
ఆకలితో అలమటించాం..
చైన్నె నుంచి సోంపేటకు వస్తున్న మేము ప్రయాణిస్తున్న రైలు ఫలక్‌నుమా ట్రైన్ ఘటనతో ఆలస్యంగా నడిచింది. దీంతో గంటన్నర ఆలస్యంగా వచ్చాము. దీంతో ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– మధుస్మితా పండా, కుమార్తె చిన్మయి పండా, ప్రయాణికురాలు, జలంత్రకోట గ్రామం, కంచిలి మండలం
ఆందోళన కలిగింది..
మా ముందు వెళ్తున్న రైలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పిందని తెలిసిన తర్వాత మొదట ఆందోళనకు గుర య్యాం. చివరికి ప్రయాణికులెవ్వరికీ ఏమీ కాలేదని తెలిశాక తర్వాత ఊపిరి పీల్చుకున్నాం.
– గేదెల మోహనరావు, ప్రయాణికుడు,
ఆర్. కరాపాడు గ్రామం, కవిటి మండలం
భయపడ్డాం
పలాస దాటిన తర్వాత కాసేపటికి మేము ఉన్న బోగీ వేగం తగ్గింది. ఇంతలో ట్రైన్ ఆగి చుట్టుపక్కల ఉన్న వా రు కొన్ని బోగీలు తెగిపోయాయని తెలిపారు. దీంతో భయపడ్డాం. చాలా సమయం తర్వాత వేరే ఇంజిన్ వచ్చి బోగీలను ట్రైన్ వద్దకు తీసుకెళ్లింది.
– ఎం బలరాం, చీకటి గ్రామం, ఒడిశా
చాలా సమయం పట్టింది
పలాస దాటిన తర్వాత ప్రమాదం జరిగింది. ప్రమా దం జరిగిన స్థలం నుండి మందస వరకు వచ్చి అక్కడ ట్రైన్ రిపేరు చేసి ఇచ్ఛాపురం వచ్చేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టింది.
– ఎం.పద్మ, చీకటి గ్రామం, ఒడిశా
●

ఆకలితో అలమటించాం..

ఆకలితో అలమటించాం..

ఆకలితో అలమటించాం..