
ప్రైవేట్ డిగ్రీ కాలేజీల సమస్యలు పరిష్కరించాలి
ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్ మెంట్ అసోషియేషన్ అధ్యక్షుడు పొన్నాన జయరాం డిమాండ్ చేశారు. సంఘ కార్యవర్గాన్ని కడపలో బుధవారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సన్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పొన్నాన జయరాం, జాయింట్ సెక్రటరీగా జిల్లాకు చెందిన బొంతు శ్రీనివాసరావు, రీజనల్ కో–ఆర్డినేటర్‌గా కోట మురళీధర్, కార్యవర్గ సభ్యునిగా దేవరాజులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త కోర్సులు ప్రారంభానికి అడ్డంగా ఉన్న జీవో 36 రద్దు చేయాలని, జీవో 22 రద్దు చేసి ఫీజులు నిర్ణయాధికారం స్థానిక వర్సిటీలకు అప్పగించాలని, పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయాలని, ఆన్‌లైన్ డిగ్రీ ప్రవేశాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.