు. సెలవులు పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. పనిముట్లు, వాహనాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో కె.రాజు, ఎ.రాము, ఎ.గురుస్వామి, ఎ.శేఖర్, జె.మాధవి, డి.యుగంధర్, శంకర్ గణేష్, ఎ.దేవసంతోష్, బాల, ఎ.జనార్దనరావు, డ్రైవర్లు హరి, నాని, ఇంజినీరింగ్ విభాగం నాయకులు పి.మణి, త్రినాథరావు, క్లాప్ డ్రైవర్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ
శ్రీకాకుళం అర్బన్: కూటమి నాయకులు జిల్లాలో ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌తో సహజ వనరులను దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర సివిల్ రైట్స్ చైర్మన్ కరణం తిరుపతినాయుడు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని రాష్ట్ర సివిల్ రైట్స్ ఫోరం కార్యాలయంలో మంగళవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాపాలన, సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు. నదులను యంత్రాలతో తవ్వుకుంటూ పోతే రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడడం ఖాయమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అక్రమ తవ్వకాలను అరికట్టాలని కోరారు. ఎన్నికల హామీలైన నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు తక్షణమే అమలు చేసి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. సమావేశంలో రాష్ట్ర సివిల్ రైట్స్ కార్యదర్శి కె.కోటయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు వి.శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
బీసీలంటే చంద్రబాబుకు చులకన
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని అందరినీ అక్కున చేర్చుకున్నారని.. ప్రస్తుత సీఎం చంద్రబాబుకు మాత్రం ఎప్పుడూ బీసీలను, ఎస్సీలను చులకనగా చూడటం అలవాటైపోయిందని ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ నాయకుడు, వైఎస్సార్ సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మనిషి గా పుట్టాలనుకునేవాడెవ్వడైనా ఎస్సీ కులంలో పుడతారా, నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని, బీసీలు ఎంత చెప్పినా వినరు వంటి వ్యాఖ్యలు చేసే చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. సూపర్‌సిక్స్ పేరుతో మోసం చేసి తీరా అధికారంలోకి వచ్చాక అప్పులు లెక్కలు చూపించి పథకాలు ఎగ్గొట్టే ప్రభుత్వం కూట మి సర్కారని దుయ్యబట్టారు. విజన్, పీ–4 పేర్లతో అరచేతిలో వైకుంఠం చూపించి కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా బీసీలను చులకనగా చూడకుండా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలని కోరారు. హెడ్ కానిస్టేబుల్‌కు సత్కారం శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న పి.కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ పొందడంతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి దుశ్శాలువ, జ్ఞాపికలతో మంగళవారం సత్కరించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేవీ లెఫ్టినెంట్‌గా గొండ్యాలపుట్టుగ యువకుడు కవిటి: కేరళలోని కొచ్చి యూనిట్లో సబ్ లెఫ్టినెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కవిటి మండలం గొండ్యాలపుట్టుగకు చెందిన దుద్ది వేణు తాజాగా లెఫ్టినెంట్ హోదాతో పదోన్నతి పొందారు. 2012లో నేవీలో సైలర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వేణు 2023 ఏప్రిల్ 1న సబ్ లెఫ్టినెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. తాజాగా లెఫ్టినెంట్ హోదాను కల్పిస్తూ నేవీ అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. పేదింటి కుర్రోడు ఈస్థాయిలో విజయాన్ని సాధించడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరో 25 సంవత్సరాల సర్వీసు మిగిలిన నేపథ్యంలో మరిన్ని పదోన్నతులు పొందే అవకాశం ఉందని రిటైర్డ్ నేవీ ఉద్యోగులు చెబుతున్నారు. ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు సారవకోట : మండలంలోని అలుదు గ్రామానికి చెందిన కత్తిరి జగదీష్‌కుమార్ ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కత్తిరి జనార్దనరావు, వాణిల పెద్ద కుమారుడైన జగదీష్ గత ఏడాది ఐబీపీఎస్ ద్వారా నిర్వహించిన పలు బ్యాంకు ఉద్యోగాల పరీక్షలకు హాజరయ్యాడు. ఈ ఏడాది జనవరిలో వచ్చిన ఫలితాలలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు క్లర్క్‌గా ఎంపిక కాగా మంగళవారం విధుల్లో చేరాడు. తాజాగా మంగళవారం విడుదలైన బ్యాంకు పీఓ, స్పెషల్ ఆఫీసర్ పోస్టు ఫలితాల్లో బ్యాంకు ఆఫ్ బరోడాకు పీఓ, ఐటీ సెక్షన్ స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపియ్యాడు. ఈ సందర్భంగా జగదీష్‌ను గ్రామస్తులు అభినందించారు. బుర్రకథ కళాకారుడికి డాక్టరేట్ జలుమూరు: లింగాలవలస గ్రామానికి చెందిన గంగరాపు వెంకటరమణకు పబ్లిక్ లైబ్రరీ విశాఖపట్నం, డే సిప్రింగ్ థియోలాజికల్ యూనివర్సటీ టెక్సాస్(యూఎస్ఏ) ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. 20 ఏళ్లుగా బుర్రకథ రంగంలో విశేష సేవలు, నటుడిగా, పలు సాంఘిక నాటకాల రచయితగా రాష్ట్రం నలుమూలలా వేలాది ప్రదర్శనలు ఇచ్చినందుకు గుర్తింపుగా ఈ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వెంకటరమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుర్రకథ చరిత్రలో డాక్టరేట్ అందుకున్న మొట్టమొదటి వ్యక్తి తానే కావడం ఆనందంగా ఉందన్నారు. -
