తెలంగాణలో రోడ్డు ప్రమాదం
సరుబుజ్జిలి: తెలంగాణా రాష్ట్రం మియాపూర్ వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నల్లాన సింహాచలం(40) సోమవారం రాత్రి లారీ ఢీకొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మృతిచెందాడు. మృతుడి స్వగ్రామం సరుబుజ్జిలి మండలం చిగురువలస. తండ్రి త్రినాధరావు ఇటీవలే గుండెపోటుతో మృతిచెందాడు. సింహాచలంకు భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 15 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అందరితో మంచిగా ఉండే సింహాచలం మృతి చెందడం పట్ల గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.
చిగురువలసకు చెందిన హోంగార్డు మృతి


