
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
ఆమదాలవలస/శ్రీకాకుళం రూరల్: పురపాలక సంఘ పరిధిలోని నాలుగో వార్డు గేదెలవానిపేట కసింవలస మధ్య ఊర చెరువులో చేపల వేటకు దిగి మత్స్యకారుడు మృతిచెందాడు. మెట్టక్కివలస మండల వీధికి చెందిన గయా బాల (47) సోమవారం రాత్రి తోటి మత్స్యకారులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. అందరూ ఒడ్డుకు చేరుకున్నా ఆయన కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే చెరువు మధ్యలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు వివాహాలైన కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ ఎస్‌ఐ రాము కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.