ఆర్జేడీతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో కుప్పిలి మోడల్ స్కూల్లో పదో తరగతి పరీక్షల కాపీయింగ్ రగడలో మిగిలిన నలుగురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి మరో మూడు నాలుగు రోజులు సమ యం కావాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులను కోరారు. 3 నుంచి జరగనున్న టెన్త్‌క్లాస్ స్పాట్ వాల్యుయేషన్‌ను బహిష్కరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం జిల్లాకు వచ్చిన ఆర్జేడీ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపారు. జిల్లా విద్యా శాఖ అధికారి తిరుమల చైతన్యను విధుల నుంచి తక్షణమే తప్పించాలని, మిగిలిన ఉపాధ్యాయులపై సస్పెన్షన్లు ఎత్తివేయాలని, ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని సంఘాల ప్రతినిధులు కోరారు. వీటిపై మూడు నాలుగు రోజులు గడువు కోరినట్టు ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు చౌదరి రవీంద్ర, తంగి మురళీమోహన్, దుప్పల శివరామ్‌ప్రసాద్, ఎంవీ రమణ, శ్రీరామ్మూర్తి, వెంకటేశ్వరరావు, వసంతరావు, కిషోర్‌కుమార్ తదితరులు పేర్కొన్నారు. అనంతరం డీఈఓ కార్యాలయం ఎదుట అధికారుల వైఖరిని నిరసిస్తూ నిరసన చేపట్టారు. అంతకుముందు అదనపు ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో ఉపాధ్యాయులపై నమోదైన క్రిమినల్ కేసుల విషయమై తమకు స్పష్టతకావాలని ఉపాధ్యాయులు కోరగా.. ఎస్సైతో నేరుగా అదనపు ఎస్పీ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
తప్పనిసరి
ట్రేడ్ లైసెన్స్..● 90 శాతం షాపులకు లైసెన్సులు లేనట్లు గుర్తించాం ● పీడీఎస్ బియ్యం తరలిస్తే చర్యలు తప్పవు ● మెడికల్ దుకాణాల్లో మరిన్ని తనిఖీలు ● ‘సాక్షి’తో విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు శ్రీకాకుళం క్రైమ్ : అక్రమంగా వ్యాపారం సాగించే షాపులపై నిరంతరం నిఘా ఉంటుందని శ్రీకాకుళం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. ప్రతి షాప్‌కు జీఎస్టీ లైసెన్సుతో పాటు ట్రేడ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని, అనుమతులు లేనివాటిని ఇప్పటికే గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తే కేసులు బుక్ చేస్తామని, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనరాదని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని రామలక్ష్మణ కూడలి సమీపంలో ఉన్న తన కార్యాలయంలో మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రశ్న: జిల్లాలో ట్రేడ్ లైసెన్సు లేకుండా షాపులు ఉన్నాయా..? జవాబు: జిల్లా కేంద్రంలో 3,109 షాపులు మున్సిపాలిటీ నుంచి ట్రేడ్‌లైసెన్సు పొందిన్నట్లు రిజిస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జీటీరోడ్డు, కళింగ రోడ్డు, పాలకొండ రోడ్డు, పెద్దపాడు రోడ్డులో ఇటీవల సుమారు 1100 షాపులను తనిఖీ చేశాం. వీటిలో 1046 షాపులకు ట్రేడ్ లైసెన్సులు లేవు. అంటే 90 శాతం అనుమతులు లేవు. వీటికి రూ.23,15,570 జరిమానా విధిస్తూ మున్సిపాలిటీ వారికి అంచనా నివేదిక పంపించాం. దీనిని బట్టి జిల్లాలో అనుమతి లేకుండా ఎన్ని ఉంటాయన్నది అంచనా వేసుకోవచ్చు. ప్రశ్న: అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిపోతుంది. దీనిపై తీసుకుంటున్న చర్యలు? జవాబు: రెండు లారీలు, ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 1434.51 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశాం. గతేడాది చివర్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో 6ఏ కేసులు 28, క్రిమినల్ కేసులు 21 నమోదు చేశాం. ప్రశ్న: మెడికల్ షాపులపై ఇటీవల దాడులు చేశారు. నిఘా కొనసాగుతుందా? జవాబు:ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఎకై ్స్పరీ అయిన మందులను కొన్ని షాపుల్లో అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడులు జరిపాం. ప్రయివేటు ఆసుపత్రుల్లో ఉండే మెడికల్ షాపులపై ఇప్పటికే నిఘా పెట్టాం. మరిన్ని దాడులుంటాయి. ప్రశ్న: ఐరన్ స్క్రాప్ జిల్లా నుంచి తరలిస్తున్నట్లు వినిపిస్తోంది? జవాబు:ఇటీవల గుంటూరు కేంద్రంగా చేసుకుని తప్పుడు జీఎస్టీ బిల్లులతో అక్రమంగా విజయనగరం, మన జిల్లాల నుంచి ఎనిమిది లారీల్లో తరలిస్తున్న 14 టన్నుల (12.5 క్యూబిక్ మీటర్లు) ఐరన్స్క్రాప్ను సీజ్ చేశాం. రూ.16 లక్షల వరకు జరిమానా విధించాం. ఒకరిపై ఎఫ్ఐఆర్ వేయించాం. ప్రశ్న: పర్మిట్లు లేకున్నా క్వారీలు తవ్వడంపై తీసుకుంటున్న చర్యలు? జవాబు: నందిగాం మండలం లట్టిగాం గ్రానైట్ స్టోన్ క్రషర్కు సంబంధించి క్వారీ తవ్వినదానికి, తీసుకున్న పర్మిట్స్‌కు వ్యత్యాసం ఉండటంతో రూ.16 కోట్ల వరకు పెనాల్టీ విధించాం. ఇదే తరహాలో రేగులపాడులో ఇచ్చిన లీజ్ ఏరియా కాకుండా బయట కూడా చేస్తున్నట్లు గుర్తించి రూ.19.65 కోట్లు జరిమానా విధించాం. జగనన్న హౌసింగ్ స్కీమ్‌లో ఇంజినీరింగ్ వెరిఫికేషన్‌లో కన్స్ట్రక్షన్ బిల్లు విస్తీర్ణం కంటే స్లాబ్ లెవెల్ పెంచినందుకు గాను రూ. 6.7 కోట్ల జరిమానా వేస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపాం. ఇంకెక్కడైనా ఇలా జరుగుతున్నట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: మీరు వచ్చాక ఖనిజ సంపద ఎంతమేర పట్టుబడింది? జవాబు: మన జిల్లాలో కాదు గానీ, విజయనగరం జిల్లా రాజాం మండలం జి.చీపురుపల్లిలో మాంగనీస్ 20 టన్నులు (18 క్యూబిక్ మీటర్లు), ఒక పొక్లెయినర్, లారీ సీజ్ చేసి ఒకరిపై క్రిమినల్ కేసు నమోదు చేశాం. విజయనగరం జిల్లా బట్టిరాజేరు మండలంలో రూ. 9.75 కోట్లు, సారయ్యవలస మండలంలో రూ.12.45 కోట్ల విలువ చేసే క్వార్ట్జైట్ మినరల్స్ సీజ్ చేశాం. ప్రశ్న: ప్రభుత్వ టార్గెట్‌ను చేరుకున్నారా.? జవాబు: ప్రభుత్వం మాకిచ్చిన యాన్యువల్ టార్గెట్(జరిమానా) రూ.182 కోట్లు. లక్ష్యానికి ఇప్పటివరకు 196.59 కోట్లకు ప్రతిపాదనలు పంపగా సుమారు రూ.120 కోట్లకు ప్రభుత్వం ఆమోదించింది. -
కంచే చేను మేస్తే..
