పలాస రైల్వేస్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా
పలాస వరకు ప్రయాణం సాఫీగానే సాగింది. అక్కడ బండి ఆగడం.. మళ్లీ బయల్దేరడం సజావుగానే జరిగింది. కానీ పది నిమిషాల్లోనే పరిస్థితి మారిపోయింది. ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఇంజిన్‌కు అనుసంధానమై ఉన్న బోగీలు మందస వరకు వెళ్లిపోగా.. వెనుక ఉన్న బోగీలు మాత్రం సుమ్మాదేవి వద్దే ఆగిపోయాయి. బోగీల లింక్ తెగిపోయిందని తెలుసుకునేలోపే ఇంజిన్ దాదాపు పది కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మూడు గంటల పాటు పడరాని పాట్లు పడ్డారు. లక్ కలిసిరావడంతో పెను ప్రమాదం తప్పి ఊపిరి పీల్చుకున్నారు.
కాశీబుగ్గ / ఇచ్ఛాపురం టౌన్ / కంచిలి:
సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12704)కు మంగళ వారం పలాస మండలం సుమ్మాదేవి గేటు వద్ద పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వేశాఖ అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి రైల్వే సిబ్బంది, స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు..
● సికింద్రాబాద్ నుంచి సోమవారం ప్రారంభమైన ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మంగళవా రం ఉదయం ఏడు గంటల సమయంలో పలాస రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు దింపి భువనేశ్వర్ వైపు బయలుదేరింది.
● పలాస రైలు నిలయం నుంచి ఏడుకిలోమీటర్ల దూరంలో ఉన్న సుమ్మాదేవి రైల్వేస్టేషన్‌కు అతి వేగంగా చేరుకునే సమయంలో 7 : 10 నిమి షాలకు సున్నాదేవి స్టేషన్ ముందు గేటు వద్ద రెండు బోగీల మధ్య ఇనుప లింకు తెగిపడింది.
● దీంతో ఫలక్‌నుమా రైలు 14 బోగీలు ఒకవైపు 08 బోగీలు మరో వైపు విడిపోయాయి.
● ఎ–1, ఎం–6 బోగీల మధ్య లింకు తెగిపోయింది.
● ఇంజిన్‌తో ఉన్న బోగీలు సమీప మందస రైల్వేస్టేషన్‌కు చేరుకోగా మిగిలిన బోగీలు నెమ్మదిగా రైలు పట్టాలపై నిలిచిపోయాయి.
● రైలులో ఉండే గార్డు లోకో పైలెట్‌కు సమాచారం ఇచ్చే సమయానికి పది కిలోమీటర్ల దూరంలో మందస వెళ్లిపోగా అక్కడ రైలు బోగీలను పరిశీలన చేశారు.
● మరో సారి వెనుక నుంచి రైళ్లు వచ్చి ఢీకొంటాయేమోనని ప్రయాణికులు రైలు నుంచి దిగి చెట్ల కింద తలదాచుకున్నారు. రైల్వేశాఖ తక్షణమే స్పందించినా ఇంజిన్‌ను సున్నాదేవి వరకు తీసుకువ చ్చి అక్కడ ఉన్న బోగీలకు లింకు చేసి పంపించే సరికి సమయం సుమారు 10.20 దాటింది. సు మారు మూడు గంటల పాటు ప్రయాణికులు పాట్లు పడ్డారు. మందస, ఇచ్ఛాపురం, బ్రహ్మ పురం రైలు నిలయాలలో ప్రయాణికులకు అవసరమైన తాగునీరు, ఫలహారాలను రైల్వేశాఖ తరఫున అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించగా రైల్వే సిబ్బంది వారికి అందజేశారు. లింకు తెగిపోవడానికి గల కారణాలపై రైల్వే శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. సూపర్ ఫాస్ట్ రైలు ట్రాక్‌పై ఉండిపోయిందని తెలియడంతో ఒక్కసారిగా అటుగా రాకపోకలు జరిపే రైళ్లను మూడు గంటల పాటు ఆలస్యంగా నడిపారు.
ఆలస్యంగా నడిచిన రైళ్లు
సుమ్మాదేవి సమీపంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు తెగిపోయిన ఘటనతో పలు రైలు ఆలస్యంగా నడిచాయి. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ తర్వాత ఆ మార్గంలో వచ్చిన రైళ్లు ఉదయం పూట వచ్చేవన్నీ నిర్దేశించిన సమయానికి సుమారు గంటన్నర ఆలస్యంగా వచ్చాయి. సోంపేట స్టేషన్‌కు ఉదయం 9.30 గంటలకు రావల్సిన చైన్నె–పూరి(రైలు నంబర్:22860) వీక్లీ ఎక్స్‌ప్రెస్ 10.52 గంటలకు వచ్చింది. అదేవిధంగా 9.33 గంటలకు రావాల్సిన తిరుపతి–పూరీ(రైలు నంబర్:17480) వీక్లీ ఎక్స్‌ప్రెస్ 11.15 గంటలకు వచ్చింది. ఇక గుణుపూర్–పూరీ(రైలు నంబర్:18418) ఎక్స్‌ప్రెస్ 11.25కు వచ్చింది. ఇలా పలు రైళ్లు ఆ మార్గంలో నడిచేవి ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చైన్నె–పూరీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను నౌపడ స్టేషన్‌లో గంటన్నరపాటు ఆపేశారు. ఇక తిరుపతి–పూరీ ఎక్స్‌ప్రెస్‌ను కోటబొమ్మాళి స్టేషన్‌లో గంటకు పైగా నిలిపివేశారు. ఇలా ఈ మార్గంలో వచ్చే రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేయడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది.
బోగీల మధ్య లింకు తెగిపోవడంతో ఘటన
తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు
మూడు గంటల ఆలస్యంతో పాట్లు పడిన వైనం
ఆలస్యంగా నడిచిన పలు రైళ్లు
నీరు లేక ఇబ్బంది
ప్రమాదం జరిగిన చోట నీరు, ఆహారం లేక చాలా మంది ఇబ్బందిపడ్డారు. మందసలో పనులు ఆలస్యంగా చేశారు.
– మితిన్ బెహరా, పాత్రపురం, ఒడిశా
పలాస రైల్వేస్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా
పలాస రైల్వేస్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా
పలాస రైల్వేస్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా
పలాస రైల్వేస్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా
పలాస రైల్వేస్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా
పలాస రైల్వేస్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా
పలాస రైల్వేస్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా
పలాస రైల్వేస్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా


