
ఢిల్లీలో దొరికాడు
శ్రీకాకుళం క్రైమ్ : విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి యూనివర్సిటీలో ఫీజులు కట్టకుండా ఎగ్గొట్టిన వ్యక్తిని ఎట్టకేలకు రెండో పట్టణ పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ అంశంపై ఏడుగురు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గత ఏడాది జులై 29న ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కజికిస్తాన్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కొందరు విద్యార్థుల నుంచి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌కు చెందిన హరీష్ గంగాధర్ ఒప్పందం ప్రకారం ఒక్కొక్కరి వద్ద రూ. 25 లక్షల నుంచి రూ. 45 లక్షల లోపు వసూలు చేశాడు. కజకిస్తాన్‌లో కళాశాల, వసతిగృహానికి సంబంధించి ఒక సంవత్సర ఫీజును మాత్రమే చెల్లించి మిగతా సొమ్ము సుమారు రూ. 2 కోట్లు కాజేశాడని సీఐ తెలిపారు. ఎప్పటి నుంచో తప్పించుకుని విదేశాల్లో తిరుగుతున్న హరీష్ గంగాధర్‌ను పట్టుకునేందుకు లుకౌట్ నోటీస్ పంపామని, ఎట్టకేలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకుని తమ కు సమాచారం అందించారన్నారు. దీంతో ఢిల్లీ తమ పోలీసులను పంపి హరీష్ గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నామని బుధవారం మధ్యా హ్నం 3 గంటలకు అరెస్టు చేసి రిమాండ్ కోసం కోర్టుకు తరలించామని సీఐ ఈశ్వరరావు వెల్లడించారు.