● మద్యం బాటిళ్లతో దొరికిన ఎక్సైజ్ కానిస్టేబుల్రణస్థలం: మండలంలోని బంటుపల్లి వద్ద ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో పని చేస్తున్న ఎకై ్స జ్ కానిస్టేబుల్ బొడ్డేపల్లి జగదీష్ అక్రమంగా మద్యం తరలిస్తూ జేఆర్ పురం పోలీసులకు పట్టుబడ్డాడు. జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సోమవారం రాత్రి పది గంటల సమయంలో జే.ఆర్ పురం పంచాయతీ పరిధిలో గల జాతీయ రహదారిపై ఒక పెట్రోల్ బంకు సమీపంలో ఎస్ఐ చిరంజీవితో పాటు సిబ్బంది తనిఖీలు చేపట్టగా జగదీష్ రెండు సంచుల్లో 52 కింగ్‌ఫిషర్ బీరు బాటిళ్లతో దొరికాడు. వీటి విలువ మార్కెట్లో రూ. 10,400లు ఉంటుంది. తన స్వగ్రామం పొందూరు మండలంలోని కనిమెట్ట వెళ్తుండగా ఆయన దొరికాడు. ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యూబీ పరిశ్రమలో లోడింగ్, ఇతర బ్యాచ్ నంబర్లు, బీరు సంబంధిత బ్రాండ్ ఇలా అన్నీ పత్రాలు సరిగా ఉన్నాయో లేవో చూసి ఉన్నతాధికారితో సంతకం పెట్టించి లోడింగ్ వెహి కల్ విడిచిపెట్టాలి. ఈ తనిఖీలన్నీ నామమాత్రంగా చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని పరిశ్రమ కార్మిక వర్గం ఆరోపిస్తోంది. -
మంచినీళ్లపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు గల్లంతు
అసలే అమావాస్య రోజులు. సంద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండే వేకువ సమయం. చుట్టూ చీకటి తప్ప ఇంకేమీ లేని వేళలో వారు వేటకు పూనుకున్నారు. కానీ రాకాసి అలలు విరుచుకుపడడంతో తెప్పతో సహా నలుగురు చెల్లాచెదురైపోయారు. ఇద్దరు బతుకుజీవుడా అంటూ తీరానికి చేరుకున్నారు. మరో ఇద్దరు మాత్రం తిరిగి రాలేకపోయారు. మత్స్యకారులు, మైరెన్ పోలీసులు కలిపి వెతికినా ఎక్కడా వారి ఆచూకీ దొరకలేదు. వజ్రపుకొత్తూరు: మండలంలోని నువ్వలరేవు కొత్త జెట్టీ సమీపంలో మంగళవారం తెల్లవారు జామున సముద్రంలో ఫైబర్ తెప్ప బోల్తా పడిన సంఘటనలో మంచినీళ్లపేట గ్రామానికి చెందిన వంక కృష్ణ(44), బుంగ ధనరాజు( 45) గల్లంతయ్యారు. అదే తెప్పలో ఉన్న మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బుంగ కోటేశ్వరరావు, చింతల వెంకటేశ్వరరావు అతి కష్టం మీద ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో మంచినీళ్లపేటలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటనలో ఫైబర్ తెప్ప, ఇంజిన్, వలలు పాడై దాదాపు రూ.2.50 లక్షలు మేర నష్టం వాటిల్లింది. స్థానిక మత్స్యకారులు, మైరెన్, స్థానిక పోలీసులు తీరంలో తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ గల్లంతైనవారి ఆచూకీ లభ్యం కాలేదు. స్థానిక మత్స్యకారులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచినీళ్లపేటకు చెందిన వంక కృష్ణ, బుంగ ధనరాజు, కోటేశ్వరరావు, చింతల వెంకటేశ్వరరావు కలిసి మంగళవారం తెల్లవారుజామున నువ్వలరేవు జెట్టీ సమీపం నుంచి వేటకు బయల్దేరారు. ఫైబర్ తెప్పను సంద్రంలోకి తీసుకెళ్లే క్రమంలో ఎత్తైన రాకాసి అలలు ఒక్కసారిగా తెప్పపై విరుచుకుపడడంతో నలుగురూ చెల్లాచెదురైపోయారు. ఇందులో కెరటాలకు ఎదురొడ్డి నిలిచిన బుంగ కోటేశ్వరరావు, చింత వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడగా గల్లంతైన వంక కృష్ణ, బుంగ ధనరాజుల ఆచూకీ మాత్రం దొరకలేదు. వంక కృష్ణకు భార్య ఎల్లమ్మతో పాటు ఇద్దరు కుమారులు 13 ఏళ్ల సుమంత్, 8 ఏళ్ల సాయి ఉండగా.. బుంగ ధనరాజుకు భార్య కృష్ణవేణి ఎనిమిదేళ్ల ప్రణీత, నాలుగు నెలల పసికందు సోనియా ఉన్నా రు. వారి రోదనలు స్థానికులకు కంటతడి పెట్టించాయి. వైస్ ఎంపీపీ వంక రాజు, మాజీ సర్పంచ్ గుళ్ల చిన్నారావు, జి.శంభూరావు, గ్రామ పెద్దలు ఇచ్చి సమాచారం మేరకు విషయం తెలుసుకున్న మత్స్యశాఖ ఎఫ్డీఓ ధర్మరాజు పాత్రో, మైరెన్ సీఐ డి.రాము, స్థానిక సీఐ, ఎస్ఐలు తిరుపతి, బి.నిహా ర్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించా రు. వివరాలు సేకరించి స్థానిక మత్స్యకారులతో కలిసి గల్లంతైన మత్స్యకారుల కోసం అటు గంగవరం నుంచి ఇటు ఒడిశా తీరం గోపాల్పూర్ వర కు తీరం వెంబడి విస్తృతంగా గాలించారు. ప్రత్యేక చాపర్ ద్వారా కూడా గాలించారు. బుధవారం నాటికి సమాచారం పూర్తిగా తెలుస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. వంక కృష్ణ భార్య ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి.నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నువ్వలరేవు జెట్టీ వద్ద ఫైబర్ తెప్ప బోల్తా క్షేమంగా ఒడ్డుకు చేరిన మరో ఇద్దరు జాలర్లు తీరం వెంబడి విస్తృతంగా గాలింపు -
ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్న డూ లేని విధంగా జిల్లా ఈ సారి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. కుప్పిలి కాపీయింగ్ ఉదంతం మినహా టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 149 కేంద్రాల్లో మార్చి 17న మొదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. పోలీసుల సహకారంతో 144 సెక్షన్ పక్కాగా అమలు చేశారు. కలెక్టర్, జిల్లా ఎస్పీ సైతం పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఆఖరి రోజు సోషల్ స్టడీస్ పేపర్‌కు 28405 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 28254 మంది హాజరయ్యారు. 