
గడ్డి కుప్ప దగ్ధం
టెక్కలి రూరల్: మండలంలోని నంబాలపేట గ్రామంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నంబాల ఉదయ్‌బాస్కర్‌కు చెందిన గడ్డి కుప్ప దగ్ధమైంది. పక్కన పొలంలో రైతు చెత్తకు అగ్గిపెట్టడంతో అది కాస్త అంటుకుని సమీపంలో ఉన్న గడ్డికుప్పకు అంటుకుని దగ్ధమైంది. దానితో పాటు అక్కడే ఉన్న సుమారు 50 సెంట్ల టెట్టంగి పంటకు సైతం మంట అంటుకోవడంతో రైతు అగ్నిమాక కేంద్రానికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ.35వేలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు.