
● గిరిపై సత్కార్యం
గిరిజన గ్రామాల్లో సాగుకు అవసరమైన నీటి వనరులు అందించేందుకు వాటర్ షెడ్డులు నిర్మించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో పాటుగా వివిధ శాఖల అధికారులు గురువారం టెక్కలి మండ లంలోని ముఖలింగాపురం పంచాయతీ పరిధి గిరిజన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొండపై నుంచి వచ్చే నీటిని నిల్వ చేసేందుకు వాటర్ షెడ్డులను, చెక్ డ్యాంలు నిర్మాణం చేసేందుకు గాను అనుకూలమైన ప్రాంతాలను గుర్తించేందుకు పర్యటించారు. త్వరలోనే గ్రామసభలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం టెక్కలిలో గల పట్టుమహాదేవి కోనేరు గట్టుని పరిశీలించారు. – టెక్కలి రూరల్