151 మంది గైర్హాజరయ్యారు. మొత్తం మీద ప్రధాన పరీక్షల న్నీ ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కాగా ఏప్రిల్ మూడో తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ మొదలుకానుండగా.. అందుకు డీఈఓ తిరుమల చైతన్య, ఏసి లియాకత్ ఆలీఖాన్ నేతృత్వంలో అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. జిల్లా చరిత్రంలో.. మాయని మచ్చగా జిల్లాలోని ఎచ్చెర్ల మండల పరిధి కుప్పిలి మోడల్ స్కూల్ ఏ, బీ కేంద్రాల్లో మార్చి 21వ తేదీన ఇంగ్లిష్ పేపర్ మాస్ కాపీయింగ్ ఉదంతం మాయని మచ్చలా మిగిలిపోయింది. డీఈఓ తిరుమల చైతన్య నేతృత్వంలో స్క్వాడ్ బృందాలు తనిఖీ చే యడం, ఐదుగురు విద్యార్థులను డీబార్ చేయ డం, ఏకంగా 15 మందిని సస్పెండ్ చేయడం, ఆపై టీచర్లు డీఈఓ వైఖరిపై ఆందోళనలు చేయడం వంటివి సంచలనం సృష్టించాయి. ‘నాడు–నేడు’తో సకల సౌకర్యాలు.. టెన్త్ పరీక్షలకు కేటాయించిన 149 కేంద్రాల్లో మెజారిటీ కేంద్రాలు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కావడంతో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాశారు. బడుల్లో మనబడి నా డు–నేడు కార్యక్రమం ద్వారా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమకూర్చిన వసతులు, సౌకర్యాలతో విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాశారు. అత్యాధునిక ఫర్నీచర్, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు, ఆర్వో ప్లాంట్ల ద్వారా తాగునీరు, మరుగుదొడ్లు ఇలా అన్ని మౌలిక సదుపాయాలు కేంద్రాల్లో అందుబాటులో ఉండటంతో అక్కడి అధికారులు ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. పరీక్ష కేంద్రాల వద్ద పలు ప్రైవేటు జూనియర్ కాలే జీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, డిఫెన్స్ అకాడమీల కరపత్రాలను విద్యార్థులకు పంచేందుకు ఆ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది ఎగబడ్డారు. పరీక్షలు ముగియడంతో హాస్టళ్లు, వసతి కేంద్రాల్లో ఉంటున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. జిల్లాలో మొదటిసారి సంచలనాలకు కేంద్రం బిందువుగా టెన్త్ పబ్లిక్ పరీక్షలు జిల్లా చరిత్రలో మాయని మచ్చలా కుప్పిలి కాపీయింగ్ ఉదంతం పరీక్షలు ముగియడంతో హాస్టళ్ల నుంచి ఇంటి బాట పట్టిన విద్యార్థులు -
కుప్పిలి మోడల్ స్కూల్లో విచారణ
ఎచ్చెర్ల క్యాంపస్: కుప్పిలి మోడల్ స్కూల్లో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారు ల బృందం విచారణ నిర్వహించింది. రాష్ట్ర మానిటరింగ్ అధికారి కె.ధర్మకుమార్ ఆధ్వర్యంలోని బృందం ఈ విచారణ నిర్వహించింది. కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో 10వ తరగతి ఇంగ్లిష్ పరీక్షలో కాపీయింగ్ ఆరోపణలపై ఐదుగురు విద్యార్థులు డీబార్ అయ్యారు. కుప్పిలి మోడల్ స్కూల్ సెల్ఫ్ సెంటర్ కావటం, చూసిరాతలు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువ కావడం వంటి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ విచారణ నిర్వహించారు. గత మూడేళ్లలో స్కూల్ టాప ర్లు, ట్రిపుల్ ఐటీకి ఎంపికై న విద్యార్థులు అకడమిక్ ప్రగతి నివేదిక వంటివి పరిశీలించారు. అంతర్గత పరీక్షల్లో వారికి వచ్చిన మార్కులు, ఇతర ప్రతిభ వంటివి పరిశీలించారు. చూసి రాత వల్ల ట్రిపుల్ ఐటీకి విద్యార్థులు ఎంపికవుతున్నారా? విద్యార్థులు తమ ప్రతిభ ఆధారంగా ఎంపికవుతున్నారా? అన్న కోణంలో ఈ విచారణ నిర్వహించారు. టాపర్ విద్యార్థుల 8, 9, 10వ తరగతుల్లో వచ్చిన ప్రోగ్రెస్ కార్డులు సైతం పరిశీలించారు. ప్రిన్సిపాల్ కె.అప్పాజీరావు వారికి పాఠశాలో విద్యా ప్రమాణాలు వివరించారు. ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సంపాదించిన విద్యార్థులు మెరిట్ విద్యార్థులని, మాస్ కాపీయింగ్ వల్ల సీట్లు వచ్చాయన్నది అవాస్తవమని చెప్పారు. అన్ని మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు ట్రిపుట్ ఐటీ సీట్లు వస్తున్నాయని తెలిపారు. -
నేటి నుంచి ఉచిత శిక్షణలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పలువురు నిరుద్యోగ యువతకు ఉచిత వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాలుగు శిక్షణ కేంద్రాల్లో ఈ ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ● సీడాప్–డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల టీటీడీసీలో స్వీవింగ్ మిషన్ ఆపరేటర్ పోస్టుకు మూడు నెలల పాటు 60 మందికి శిక్షణ ఇవ్వనున్నారని, కనీస విద్యార్హత పదోతరగతి ఉండాలని తెలిపారు. ● శ్రీసాయివెంకటనారాయణ సొసైటీ వైటీసీ మందస (రెంటికోట) లో సోలార్ ఎల్ఈడీ టెక్నీ షియన్, స్మార్ట్‌ఫోన్ టెక్నీషియన్ కోర్సుల్లో మూడు నెలల పాటు 140 మందికి శిక్షణ ఇవ్వనున్నారని, దీనికి ఇంటర్లో సైన్సు గ్రూప్ పాస్ అయ్యి ఉండాలని తెలిపారు. ● శ్రీలక్ష్మీదీపా మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సింగనవలన సీతంపేట రోడ్లో రెస్టారెంట్ కెప్టెన్ కోర్సులకు 3 నెలలు శిక్షణ ఉంటుందని, 140 మందిని తీసుకుంటామన్నారు. ఇందుకు గాను ఇంటర్ లేదా ఐటీఐ చదివి ఉండాలని తెలిపారు. ● శ్రీకై ట్స్ స్కిల్స్ పీవీటీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఎచ్చెర్లలోని మహిళా ప్రాంగణం వద్ద గల ఐటీఐ ప్రాంగణం పక్కన ఫుడ్ అండ్ బెవరేజ్, గెస్టు సర్వీసులలో 3 నెలలు శిక్షణ ఉంటుందని, 90 మందిని తీసుకుంటారని, దీనికి పది, ఐటీఐ కోర్సులు చదివి ఉండాలని తెలిపారు. ఆసక్తి గల వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జాబ్‌కార్డు రెండు ఫొటోలు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని తెలిపారు. -
