తేలని వాటా.. తెచ్చిన తంటా
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి బాల మురళీకృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోవడం సంచలనమైంది. అయితే ఆయనతో పాటు సీసీ సురేష్‌కుమార్ కూడా బుక్కవ్వడం వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ఈ దాడుల వెనుక కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం అన్నీ కార్యాలయ ముఖ్య విభాగాధికారిగా పనిచేస్తున్న ‘ఆయన’ అని వైద్యారోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. కాంతమ్మ అనే దివ్యాంగురాలు, సీనియర్ అసిస్టెంట్‌ను అడ్డం పెట్టుకుని కథను నడిపించారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కొంప ముంచిన వాటాలు
వైద్యారోగ్య శాఖలో అవినీతి ఇప్పుడు బహిర్గతమైంది గానీ.. ఇక్కడ మామూళ్ల వసూలు చాలా మామూ లు విషయమన్న సంగతి అన్ని విభాగాలకు తెలుసు. ఫైలుకు ఓ రేట్ పెట్టుకుని వ్యవహారాలు నడుస్తున్న ఈ కార్యాలయంలో కొత్తగా డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన బాలమురళీకృష్ణ తన క్యాంపు క్లర్క్‌లను మార్చేసి జిల్లాకు చెందిన ఓ బడా నేత సిఫారసుతో సురేష్‌కుమార్‌ను సీసీగా నియమించుకున్నా రు. ఇక్కడే వైద్యారోగ్య శాఖ సిబ్బందిలో లుకలుకలు బయటపడ్డాయి. కొత్త సీసీ వచ్చాక డీఎంహెచ్‌ఓ ఎవరితోనూ సంబంధం లేకుండా తన సొంత దుకా ణం తెరుచుకున్నారు. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు కూడా ప్రచురితమైన సంగతి విదితమే. దీంతో అంతవరకు సాగిన ‘మూమూళ్ల’ వ్యవహారంలో తేడాలు వచ్చాయి. అప్పటివరకు ప్రతి ఫైల్ మూవ్ ఆర్డర్‌కు కూడా విభాగానికి ఒక్కో వాటా వెళ్లేది. కొన్ని రోజులుగా అన్ని విభాగాలు వాటాలు క్యాన్సి ల్ అయిపోయి నేరుగా డీఎంహెచ్‌ఓ చాంబర్‌కే మామూళ్లు చేరిపోయాయి. దీంతో వివాదాలు పెరిగి ఏసీబీకి తమ వారితో ఫిర్యాదు చేసేంత స్థాయికి చేరిపోయాయి. ఫలితంగా ఏకంగా జిల్లా అధికారి ఏసీబీ చేతికి చిక్కాల్సి వచ్చింది. పైగా ఫిర్యాదుదారురాలు కాంతమ్మపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయన్న సంగతి కూడా పాఠకులకు తెలిసిందే. ఈమె కొంత మంది నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట వసూ ళ్లు చేయడంతో బాధితులంతా నిలదీయడంతో కొ న్ని నెలల పాటు విధులకు వెళ్లకుండా మాయమైపోయింది. ఇవే సెలవుల అనంతరం వైద్యశాఖ రీజనల్ డైరక్టర్ వద్ద నుంచి రీపోస్టింగ్‌కు ఆదేశాలు పొందినప్పటికీ మూవ్ ఆర్డర్ ఇవ్వాల్సిన డీఎంహెచ్‌ఓ లంచం డిమాండ్ చేయగా కాంతమ్మ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించింది. దీనివెనుక విభాగాధిపతి ఉన్నారన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. ఈ వ్యవహారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ జాయినింగ్ ఆర్డర్లు వ్యవహారంలో కూడా ఆ కీలక ఉద్యోగి పాత్ర ఉందన్న సంగతిపై తేల్చాలని కూడా మంత్రి ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.
డీఎంహెచ్‌ఓపై ఏసీబీ దాడుల వెనుక పెద్ద ప్లాన్
వాటాల సమస్యే కొంపముంచిందంటున్న వైద్యశాఖ వర్గాలు


