
పలాస కిడ్నీ ఆస్పత్రిలో పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
కాశీబుగ్గ: పలాసలోని కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ విధానంలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఏప్రిల్ 6వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటివరకు మొత్తం 267 దరఖా స్తులు అందాయని తెలిపారు. ఈ దరఖాస్తుల్లో జనరల్ డ్యూటీ అటెండెంట్స్ పోస్టులకు 81 మంది, సీ–ఆర్మ్ టెక్నీషియన్ పదవులకు 16 మంది, డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులకు 26 మంది, రిసెప్షన్ కమ్, రిజిస్ట్రేషన్ క్లర్క్ ఉద్యోగానికి అత్యధికంగా 86 మంది, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగానికి 15 మంది దరఖాస్తు చేసినట్లు ఆమె వివరించారు.