ఉపాధిలో మూడో స్థానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్ స్విప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఎన్ఐసీ పోర్టల్ గణాంకాలు ప్రకారం సిమ్మెంట్, మెటల్ రోడ్ల నిర్మాణం, సిమ్మెంట్ కాలువల నిర్మాణం, పాఠశాలల ప్రహరీల నిర్మాణం తదితర పనులు చేపట్టినట్టు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరం 2025– 26లలో ‘పంచ ప్రాధాన్యాలు‘ అనే భావనతో పశువులకు నీటి తొట్టెలు, సేద్యపు నీటి కుంటలు, పంట కాలువలను పునరుద్ధరించడం, చెరువులు / కుంటలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, దినసరి వేతనం రూ.307కు పెంచడం చేస్తామన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రణాళిక ప్రక్రియలో రూ.1499.03 కోట్ల అంచనా విలువతో 41523 పనులను గుర్తించామన్నారు. జిల్లా ఆస్పత్రి సందర్శన టెక్కలి రూరల్: స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని మంగళవారం రాష్ట్రస్థాయి కాయకల్ప టీమ్ సందర్శించింది. ఇందులో భాగంగా ఆస్పత్రిలోని పలు వార్డులు, ల్యాబ్‌లు పరిశీలించారు. అలానే ఆస్పత్రి పరిసరాలు, మరుగుదొడ్లు పరిశుభ్రత వంటిని పరిశీలించారు. అనంతరం వార్డుల్లో రోగులకు ఉండే పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి చుట్టుపక్కల వాతవరణం పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాయకల్ప టీమ్ సభ్యులు డాక్టర్ సౌజన్య, పి.కమలాకర్‌లతో పాటు ఆస్పత్రి సూపరిండెంటెంట్ బి.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. నీటి తొట్టెలు నిర్మించాలి: కలెక్టర్ నరసన్నపేట: వేసవి తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో పశువులకు ఇతర జంతువులకు మంచి నీరు అందించాలని, ఈ మేరకు నీటి తొట్టెలు నిర్మించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలోని తామరాపల్లిలో నీటి తొట్టెల పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. ఒక్కో నీటి తొట్టెకు రూ. 30 వేలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. దీంట్లో భాగంగా నరసన్నపేట మండలంలో 16 నీటి తొట్టెలు మంజూరు చేశారని, ఈ పనులు చురుగ్గా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే తామరాపల్లి గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ బి.మధుసూదనరావు, ఏపీఓ యుగంధర్లతో పాటు గ్రామస్తులు ముచ్చ గనేష్, గొద్దు జగన్మోనరావు తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ ఈ లైబ్రరీలో అగ్నిప్రమాదం శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలలోని ఈ లైబ్రరీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రంథాలయంలోని ఏసీలో షాట్ సర్క్యూట్ జరగడంతో పొగలు వచ్చా యి. దీంతో కళాశాల ఆవరణలో ఉన్న అగ్నిమాపక యంత్రంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అప్పటికే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందడంతో వారు వచ్చి, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఈ ప్రమాదంలో గ్రంథాలయంలో ఉన్న పలు కంప్యూటర్లు పనికి రాకుండా పోయినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఆ సమయంలో గ్రంథాలయంలో ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. -
ఆత్మీయ ఆలింగనాలు, ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ విందులతో రంజాన్‌ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మసీదుల వద్ద ఈదుల్ ఫితర్ నమాజులు జరిగాయి. ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని, ప్రవక్త మాటలు ఆచరణీయం కావాలని మత పెద్దలు ఆకాంక్షించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్,
అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడి డైరెక్షన్లో మైనింగ్ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు చెందిన క్రషర్లు, క్వారీలకు ఎలాంటి అనుమతులు లేకపోయినా కనీసం పట్టించుకోవడం లేదు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారనే కక్షతో కొంత మందిపై అడ్డగోలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ–పర్మిట్ వెబ్సైట్ ఆగిపోతే క్రషర్లు, గ్రానైట్ బ్లాకుల రవాణా ఎలా జరుగుతున్నాయి. మైనింగ్ అధికారుల అడ్డగోలు వ్యవహారంపై అన్ని రకాల ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆయా ఆధారాలతో కోర్టులను ఆశ్రయించి అధికారులు చేస్తున్న తప్పులకు మూల్యం చెల్లించుకునే విధంగా చేస్తాం. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, టెక్కలి -
ఆకట్టుకున్న రంజాన్ కవి సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: రంజాన్ సందర్భంగా స్థానిక కేంద్ర గ్రంథాలయంలో రాష్ట్ర ముస్లిం రచయితల వేదిక వ్యవస్థాపకులు కరీముల్లా ఆదేశాల మేరకు సోమవారం జరిగిన కవి సమ్మే ళనం ఆకట్టుకుంది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహ్మద్ రఫీ అధ్యక్షతన ‘హిందూ ముస్లిం భాయిభాయి’ పై జరిగిన ఈ కవి సమ్మేళనంలో పలువురు కవులు రంజాన్ విశిష్టతను, గొప్పదనాన్ని తెలియజేస్తూ చక్కనైన కవితలను చదివారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ మత సామరస్యానికి ప్రతీక ఈ కవి సమ్మేళనం అని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సురంగి మోహనరావు చేతుల మీదుగా ఈవేమన కవితా నిలయం తరఫున విశేష వైద్య సేవలు అందిస్తున్న పి.బి.డేవిడ్‌ను ఆరోగ్యమిత్ర బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో కవులు గుడిమెట్ల గోపాలకృష్ణ, వాడా డ శ్రీనివాస్, పసుపురెడ్డి శ్రీను, బోగెల ఉమామహేశ్వరరావు, గుణస్వామి, తంగి ఎర్రమ్మ, బి.సంతోష్ కుమార్, విజయలక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. టైమ్ స్కేల్ అమలు చేయాలి ఎచ్చెర్ల క్యాంపస్: సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లకు ప్రభుత్వం మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని యూనిటీ వెల్ఫేర్ టీం జిల్లా ఉపాధ్యక్షుడు చిగిలిపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చిలకపాలెంలో సోమవారం సమగ్ర శిక్ష ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం నిర్వహించి, ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా కనీసం వేతనం అందజేయటం లేదని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. కనీ సం మినిమం టైమ్ స్కేల్ అమలు చేస్తే ఉద్యో గులకు న్యాయం జరగుతుందని చెప్పారు. పార్ట్ టైమ్ పేరుతో ఉద్యోగులను ఫుల్ టైమ్ వినియోగించుకుంటున్నారని, పార్ట్ టైమ్ పదం తొలగించాలని అన్నారు. ఒకేషనల్ టీచర్లుగా పరిగణించాలని విజ్ఙప్తి చేశారు. ఉద్యోగ భద్రత, కుటుంబ నిర్వహణకు తగ్గ వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ ప్రతినిధులు వై.సత్యనారాయణ, ఎల్.దిలీప్‌కుమార్, తారకేశ్వరరావు పాల్గొన్నారు. కొనసాగుతున్న దర్యాప్తు జలుమూరు: యలమంచిలి ఎండల మల్లికార్జున దేవాలయంతోపాటు అక్కురాడ, కొండపోలవలస ఆంజనేయ ఆలయాల గోడలపై అన్య మత సూక్తులు రాసిన వారిని పట్టుకునేందుకు ఆరు బృందాలతో ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని టెక్కలి డీఎస్పీ డీఎస్ఆర్ఎస్ఎన్ మూర్తి తెలిపారు. సోమవారం యలమంచిలి, అక్కురాడ, కొండపోలవలస ఆయా దేవాలయాలను మరోసారి పరిశీలించి అర్చకులు, గ్రామస్తులతో మాట్లాడారు. అదే సమయంలో ఎక్కువ మందికి వచ్చిన ఫోన్ కాల్స్ సీడీఆర్‌ను పరిశీలిస్తున్నారు. అనంతరం జలుమూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ బృందాల అధికారులతో మాట్లాడారు. దుండగులను త్వరలో పట్టుకుంటామన్నారు. -
రెవెన్యూ ఉద్యోగి బరితెగింపు
పొందూరు: మండలంలోని మజ్జిలిపేట గ్రామానికి చెందిన జి.జనకచక్రవర్తి సీనియర్ అసిస్టెంట్‌గా పొందూరులో పని చేస్తున్నారు. మజ్జిలిపేటలో రెండు రోజుల కిందట నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొనడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. కానీ ఆయన ఎలాంటి భయం లేకుండా టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందడిగా శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభం వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో అతి పెద్ద మత్య్సకార గ్రామమైన నువ్వలరేవులో సందడిగా శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఠక్కురాణి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దాసుడు మువ్వల డోమ్మ, ఘంటోమోనరి మువ్వల పురుషోత్తంలు ప్రత్యేక అలంకరణతో, సాంస్కృతిక కార్యక్రమాలతో జన సంద్రం నడుమ ఊరేగారు. ఈ సందర్భంగా భక్తులు పూజలు చేసి ముర్రాటలు, కానుకలు సమర్పించారు. కాగా సుమారు 10 వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఉత్సవ వేడుకలలో మొదటి తంతును భక్తిశ్రద్ధలతో జరిపారు. దీంతో గ్రామ ప్రధాన వీధి జనంతో కిక్కిరిసింది. అలాగే యువతీ యువకులు నృత్యాలతో సందడి చేశారు. ఉచిత నాట్య శిక్షణ ప్రారంభం శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని బ్యాంకర్స్ కాలనీ సత్యసాయి బృందావనంలో ఉగాది సందర్భంగా ఉచిత నాట్య శిక్షణ ప్రారంభమైంది. సంప్రదాయం కూచిపూడి గురుకులం డైరెక్టర్ స్వాతీ సోమనాథ్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంజలి, యామిని, లోకేశ్వరి, సాయి మందిరం భక్తులు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల పిక్కాట!
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమకు ఏది తోస్తే అదే న్యాయమని భావిస్తూ చెలరేగిపోతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ బెట్టింగ్ కారణంగా యువత బలి అవుతుండగా తాజాగా నరసన్నపేటలో నడిరోడ్డుపై పిక్కాట(లాటరీ) ఆడిస్తున్నారు. స్థానిక జట్టు కళాశీ సంఘం శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా తెలుగు తమ్ముళ్లే దగ్గరుండి లాటరీ ఆడిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నవమి ఉత్సవాలకు లాటరీ నిర్వాహకులు పెద్ద మొత్తంలో తెలుగు తమ్ముళ్లకు ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది. దీనిని జనాల నుంచి రాబట్టడానికి మోసపూరితమైన లాటరీ ఆట నిర్వహిస్తున్నారు. ఆరు నెలలుగా మండలంలో ఎక్కడా లాటరీలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా తెలుగు తమ్ముళ్లు పోలీసులపై ఒత్తిడి చేసి వేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది యువత వ్యసనాల బారిన పడుతున్నారని, ఇప్పుడు బహిరంగంగా లాటరీలు పెడితే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, జట్టు కళాశీ సంఘం భవనం పక్కనే పబ్లిక్‌గా లాటరీ నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై సీఐ శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుదాం
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ద్వారా సమాజంలో అందరికీ విద్య అందుతుందని, నైతిక విలువలు, రాజ్యాంగ విలువలు పరిరక్షించబడతాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్‌ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న విద్యారంగ సంస్కరణలు సక్రమంగా లేవన్నారు. మోడల్ ప్రైమరీ పాఠశాల పేరుతో మిగిలిన ప్రాథమిక పాఠశాలలో ఉన్న ముడు, నాలుగు, ఐదు తరగతి విద్యార్థులను మ్యాపింగ్ చేయడం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియంగా ప్లస్–2 పాఠశాలలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించకపోతే తల్లిదండ్రులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి సామాజిక ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కోశాధికారి ఆర్.మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు ఎస్.కిషోర్‌కుమార్, ఎస్.మురళీమోహన్, వి.లక్ష్మీ, ఉత్తరాంధ్రల జిల్లా పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన కె.విజయగౌరి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రబీలో ధాన్యం కొనుగోలు జరిగేనా?
సారవకోట: ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు సేకరణ లక్ష్యం పూర్తయిందనే నెపంతో చాలాచోట్ల ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో రబీలోనైనా ధాన్యం కొనుగోలు జరిగేనా అంటూ రైతులు ఎదురుచూస్తున్నారు. సారవకోట మండలంలోని కొత్తూరు, గోపాలపురం, అగదల, బురుజువాడ, అక్కివలస, బద్రి, లక్ష్మిపురం, సారవకోట, జగ్గయ్యపేట తదితర గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాలలో వరి సాగు చేశారు. ప్రస్తుతం యంత్రాలతో నూర్పులు చేపట్టి ధాన్యం ఆరబెడుతున్నారు. కనీసం రబీలోనైనా తాము పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే చాలామంది రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలుపై నమ్మకం లేక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ గ్రామాల నుంచి ప్రతిరోజు లారీలతో ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. -
ఆలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి
శ్రీకాకుళం క్రైమ్ : ఇటీవల జలుమూరు మండలం యలమంచిలి ఎండల కామేశ్వరస్వామి ఆలయ గోడలపై అన్యమత రాతలు వంటి ఘటనలతో పాటు ఆలయాల్లో చోరీలు జరగకుండా నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్ పరిధిలోని ఆలయాల కమిటీ సభ్యులతో ఎస్ఐ ఎం.హరికృష్ణ సమావేశం నిర్వహించారు. ఆలయాలకు నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఆలయానికి కమిటీలుండాలని, అందులో యువకులుంటే ఇద్దరు రాత్రిపూట ఆలయం వద్దే నిద్రపోయేలా చూడాలని, లేదంటే సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలని ఎస్ఐ సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు ఎచ్చెర్ల: లావేరు మండలం రావివలస సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పిన్నింటి రాము, మరో వ్యక్తి సుభద్రాపురం నుంచి విశాఖ వైపు కారులో వెళ్తుండగా హైవే పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికీ కాళ్లు విరగడంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. -
ఘనంగా కురిగాం పీహెచ్సీ వార్షికోత్సవం
కొత్తూరు : ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బందితో పాటు పలువురి సహకారంతో కురిగాం పీహెచ్సీ పరిధిలో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని పూర్వ వైద్యాధికారులు, జిల్లా ఆరోగ్యశ్రీ అధికారి పి.ప్రకాశరావు, హనుమంతు రమేష్, జంపు కృష్ణమోహన్, తిరుపతిరావు రెడ్డి, నరేష్కుమార్, సందీప్, దిలీప్, శ్రీలత చెప్పారు. కురిగాం పీహెచ్సీ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తి కావడంతో వైద్యాధికారి పి.ప్రసన్నకుమార్ అధ్యక్షతన వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో వార్షికోత్సవం నిర్వహించడం రాష్ట్రంలో ఇదే మొదటిసారని చెప్పారు. భౌగోళికంగా ఒడిశాకు ఆనుకుని గ్రామీణ ప్రాంతంలో ఉన్న కురిగాం పీహెచ్సీలో వైద్యం అందించడం కష్టసాధ్యమైనప్పటికీ జాతీయ స్థాయి ప్రమాణాలకు అణుగుణంగా సేవలు అందుతున్నాయని, ఈ విషయంలో కురిగాం పీహెచ్సీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. వైస్ ఎంపీపీ తులసీ వరప్రసాదరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత రోగులకు నాణ్యమైన వైద్యం అందివ్వడం హర్షనీయమన్నారు. వైద్యాధికారులకు ఎల్లప్పుడూ మావంతు సహకారం ఉంటుందని చెప్పారు. అనంతరం పూర్వ వైద్యులను సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సేపాన అశోక్‌కుమార్, ఈవో బుజ్జిబాబు, సూపర్వైజర్ తిరుపతిరావు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కబడ్డీ పోటీల విజేత సింగుపురం
పలాస: మండలంలోని చిన్నగురుదాసుపురంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఆహ్వానిత కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం సమీపంలోని సింగుపురం జట్టు విజేతగా నిలిచింది. చినగురుదాసుపురం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 21 జట్లు పాల్గొన్నాయి. లింబుగాం జట్టు ద్వితీయ, గొల్లమాకన్నపల్లి తృతీయ స్థానాలు సాధించాయి. శ్రీకాకుళం కె.ఆర్.స్టేడియం జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పాలిన కృష్ణారావు, కార్యదర్శి జినగ తాతారావు, సాలిన రమేష్, జినగ ధర్మారావు, కొండే తేజేశ్వరరావు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. ఫ్యాప్టో నూతన కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం: జిల్లా ఫ్యాప్టో చైర్మన్‌గా బి.శ్రీరామమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని రాష్ట్ర ఫ్యాప్టో పరిశీలకులు(యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి) ఎస్.కిషోర్ తెలిపారు. నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఫ్యాప్టో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఫ్యాప్టో వైస్ చైర్మన్లుగా పి.హరిప్రసన్న, వి.సత్యనారాయణ, సెక్రటరీ జనరల్‌గా పి.ప్రతాప్‌కుమార్, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఎస్.వి.రమణమూర్తి, ఎం.మదన్మోహన్రావు, బి.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా కె.జగన్మోహన్రావు, కార్యవర్గ సభ్యులుగా బాబూరావు, ఎస్.రమేష్‌బాబు, పి.కృష్ణారావు, వై.వాసుదేవరావు, జి.రమణ, ఎస్.వి.అనిల్‌కుమార్, బి.రవి, ఎస్.ఎస్.ఎల్.వి.పూర్ణిమలను ఎన్నుకున్నట్లు తెలిపారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలి శ్రీకాకుళం అర్బన్: డీఎస్సీ–2003 అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డీఎస్సీ–2003 ఏపీ ఫోరం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఎన్జీవో కార్యాలయంలో సోమవారం ఫోరం సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆలస్యం వల్లే డీఎస్సీ – 2003 నియామకాలు 2005 నవంబరులో చేపట్టారని చెప్పారు. దీంతో పాత పెన్షన్ విధానం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 మేరకు అర్హత వ్యక్తులందరికీ పాతపెన్షన్ విధానం వర్తింపజేయాలన్నారు. తూర్పుగోదావరికి చెందిన రూపరాజు మాట్లాడుతూ కోర్టును ఆశ్రయిస్తే న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో జిల్లా కో–కన్వీనర్లు కె.ప్రకాష్, పి.శ్రీకర్, వి.శ్రీను, ఎ.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలి శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో చూచిరాతలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం అవసరమేనని.. అయితే డీఈఓ తిరుమల చైతన్య ఎంచుకున్న మార్గం సరైనదికాదని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.శ్రీనివాస్ అన్నారు. కుప్పిలి మోడల్ స్కూల్ కేంద్రంలో అన్యాయంగా డీబారైన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని దాసరి క్రాంతిభవన్ వేదికగా సోమవారం ఎస్టీయూ జిల్లా మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పిలి కేంద్రంపై కాపీయింగ్ ఆరోపణలు ఉన్నప్పుడు పరీక్ష కేంద్రంగా ఎందుకు మంజూరు చేశారని ప్రశ్నించారు. పరీక్ష కేంద్రం నిర్వహణకు పకడ్బందీ చర్యలు ఎందుకు చేపట్టలేదో డీఈఓ తెలియజేయాలని, హోల్డ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని, కోర్టు కేసులను రద్దు చేయాలని కోరారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి మాట్లాడుతూ డీఈఓను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. 400 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రంలో విద్యార్థులను భయాందోళనలకు గురిచేసి, పిల్లల విలువైన కాలాన్ని వృథా చేసిన డీఈఓపై కచ్చితంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సంఘ జిల్లా కార్యదర్శి గురుగుబెల్లి రమణ, ప్రతినిధులు పి.రామకృష్ణ, ఎస్.రాధాకృష్ణ, కె.శ్రీనివాసరావు, లక్ష్మణరావు, పి.రమణ, డీవీఎన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని కులాలకు న్యాయం జరగాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మాల, మాదిగ, రెల్లి, వాటి ఉప కులాలు అన్నింటికి న్యాయం జరగాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపకులు పోతల దుర్గారావు కోరారు. శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ విజ్ఞానభవన్‌లో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ విషయంలో అన్ని కులాలకు న్యాయం జరగాలని, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. మాల, మాదిగ, రెల్లి, రెల్లి ఉపకులాలు అన్ని కలిసి మెలిసి ఉన్నాయని, ఎస్సీలకు మొత్తం మీద రిజర్వేషన్ పెంచాల్సి ఉండగా, విభజించి పాలించు విధంగా చేయడం సరికాదని, సమగ్రంగా రిజర్వేషన్ ప్రక్రియ జరగాలని, రిటైర్డ్ న్యాయమూర్తులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల నాయకుల సమక్షంలో కులాల వారీగా రిజర్వేషన్ శాతం ప్రకటించాలని కోరారు. సమావేశంలో పలు సంఘాల నాయకులు దండాసి రాంబాబు, అంపోలు ప్రతాప్, రామప్పడు, గంజి ఎజ్రా, రాము, అప్పన్న, రమేశ్‌బాబు, బోనేల రమేష్, రమణ, రవికుమార్, రామారావు, తవిటయ్య, పాపారావు, గౌరీ, తవిటిరావు తదితరులు పాల్గొన్నారు. -
దేవాలయ గోడలపై అన్యమత ప్రచారం
జలుమూరు: ఉగాది రోజున మండలంలోని యలమంచిలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని దాదాపు 300 ఏళ్ల పురాతన మల్లికార్జున స్వామి ఆలయం గోడలపై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శిలువ గుర్తులు వేసి, ఆ మతానికి సంబంధించిన రాతలు రాశారు. ఆదివారం వేకువజామున అర్చకులు వసనాబి వెంకటరమణ ఆలయానికి వచ్చి గోడలపై రాతలు చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఆలయంతో పాటు పక్క పంచాయతీలైన అక్కురాడ, కొండపోలవలసలోని ఆంజనేయ ఆలయాల్లో కూడా ఇలాంటి రాతలే రాశారు. దీంతో మూడు గ్రామస్తులతో పాటు విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్, బీజేపి నాయకులు, ఆనంద ఆశ్రమ వ్యవస్థాపకుడు శ్రీనివాసనంద సరస్వతి తదితరులు యలమంచిలి శివాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. అంతకుముందు అక్కురాడ, కొండపోలవలసలో రాతలను చెరిపేశారు. యలమంచిలిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, టెక్కలి, శ్రీకాకుళం, పలాస డీఎస్పీలు డీఎస్ఆర్ఎస్ఎన్ మూర్తి, వివేకానంద, అప్పారావు పలువురు సీఐ, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాసిన వారిని రెండు రోజుల్లో పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ రాతలు రాసిన వారిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పా టు చేసినట్టు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. దీనికి ముందు ఆయన మూడు ఆలయాలను పరిశీలించారు. అర్చకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ బి.అనిల్‌కుమార్ కేసు నమోదు చేశారు. యలమంచిలి, అక్కురాడ, కొండపోలవలస గ్రామాల్లో ఆలయాల గోడలపై రాతలు ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు యలమంచిలిలో ఉద్రిక్త పరిస్థితులు -
ఊరిలోన.. చైత్ర వీణ
● జిల్లావ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు ● ఊరూరా పంచాంగ పఠనాలు విశ్వావసుకు స్వాగతం పలుకుతూ కోయిలమ్మలు కొత్త పాటలు కట్టాయి.. వేకువన కువకువలన్నీ ఆ పాటలతోనే గడిచాయి. ఊరూవాడా కోవెల వాకిటే కూర్చున్నాయి.. ఆదాయ వ్యయాలను, రాజపూజ్య అవమానాలను ఆరారా విన్నాయి. అన్నదాతలంతా నాగళ్లు చేతబట్టారు.. ఏరువాక సాగారో అంటూ హుషారైన పాటందుకున్నారు. కొత్త చిగుర్లతో ప్రకృతి చైత్రవీణ మోగించింది. తెలుగు వారి కొత్త ఏడాది నాడు ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణల్లో మెరిసిపోయారు. జనమంతా వసుదైక కుటుంబంలా కలిసిమెలిసి విశ్వావసుకు స్వాగతం పలికారు. అష్ట ఫలాలతో విజయదుర్గమ్మ